
Sign up to save your podcasts
Or


నేను నాలుగు చక్రాల వాహనం తోలటాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నా. చాలా పద్దతి గా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లు, రియర్ వ్యూ మిర్రర్ లు పదే పదే చూడటం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే తోలడానికి అన్నీ అనుమతులు రావటంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా, షికారుకు బయలుదేరాను. ట్రాఫిక్ వున్నా స్మూత్ గా కదులుతుంది ప్రయాణం, వెనక, ముందూ, పక్కల చూసుకుంటూ వెళ్తున్నా, ఎంతైనా కొత్త కదా. ఇంతలో సుప్రియ రియర్ వ్యూ మిర్రర్ ని సర్రుమంటూ తన వైపుకు తిప్పుకొని, తన చేతి సంచిలోంచి తన పెదవుల సౌందర్యాన్ని ఇనుమడింప చేసే సాధనాన్ని తీసి సౌందర్యాలంకరణ లో మునిగి పోయింది. నాకు వెనకేమి వస్తున్నాయో తెలియక కెవ్వు కెవ్వుమని అరుస్తున్నా. తాను చాలా ప్రశాంతంగా అబ్బాయా! అద్దముండేది ఎందుకు ముఖం చూసుకోవడానికి కాకపోతే. ఇందాకటి నుండి నువ్వా అద్దంలో నీ సోకు చూసుకుంటా ఉండావనుకుంటూ వున్నా అని తన సునిశిత దృష్టిని బయటపెట్టింది.
ఈ విషయం నేను ఈ మధ్య మా స్నేహితులందరి మధ్యలో ఉండగా బయట పెట్టా.. తాను ఎర్రబడ్డ మొహంతో, ఈడు మరీ అతిశయాలు కలిపి చెబుతున్నాడు, నేను ఆ అద్దం లాగింది పార్కింగ్ లాట్ లో ఉండగా అని కవర్ చేసేసింది. ఏది ఏమైనా ఈ ప్రాబ్లెమ్ నాలాటి అభాగ్యులు చాలామందికి జరిగిందేమో ఇంతకు ముందు, అందుకే పాసెంజర్ సైడ్ ఇంత లావు అక్షరాలతో వానిటీ మిర్రర్ ఏర్పాటు చేశారేమో. మీరెప్పుడైనా మాలాటి ఎర్ర బస్సు జంటలను చూసారా. చూసుంటే ఆ కథలు రాసెయ్యండి.
అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని. దానికి ఆయన నవ్వేసి మేము మైలు రాళ్ల వంటివారము, అవి ఎప్పడు ఫలానా ఊరికి ఇక్కడనుండి ఎంత దూరమో చెప్తాయి, కానీ దగ్గరుండి దిగబెట్టి రావు, అలాగే మేము కమ్యూనిజం అంటే ఏమిటో చెప్తాము అంతేనని ముక్తాయించాడట.
అలాగే మా తాత, అనగా మా నాన్నకి నాన్న కూడా ఓ కమ్యూనిస్ట్. ఆయన మావూరికి దగ్గరలో వున్న బిట్రగుంట లోకో షెడ్ లో ఓ ఫిట్టర్. ప్రజాశక్తి దినపత్రికని నిత్యం తన తోటి వాళ్లకు బిగ్గర చదివి వినిపించటం ఆయనకీ మహా సరదా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, స్పష్టమైన ఉచ్చారణ, కంచుకంఠం తో, చక్కని హెచ్చు తగ్గులతో ఆయన పేపర్ చదువుతుంటే చుట్టూ పక్కల వాళ్ళు వహ్వా అనాల్సిందే. ఈయన పేపర్ చదివి అందరి పని చెడగొట్టటంతో, రైల్వే అధికారులకు కోపం వచ్చి ఓ మూడేళ్లు రాజమండ్రికి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆగండాగండి ఇవన్నీ విని, ఆయన్ని ఓ ఆరడుగుల ఆజానుబాహుడు అని మీరూహించుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఎత్తు భూమికి జానెడు. కానీ మా నాయనమ్మ బహు పొడగరి. ఈ వ్యత్యాసాన్ని ఆయనలోని కమ్యూనిస్ట్ అస్సలకి పట్టించుకోలేదని నా నమ్మకం. అలాగే మా నాన్నమ్మ ఇంటిని మరియు పరివార జనులని ఏలటంలో నాయకురాలు నాగమ్మే. ఇంటి పెత్తనమంతా మా నాన్నమ్మదే, మా తాత జోక్యం ఇందులో అసలకి ఉండేది కాదు, అలాగే ఆయన మా నాన్నమ్మని పల్లెత్తు మాట అనటం నేను చూడలేదు. ఇక్కడ మాత్రం ఆయన ఒక నిజ కమ్యూనిస్ట్.
మాకు మా నాన్న వాళ్ళ ఊరిలో పొలాలు మరియు ఓ ఐదు ఎకరాల తోట ఉండేది. ఆ తోటలో వేరుశెనగ, మిరప లాటి పంటలు వేసే వాళ్లము. మా తోట మా ఊరికి చాలా దగ్గరలో ఉండటం వలన మేము అందరం తోటలో ఎక్కువ సమయం గడిపే వాళ్లము, నాకైతే మా పొలాలకు వెళ్ళినట్టే గుర్తు లేదు, ఎందుకంటే అవి మావూరికి చాలా దూరం, పక్కన ఊరికి చాలా దగ్గర. మా తాత గారు మా తోటలో వచ్చే పని వారి పని విషయం లో మహా కరుకు. వాళ్ళు ఉదయం పనిలోకి వొంగితే మధ్యాహ్నం భోజనానికి మాత్రమే లేవాలి; భోజనాలు ఐన వెంటనే మళ్ళి పనిలోకో దిగాలి - విరామం లేకుండా పని చేయాలి. వాళ్ళు మా అమ్మ దగ్గరకు వచ్చి మొర పెట్టుకొనే వాళ్ళు, అమ్మ మీ మామగారు పేరుకే కమ్యూనిస్ట్, హక్కులు సాధించుకోవటం అంతా ఆయన వుద్యోగం లోనే ఇక్కడ మాత్రం కాదు అనే వాళ్ళు. అమ్మ తోటలో ఉంటే వాళ్ళకి పండగే పండగ. వెల్తూ వెల్తూ తోటలో వేసిన వంకాయలో, బెండకాయలో, గోంగూరో, పచ్చి మిరపకాయలో గిల్లుకొని వెళ్లే వారు స్వతంత్రం గా. మా తాత ఉంటే ఇవన్నీ కుదరవు మరి. ఎంతైనా మైలురాయి కమ్యూనిస్ట్ కదా ఆయన.
అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అమ్మకి ఓ ఐదు ఎకరాల పొలం ఉండేది. అది పాలికి అంటే కౌలుకి చేసే వాడు మా కొండన్న. ఆయనకీ మా అమ్మ చిన్న బుజ్జమ్మ. చిన్నప్పటి నుండి మా అమ్మనాయన పొలాల్లో కొన్ని ఆయన పాలికి చేసే వాడు. అమ్మ పెళ్లి అయ్యాక అమ్మకి వచ్చిన ఐదు ఎకరాలు తీసుకొని అవి మాత్రమే పాలికి చేయటం మొదలెట్టాడు. మేము నెల్లూరుకి వచ్చేసినా ఆయనే వాటికి సంరక్షకుడు. అప్పుడప్పుడు అమ్మ ఊరికి వెళ్లి చూసుకొని వచ్చేది - విత్తనాలకు, కూలీలకు, ట్రాక్టర్ కి, మందులకు డబులు సర్దటం అన్నీ అమ్మే చూసుకొనేది. ఏమన్నా అమ్మ ఇవ్వటం ఆలస్యమతే ఆయనే నెల్లూరు వొచ్చి ఒక రోజు అయినా వుండి తీసుకెళ్లే వాడు. మాకు కూడా ఆయన కొండన్న. ఆయన పెద్ద కొడుకు నా ఈడువాడు, కానీ చదువుకోలా, పొలం పనులు లేక మేకల్ని మేపుకోవటం. ఉప్పలపాటిలో కూడా కొంత కమ్యూనిస్టుల ప్రభావం వుంది. రఘురామయ్య అని ఒకాయన రైతు కూలీలా తరపున, ఇలా పాలికి చేసుకొనే వాళ్ళ తరపున హక్కుల పోరాటం చేసే వాడు. ఆయన మా కొండన్న బోటి వాళ్ళందరి కీ లీడర్. చిన్న చిన్నగా వాళ్ళ పోరాటం కొంచెం దున్నే వాడిదే భూమి కోణం లో మారటం మొదలెట్టింది. మా కొండన్న ఎప్పుడూ మా దగ్గర ఆ ప్రభావమున్నట్టు కనిపించేవాడు కాదు. ఆయన మా పట్ల తన సహజసిద్ద ఆపేక్షనే వ్యక్తపరిచే వాడు. కానీ మేము మా పొలాలు అమ్మేశాము, మా అక్క పెళ్లి దగ్గర పడటంతో మరియూ జాగ్రత్త పడాలన్నతహ తహతో. ఉన్నదానితో సహాయం చేసే గుణమున్న మా అమ్మ ఒక కమ్యూనిస్ట్, చుట్టుపక్కల పిల్లలందరికీ మాతో సమానం గా చదువు చెప్పటం లో కమ్యూనిస్ట్. కానీ ఉన్న కొంత ఆస్తిని కాపాడుకోవడంలో పక్క క్యాపిటలిస్ట్ అయిపొయింది.
నాకు రాయటం వ్యసనంగా మారిందనుకుంటా . ఏదో ఒకటి రాయకుండా ఉండలేక పోతున్నా. నా కథా వస్తువులకు బాల్యం, బంధాలు మొదలగునవి ముడిసరుకులు. కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు, అన్నీ కథలు రాయాలి, రాసి మీలాటి విజ్ఞులచే, హర్షా! నీ దగ్గరనుండి ఇలాటి కథ ఊహించలేదు అని దాడి చేయించుకోవాలి. మీ ఎదురుదాడికి తయారయిపోతూ, ఈ కింద కథను ప్రచురిస్తున్నా, కొంచెం గుండె గాభారాతో మరికొంచెం నా ఏభై కథల గమ్యానికి చేరాలన్న ఆతృతతో.
ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ తో ఈ నెల ఒక వర్క్ షాప్ వుంది. ఇప్పటి వరకు ఏమి చేసాము, ఈ ఇయర్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, మొదలగు విషయాల మీద. ప్రిపేర్ అవుతున్నాము, మా బాస్ తో రివ్యూ కి. నాకేమో మా ప్రిపరేషన్ తృప్తి గా లేదు. కొంచెం గాభరాగా వుంది. నా గాభరా చూసి నా కొలీగ్, రామ్ సార్ మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక కథ చెప్తా, మీరు వినాలి అన్నాడు. సరే చెప్పమన్న, కొంచెమ్ రిలాక్స్ అవుదామని. హర్షా! ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది రోజూ పక్కన వుండే ఊరి మీద పడి కంటికి నదురుగా వుండే మగవాళ్ళని ఎక్కేది అన్నాడు. ఎక్కడం అంటే, మీరే అర్థం చేసుకోండి అన్నాడు, ఒక చిన్న గ్యాప్ ఇచ్చి. మగ వాళ్ళు సిగ్గుతో చచ్చి పోతున్నారు, దీనెమ్మా! ఇది పడి సంపిపార నూకున్నా బాగుండేది, మరీ ఎక్కి వొదలటమేంటి అని.
సరే వాళ్ళందరూ ఒక మేటి వేటగాడిని బాడుగకు మాటలాడుకున్నారు, ఎలాగైనా ఈ సింహం బాధ వొదిలిచ్చుకుందామని. వాడు వచ్చాడు, మంచె అన్నాడు కంచె అన్నాడు, ప్రిపరేషన్ అన్నాడు అచ్చు మనలాగే. అసలు రోజు రానే వచ్చింది, వాడి గురి తప్పింది, సింహం బాగా సంతోష పడి వాడిని ఎక్కింది, వాడు సిగ్గుతో చావనే చచ్చాడు. సరే మనలాగే రికవర్ అయ్యాడు, ఈ అనుభవంతో మనలాగే లెసన్స్ లెర్న్ట్ అని మొదలెట్టాడు, మనలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ సమీకరించాడు. మరలా ఆ డి-డే రానే వొచ్చింది, అదొచ్చింది వీడి గురి షరా మాములుగా తప్పింది, అందర్నీ ఒక్కసారే ఎక్కే సింహం వీడు ఛాలెంజ్ చేసాడు కనుక రెండోసారి కూడా ఎక్కింది. వీడు ఇక అవమానం తట్టు కోలేక, వాడి తుపాకీ సన్యాసం చేసేసాడు. ఇక ఆ గ్రామస్తులందరూ వాడిని బ్రతిమాలుకున్నారు, నువ్వు తప్ప మాకు ఇంకో గతి లేదు. అందులోను నీకు రెండుమార్ల అనుభవం వుంది, నువ్వీసారి ఖచ్చితంగామా అవమానానికి ప్రతీకారం చేయగలవని. వాడు కూడా సరే అన్నాడు. అనుకున్న ప్రకారం సింహం రానే వచ్చింది, వీడు గురి మూడోసారీ తప్పింది, సింహం రెట్టించిన సంతోషంతో మరలా ఎక్కింది. వెళ్లి పోతూ పోతూ దానికో డౌట్ వచ్చింది, ఎరా! నువ్వు నిజంగానే గురి తప్పుతున్నావా!, లేక నాతో నచ్చి కావాలని గురి తప్పుతున్నావా అని.
