Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • మా వాకాటి కథల్లో అశోక్ గాడు!

    మాది ఇంజనీరింగ్ లో 1988-1992 బ్యాచ్. మా బ్యాచ్ మొదటినుండి మిగతా బ్యాచ్ ల కన్నా విభిన్నం. మాలో మేము కలివిడిగా వుండేవాళ్ళము, ఆట పాటల్లోనూ, చదువు సంధ్యలలోను మెరుగ్గా రాణిస్తూ. మేము కాలేజీలో వున్నంత  వరకు మేమే  ప్రతీ సంవత్సరం ఓవరాల్ చాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నది. మా అయ్యవార్లు కూడా మా బ్యాచ్ చాలా పద్ధతైన బ్యాచ్ అనే వారు మేము చివరి సంవత్సరం పరీక్షలు ఎగ్గొట్టక ముందు దాకా, ఎగ్గొట్టేసాక మీ అంత పనికి మాలిన బ్యాచ్ ని ఇంత వరకూ చూడలేదు, చూడబోము కూడా అని తేల్చేశారు.

    మా సహాధ్యాయుడైన అశోక్ యెడ్లగాడు మొదటినుండి అందరికీ ఆత్మీయుడే. తన నవ్వుతో, కలివిడి తనంతో, మంచితనంతో అందరితోనూ చాలా ప్రేమపూర్వకంగా మెలిగేవాడు. మాలో చాలా మందికి వాడు సన్నిహిత మిత్రుడు. అందరిలాగే మేము కళాశాల చదువులు అయ్యాక వేళ్ళ మీద ఎంచదగ్గ వారితో తప్ప మిగతా వారితో సంబంధ బాంధవ్యాలు కోల్పోయాము. అప్పటిలో కొద్దిమందికే ల్యాండ్ లైన్ సదుపాయం ఉండెడిది,  ఇప్పటిలా చరవాణులు మరియు వాట్స్ అప్ సమూహాలు లేవు.

    క్రీ || శ 2000  సంవత్సరమనుకుంటా,  నేను డెన్వర్లో ఉండగా, మామ! అంటూ ఫోన్ చేసాడు వాడు. నా ఫోన్ నెంబర్ ఎలా పట్టాడురా  వీడు అని ఆశ్చర్యపోతూ,  ఏరా! ఎక్కడున్నావు, ఏమిటి విశేషాలు అంటే, నేను గత వారమే డెన్వర్ వచ్చానురా, ఫ్రెంచ్ క్వార్టర్స్ లో వుండే మా కంపెనీ గెస్ట్ హౌస్ లో వున్నా, వచ్చి కలువు అన్నాడు. ఓరి నీ పాసు గూల, వచ్చి వారమయ్యాకరా! నువ్వు నాకు కాల్ చేసేది, వచ్చే ముందు చేయలేక పోయినా, రాగానే అన్నా చేయాలి కదరా అంటూ వాడిని కలవడానికి వెళ్ళిపోయా.  సుప్రియాకి వాడిని పట్టకొస్తా మాకేమన్న ఉడకేసిపెట్టు అని చెప్పి.

    వాడిని చూడగానే చాలా సంతోషం వేసింది, వాడు కూడా అలాగే వున్నాడు గల గలా మాట్లాడుతూ. వాడితో పాటే ఆ గెస్ట్ హౌస్ లో దిగిన సర్దార్జీని పరిచయం చేశాడు. కొంచెం సేపు మాటాడుకున్నాక అశోక్ గాడిని మా ఇంటికి పట్టకెళ్ళిపోయా నేను. దార్లో చెప్పాడు వాడు, ఇంజనీరింగ్ అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసాడని, అటుపిమ్మట, అమెరికాలో ఉంటున్న కన్సల్టెంట్ H1 స్పాన్సర్ చేయటంతో,  ఇక్కడ తేలాడు అని.

    నాకు చెప్పొద్దూ! మనమేమో తెగ సూపర్ అయినట్టు ఆపైన ఇక్కడికి వచ్చి ఎదో సాధించేసినట్టు,  వాడేదో చాలా అమాయకుడు, ఏమీ తెలియని వాడు అయినట్టు, ఎందుకు వచ్చాడురా నాయనా  యీ .కామ్ బూమ్ అంతా ఢమాల్ అయిపోయిన కాలం లో, అదీ జావా మీద, కష్టాల్లో పడిపోతాడు అని దిగులేసిపోయింది. వాడిని తరచి తరచి అడిగా వాడి అనుభవం గురుంచి మరియు వాడి కంపెనీ గురుంచి, వాడు విసుక్కొనే దాకా నువ్వూ నీ ఎదవ అనుమానమని.

    అలా వచ్చిన అశోక్ గాడు, సుప్రియాని అమ్మాయీ అని పిలుస్తూ, సుప్రియాకి మరియు పిల్లలకి చాలా దగ్గరైపోయాడు. నేను వాడిని తరచుగా కలిసే వాడిని మరియు వాడిని భోజనానికి ఇంటికి పట్టకెళ్లిపోయేవాడిని. ఒక రోజు వాడి రూమ్ కి వెళ్లిన నాకు, వాడి కొత్త రూమ్ మేట్ తలుపు తీశాడు, సర్దార్జీ లేడు రూమ్ లో, నాక్కూడా చాలా సంతోషమేసింది, వాడిక్కూడా వుద్యోగమొచ్చి వెళ్లిపోయాడేమో అని, ఎందుకంటే వాడు చాలా రోజులుగా బెంచ్ లో వున్నాడు కాబట్టి. అదే విషయం అశోక్ గాడిని అడిగా, వాడు నవ్వుతూ, హర్షాగా! వెళ్లి వాడిని ఇంకోమారు చూసి రారా అన్నాడు.

    ఏందిరా సంగతి అని వెళ్లి చూద్దునుగా ఆ తలుపు తీసింది క్లీన్ షేవ్ లో వున్న మా సర్దార్జీనే. వాడికీ ఉద్యోగమొచ్చేసింది. అశోక్ గాడు తీరిగ్గా నవ్వుతూ చెప్పాడు, వాడసలు అమెరికా వచ్చింది దీనికోసమేరా, ఇప్పటి దాకా భరించాడట వాడు, ఇక వాడి వల్ల కాదని ఇలా అవతరించాడు అని. మా సర్దార్జీకి ఉద్యోగమొచ్చిన సందర్భం గా వాళ్ళ ఫ్రెంచ్ క్వార్టర్స్ కి మాత్రమే గర్వకారణమైన ఇన్డోర్ వార్మ్ వాటర్ పూల్ లో తెగ ఈత కొట్టేశాము ఆరోజు మేము ముగ్గురమూ.

    అశోక్ గాడికి ప్రతిదీ ప్రశ్నయే, మన ముందు జుట్టు పెంచుకున్న మగవాడు వెళ్తుంటే, ఒరే, హర్షాగా! ఆ వెళ్ళేది అమ్మాయా లేక అబ్బాయా అనడిగే వాడు. నాకు మండి, నీది అమాయకత్వమా లేక ఇంకోటి ఏదన్నానా అని కయ్యి మనేవాడిని. సర్లేరా బాబూ! నీకంత కోపమైతే ఇలాటి ప్రశ్నలు అడగనులేరా అని చెప్పేవాడు వాడు.

    అశోక్ గాడి దృష్టి యిక వాడి వాహన చోదక కళని అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మీద పడింది. నన్ను తెగ నస పెట్టటం మొదలెట్టాడు. నేను తప్పించుకోవాలని చూశా, అక్కడ చోదక నియమాలు చాలా ఎక్కువ అనే సాకు పెట్టి. కానీ వాడసలు వొదల లేదు, నాకసలు తప్ప లేదు. సరే వాడికి తోలడానికి అనుమతి ఉంది, పక్కన తోలటం వచ్చిన వాడు ఉండగా వాడు తోలవచ్చ

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    7 min
  • మన వాకాటి కథల్లో గోపీగాడు!

    ఈ మధ్య మా అనీల్గాడు ఓ వెధవ సలహా ఇచ్చేశాడు, వరస బెట్టి మన స్నేహితుల కథలు రాసెయ్యి, అవి ఓ ఇరవై అయిదు అయ్యాక మనం వాటిల్ని మన వాకాటి కథలు పేరున ఒక  సంపుటిగా తీసుకొద్దాము అని. 

    ఇలా రాయటం మొదలు పెడితే అంతా మన స్నేహితుల గురుంచే రాయాల్సి వస్తుంది, నా రాతలతో ఎక్కడో వాళ్ళ మానాన బతుకుతున్న వాళ్ళని ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలతో ఎక్కడ బాధ పెడుతానేమో అన్న భయం వ్యక్తం చేసిన నన్ను చూసి, వాడు నవ్వి, ముండా నీ అభిప్రాయాలకి వాళ్ళు అంత విలువిచ్చి తెగ బాధ పడిపోతారని నువ్వు మరీ అంతలా ఇదైపోకు, ముందు రాసెయ్యి అని వాడికలవాటైన విధంగా చెల రేగిపోయాడు.

    నువ్వు ఈ కథలన్నీ నీ వైపునుండి వాళ్ళ మీద ఫిర్యాదుల పూర్వకంగా రాస్తే మేము ఇంకా సంతోషిస్తాము అన్నాడు, ఆ మాటల్ని బలపరుస్తూ మా గిరిగాడు, ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ గతం మీద వాళ్లకు ఏమీ హక్కులుండవు అనే కావియట్ తో కథ మొదలెట్టు అని సలహా ఇచ్చి పారేశాడు.

    ఆలా సంపుటిగా తీసుకొస్తే దానికి ముందు మాట మన గిరిగాడు రాయాలి, మరి మన శ్రీధరగాడు తన డబ్బులతో ప్రచురించి, ఇళ్ళుల్లు తిరిగి అమ్మాలనే షరతు మీద ముందు మన గోపీగాడితో మొదలెడుతున్నా.  

    కడప జిల్లా ఎర్రకుంట్లకు చెందిన కొంగని గోపీచంద్  మా వాకాటి ఇంజనీరింగ్ కళాశాలలో మా మైటీ మెకానికల్ బ్రాంచ్ లో మా సహాధ్యాయుడు, నా నాలుగు సంవత్సారాల బెంచ్ మేట్ మరియు నాలుగేళ్లు ప్రాక్టికల్స్ లో ల్యాబ్ మేట్. నాలుగేళ్లలోనూ వాడికి నాకు క్రమం తప్పకుండా నాలుగైదు మార్కులే తేడాగా ఉండేవి.

    తెలుగు బాగానే మాటలాడుతాడు కానీ, మొదటి నుండి వాళ్ళ నాన్న గారి ఉద్యోగరీత్యా దేశమంతా సంచరిస్తూ  తదనుగుణంగా  సి.బి.ఎస్.యీ సిలబస్ లోనే చదవటం వలన, తెలుగు చదవటం, రాయటం రాదు. గూడూరులో బస్సు దిగి వాళ్ళనీ వీళ్ళనీ ఈ బస్సు వాకాటి వెళ్తుందా లేదా అని అడుగుతుంటే, ఒక ముసలవ్వ వీడికి ఏమయ్యా చూసేదానికి  చదువుకున్న వాడిలాగే కనపడుతున్నావు ఆ మాత్రం ఊర్ల పేర్లు చదువటం రాదా అని క్లాస్ పీకింది అని మా గిరిగాడు వాకాడు కాలేజీలో టామ్ టామ్ చేసేసాడు. మా గిరిగాడు ఏదన్నా చెబితే మేమిక నిజనిర్ధారణ లాటి పనికిమాలిన పనులు పెట్టుకోము. నా కథల్లో చిన్న పిల్లల మొదలు పెద్ద వారి వరకూ తెలుగు చదవటం రాని పాత్ర వుంటే ఆ పాత్ర పేరు గోపి అనే ఉంటుందని మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చెయ్యండి.

    వీడు, మా గిరిగాడు మరియు మేము ప్రెసిడెంటు అని ముద్దు గా పిలిచుకొనే నరేంద్ర గాడులు రూమ్ మేట్స్. వాళ్లిద్దరూ ఎలా చదివేవారో రూమ్ లో నాకు తెలియదు కానీ, వీడు మాత్రం మొదటి నుండి పద్ధతి గా చదివే వాడు, ఏ రోజు పాఠాలు ఆ రోజు. పరీక్షల రోజుల్లో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా వాడి అలవాటు ప్రకారం పదిగంటలకు పడక వేసేసేవాడు ఎందుకంటే మొదట నుండి అన్నీ చదివేసుకొనే వాడు కనుక. మరీ ఇంత పద్ధతైన వాడిని నేను మొదట దూరం పెట్టేసే వాడినే కానీ, భిన్న ధృవాలు స్నేహం చేసినట్టు మా మధ్య స్నేహం అలా కుదురిపోయిందంతే మా ప్రమేయం లేకుండా.

    ల్యాబ్ లో వీడు పద్ధతిగా  పరిశోధనలు చేసి, పరిశోధనా విలువలు నాకు ఇస్తుంటే నేను కాల్కులేటర్ లో ఆ విలువలని ఎక్కించి ఫలితాన్ని రాబట్టి, ల్యాబ్ నుండి అందరికంటే ముందే బయటపడిపోయే వాళ్ళము. మా రోజుల్లో ల్యాబ్ నుండి ఎంత తొందరగా బయటపడితే అంత గొప్ప, ఈ సూత్రం మా మెషిన్ డ్రాయింగ్ కి వర్తించదు, ఎందుకంటే ఆ సబ్జెక్టు ఉండటం మా మెకానికల్ వాళ్ళు చేసుకున్న ఖర్మ. ఎవరో కొందరుండే వాళ్ళు మా బట్టల సత్తిగాడు లాటి వాళ్ళు డ్రాయింగ్ ని టప టప గీసేసి డ్రాయింగ్ హాల్ నుండి బయటపడిపోయేవాళ్లు.

    ల్యాబ్ లో గోపీగాడు తీసే రీడింగ్స్ మీద నేను ఎంత ఆధారపడిపోయానంటే మా మూడవ సంవత్సరపు థెర్మోడైనమిక్స్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలో, నాకసలు రీడింగ్ తీయటమే రావటంలా, నేను రీడింగ్ తీసి రిజల్ట్స్ చూపితే మరలా వైవాకి అటెండ్ అవ్వాలి. అసలే చండశాసనుడు అయిన మా నాగేశ్వర రెడ్డి అయ్యవారు నా చుట్టూ అయ్యిందా లేదా అంటూ తిరుగుతున్నారు.

    ఆయనకి మెల్లగా చెప్పా నా ఇబ్బంది, ఓర్నీ నీ పాసుగూలా బాగానే చదివి చస్తావుగా నీకిదేం పోయే రోగం అని నాలుగు తిట్టి, మా ఎక్స్టర్నల్ ఎక్సామినర్ చూడకుండా ఆయనే రీడింగులు తీసిచ్చి పుణ్యం కట్టుకున్నాడు. ఆదాయన నేను ఫైనల్ ఇయర్ ఆయ్యేదాకా మనసులో పెట్టుకున్నాడు. సందర్భ

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    8 min
  • మా వాకాటి కథలకు కొనసాగింపు!

    "ఈ రోజు నేను, కమల గూడూరు నుండి వాకాటికి బస్సులో ప్రయాణిస్తూ సరదాగా ఒక జూనియర్ పిల్లగాడిని ర్యాగింగ్  చేశాము", అని ప్రకటించింది, ఒకనాటి సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్లిన సందర్భంలో మా ప్రమీల .

    ప్రమీల మరియు కమల నాకు ఒక సంవత్సరం జూనియర్లు. ఓహో! అని అనుకున్నా. అవి కాలేజీకి కొత్త ప్రవేశాలు జరుగుతున్న తొలి రోజులవ్వటం మూలాన, ర్యాగింగ్ చేయాలన్న అత్యుత్సాహం చాలా మందిలో అప్పుడప్పుడే ఉరకలెత్తుతూవుంది. మేము అప్పటికే నాలుగవ సంవత్సరానికి చేరుకోవటంతో మాకు ఈ ప్రక్రియ పట్ల అంత వ్యామోహం లేదు. నా ఈ ఆలోచనలని భంగపరుస్తూ, "అబ్బబ్బా! ఏమున్నాడు వాడు, ముట్టుకుంటే మాసిపోయేలా అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె", అంటూ కొనసాగించింది ప్రమీల.

    పైగా వాడికి ఎంత ధైయిర్యం మాతో ఏడిపించుకొని, "మాలా డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆడపిల్లలని తాను ఎక్కడా చూడలేదని, ఇలా మీ డైనమిజం అంతా అడవి కాచిన వెన్నెలలా బస్సుల్లో వృధా కాకూడదని, అలా కాకూడదంటే మీరు వచ్చి నన్ను మా తరగతి నుండి బయటకు పిలిచి మరీ ర్యాగింగ్ చేశారంటే అప్పుడు మీరు గొప్ప అని ఒప్పుకుంటాను సవాల్ విసిరాడని" చెప్పింది తను.

    వీడెయ్యా! వీడెవడో మరీ గుండెలు తీసిన బంటులా వున్నాడే, చేరీ చేరక ముందే ఇన్ని వేషాలు వేస్తున్నాడంటే వీడు ఖచ్చితం గా హైదరాబాదోడే అయ్యుంటాడు అనుకుంటూ అడిగా తనని, అయితే తమరు ఆ సవాలును ప్రతిసవాలు చేయడానికే నిశ్చయించుకున్నారా అని. "అవును రేపు నేను, కమల వాడి తరగతి అయిన MH4  కి వెళ్లి వాడిని బయటకు లాగుతాము. అబ్బబ్బా! వాడున్నాడు చూడు అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె", అంటూ తన ధోరణిలోకి వెళ్ళిపోయింది. నాకు ఆ అమ్మాయి వాడిని చూసి ముచ్చట పడటం, ముద్దుగా వుండే ఓ చిన్ని కుంకను చూసి మనమెలా ముద్దు చేస్తామో అచ్చు అలాగే అనిపించింది.