ఈ కథ చెప్పి నావంక చూసి నవ్వి కంటిన్యూ చేసాడు. హర్షా! మన ప్రిపరేషన్ ఎంత వున్నా, మనం గురి తప్పుతాము, మన కస్టమర్ ఎక్కుతాడు, ఎక్కడమే కాదు ఇలా ఎక్కించుకోవటం మనకిష్టమేనని కూడా నిరూపిస్తాడు. దానికి ముందు రెడీ అవుదాము అంటూ. ఉసురో మంటూ వచ్చా ఇంటికి , దేవుడా కొంచెం మంచి కస్టమర్ ని అంత కంటే కొంచెం మంచి కొలీగ్స్ ని ఎందుకివ్వవు అనుకుంటూ. ఆ రాతిరోకల, ఆ కల లో ఒక పక్క సింహం, ఒక పక్క మా కస్టమర్ వస్తున్నారు నా వైపు. నేను సింహానికే దొరికిపోయా ఉద్దేశ్యపూర్వకంగా. ఉదయం లేచి, చూసావా రామ్, నేను ఎంత తెలివి కలవాడినో అంటూ నా కల చెప్పా. నిజమే సార్ సింహాన్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టే, బతికి మాకు కల గురుంచి చెప్పగలుగుతున్నారు, లేక పోతే గుండె ఆగి చచ్చి వుండే వాళ్ళు నిద్రలోనే అని ముక్తాయించాడు మా రామ్. నా లాగే రివ్యూల పేరుతో రేప్ కు గురయ్యే ప్రతీ ఐ.టి మిత్రులకు నా సానుభూతి తో.
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట్టుదల చూపిన భగీరథుని కథ చెపుతాను శ్రమ తెలీయకుండా విను", అంటూ ఇలా చెప్పసాగాడు.
"భగీరధుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు, దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంతటి కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు . భగీరథుడు, తన తల్లి ద్వారా తన పూర్వీకులైన, సగరుని కుమారుల శాపాన్ని విని, వారి చితా భస్మాల మీద పవిత్ర ఆకాశ గంగను ప్రవహింప చేసి, వారికి సత్గతులు ప్రసాదించాడు", అని భగీరథ కథ పూర్తిగా చెప్పాడు. అలా చెప్పి, "రాజా నాకు ఈ కథలో కొన్ని సందేహాలున్నాయి, ఆ సందేహాలకు నువ్వు సమాధానం తెలిసి చెప్పకపోతే, నీ తల వేయి వ్రక్కలవుతుంది", అని హెచ్చరించాడు. దానికి విక్రమార్కుడు చిన్నగా నవ్వి , "బేతాళా ! ముందు మీ ప్రశ్నని అడగండి" అన్నాడు. ' విక్రమార్కా, మహోధృతంగా భూమికి దుమికిన ఆకాశగంగను భూమి తట్టుకోలేదని , పరమ శివుఁడు, తన జటాజటంలో బంధించి , గంగాధరుడయ్యాడు కదా ! మన పండిత పామరులు కూడా ఆ విధంగా గంగాదేవిని ఆయనకు భార్యను మరియు మహాదేవికి సవతని చేశారు కదా! మరి అదే పండితులు మహాభారత కాలమానంలో గంగాదేవిని శాంతన మహారాజు భార్యని చేసి , ఆయన ద్వారా అష్ట వసువులకు తల్లిని కూడా చేశారు ! ఆ వసువులలో చివరివాడే భీష్ముడని కూడా మీకు తెలుసు కదా! అంతటి మహాదేవుని సఖిని ఒక మానవ మాత్రునికి భార్యనెలా చేశారు ఈ పండిత పామరులు? సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ తల వేయి వ్రక్కలగుగాక " అని తన బేతాళ ప్రశ్నను విక్రమార్కుని ముందుంచాడు.
తరువాత విక్రమార్కుడేమయ్యాడో భేతాళుడిమయ్యాడో నాకు తెలీదు . ఈ ప్రశ్న నన్ను భేతాళ ప్రశ్నలా చితికి పోయిన నా చిన్న మెదడుని చిన్న నాటి నుండీ వెంటాడుతూనే వుంది.
మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే.
మా వాళ్ళకి నచ్చేది సినిమాలు, భోజనాలు మరియు పాలిటిక్స్. ఒకప్పుడు మాకు అదిరే హాల్స్ ఉండేవి. మూడు హాళ్లు, నర్తకి, అర్చన మొదటి శ్రేణి అయితే, సుందర్ డీలక్స్, రాధామాధవ్, శ్రీనివాస, అనిత, లీలమహల్ లాటి ద్వితీయ శ్రేణి, వినాయక, న్యూటాకీస్, విజయ మహల్, మనీటాకీస్ లాటి తృతీయ శ్రేణి హాల్స్. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడాలంటే వినాయక హాల్ మాత్రమే. పేరుకు న్యూ టాకీస్ గాని ఆడేదంతా రెండో రిలీసో లేక మూడో రెలీసో లేక ఎన్ని రిలీస్ లయ్యాయో తెలీని అరిగిపోయిన సినిమాలు.
ఇక భోజనానికి వస్తే, మా ప్రత్యేకాలు చాలానే వున్నాయి. నెల్లూరు చేపల పులుసు అంటే వరల్డు ఫేమస్. మేము పులుసును, గండి, బొచ్చె, బొమ్మిడాయిలు, మట్ట గిడసలు, జెల్లలు మొదలగునవి వాడతాం. అలాగే పులుసులో ఓ మామిడి ముక్క, ఓ వంకాయ ముక్క వేస్తే నా సామిరంగా ఆ రుచే వేరబ్బా. వంకాయ మామిడికాయ బజ్జి, మునక్కాడలులో పాలుపోసి చేసే కూర, పులి బొంగరాలు, మిరపబజ్జీలు, కారందోశలు మా ప్రత్యేకాలు. చిన్నప్పుడు స్వతంత్ర పార్క్ లో ఆడి, సండే మార్కెట్ దగ్గర బజ్జీలు తినటం, ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక రాధా మాధవ్ దగ్గర కారం దోశెలు రుచి చూడటంలో ఆ మజానే వేరు. సంతపేట లో మునిసిపల్ మార్కెట్ కి ఎదురుగా వుండే పరంధామయ్య హోటల్ లో దోశె మరియు పాయా కూర రుచో చూడాల్సిందే.