    "MH4 అంటే మెకానికల్ హాల్ 4  అది మా ఫైనల్ ఇయర్ మెకానికల్ వాళ్ళ తరగతి గది అంటే మా తరగతి, ఏమోలే క్లాస్ రూమ్స్ అప్పుడప్పుడు ఎక్స్చేంజి అవుతుంటాయని సర్ది చెప్పుకున్నా, నాకేదో ఎక్కడో తేడా అనిపిస్తుంది, ఎందుకంటే మా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు మరియు వసతి గృహాలు, సీనియర్స్ వుండే ప్రదేశాలకు కాస్త దూరం లో ఉంటాయి, జూనియర్స్ ని ర్యాగింగ్ నుండి రక్షింపపడడానికి. మరి ఈ అమ్మాయేమో వాడి తరగతి MH4 అంటుంది", లాటి ఆలోచనలు తిరుగుతున్నాయి, ఆ అమ్మాయి వాడిని వర్ణిస్తున్నంత వరకూ. అయినా మనం చాలా విషయాల్లో మాశ్రీధర్ గాడిలా ఎక్కువ బుర్ర పెట్టము కదా అందుకే ఎక్కువగా ఆలోచించ కుండా వదిలేశా, ఆ విషయాన్ని అంతటితో.

    మరుసటి రోజు మా అనీల్గాడు హడావిడిగా వచ్చాడు. వచ్చీ రాగానే ఎప్పుడూ ముందు వరుసలో కూర్చొని పాఠాలు తెగ వినేసే  మా శ్రీధర గాడిని మరియు నాలుగో బెంచీలో కూర్చొనే నన్నూ తెగ ప్రేమగా, ఒరే నాకు ఈరోజు మా యింటి  మీద బెంగయ్యింది, నేను ఈ రోజంతా మీతోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈరోజు నా నివాస స్థలమైన ఆఖరు బెంచీకి రండిరా అని.

    అబ్బా ఛా! వీడికి ఈ కళలు కూడా ఉన్నాయా అని అనుకునేలా మా హృదయాలను ద్రవింపచేసేలా బ్రతిమాలుకొని మమ్మల్ని చివర బెంచీకి బదిలీ చేయించుకున్నాడు. ఎప్పుడు వాడి పక్కన పడివుండే ప్రశాంత్ గాడినేమో మా శ్రీధర గాడు ఖాళీ చేసిన మొదటి బెంచీలో కుర్చోపెట్టాడు. నాకు ఇదంతా ఎదో తేడా అనిపిస్తున్నా, మమ్మల్ని అడిగిందెవరు మా అనీల్గాడు కాబట్టి నా సందేహాలు పక్కన పెట్టా. మా శ్రీధర గాడితో ఏమన్నా ముందే చెప్పుంటే వాడెప్పుడో ఈ చుక్కలన్నీ కలిపేసి ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో చెప్పేసేవాడు.

    అది మా  హెడ్డు అఫ్ ది డిపార్ట్మెంట్ మరియు ఆ సంవత్సరమే ప్రిన్సిపాల్ హోదా లభించిన మా ప్రభాకర రావు గారి క్లాస్. ఆయన ఎప్పటిలాగే ఆయన మానాన బోర్డు మీద ఓ బొమ్మని చెక్కి ఆ చెక్కటం లోని ఆయన ప్రావీణ్యానికి ఆయనే తన్మయులై, ఆ బొమ్మకే పాఠం చెప్పుకుంటున్న వేళ, ఆయనకి తపో భంగం కలిగిస్తూ, తలుపు దగ్గర ఎవరో నిలబడి ఆయన్ని ఎదో అనుమతి అడిగారు, ఆయన మా వైపు తిరగాల్సిన దానికే చిరాకు పడుతూ, "ప్రశాంత్ యు హేవ్ సం విజిటర్స్"  అని చెప్పి మరలా బొమ్మకి తుది మెరుగులు దిద్దటంలో  మునిగిపోయారు.

    మా హాస్టల్ వెధవలందరూ పళ్ళికిలిస్తూ ఒకళ్ళకొకళ్ళు హై-ఫై  లు ఇచ్చుకోవటం మొదలెట్టారు. వీళ్ళు ఎందుకిలా అని మా సెంటర్ వాళ్లమంతా తెల్ల మొహాలేసుకొని చూస్తున్నాము. కొంత సద్దుమణిగాక మా

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    9 min
  • మా వాకాటి కథలు

    నాకు శైలేంద్ర అని ఇంజనీరింగ్ లో దొరికిన స్నేహితుడున్నాడు. వాడి ఎత్తు అయిన ఐదడుగుల ఆరంగుళాల కన్నా ఎక్కువ వుండి ఉంటే మన చలన చిత్రాలలోని కథానాయకులకేమీ తీసిపోడు. మొదటి సంవత్సరమంతా వాడికి మా వాకాటి కాలేజీని వాడికి తగ్గ కాలేజ్ కాదు అని తిట్టుకోవటంలోనే సరిపోయింది. నాకు తెలిసి వాడు మా గోపీచంద్ గాడు మా కాలేజ్ లో చేరాక కూడా మళ్ళి ఐ.ఐ.టి కి ప్రిపేర్ అయ్యారు అని నా అనుమానం.

    నేనూ మా శ్రీధర గాడు, పరీక్షలకు ముందర ఒక ఓవర్ చూసి వద్దామని, వన్డే క్రికెట్ మ్యాచ్ అంతా చూసి సాయంత్రమయ్యేసరికి ఆ మర్నాడు జరగబోయే పరీక్షకు తగ్గ ప్రిపరేషన్ చాలలేదని కంగారు పడే వాళ్ళం. ఆ కంగారులో కూడా మనకి మన శైలేంద్ర గాడు తోడున్నాడులే అని ఊరట పడుతూ వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం. మేమెళ్ళేసరికి వాడు మంచిగా తల స్నానం చేసి, నీట్ గా ఒక కుర్చీలో కూర్చొని, పైన ఒక పెద్ద పాడ్ పెట్టుకొని మొదటి చాప్టర్ మొదటి పేజీలోని వుండే వాడు. హమ్మయ్య వీడు మనకన్నా ముందుకెళ్ల లేదు అనుకోని తృప్తిపడి రూమ్ కి వెళ్లే వాళ్ళము.

    ఆరోజు నైట్ మా తంటాలు మేము పడి, గంట చదివి, ఓ గంట సెంటర్ దాకా వెళ్లి టీ తాగటంలో గడిపి మొత్తానికి ఓ నాలుగైదు చాఫ్టర్లు కంప్లీట్ చేసే వాళ్ళం. పరీక్షలు మధ్యాహ్నం పూట జరిగేవి కాబట్టి, ఉదయం పొట్టకి కాస్త బ్రేక్ ఫాస్ట్ పట్టిచ్చి, మరలా మా శైలేంద్రగాడు ఎక్కడున్నాడబ్బా అని వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం, మేము వెళ్లే సరికి మా వోడు తెగ ఆలోచనా నిమగ్నుడయ్యి  ఆకాశం లోకి చూస్తూ ఉండేవాడు, కాకపోతే పేజీలు మొదట చాప్టర్ మధ్య వరకూ తిప్పబడి. ఏరా ఏమి చేస్తున్నావురా అంటే, ఉదాహరణకి ఈ బ్యాంకింగ్ యాంగిల్ అఫ్ ది కర్వుడ్ సర్ఫేస్ మీద దీర్ఘంగా ఆలోచిస్తున్నానురా, ఆలోచించగా ఆలోచించగా ఈ బుక్ లో రాసింది తప్పురా హర్షాగా అనేవాడు.

    మా ఇద్దరికైతే బి.పి పెరిగిపోయేది. ఒరే శైలేంద్రగా నువ్వు ఈ రీసెర్చ్ అంత నువ్వు డాక్టరేట్ చేసేటప్పుడు చేద్దువురా, ఇప్పుడంతా మనం  జవాబులు ముక్కున పెట్టుకొని వెళ్లి రాయాలిరా నాయనా, అని మా శ్రీధర గాడిని రూమ్ కి పంపి వాడికి నేను చదివిన అరాకొరా పరిజ్ఞానంతో  ఓ నాలుగైదు ఇంపార్టెంట్ ప్రశ్నలకి జవాబులు వాడి చేత బట్టీ పట్టించి రూమ్ కి వెళ్లి, ఈ లోపల మా శ్రీధర గాడు చదివిపెట్టిన ప్రశ్నలకి జవాబులు వాడితో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని, ఎదో విధంగా సిలబస్ అయ్యిందనిపించి పరీక్షకి హడావిడిగా వెళ్ళేవాళ్ళం.

    పరీక్షా హాల్ కి వెళ్లే దారిలో మాకేమన్న ప్రశ్నలకి జవాబులు తట్టక పోతే మా విశ్వవిద్యాలయ ప్రథముడైన మా సుబ్బూ గాడిని బతిమాకునే వాళ్ళం, జవాబులు చెప్పరా అని. వాడు మాత్రం, అబ్బా హర్షా! శ్రీధరా మీరు టెన్షన్ పడకుండా పరీక్షా హాలుకి వెళ్ళండిరా నాయనా, అక్కడ మీకు వాటికవే గుర్తొచ్చేస్తాయి అనే వాడే కానీ ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా ఇచ్చే వాడు కాదు. మా టెన్షన్ మేము పడుతూ పరీక్షా హాలుకి నడుస్తుంటే మాకు ఇంకో టెన్షన్, మా ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ మేట్  అయిన స్నేహలత, వెళ్లే దార్లో పుస్తకం చదువుతూ చదువుతూ అడ్డొచ్చిన తుప్పల మీదకెళ్ళి పోయి ఎక్కడ పడిపోద్దో అనే ఆదుర్దా మాకొకటి. అసలే ఆ అమ్మాయి గెడ కర్రలా ఉండేది, తట్టుకొని కిందపడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అమ్మాయా! మమ్మల్ని చూడు ముందే అన్నీ చదివేసి ఎంత హాయి గా పరీక్షా హాలుకెళ్తున్నామో అని ఒక క్లాస్ పీకాలనే కోరిక మాకు మనసులో.

    మా శైలేంద్ర గాడు నేను చెప్పిన జవాబులు ముక్కున పట్టి సుద్ధంగా పరీక్షల్లో రాసొస్తే నేను తప్పులు చేసొచ్చేవాడిని. మనకసలే పరీక్షా హాల్లో తింగరి డౌట్స్ వచ్చి జవాబులు చెడకొట్టి వచ్చే వాడిని. మా శైలేంద్ర గాడు ఇప్పటిక్కూడా వాడి  ఇంజనీరింగ్ మార్కుల్లో  నాలుగో వంతు వాటా హర్షా గాడితే అని ప్రకటిస్తాడు, నాకు అమిత సంతోషం కలిగేలా. ఒకసారి కలిసినప్పుడు చెప్పేడు మా శైలేంద్రగాడు, ఒరే! నాకు ఎక్సెలారై లో ఎం.బి.ఏ లో ప్రవేశం వచ్చిందిరా, కానీ నేను చేరలేదురా అని. అదేందిరా శైలేంద్ర అంటే, అడ్మిషన్ కార్డుని మా పోస్ట్ మాన్ ఆరు నెలల తర్వాత తెచ్చిచ్చాడురా అని చెప్పాడు. ఒరే నాతో చెప్పావు కానీ ఎవరితో చెప్పుకోకురా అని చెప్పా నేను, దాని వాడు, ఏరా నాకు అంత తెలివి లేదా అని అడిగాడు నన్ను. నేను నీ తెలివి గురించి సందేహపడటం లేదురా నీ తల రాత గురుంచే నా సందేహం అని చెప్పా నవ్వేస్తూ. అందులోనూ వాడు హస్త సాముద్రికంలో మెరిక లాటి వాడు. వాడి హస్త సాముద్రికం, పెరటి చెట్టు వైద్యానికి పనికి రానట్టు వాడికే పనికిరాలా. వాడు కూడా నవ్వేసాడు కొంచెం బాధగా. 

    8 min
  • మా (కానీ) సత్యం!

    నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు.

    ఇప్పగుంట వెంకట సత్యనారాయణ, మా స్నేహితులకందరికీ ఐ.వి.ఎస్ గా సుపరిచితుడు, కానీ నాకు మాత్రం సత్య గానే, మా ఇంట్లో వాళ్లకు సత్యంగా. జీవితం లో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళని మనం కథలలో చదువుతూ లేక సినిమాలలో చూస్తూ లేక నిజ జీవితం లో ఎవరి ద్వారా అయినా వింటూ చాలా ఉత్తేజితుల మవుతాము, కానీ అలాటి ఒక వ్యక్తి మన సమకాలీనికుడు అయినప్పుడు మన జీవనక్రమంలో పడి తన  ఎదుగుదలని మనము పెద్దగా గమనించలేము. అలా మా సమకాలీనుకులలో జీవనక్రమాన్ని మొదలుపెట్టిన స్థితితో పోలిస్తే ప్రస్తుత స్థితి ఎంతో అందలేనంత ఎత్తులో నిలుపుకున్న వ్యక్తే మా సత్య. కానీ ఈ క్రమంలో వాడేమి బావుకున్నాడో లేక ఏమి కోల్పోయేడో వాడికే తెలియాలి.

    మనిషి ఐదడుగుల ఆరంగుళాల ఎత్తుతో, చక్కటి వర్ఛస్సుతో, అప్పటికే ఎన్నో ఆటుపోటులను చవిచూసిన కారణంతోనో లేక బాల నెరుపు వల్లనో అక్కడక్కడా తెలుపు లేక ఎరుపు కానీ జుట్టు ఉండేవాడు సత్య. తన చురుకుతనంతో, తెలివితేటలతో, మహా కలివిడి తనంతో మరియు సహజ సిద్ధంగా అలవడిన వేణుగానంతో వాడు మా కాలేజీ చేరిన కొద్ది దినాల్లోనే బాగా పాపులర్ అయిపోయాడు. నాకు, శ్రీధర గాడికి వాడు ఎప్పుడు స్నేహితుడైపోయాడో కూడా తెలియనే లేదసలు. తెలిసే సరికి వాడు కూడా శ్రీధర గాడిలాగే మా కుటుంబ సభ్యుడైపోయాడు, వాళ్ళని నే పిలిచే వరసలతోనే పిలిచేస్తూ. రోజుల తరబడి తినకపోయినా, నిద్రపోకపోయినా, అలుపెరగని దేహం, చెక్కు చెదరని నవ్వు వాడి సొంతం. కాలేజీ లో పగలంతా లేక చాలా పొద్దుపోయిన దాకా అందరి రూములూ కలియ తిరుగుతూ, సందడి సందడి చేస్తూ, అందరూ పడుకున్నాక, తెలవారు ఝాము వరకూ చదువుకోవటం వాడి అలవాటు.

    నెల్లూరు జిల్లాలోని కావలి వాడి స్వస్థలం. పుట్టింది పేద బ్రాహ్మణ కుటుంబములో. చదువుకున్నది కావలి బ్రాహ్మణ సంఘము వారి సహకారంతో మరియు వారాలు చేసుకుంటూ. వాడు పదవ తరగతి ఉత్తీర్ణుడయ్యాక, ఆ సంఘము వారు వాడి బతుకేదో బతికేస్తాడని వాడిని ఓ టైపు ఇన్స్టిట్యూట్లో  చేర్చారట, అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యజమాని వీడి తెలివితేటలు చూసి పైచదువులు చదువుకోమని ప్రోత్సహించాడట. అలా ఎంసెట్ రాసి ఆయన సహకారంతో వీడు మా కాలేజీలో పడ్డాడు. అలాగే వీడు వీడి చదువులతో ఎప్పుడు ఆయన్ని నిరాశ పరచ లేదు.

    మేము మా రెండవ సంవత్సరంలో ఉండగా వాళ్ళ నాన్నగారు పోయారు. వీడు మాకెవరికీ చెప్పకుండా కావలికి వెళ్ళిపోయాడు. మేము ఒక పదిమంది స్నేహితులం తెలుసుకొని కావలికి చేరే సరికి అర్థరాత్రి అయిపొయింది. మాకు వాడి ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నాకు ఓ చిన్న జ్ఞాపకం, ఎక్కడో జనతా పేటలో వాళ్ళ ఇల్లు అని. మా దురదృష్ట వశాత్తు మేము దిగిన రోజే కావలిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. మేము బస్సు దిగి నాలుగు అడుగులు వేసేమో లేదో, ఒక పోలీసు జీప్ వచ్చి మమ్మలన్దరినీ కట్టగట్టి పోలీస్ స్టేషన్లో పడేసింది. మేము ఇలా స్నేహితుడి నాన్నగారు చనిపోతే వచ్చాము అన్నా నమ్మే నాథుడే లేదు, మాలో కనీసం ఒక్కడి దగ్గర కూడా కాలేజ్ ఐడెంటిటీ కార్డు లేదు. మాతో పాటే జీపులో ఎక్కించుకొచ్చిన ఒక దొంగని మా కళ్ళ ముందరే సెల్ లో నాలుకు పీకుతుంటే బిక్కు బిక్కుమని గడిపాము.