మంచి గులాబ్ జామూన్ కావాలంటే జై హింద్ స్వీట్స్, మలై కాజాకి మురళి కృష్ణ స్వీట్స్, అరటి బజ్జీలకి రాజా కేఫ్, చాయ్ పే చర్చలకు సీమ కేఫ్ , టెస్ట్ బుక్స్ కి శ్రీరామ్ స్టోర్స్, హోమియోపతి మెడిసిన్కి సదాశివ మెడికల్స్, మంచి ఫొటోస్ దిగాలనుకుంటే ట్రంక్ రోడ్ లో రాజా స్టూడియోస్, అప్పట్లో హీరో పెన్ కావాలంటే పెన్ కార్నర్, కంటి అద్దాలు కావాలంటే డాక్టర్ కృష్ణ , ఐస్క్రీం కి బాబు లేక ఎస్.జి.ఎం, అన్నీ టిఫిన్స్ అల్ టైం ఫేవరెట్ చంద్రభవన్స్ (మూసేసారు), వెజ్ మీల్స్ కి కోమల విలాస్ కి వెళ్లాల్సిందే నబ్బ.
అలాగే చీప్ గా రఫ్ నోట్ బుక్స్ కావాలంటే టౌన్ హాల్ ఎదురు సందులో వికాస్ బుక్స్, సెకండ్ హ్యాండ్ బుక్స్ కి సంతానం అండ్ కో,ఎమన్నా వెనెరియల్ ప్రాబ్లెమ్ లకు ఉమా నర్సింగ్ హోమ్ పక్కన డాక్టర్ మాతుల్లా గారి దగ్గర కు వెళ్లాల్సిందే. నాన్ వెజ్ కి బోసోటా, నర్తకి పక్కన నిర్మల కేఫ్, కిళ్లీ సామానులకి గూండా అంజనేయశెట్టి గారి షాప్, సరుకులకు స్టోన్ హౌస్ పేటలో నాత వారి షాప్ అలాగే పెద్ద బజారులో నాగరాజం స్టోర్స్, మెటల్ సామానులకు కాంతి స్టోర్స్, పండ్లకు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ఫేమస్ అబ్బా.
ఇక పాలిటిక్స్ కి వద్దాం. అసలు రాజకీయాలు మా బ్లడ్ లోనే వున్నాయబ్బా. కానీ మన నెల్లూరు అన్న వివేకా చని పోయాక ఎంటర్టైన్మెంట్ తెగ మిస్ అవుతున్నాం. నీ పాసుగూల ఏందయ్యా జాఫ్ఫారా! అంటూ తను చేసిన హడావుడి, షాప్ ఓపెనింగ్స్ వెళ్లి చీరలు పైన వేసుకొని చేసే ఆర్బాటం బాగా మిస్సింగ్. ఇక సీమా కేఫ్ దగ్గర పావుగంట నిలబడితే అసలు ఇరాక్, కువైట్ ని ఎందుకక్రమించిందో, అమెరికాకి ఇరాన్ మీద కోపమెందుకో, మైక్ గాటింగ్ ని అవుట్ చేసిన అద్భుతమైన బంతిని షేన్ వార్న్ ఎక్కడ, ఎలా ప్రాక్టీస్ చేసాడో లాటి ప్రశ్నలకు నాకు అక్కడ సమాధానాలు అప్పట్లో దొరికేసాయి. ఈ మధ్య కాలం లో అక్కడ నిలబడలేదు, కాబట్టి ప్రస్తుత అంతర్జాతీయ సమస్యలకు మా నెల్లూరొళ్ల పరిష్కారాలు గురుంచి నాకు తెలియదు. అసలు మా సీమా కేఫ్ ని యూ.ఎన్.ఓ యొక్క రెండో బ్రాంచ్ గా ఎందుకు డిక్లేర్ చేయలేదో నాకైతే అర్థం కాదు. ఆ ప్రపోసల్ ని పాకిస్థాన్, చైనా సహాయంతో తిప్పి కొట్టటంలో సఫలమయ్యిందని మా వాళ్ళ ఉవాచ.
నాకు ఇప్పటికీ నెల్లూరు రైల్వే-ఫీడెర్స్ రోడ్డులో వెళ్తూ అమెరికన్ హాస్పిటల్ ని చూస్తుంటే డాక్టర్ బేరమ్మ ఇంకా అక్కడే ఉందేమో అనిపిస్తుంది. అరవైయ్యవ లేక డెబ్భైయ్యవ శకం లో పుట్టిన నా బోటోళ్లందరూ అక్కడే ఈ లోకాన్ని చూసుంటారు. ఎంత మందికి ఆవిడ, ఈ నాటి శస్త్ర చికిత్సలు అవసరం లేకుండానే పురుడులు పోసుంటారో. ధన్యురాలు ఆ తల్లి. అలాగే పల్లెలనుండి కాన్పులకు వచ్చిన వారందరికీ వసతి కల్పించిన ఆ రేబాల వారి సత్రం, ఆ సత్రం లో గడిపిన అడపా దడపా రోజులు. ఉన్న కొన్ని రోజుల్లోనే ఐకమత్యంగా మెలిగి అక్కడనుండి బాగైపోయి కూడా కళ్ళనీళ్ళతో వెళ్లే వాళ్ళు రోగులు (రోగులనకూడదు వాళ్ళని ఆరోగ్యవంతులనాలి). అట్టి సత్రాలు కట్టి వాటిని నామ
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . "నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను. కానీ వాళ్ళు ఇంటికొచ్చాక ఎక్కువ క్లాస్ వర్క్ చేస్తుంటే, వాళ్ళు నేను ఇచ్చిన గ్యాప్ లో వర్క్ చేయటం లేదు అని అర్థం. సో అమృతని కొంత కాలం మానిటర్ చేయండి. తనకి ఈ విషయం చెప్పకుండా", అని చెప్పారు ఆవిడ.
నేను అమృతని మానిటర్ చేయటం మొదలెట్టాను. ఆశించినట్టే మా అమృత వర్క్ నంతా ఇంటికి తెచ్చుకోవటం, నన్ను డౌట్స్ అడగటం మొదలెట్టింది. ఆలా చాలా రోజులు గడిచాయి, మా అమృత లో ఏమి మార్పు లేదు. ఒక రోజు తనకి చెప్పా, ఇలా నువ్వు ఇంట్లో స్కూల్ వర్క్ చేస్తున్నావంటే నువ్వు స్కూల్ లో అస్సలకే ఏమీ చేయకుండా టైం పాస్ చేస్తున్నావని అర్థం అని .
మా చిన్నది వాళ్ళ అక్క చుట్టూ తిరుగుతుంటుంది, వాళ్ళక్క ఇంట్లో ఉన్నంత వరకు. మా సంభాషణ అంత వింటూ వుంది. దానికి నాలుగు ఏళ్ళు నిండుతున్నాయనుకుంటా అప్పటికి. అది వెంటనే నా దగ్గర కు వచ్చి, నడుము మీద చేతులు వేసుకొని చెప్పింది, "ఓ, అయితే నాకు ఇప్పుడు అర్థమయ్యింది నువ్వు ఎందుకు ఆఫీస్ పని ఎప్పుడు ఇంట్లో చేస్తుంటావో" అని. నాకు అది పెద్ద షాక్. ఆ తర్వాత నేను ఆఫీస్ పని ఇంటికి తేలేదు . దానికి రోజూ చెప్పే వాడిని ఈ రోజు ఆఫీస్ పని ఆఫీస్ లోనే చేసేసా .