    మా అదృష్టవశాత్హు ఆ దొంగని బాదిన ఒక కానిస్టేబుల్ మా సత్యకి ఇంటర్లో సహాధ్యాయుడు అవటంతో, ఇన్స్పెక్టర్ కి చెప్పి సత్య వాళ్ళింటికెళ్లి వచ్చి మేము చెప్పింది నిజమే అని నిర్ధారణ చేయటంతో, ఆ కానిస్టేబుల్ సహాయంతోనే మేము సత్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. వాళ్ళ ఇంటికెళ్లాకే మాకు తెలిసింది, సత్యాకి ఒక అక్క ఉందని, ఆ అక్క అప్పటికే ఒక ముస్లింని పెళ్లిచేసుకొని ఇంటినుండి వెళ్ళిపోవటంతో వీడు తనతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నాడని. మేము ఉన్నంత వరకు వాళ్ళ బావ గారు మాతో చాలా కలివిడిగా, మా వెంటనే వున్నారు. పోనీలే ఆవిడ వీడి కోపతాపానికి బలయినా ఆవిడకి మంచి భర్తే వచ్చాడని అనుకున్నాము మేము. ఇద్దరు పిల్లలు అనుకుంటా వారికి అప్పటికే. అలా మేము వాళ్ళ నాన్నగారి కర్మకాండలలో పాలుపంచుకొని, ఆ రాతిరికి వాకాడుకి చేరుకున్నాము.

    వాళ్ళ నాన్నగారు చనిపోవటంతో వాడు వాళ్ళ అమ్మగారిని తీసుకొని

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    12 min
  • మన జీవితాల నాయకా నాయకులు! రెండవ భాగం

    నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితంలో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది. ఇక నేను ఇటువంటి కథలకు విక్రమాదిత్యుడు-బేతాళుడుల కథలకు మల్లె పైన రాసిన వాక్యాలు పరిచయ వాక్యాలుగా వస్తాయి.

    మా మేనత్తని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది మా నాయనమ్మ. మరలా మా మేనత్త తన కూతురిని తన తమ్ముడు అంటే మా చిన్నాన్న కిచ్చి పెళ్లి చేసింది. అలా మా పిన్నమ్మ మరియు చిన్నాన్నల పెళ్లి రెండవ తరపు మేనరికం. మా పిన్నితో మాకు చాలా మంచి అనుబంధం వుంది. ఆవిడ పని చేయటం లో మహా చురుకు, మాటల్లో మాత్రం మహా నిదానం. మా అమ్మ ముక్కీ మూలిగి ఇంటి వెనక ఉండే చిన్న లోగిలి ఊడ్చే లోపలే మా పిన్ని ముందున్న చాలా పెద్దదైన లోగిలి అంతా చిమ్మేసి, కళ్ళాపి చల్లేసి, ముగ్గులు కూడా పెట్టేసి వచ్చేసేది. మాతో రక రకాల ఆటలు ఆడటం అంటే తనకి చాలా ఇష్టం. చిన్నా చేయి చాపు తాయిలం పెడతా అని, అని నేను చేయి చాపగానే, బతికున్న కప్పనే చేతిలో పెట్టి పారిపోయేది, మా కేకలకు ఎక్కడ మా అమ్మ వచ్చి చీవాట్లు పెడుతుందో అని. అలాగే రబ్బరు బల్లిని అందరూ నడిచే చోట గోడలకి అంటించి అది వాళ్ళు నడిచేటప్పుడు సరిగ్గా వాళ్ళ నెత్తిన పడేలా చేయటం వాళ్ళు భయంతోనో అసహ్యం తోనో కేకలు పెడుతూ దులుపుకుంటుంటే పక పక లాడటం, వాళ్ల మీద బొద్దింకలేయటం లాటి ఆటలతో మా ఇల్లు సందడే సందడి. తాను మమ్మల్ని భయపెట్టడానికి తన కను రెప్పల్ని వెనక్కి ముడుచుకొని, గాలి నోటితో లోపలి పీల్చుకుంటూ బొంగురు గొంతుతో భయపెడితే నాకు దడుపుతో ఆ రాతిరికి జ్వరం కాసేది.

    దానికి తోడు మా చిన్నాన్న కూడా చాలా సరదా మనిషే. మా ముందు గోళీలను మాయం చేసి మా చెవుల్లోంచి, ముక్కుల్లోంచి తీయటం, మనసులో ఓ అంకెను అనుకొని, దాన్ని రెండుతో పెంచి, ఓ పది కలిపి లాటి కంగాళీ లెక్కలు చేసి మనసులో మేము అనుకున్న అంకెను ఆయన చెప్పటం లాటి సరదా లెక్కలు చేయించటం, మమ్మల్నివీపు మీద ఎక్కించు కొని బావిలో ఈదటం, మా వూరిలో వేసే నాటకాల్లో ఎప్పుడు పంతులు వేషం వేసినా మా చిన్నాన్నే వేశాడు అని మేము ఎప్పటికీ గుర్తుపట్టలేనట్టు మమ్మల్ని మాయ చేయటం, నేను ఒకటి రెండు మూడు అనే లోపల మీరు మంచం దిగుతారు అని పందెం కట్టి మేము పందేనికి ఒప్పుకోగానే, మూడు అని ఎప్పటికీ అనకుండా మమ్మల్ని విసిగించి మేమే దిగేలా చేయటం లాటి పనులతో మా చిన్నాన్న అంటే మేము ప్రాణం ఇచ్చేలా చేసుకున్నాడు ఆయన. అసలు ఆయన మమ్మల్ని ఎప్పుడు సందడిగా, ఉత్సాహం గా ఉంచడానికి చాలా చిట్కాలు, పాటలు మరియు పద్యాలు నేర్చుకున్నాడు అని అనుకుంటే ఆ ఇష్టం ఇంకా ఎక్కువయ్యేది.

    ఆయన బావిలో మమ్మల్ని వీపునెక్కించుకొని ఈతలు కొట్టే ఆటలకి మా అమ్మ తన అనుమతి ఇచ్చేస్తే మా పిన్ని మాత్రం తన కొడుకుని సంకనేసుకొని తోటలోంచి ఇంటికి పరిగెత్తేసేది వాడిని ఆయనకు దొరకనీయకుండా. వాడు రెండు తరాల మేనరికాల వలన పుట్టటమే కొంచెం బలహీనప్రాణి. వాడంటే మా ఇంటిల్లిపాదికీ గారాభమే. వాడికైతే స్నానం చేయించడం, అన్నం పెట్టడం, కథలు చెప్పడం లాటి అన్నీ పనులకి వాళ్ళ పెద్దమ్మ అంటే మా అమ్మే ఉండాలి. వాడు ఒకరోజు అత్యుత్సాహం తో నన్ను మా దొడ్లో వుండే నీళ్ల తొట్టిలో దించమన్నాడు, నేను ఉత్సాహం గా దించేసా, దిగాక వాడు నాకలివి గాలా, ఎంతకూ రాడు బయటకి, నేను వాడిని నా చేతులతో మునిగిపోకుండా అలాగే పట్టుకొని కేకలు వేస్తూనే వున్నా, ఎప్పటికో మా అమ్మా పిన్ని వాళ్ళు విని పరిగెత్తుకొచ్చారు, ఆ రోజు మా పిన్ని భయపడి ఏడ్చిన విధానం, ఇంక నేను వాడితో ఎప్పటికీ అలాటి ప్రయోగాలు చేయకుండా చేసింది. అలాగే వాడేమన్నా తులిపి పనులు చేసి ఆమె చేతిలో తన్నులు తిని, వాడు ఏడవటం, వాడితో పాటూ ఆమె ఏడవటం, అందరూ తిరిగి ఆమెని తిట్టేవరకు జరిగేది, అంతలా ఏడ్చేదానివి వాడిని కొట్టటం ఎందుకు మొదట అని.

    మా పిన్ని మా చిన్నప్పుడు తినడానికి వేరుసెనగ ముద్దలో, చలిమిడి ముద్దలో, నువ్వుల చిమ్మిరో చాలా క్రమం తప్పకుండా చేసేది. కానీ ఎప్పుడూ అన్నీ మా దగ్గర పెట్టేది కాదు, చాలా జాగ్రత్తగా దాచి రోజుకొక్కటే ఇచ్చేది. ఏరోజుకారోజు అయిపోయాయి, ఇదే చివరి ముద్ద అని చెప్పేది, ఆమె ఎక్కడ దాచుతుందో అని మేము ఎంత గూఢచర్యం చేసినా

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    14 min
  • మన జీవితాల నాయకా నాయకులు! ఒకటవ భాగం

    నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితం లో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది.

    ఈ మధ్య మా అమ్మతో మాట్లాడుతుంటే, తన చిన్ననాటి స్నేహితురాలైన ఈదల పద్దమ్మ గారి గురుంచి చెప్తూ, తన చిన్నతనంలో తనంతటి వయస్సు వుండే ఆవిడ చాలా పెద్దదైన వాళ్ళ పెరడు అంతా ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, ఆ తర్వాత అంట్లు అన్నీ తోమేస్తే మా అమ్మ తనకి సహాయం చేసేది అంట్లు కడగటంలో. మా అమ్మనడిగా నేను, మరి మీ ఇంట్లో ఈ పనంతా ఎవరు చేసేవారు అని. మా చిన్నక్క ఐన సరోజినక్క అని చెప్పింది. చెప్తూ మన పనంతా గోసంగిలా ఊరంతా స్నేహితురాళ్ళతో తిరగటమే, అంత మా అక్కే చూసుకొనేది అని సెలవిచ్చింది. ఈ ఒక్క వాక్యం చాలు మా చిన్న పెద్దమ్మ ఎంత కష్ట జీవో, మరియు తన చెల్లెలైన మా అమ్మ కూడా పని చేయాలి కదా అని వంతుల కోసం ఎదురు చూడకుండా తన పని తాను ఎలా చేసుకొని పోయేదో చెప్పడానికి.