ఒరే హర్షాగా! "మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా", అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, "చెప్పరా ఏమయ్యిందో అన్నా", వినటానికి సిద్దపడుతూ. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగార్రా, అమ్మాయి ఏమి చదివింది, ఎలా ఉంటుంది అని. "పర్వాలేదమ్మా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం బొద్దుగా ఉంటుంది, అని చెప్పా!. నిన్న రిసెప్షన్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల ముందు, అదేమిటి మా నారాయణ అల్లా చెప్పాడు , అమ్మాయి ఇంత బాగుంటే అని చెప్పేసింది మీ అమ్మ", అంటూ లబ లబ లాడాడు వాడు.
మొన్నటికి మొన్న మా ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది ఇక మననింటికి ఎవరినన్నా భోజనానికి పిలిచావో చంపేస్తా నిన్ను అని. "ఏమి జరిగిందో చెప్పు", అంటూ మా ఆవిడ వలిచే చిక్కుడు కాయలు వలవటం లో సహాయం చేసే వంకతో అడిగా, ఎదో అయ్యింది అనుకుంటూ. "మీ మేనత్త కొడుకు గోపాలన్న వాళ్ళ కుటుంబాన్ని భోజనానికి పిలిచాము కదా. ఆయన భోజనాల దగ్గర నన్ను పొగుడుతూ నీకు చాలా ఓపికమ్మా ఇన్ని రకాలు ఎలా చేసావు, అన్నీ చాలా బాగున్నాయి అనగానే, మీ మమ్మీ (కోపమొచ్చినప్పుడు మా మమ్మీ లేక పోతే వాళ్ళ అత్త) గోపాలయ్యా! ఆ చికెన్ బిర్యానీ, జింజర్ చికెన్ ఇప్పుడే అంగార హోటల్ నుండి, ఈ కొబ్బరి పచ్చడి, ఆ టమేటా చిక్కుడు కూర నిన్నటివి, ఇప్పుడు వేడి చేసినవి అంటూ, మా ఆవిడ మొహంలో కోపం చూసి, ఏంటే ఆ కోపం వీళ్ళెవరూ! మన వాళ్ళే కదా", అంటూ ఒక నవ్వు నవ్విందట.
"నాన్న! నాన్నమ్మతో ఇక మా గురుంచి ఏమీ చెప్పకు", అంటూ ఒకరోజు నా కూతుర్లు నా మీద యుద్ధానికి వచ్చారు. ఏంటమ్మా అంటే అత్తమ్మోళ్లతో మాట్లాడుతూ, ఆ చిన్నది ఎప్పుడూ బలహీనమే ఎప్పుడూ దానికి ఆయాసమే అని చెప్తుంది. అదేమిటి నాన్నమ్మ, అంటే వాళ్ళు మీ అత్తలే మీరంటే వాటికి ప్రాణమే అంటుంది అని కంప్లైంట్.. మొన్నటికి మొన్న మీ నాన్న అమెరికా నుండి జాబ్ పోతే వచ్చేసాడా, నాకోసమే వచ్చేసాడా అని అడిగింది నువ్వు ఆమె కోసమే కదా పరిగెత్తావ్ అంటూ కయ్ మన్నారు.
కానీ పిల్ల కాకులకేమి తెలుసు మా అమ్మకి అందరూ తన వాళ్ళే, స్వపర బేధం లేదు తెలియదు అని. వాళ్లకేం తెలుసు నేను తన కోసమే వచ్చేసాను అని పదే పదే తెలుసుకొని ఆమె పడే సంతోషం. నేనూ డిసైడ్ అయిపోయా మా అమ్మగురుంచి నాకు తెలుసు, ఆమె మనసు ఎంత మంచో, మాట దాయలేనంత మంచి. కాబట్టి ఆవేశపడే వాళ్ళకి మంచి నీళ్లు ఇచ్చి, ఇక చెప్పండ్రా మీరు అంటూ హాయిగా నవ్వటమే. ఏమంటారు. ఈ వయస్సులో చిన్నపిల్లలు అయిపోయి అందరూ మన వాళ్ళే, వాళ్ళతో మనకు రహస్యాలు ఏమిటి అనుకొని అప్పుడపుడు మనకు షాక్ లు ఇచ్చే అమ్మలందరికి, నా నమస్సులు.
కొసమెరుపేటంటే ఈ కథ చదివి మా మేనకోడలు మామయ్య నువ్వు ఇంకోటి మరిచిపోయావు అన్నది. అది కూడా యాడ్ చేస్తున్న. సుప్రియ కస్టర్డ్ లోకి అరటిపళ్ళు లేవు అని హైరానా పడుతుంటే, ఆ గోపాలయ్య వాళ్ళు భోజనాలకి వస్తూ ఎలానూ తెస్తార్లేవే అని. వాళ్ళు తెచ్చారు చూడు అని వాళ్ళ ముందరే ప్రకటించేసింది మా అమ్మ. మా ఆవిడ పళ్ళు పట పట ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి
మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి తన అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయన అప్పటిలోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ లో మెట్రిక్యూలేషన్ చదివాడు, హిందీ ప్రచారసభ వారి విశారద కూడ ఫ్యాన్ అయ్యాడు. అప్పటిలో నెల్లూరు లో ఓ చిరుద్యోగి ఆయన.
వాళ్ళ కూతురే మా లక్ష్మి పెద్దమ్మ. తాను ఇంటర్మీడియట్ లో ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా చిన్నమ్మమ్మ నెల్లూరులోనే ఉంటూ, మా ఉప్పలపాడు కి వచ్చి వ్యవసాయం చేయించుకునేది. మా వూరిలో ఆవిడకి ఓ చిన్న ఇల్లు కూడా వుంది, మా దేవాలయానికి ఎదురుగ. మా చిన్న అమ్మమ్మకి మా అమ్మమ్మంటే కోపం, మా అమ్మమ్మవల్లే తాను చిన్నతనంలోనే విధవరాలు అయ్యిందని. భర్త చనిపోయాక తాను విపరీతమైన పురుషద్వేషిణి అయ్యింది. వేలెడంత బుడ్డోడిని నేను కూడా తాకరాదు ఆవిడని. ఆవిడ నెల్లూరులో బస్సు ఎక్కి ఉప్పలపాటిలో దిగేసరికి కనీసం ఓ పదిమంది పురుష పుంగవులైనా ఆమె నోటి బారిన పడి పారిపోవాల్సిందే. ఇంటికి రాగానే సబ్బు పెట్టి వొళ్ళంతా కడగాల్సిందే.
అటువంటి ఆవిడకి మూగ జీవాలంటే చాలా ప్రేమ. కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి ఓపికగా వెతుక్కొని వెళ్లి మరీ ఎదో ఒకటి పెట్టి రావాల్సిందే. ఆవిడ బస్సు దిగుతుందని వాటికి ఎలా తెలుస్తుందో, అవి అన్నీ వెళ్లి ఆవిడని ఇంటి వరకూ దిగపెట్టి, ఆవిడ ఉన్నన్నాళ్ళు ఆవిడ ముందు వెనకా ఒక సైన్యం లా కవాతు చేసేవి. వాటికి మా ఉప్పలపాటిలో వాటికి మా చిన్నమ్మమ్మ ఆర్మీ అని ముద్దు పేరు.
అలాటి పురుషద్వేషిణి అయిన మా చిన్నమ్మ వాళ్ళ నెల్లూరులోని ఇంటిపైన చేరాడు షోకిల్లా రమణయ్య. చదువు పేరుతో ఇంట్లో డబ్బు దస్కం తెప్పించుకొని స్నేహితులతో జల్సా చేయటమే జీవిత ధ్యేయం ఆయనకీ. పురుషద్వేషిణి అయిన మా చిన్నమ్మకి , విలాసపురుషుడైన రమణయ్యకి క్షణం పడదు. ఆయన మిద్దె మీదకు వెళ్లే సమయంలో, దిగి బయటకు వెళ్లే సమయం లో ఈవిడ ఆయన నెత్తి మీద నీళ్లు కుమ్మరిచ్చేది కూడా అట. ఈ పిల్లీ ఎలుకా చెలగాటం లోనే మా పెద్దమ్మ, ఆయన నిండా ప్రేమలో మునిగిపోవటం మా పిచ్చి చిన్నమ్మ కి తెలీయనే లేదు. కొంత కాలానికి ఆవిడకి తెలిసినది, కూతురి గర్భవతి అయ్యాక. అందరికీ తెలిసి గొడవ అయ్యాక, రమణయ్య పారిపోయాడు. వాళ్ళ వూరికెళ్ళిన మా వాళ్లకు తెలిసింది అప్పటికే ఆయన గారికి పెళ్లి కూడా జరిగి ఉందని.
ఆయన నిజస్వరూపం తెలిసిన మా లక్ష్మి పెద్దమ్మ ఇక ఆయన్ని దగ్గరకు రానివ్వలేదు. మా పెద్దమ్మ ధైర్యం గా నిలబడింది, ఒక కొడుకుకి జన్మ నిచ్చింది. చదువు పూర్తి చేసుకొని, కాలేజీ లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో లెక్చరర్ గా చేరిపోయింది. ఆ రోజుల్లోనే మా పెద్దమ్మని మా వాళ్ళు ఎవరూ తప్పు పట్టలేదు, పైపెచ్చు అండగా నిలబడ్డారు, మా అమ్మ, పెద్దమ్మ లు అందరూ. పిచ్చి అమ్మమ్మ అనుకునే మా చిన్న అమ్మమ్మ కూతురిని రెప్పలాగా కాపాడుకుంది.
ఒంటరి అమ్మ, అమ్మమ్మేమో అలా, ఈ వాతావరణం లో పెరిగిన మా పెద్దమ్మ కొడుకు కూడా వింత గానే పెరిగాడు. వాళ్ళమ్మమ్మ క్రమశిక్షణ మీద కోపంతో ఆవిడ పెంచే పిల్లుల్ని ఆగిన సీలింగ్ ఫ్యాన్ రెక్కల మీద ఉంచి స్విచ్ ఆన్ చేసేవాడు, వాటిల్ని బకెట్ లో ఉంచి బావిలో దించే వాడు, రబ్బర్ బ్యాండ్ లకు గుండు సూదులు గుచ్చి దాన్ని స్ట్రెచ్ చేసి దార్లో వెళ్లే బట్టఫుర్రి వున్న వ్యక్తుల మీదకు సంధించేవాడు. చదువులన్నీ అసంపూర్ణాలే, కానీ ఆయన అంత తెలివి కలవాడు మరియు మంచివాడు లేడని మా వాళ్లలో పెద్ద పేరు, కానీ ఆ తెలివి ఆయనకే కాదు ఎవరికీ ఉపయోగ పడేది కాదు. ఆ రోజుల్లోనే ఎన్నో వెరైటీ బైక్ లు, వాడిన బైక్ వాడకుండా. మహారాష్ట్ర లో ఇంజనీరింగ్ డొనేషన్ కట్టి చేరి మధ్యలోనే మానేసిన చరిత్రతో మా పెద్దమ్మ డబ్బులంతా మంచి నీళ్లు తగిన ప్రాయం లా ఖర్చుపెట్టేవాడు .
కాలక్రమేణా ఆయనకీ పెళ్లయ్యింది, ఆయనకీ ఇద్దరు పిల్లలు. ఏమన్నా ఆయన అనుకున్నది జరగక పోతే అమ్మ మీద దౌర్జన్యమే. అయినా ఆ అమ్మకి ఆయనంటే పంచ ప్రాణాలు. కనుల ముందర ఉంటే చాలు, సిగరెట్ కి , ముందుకి తగలేసినా పరవాలేదు. అమ్మా వాళ్ళు కలిసినప్పుడు కుమిలి పోయేది. ఏమి బతుకు నాది, భర్త వలన సుఖం లేదు, కొడుకు వలన నరకం అని. అలాటి మా పెద్దమ్మ, ఓ ఐదేళ్ల క్రితం, ఓ వరలక్ష్మి వ్రతం నాడు తిరుగుతూ తిరుగుతూ
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదుకున్న. నాకు అంకెలు బాగానే వొచ్చు, ఐదవ తరగతేమయిందనేగా మీ అనుమానం, చాలా ఎక్కువ చదివేసాననుకొని ఐదుని ఎత్తేసి ఆరులో చేరిపోయా. అది నాకు బాగా ఉపయోగ పడిందబ్బా! ఏడో తరగతి వరకూ, సరిగ్గా చదవక పోయినా, వీడు బుడ్డోడులే అని మా అయ్యోర్లు, ఒంగో బెట్టి గుద్దకుండా.
పెదపుత్తేడు మా వూరికి, పొలాల్లో అడ్డం పడిపోతే ఓ మూడు కిలోమీటర్లు, ఈ రెండూర్ల నడిమాయిన రామలింగాపురం. పొలాల్లో బడికి పోయేటప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఊర్లో వుండే వాళ్ళు కాదు, పొలాల్లో వుండే వాళ్ళు. అందుకే మా పెదనాయన వాళ్ళ ఇల్లు ఎక్కడా అని రామలింగాపురం వచ్చి మీరు అడిగారనుకో బీట్లో అంటారు. బీట్లో అంటే బీడు భూముల్లో అని అర్థం.