    మా సరోజన పెద్దమ్మ మరియు మా శేష పెదనాన్నలకి నలుగురు సంతానం. ముగ్గురాడపిల్లలు మరియు ఒక మగ నలుసు. మా పెదనాన్నకి అందర్నీ ప్రేమించటం, వ్యవసాయప్పనులు చూసుకోవటం తప్ప ఏమీ తెలియదు మా పెద్దమ్మే అన్నీ చక్కబెట్టుకోవాలి. వాళ్లిద్దరు వాళ్ళ నలుగురు పిల్లలతో పాటు మాకు, అంటే మా అన్నకి, అక్కకి మరియు నాకు, సమానంగా ప్రేమని పంచారు, ఇంకా ఒక పాళ్ళు ఎక్కువే, మేము చిన్న పిల్లలమవటంతో. మా పెదనాన్న వాళ్ళ నాన్నగారు మా అమ్మమ్మ వాళ్లకి బంధువులు మరియు వాళ్ళకి మొదటినుండి ఉప్పలపాటిలో పొలాలు ఉండటం తో మా పెద్దనాన్న ఉప్పలపాటికే వచ్చేశారు. అలా మా సొంత అక్క ఉప్పలపాటిలో మా పెద్దమ్మ పెద్ద నాన్నల దగ్గరే పెరిగేసింది. మా నాన్నమ్మ వాళ్ళ వూరైన ఉలవపాళ్లలో మా నాన్నకసలు ముగ్గురు పిల్లలని తెలీనే తెలియదు. మా అక్క మా ఉలవపాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి పోయే ఇందిరమ్మ. ఎందుకో తెలియదు మా ఉలవపాళ్ళ జనాలు మా అక్క పేరు సుమతి అయినా, ఇందిరమ్మ, లేక ఇందిరా గాంధీ అనే పిలిచే వాళ్ళు.

    అలాగే నేను ఉప్పలపాటి వచ్చి ఎక్కడికైనా వెళ్లాలంటే మా పెదనాన్న భుజాలమీద ఎక్కి వెళ్లాల్సిందే, నాకు బాగా లేనప్పుడు ఎత్తుకెళ్ళి చీటీలు కట్టించటం, లేక కామెర్లకి పక్కూరికి తీసుకెళ్లి మందు పెట్టించటం, అంత ఎందుకు మా ఊరి పొలాల వెనక పారే వాగులో దొరికే అతి రుచికరమైన అర్జులు అనబడే చేపలు తెచ్చుకోవాలన్న నేను మా పెదనాన్న భుజం ఎక్కాల్సిందే. ఆయనకి ప్రేమ ఎక్కువైతే నా బుగ్గలు కొరికేసేవారు. అదొక్కటే నేను ఆయన మీద చేయగలిగిన ఫిర్యాదు. ఆఖరకు మేము ట్యూషన్లో లేట్ అయినా లాంటర్న్ ఎత్తుకొని వచ్చేవాడు మా పెదనాన్న నన్ను మా అక్కనీ ఇంటికి తీసుకెళ్లడానికి. నాకు తెలీదు అంత ప్రేమ ఆయన ఎలా పంచగలిగాడో అని.

    మా పెద్దమ్మైతే పొలం పనుల అజమాయిషీలో పడి అలిసి సొలిసి వచ్చినా దాలి గుంత వేసి కాగు నిండా నీళ్లు కాచి ఆ వేడినీళ్ళతో మాకు స్నానాలు చేయించేది. నేను పెద్ద వాడినయ్యా నేనే చేస్తా అని హఠం వేసే వాడిని అప్పుడప్పుడు. ఆమె ఎప్పుడన్నా నెల్లూరు వెళ్తుంటే పనుల మీద కాళ్లకడ్డం పడి ఆమె వెంట వెళ్లే వాడిని. నెల్లూరులో ఆమె ఎన్ని పనులున్నా ఓపికగా నడిచే వెళ్లే వారు, నేను కొంచెం నడిచి రిక్షా ఎక్కుదామని మారాం చేసే వాడిని. ఎన్నిటికని ఎక్కగలం, ఆమె అలాగే నన్ను బతిమాలుతూ నడిపిస్తూ, నడిస్తే షోడాకొని పెడతానని చెబుతూ, తనకి ఓపిక వున్న వరకూ నన్ను మోస్తూ పనులు చక్క బెట్టుకొనేది.

    ఇక మా పెద్దక్క సి. గాన పెసూనాంబ అయితే మా పిల్లకాయల్ని మాయ చేసి అన్నాలు పెట్టటంలో మహా నేర్పరి. అప్పట్లో మాకు ఇన్ని రకాల కూరగాయలు లభ్యం అయ్యేవి కావు. మహా అయితే పల్లెల్లోనే పండిన సొరకాయో, పొట్లకాయో, పందిరి చిక్కుడ్లో, లేక పోతే తంబకాయలో దొరికేవి. ఇప్పటిలా క్యారట్లు, బీట్ రూట్లు, క్యాబేజీలు లాటివి మేమెరుగం. బంగాళా దుంపలు కూడా ఎప్పుడో పండగలకు పబ్బాలకు కుర్మా రూపంలో. చేపలు మాత్రం చాలా విరివిగా దొరికేవి. కానీ సాయంకాల పూట, సూర్యాస్తమయ్యాక, ఆరుబయట, మినవల పచ్చడి, పొట్టు పెసలతో చేసిన పప్పు, నెయ్యి కలిపి మా అక్క భీముడి కథలు చెప్తూ నా సామిరంగా అన్నం పెడుతుంటే, ఇంకా పెట్టు, ఇంకా

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    10 min
  • మా శ్రీధర గాడు! ఓ మంచి స్నేహితుడు!

    నేను ఇంతకుముందే చెప్పా, నావి ఎలాటి వానాకాలం చదువులో, ఇంటర్మీడియట్ ఎలా చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గట్టెక్కానో, ఎంసెట్ లో ఎలా ఓ పెద్ద రాంక్ సాధించుకొని వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డానో. ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా విరుచుకు పడతాడు, నీ దొక బయోగ్రఫీ, అది ఇంతకు ముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ ఎదవ అభిప్రాయమూ అని. వాడలాగే అంటూ ఉంటాడు, నేనిలాగే రాసి పారేస్తుంటా. ఇక్కడో రహస్యముంది, అబ్బా! నా పేరు వీడు కథలో వాడేసాడు అనే తృప్తితో వాడు ఈ కథని తక్కువ విమర్శిస్తాడు అన్నది నా ఎదవ అభిప్రాయము. కానీ ఈ కథ చదివి వాడు, చాలా భయం భయం గా రాసినట్టున్నావురా అనెక్కడ అనేస్తాడో నని నా భయం.

    అవి నేను ఇంజనీరింగ్ చేరిన తొలి రోజులు. మా అనీల్గాడు మరియు నేను ఈ నాలుగు సంవత్సరాలు మాతో గడపబోయే మాబోటి దుర్లక్షణాలు మరియు మా తరంగ దైర్గ్యములు జత కలిసే మిత్రుల కోసం వెతుక్కుంటున్నాము. ముందే చెప్పాను కదా, మా వోడు హాస్టల్ మీద నేను ఊరి మీద పడ్డామని. మా వోడు అప్పటికే మావ!, నాకు ప్రశాంత్, భార్గవ్, జగ్గు, కోట మొదలగు వారు తెగ నచ్చేశారు అని అప్పటికే ప్రకటించేశాడు, నేను వెనకబడిపోయా మా వాడితో పోల్చుకుంటే. నాకూ అప్పటికే ఓ రూమ్ మేట్ దొరికాడు సుబ్రహ్మణ్యం అని, కానీ వాడు నాకు ఈ రెండు మూడు వారాల్లోనే అస్సలకి మనిషి అన్నవాడు ఇంతలా చదువుతాడా అనే సందేహం కలిగించేశాడు. వాడి చదువు తీరు మరియు వాడి క్రమశిక్షణా నాకు కడు దుర్లభంగా వున్నాయి. నాకు మిత్రుడయ్యే లక్షణాలు వాడిలో అస్సలకి లేవు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసా.

    ఆ రోజు మేము మొదటి సారిగా మెకానికల్ వర్క్ షాప్ కి వెళ్ళాము. మమ్మల్ని మూడు బ్యాచ్ లుగా విభజించారు. బ్లాక్ స్మితి, టిన్ స్మీతి మరియు వుడ్ కార్పెంటరీ బ్యాచ్ లుగా. ఇదేందిరా నాయనా నాలుగేళ్ళయ్యాక యీ పనులే చేసుకుంటా బతకాలా అని చతురోక్తులు వేసుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళం వెళ్ళాము. నాది బ్లాక్ స్మితీ బ్యాచ్. నాతో వచ్చిన పక్కనున్న పిల్లగాడు కొంచెం పల్లెటూరు నుండి వచ్చిన వాడై కనపడటంతో మనకలవాటైన పట్టణపు అతి తెలివితో, నువ్వు కింద కుప్పలా పడున్న బొగ్గుల్ని ఎత్తుకొని కొలిమిలో వేస్తూ వుండు, నేను ఈ పొడవాటి టాంగ్స్ తో వర్క్ పీస్ ని కాలుస్తూ ఉంటా అని చెప్పా. ఆ పిల్లగాడు నన్ను పైనుండి కిందవరకూ ఓ మారు చూసి, పోరా! అదేదో నువ్వే ఆ బొగ్గులేరుకో, నీ చేతులే మసి జేసుకో అని గదమాయించాడు.

    అప్పుడు ఇంకా గమనించా వాడిని, మనిషి మహా చురుగ్గా వున్నాడు, ముందు రెండు పళ్ళు చివర్ల విరగ్గొట్టుకొని వున్నాడు, మహా తులిపి తనానికి నిదర్శనంగా, నాకర్థమైయింది వీడు ఒకడికి చెప్పే వాడే కానీ వేరే వాడు చెప్తే వినేరకం కాడని, వెంటనే బుద్ధిగా వాడు చెప్పినట్టే చేశా. అలా నన్ను మొదటి రోజే ఏరా, పోరా అని, వాడి పెత్తనం కిందకు తెచ్చేసుకొని నన్ను ఇప్పటికీ ఆడేసుకొనే వాడే మా శ్రీధరగాడు.

    ర్యాగింగ్ టైం లోనే మహాధైర్యంగా తిరిగేవాడు, ఎందుకంటే వాడు లోకల్. కాలేజీ కి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ వూరు. వారంలోపలే మనం వాళ్ళ ఊరిని సందర్శించటం, వాళ్ళ కుటుంబ సభ్తులను మరియు బంధువులను వాడు ఏ-ఏ వరుసలతో పిలుస్తాడో మనమూ అలానే పిలిచెయ్యటం, అలాగే వాడు మా నెల్లూరుని సందర్శించటం, నేను మా వాళ్ళను ఏ వరుసలతో పిలుస్తానో వాడూ పిలిచెయ్యటం లాటి చర్యలతో మా స్నేహం బర్తృహరి చెప్పినట్టు సజ్జనుల స్నేహం ఉదయపు ఎండలా ఎలా పెరిగిపోతుందో అలా పెరిగి పోయింది.

    మొదటి సంవత్సరం వాడు వాళ్ళ వూరునుండి ఒక బుడ్డ బులుగు సైకిల్ లో వచ్చేవాడు, రెండవ సంవత్సరం నుండి వాడు నేను ఒక రూమ్ కి మారిపోయాము. వాడు లోకల్ అవటం నాకు చాలా సౌఖ్యంగా ఉండేది. వారంలో ఒక రోజు వాళ్ళ ఇంటినుండి ఇద్దరికీ పిలుపు వచ్చేసేది, ఏ చేపల కూరో, లేక ఏదైనా స్పెషల్ చేసినప్పుడో. వెళ్ళేసి కుమ్మేసి రావటమే. వారానికోసారి వాడి బట్టలన్నీ వూరికెళ్ళిపోయి నీట్ గా ఉతకబడి, గంజి పెట్టబడి, ఇస్త్రీ చేయబడి పర పరలాడుతూ వచ్చేవి. వాడి చొక్కాలు నేను వేసుకొని పూలరంగడి లా తిరుగుతూ ఉంటే, కుళ్లుకొని మా గోపీ గాడు, ఏరా వాడివి చొక్కాలేనా లేక అండర్ వేర్ లు కూడా వాడేస్తావా అని ఏడిచేసే వాడు.

    వీడు టెక్స్ట్ బుక్ లు బాగా కొనేవాడు కానీ ఇద్దరం వాటిని ఏమాత్రం నలగనిచ్చే వాళ్ళం కాదు. సంవత్సరమంతా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగి పరీక్షల ముందర మాత్రం తెగ నైట్ అవుట్ లు చేసే వాళ్ళము. వచ్చే సంవత్సరం నుండి ఎప్పటి పాఠాలన్నీఅప్పుడే చదివెయ్యాలని ఒట్లు పెట్టుకొనే వాళ్ళం. కానీ షరా మామూలే. ఇక నిశ్చయించుకున్నాం మనదంతా వ

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    12 min
  • నేనూ, నా మైనర్ సర్జరీ!

    ఈ రోజు మా పదో తరగతి సహాధ్యాయని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితువులమందరిమి హాజరయ్యాము. అలా వచ్చిన వారిలో, ఒక స్నేహితుడు రియాజ్ బాషా. తనకి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు కొంత కాలం క్రిందట. హాస్పిటల్ అంతా తనని చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్ కి తాను ఒక సమరసింహారెడ్డి ని అనే బిల్డ్ అప్ ఇద్దామనుకున్నాను అని చెప్పటంతో నాకు కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలు గా కళ్ళ ముందు కనపడటం మొదలయ్యింది. 2001 లో  నాకొక సర్జరీ అవసర మయ్యింది. దాని గురుంచి ఎంక్వయిరీ చేస్తే మన సీనియర్ బాలాజీ కూడా చేయించు కున్నాడని తెలిసి, ఆయనకీ చేసిన డాక్టర్ ఏ.ఎస్.రెడ్డి గారి దగ్గరే నేను కూడా అప్పోయింట్మెంట్ తీసుకున్నా. నేను భయపడుతుంటే, పాపం బాలాజీ చాలా ధైర్యం చెప్పాడు, ఇది చాలా మైనర్ సర్జరీ, నొప్పేమీ ఉండదు, ఉదయం చేయించుకుంటే మధ్యాన్నానికి ఇంటికెళ్లి పోవొచ్చు అంటూ. ఎంత ధైర్యం చెప్పినా, మొదటిసారి కావటం తో ఎక్కడో ఎందుకో తెలియని ఆందోళన. ఇంట్లో కూడా రెండు గ్రూపులు, ఒక గ్రూపేమో వీడు పిరికోడు వీడేమి చేయించు కుంటాడు అని రెచ్చ కొట్టే గ్రూప్, ఇంకో గ్రూప్ వద్దయ్యా! హర్షయ్య! అని కళ్లనీళ్లు పెట్టుకొనే సోదరీమణుల గ్రూప్. ఈ గ్రూప్ ల మధ్య పందేలు కూడా. ఓ రోజు రెచ్చ కొట్టే గ్రూప్ వెటకారాలు ఎక్కువ అవటం తో మొండిగా ధైర్యం నటిస్తూ వెళ్లిపోయా సుప్రియ తోడు రాగా డాక్టర్ గారి దగ్గరకు.

    సర్జరీ అయ్యి బయటకి రాగానే మొత్తం సుప్రియ వాళ్ళ బంధువులందరూ హాస్పిటల్ కి వొచ్చి ఒకటే విచారణ. మా బామ్మర్ది గాడైతే ఓ పూల బొకే మరియూ ఓ పెద్ద గెట్ వెల్ సూన్ బోర్డు తో వొచ్చాడు. ఆ డాక్టర్ ఈ సందడంతా చూసాడు , నా దగ్గర కొచ్చాడు. నీ పాసు గూలా నేను నీలాటి వాడినెక్కడా చూడలేదయ్యా. ఎవరన్నా వాసెక్టమీ అంటే మొగుడూ పెళ్ళాలు మాత్రమే వొచ్చి ఎదో గుట్టుగా చేయించుకొని చప్పుడు చేయకుండా వెళ్ళిపోతారు. నువ్వెందయ్యా ఊరంతా డప్పు కొట్టుకొచ్చావ్, నరసింహ నాయుడా! అంటూ ఒకటే నవ్వు. ఆ తర్వాత తెలిసింది బొకే సుప్రియా ఐడియా అని. ఆ ఆపరేషన్ చేయించుకొని నేను పెద్ద హీరో అయిపోయా తనకి అని.