అలా బడికి వస్తూ పోతూ, మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దాహం తీర్చుకోవడానికి ఆగుతూ, మా పెదనాయనని ఆసక్తి గా గమనించే వాడిని. ఆయన మాకు పెద్ద పులి లాగే కనపడే వాడు. బడినుండి ఇంటికి వెళ్లే క్రమంలో, వాళ్ళ ఇంట్లో ఆగినప్పుడు, ఎవరక్కడా! చిన్నోడు వచ్చాడు వాడికేమన్న తినటానికి పెట్టారా?, అని ఆయన అనగానే, పరిగెత్తు కొచ్చేవాళ్ళు మా పెద్దమ్మ కానీ చిన్నక్క కానీ. నాకనుమానం వచ్చేది ఆ మాత్రం వాళ్లకు తట్టదా, లేక మా పెదనాన్న ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిటుక్కు మనదా అని.
ఆయన బట్ట నలక్కుండా, వొళ్ళు అలవకుండా, దర్జాగా రెండు పూటలా కోళ్లు, పొట్టేళ్లు, చేపల విందులతో జీవితాన్ని నడిపేసేవాడు. పొలాల మీద ఆదాయాలు తక్కువ, దర్జాలు ఎక్కువ వలన ఆస్తులు కరగటం మొదలయ్యాయి. కానీ ఇంట్లో మాత్రం మిలటరీ క్రమ శిక్షణ. ఉదాహరణకి వాళ్ళ ఇల్లంతా ఇల్లంతా జామ చెట్లు దానిమ్మ చెట్లు, కానీ అవి పండి రాలే వరకూ తాక రాదు. మనకేమో పిందె కాయల్ని చూస్తేనే చేతులకు దురద. అప్పటికీ చేతివాటం చూపే వాడిని. ఆయనేమో మరలా నేను కనపడినప్పుడు, ఎరా చిన్నోడా! మొన్న నువ్వొచ్చి పోయాక నాలుగు పిందెలు కనపడ లేదురా అనే వాడు.
ఆయన చందమామ కథలన్నీ వేటికవి విడిగా తీసి స్వయంగా దబ్బళముతో కుట్టి పుస్తకాలుగా చేసేవాడు. నేను ఆదివారం మా ఇంట్లో సద్దికూడు తిని, వాళ్ళింటికెళ్లి సాయంత్రం దాకా వీరహనుమాన్, బేతాళకథలు, జ్వాలాద్వీపం, విచిత్ర కవలలు అన్నీ చదువుకుని, ఇంటి దారి పట్టేవాడిని. చదుకునేంత సేపు మంచం పక్కన రెండు కుక్కలు తిరుగుతూ ఉండేవి, ఒంటి కెళ్లాలన్నా భయంతో పెదమ్మని తోడు పిలవాల్సిందే.
మా వ్యవసాయ కుటుంబాలలో చదువులు మొదలయ్యింది మాతోనే. మా అన్నలిద్దరికి పెద్దగా చదువులు అబ్బలా. వ్యవసాయం మీద రాబడులు లేవు, మా పెద్ద నాయన ఖర్చులకి పొలాలు కరుగుతున్నాయి. ఈ కరిగే క్రమంలోనే పెద్ద అక్కకి మరియు ఇద్దరు అన్నలకీ పెళ్లిళ్లు అయ్యాయి. మా పెద్ద అన్న భార్య చనిపోవటం తో, ఆయన కొడుకుని మా పెద్దమ్మే పెంచి పెద్ద చేసింది. వాడు, మా పెద్దమ్మ పెద్దకూతురు కూతురు, మా అక్క మరియు నేను ఆరవ తరగతి నుండి సహాధ్యాయులము. నా చదువు ఓ పదిమంది దగ్గర బంధువుల పిల్లలు సహాధ్యాయులుగా జరగటం చాలా తీపి అనుబంధం.
క్రమంగా ఆస్తులు కరిగిస్తున్నాడని పెదనాన్న మీద కోపం కొడుకులకి. తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య లోపించింది. విడి పడ్డారు, మిగిలిన కొద్ది ఆస్తులు పంచుకున్నారు. ఒకరికొకరి మధ్య సంబంధాలు అస్సలకి లేవు, చూపులు కూడా లేవు. నాలుగేళ్ల క్రితం మా పెద్దమ్మ పెద్ద కొడుకు చనిపోయాడు. కొడుకుని ఆఖరి చూపు చూడడానికి, దశ దిన కర్మలకి కూడా మా పెద్ద నాన్న రాలేదు. దశ దిన కర్మల అనంతరం మా పెద్దమ్మని ఆత్మకూరు బస్సు స్టాండ్ లో దింపి, అడిగాను రామలింగాపురానికే కదా? అని. కాదురా! మధ్యలో రాజు పాలెం లో దిగి అక్కడ చిన్న పని చూసుకొని ఆటోలో వెళతానురా అంది. చిన్నగా నిట్టూర్చి అడిగా, వస్తూ వస్తూ పెదనాన్న చేపలు తెమ్మన్నాడా అని. ఆ గాజు కళ్ళల్లో నాకు అవుననే సమాధానం దొరికింది. ఓ సంవత్సరం క్రితం పెదనాన్న కూడా పోయారు. కొరివి పెట్టడానికి మా అన్న అంటే ఆయన చిన్న కొడుక్కి పదివేలిప్పిస్తామని చెప్పి ఒప్పించారు ఆ వూరి పెద్ద మనుషులు.
బుడ్డ వెంకన్న పచ్చని మేని ఛాయతో, గిరజాల జుత్తుతో, ఆరడుగులకన్నా ఎక్కువ ఎత్తు వున్న భావం అధికమైన వాడై, కొంచెం వొంగినట్టుండి, ఉప్పలపాటి చుట్టూ పక్కల వూర్లకన్నిటికీ అందగాడు. ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు కలిగిన వాడు. పల్లెల్లో వ్యవసాయదారుల ఇళ్లల్లో కొందరే చదువుకోగలుగుతారు, కొందరు వయవసాయప్పనులు ఒంట బట్టించుకుంటారు, మరి కొందరు, యీ రెండూ చేయరు. ఈ బుడ్డ వెంకన్న మూడవ కోవకి చెందిన వాడు. ఊరందరికీ బుడ్డ వెంకన్న అంత మంచి వాడులేడు, చేయని సహాయం లేదు, సహాయం పొందని వాడు లేడు. ఇంట్లో మాత్రం అందరికీ భయమే. అమ్మకి గారాబంతో పాటు కొడుకుని చూస్తే ఒణుకు కూడా, భోజనంలో కూర బాగా లేక పోతే పళ్లెం ఎగిరి ఎక్కడో పడాల్సిందే. ఆయన ఎంత అంటే అంత, ఏదడిగితే అది.
అలాటి బుడ్డ వెంకన్నకి వాళ్ళ మేనమామ తన పిల్లనిచ్చి పెళ్లి చేసాడు. ఎందుకు చేసుకున్నాడో ఈయనకి తెలియదు, ఎందుకిచ్చారో వాళ్లకు తెలియదు, ఈయన సంగతి తెల్సి ఆ మహాతల్లి ఎలా చేసుకుందో ఆ పరమేశ్వరుడి కూడా తెలియదు. ఇద్దరి ఇళ్ళు ఎదురెదురుగానే. ఈయన తాగి రావటం, అది నచ్చని ఆవిడ ఎదురుగా వున్న అమ్మగారింటికి పయనమవటం, ఈయన ఆ మత్తులో వాళ్ళింటి మీద దండయాత్ర చేయటం, ఆవిడకి సోదరులైన ఇద్దరు సుందోపసుందులు ఈయన్ని క్రుంగతన్నటం. ఇదంతా చూసి వాళ్ళ అమ్మ కృంగిపోవటం, మత్తువొదిలిన ఈయన వెళ్లి తన బావమరుదుల్ని తన్నటం. ఇదే నిత్యకృత్యం. ఉప్పలపాటి గ్రామస్థులకు వినోదానికి కొదవే లేదు వీళ్ళ వ్యవహారంతో.
ఈ గందరగోళం లోనే బుడ్డ వెంకన్న ఇద్దరు పిల్లల్ని కూడా కనేసాడు. ఆ పిల్లలంటే వాళ్ళ నాయనమ్మకు మహా ఇష్టం, అలాగే చిన్న మేనత్త, అంటే బుడ్డ వెంకన్న చిన్న చెల్లెలికి కూడా. ఈ చిన్న మేనత్త ఎప్పుడూ ఆ పిల్లల అమ్మ పక్షమే ఎందుకంటే వాళ్ళ అమ్మ, ఈ చిన్నమేనత్త , చిన్న నాటి స్నేహితురాళ్ళు. తన అన్ననే తప్పు పట్టేది ఈ చిన్నమేనత్త.
ఓ రోజు బుడ్డ వెంకన్న పక్కూర్లో ఇచ్చిన తన అక్క ఇంటికెళ్ళాడు. రాక రాక వచ్చిన తమ్ముడిని చూసి అక్క మురిసిపోయింది. తమ్ముడికి ఇష్టమని చేపలు తెప్పించింది, ఇంట్లో వున్న నాటుకోడితో ఇగురు వండింది, వడలు చేసింది. కడుపు నిండా అన్నం పెట్టింది, కాసేపు పడుకోరా! అని తన పనిలో పడిపోయింది ఆవిడ. ఓ గంట తర్వాత బుడ్డ వెంకన్న వచ్చి చెప్పాడు ప్రశాంతంగా, అక్క! అంత అయిపోయింది నేను పురుగుల మందు తాగేసాను అని. అక్క లబ లబ లాడిపోతూ ట్రాక్టర్ కట్టించింది రాజుపాళేనికి, దారిలోనే పోయాడు బుడ్డ వెంకన్న,
అసలే అంతంత మాత్రపు సంబంధాలు, ఈ దెబ్బతో పూర్తిగా పోయాయి. పిల్లకాయల చిన్నమేనత్త వాళ్ళని వొదులుకోలేదు. వాళ్ళ ఇంటికి పోవటం మానలేదు. మిగిలిన అక్కలకీ, అన్నకీ ఇది చాలా మనసు కష్టం. ఈవిడని చాలా ఆపాలని చూసారు, కానీ ఈవిడ చాలా మొండి, ఆ పిల్లలని దగ్గరకి తీయటం మానలేదు, చూసి చూసి ఇక అక్కలు అన్న, ఈవిడకి వాళ్ళతో సంబంధాలు మానెయ్యమని చెప్పటం మానేశారు. ఆ బుడ్డ వెంకన్న పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారింట్లోనే పెరిగారు, నాన్నమ్మ-తాతయ్యలంటే ద్వేషం, కానీ ఏదన్న పొలమో-పుట్రో లేక ఏదన్న స్థలమో కావాలనుకుంటే మాత్రం మేము తండ్రి లేని బిడ్డలమంటూ వచ్చి సాధించుకునే వాళ్ళు.
క్రమంగా పిల్లలు పెద్దలయ్యే క్రమం లో మిగతా మేనత్తల పిల్లలతో కలవటం మొదలెట్టారు వాళ్ళు. సంబంధాలు మెరుగుపడ్డా, అంతర్లీనంగా, బేధ భావం పూర్తిగా పోలేదు, పిల్లల మధ్య. వాళ్ళ నాన్న తమ్ముడు వాళ్ళకే కాదు వాళ్ళ మేనత్తలకి కూడా దూరమయ్యి ఆయన బ్రతుకు ఆయన బతికేస్తున్నాడు. ఈ క్రమంలో బుడ్డ వెంకన్న తలితండ్రులు కూడా గతించారు.
బుడ్డ వెంకన్న కూతురేమో చాలా పెద్ద చదువులు చదివి, ప్రేమ వివాహం చేసుకుంది ఇతర కులస్థుడిని. పెళ్ళైన రెండు ఏళ్ళకి ఆ పెళ్లి విఫలమయ్యింది అందరికీ బాధను మిగులుస్తూ. తనకో కొడుకు, తన అమ్మని దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటూ కొడుకుని చదివిచ్చుకుంటూ బతికేస్తుంది. ఇక బుడ్డ వెంకన్న కొడుకు టెక్నికల్ చదువు చదివి, ఒక కేంద్రీయ సంస్థలో వుద్యోగం చేస్తున్నాడు. ఆయనకీ పెళ్లయ్యింది, ఇద్దరు పిల్లలు ఆయనకి. ఒంటరి ఐన అక్కకి, ఎప్పుడో ఒంటరి ఐన అమ్మకి ఎంతో అండగా వుండవలిసిన ఆయన అస్సలు వాళ్ళ ఊసు ఎత్తడు.
మనం అనుకుంటాము కళ్ల ముందర పరిస్థితులను బట్టి మనం గుణ పాఠం నేర్చుకుంటాము అని. అది ఎప్పుడో, ఎక్కడో చాలా అరుదు. చాల మందిమి అదే చట్రంలో పడిపోతాము, ఎందుకు యీ మాట అంటున్నానంటే, బుడ్డ వెంకన్న ఎలానో కొడుకు కూడా అలానే ప్రస్తుతం. విషాదమేమంటే బుడ్డ వెంకన్న జీవితాన్ని దగ్గరగా చూసి, తన పిల్లలకి ఆయన అలవాటులు రాకూడని ఎన్నో దేవుళ్ళకు మొక్కుకుంది వాళ్ళ చెల్లె
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
From the publisher's feed

52