    కానీ బాలాజీ చెప్పినంత వీజీ కాలా నాకు. ఒక వారం పట్టింది ఆ నొప్పి తగ్గడానికి. నడవడానికి కూడా కష్టపడ్డా. ఆ తర్వాత మన శ్రీధర్ గాడి వొంతు. వాడు కాల్ చేసాడు భయపడుతూ భయపడుతూ, ఏరా!  చేయించుకోవొచ్చా, నొప్పి ఉంటుందా, వున్నా ఎన్ని రోజులూ అంటూ. నేను కూడా, అచ్చు మన బాలాజీ లాగే,  అస్సలకేమీ భయపడకురా, చాలా మైనర్, పదికి చేయించుకున్నావా పదకొండు గంటలకి ఇంట్లో ఉండొచ్చు అంటూ చెప్పా. చేయించుకున్నాక వాడు ఎలాగూ బూతులు తిట్టాడనుకో. ఒక చిన్న మెసేజ్ వాసెక్టమీ చాలా సింపుల్ ప్రొసీజర్ మరియు చాలా సేఫ్, ట్యూబెక్టమీ తో పోలిస్తే. ఐన ఈ కథ మీకు అంటే మన స్నేహితులకి ఒక జీవిత కాలం లేట్ .



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    3 min
  • నాది కాదు కానీ, మా అనీల్గాడి సోది!

    ఎక్కడో మారు మూల పల్లెలో పుట్టాను. ఏకోపాధ్యాయ లేక ఆ పూటకి ఉపాధ్యాయుని రాక దైవాధీనాలు అనేలా వుండే ప్రాధమిక పాఠశాలలో పలకల మీద అక్షరాలూ దిద్దాను, నోటి లెక్కలు నేర్చాను, నాలుగవ తరగతి లోనో లేక ఆపై తరగతులలోనో ఆంగ్ల అక్షరమాలలు నేర్చుకున్నాను. అన్నీ పలకల మీదే, పుస్తకాల మీద రాయటమన్నదే ఎరుగను ఆరవ తరగతి వరకు. వానా కాలం చదువులంటారు ఎందుకో తెలియదు కానీ మా నావీ అట్టివే అనవచ్చు. అదేదో మేము అప్పటికే పొడిచేసి ఇంకా నవీన చదువులు చదవాలన్నట్టు మా బ్యాచ్ తోనే సిలబస్ మారటం మొదలవ్వటం మూలాన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఆరు నెలల తర్వాతే లభ్యమయ్యేవి. కొనే స్తోమతు లేకనో లేక ఇక ఇంకో ఆరునెలలు కోసం కొనటం ఎందుకనో, నేనైతే టెక్స్ట్ బుక్ మొహం చూసి ఎరుగనబ్బా. మా అయ్యోర్లు ఏ నోట్స్ చెబితే అదే నాకు మార్గదర్శనం. అందుకే ఇప్పటికీ ఏదన్న టెక్నికల్ పుస్తకం చదవాలన్న అదేదో బ్రహ్మ విద్య లాగ మనస్సులో ఓ భయం. నా వల్ల కానే కాదబ్బా అనే అంతర్వాణి బలంగా వెనక్కి లాగుతుంది.

    లెక్కలు కూడా బట్టీయమే నేను. మిగతా సబ్జెక్టులు పరవాలేదు గాని, నాకు బడిలో లెక్కల రావు అని పేరు. రావు అంటే రావనే అర్థం. అలా లెక్కలంటే ఒక మానసిక భయం పెంచుకున్నా నేను. మా ముందు బ్యాచ్ వాళ్లకి ఎనిమిదో తరగతి నుండి లెక్కల్లో రెండు ఆప్షన్స్ ఉండేవి , ఒకటి కంపోజిట్ అని రెండోది జనరల్ అని. లెక్కల్లో మా శ్రీధర్గాడిలా వుండే మేధావులంతా కంపోజిట్ తీసుకొనే వారు, నా బోటి బట్టీయమ్ గాళ్ళంతా జనరల్ తీసుకొనే వాళ్ళు. నేను కూడా ఫిక్స్ అయిపోయా జనరల్ తీసేసుకుందామని. కానీ మన అకాడెమీ వాళ్ళు ఇలా లెక్కల్ని రెండు విధాలుగా డిస్క్రిమినేట్ చేయరాదని నిశ్చయించి రెండిటినీ కలిపి కలగూర గంప చేసి నా లాటి వాళ్లకు లెక్కల్ని ఓ జీవన్మరణ సమస్య చేసిపారేసారు. లెక్కలంటే ఇంత భయపడే నేను సామాన్య శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము లాటి విషయాల్లో చురుకుగానే వుండే వాడిని. ఇప్పటికీ మైటోకాండ్రియా, హైడ్రా గమనము లాటివి పటము సహాయముతో వివరించగలను, ఏ మూలకముల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమిటో ఇప్పటికీ చెప్పగలను అబ్బా.

    పదవ తరగతి గట్టెక్కగానే వెళ్లి నా అన్నీ లెక్కల పుస్తకాలు కిలోల లెక్కన మా అంగటాయనకి తూకం కింద అమ్మేసి , ఆయన రెండు రూపాయలు తక్కువిచ్చినా గీకి బేరమాడకుండా, ఆ డబ్బుల్తో సినిమాకి కూడా వెళ్ళొచ్చా. అలాగే మన నెల్లూరు వి.ఆర్.కాలేజీ వాళ్ళిచ్చే ప్రవేశ పత్రం తెచ్చుకున్న బై .పి .సి కి. ప్రవేశ పత్రానికి మా నాయన సంతకం పెట్టలా అప్పట్లో. ఎంసెట్ లో 500 లోపలే ర్యాంకు రావాలి ఎం.బి.బి.ఎస్ లో సీట్ కావాలంటే, అదే ఇంజనీరింగ్ అయితే ఏ ఐదు వేలొచ్చినా పర్వాలేదు అనే అవగాహన ప్రతీ నాయనలకుంది ఆ రోజుల్లో. నేను బతిమాలా మా నాయన్ని , ఆయన కరగాలా. వెళ్లి మళ్ళి నాకు మరియు మా అక్కకి ఎం.పీ.సి ప్రవేశ పత్రం తెచ్చుకున్న.

    అక్కడ దొరికాడు మా అనీల్హాడు నా సహాధ్యాయుడిగా. మా వీ.ఆర్. కాలేజి చాలా ప్రజాతంత్య్ర కళాశాల. తరగతులెప్పుడూ జరగవు. భౌతిక శస్త్ర తరగతులకు హాజరైతే చాలు ప్రాక్టీకల్స్ కి రానిస్తారు, మిగతా క్లాసులన్నీ ఎగ్గొట్టొచ్చు. అప్పుడు నెల్లూరు ఎంసెట్ కోచింగ్ కి చాలా ప్రసిద్ధి. కోరా , నారాయణ , అమీరుద్దీన్ , ఆదిత్య , రత్నం లాటి కోచింగ్ సెంటర్స్ అన్నీ కోచింగ్ తీసుకొనే విద్యార్థులతో కిట కిట లాడుతూ ఉండేది. అలా మేము తంతే వెళ్లి కోరా లో పడ్డాము. బాగా చదువుకొనే వాళ్ళు చదువుకున్నారు , నేను-మా అనీల్గాడు మరికొంత గాంగ్ చదువుని చట్టుబండలు చేసి రోజుకో ముప్పై గంటలు క్రికెట్ ఆడేవాళ్ళము. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి వాడు పాసయ్యాడు, నేను లెక్కల్లోనే తప్పాను. మొత్తానికి 150 మార్కులకు గాను నాకు 44 వచ్చాయి. మా అనీల్గాడు పాసైపోయాడు. గుడ్డిలో మెల్ల నాకు ఎంసెట్లో 3047 రాంక్ రావటంతో మా వాళ్లంతా బిడ్డ బాగా చదివాడమ్మా!, ఆ పేపర్లు దిద్దినవాడి చెయ్యి పడిపోను, అని వాడిని తిట్టుకున్నారు, నన్ను నమ్మేశారు. మనం కూడా మొహం దీనంగా పెట్టుకొని ప్రపంచమే నన్ను ముంచేసినట్టు కొన్నాళ్ళు జీవించేశాను.

    మా అనీల్గాడేమో నా వల్లే వాడి ఎంసెట్ రాంక్ దొబ్బిందని, నా దగ్గరుంటే మళ్ళీ దొబ్బద్దని తలచి, నన్ను ఒంటరిని చేసి, వాళ్ళ నంద్యాల వెళ్ళిపోయాడు, ఎంసెట్ కాదు దాని జేజెమ్మ ఐ.ఐ.టి కొడతానని శపధం చేసి మరీ. సరే బాగుపడే వాడినెవరూ చెడగొట్టలేరని వాడినొదిలేసా. నేను కూడా నా సెప్టెంబర్ ప్రిపరేషన్ లో పడిపోయా, మా కాలంలో ఇప్పటిలా ఇన్స్టంట్ ఎగ్జామ్స్ లేవు మరీ. నా సప్లిమెంటరీ పరీక్ష అయ్యింది , పాపం ఈసారి దిడ్డినోడి చెయ్యి మా వాళ్ళ నోట్లో పడి పడిపోకూడదనేమో నాకు 150 కి 144 మార్కులు వచ్చాయి. నేను కూడా మా వాళ్ళ ఇళ్ళకందరికీ వెళ్లి, పోయిన సారి దిద్దినోడు ఎడమ పక్కన ఒకటెయ్యటం మర్చిపోయాడని ప్రకటించ

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    10 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners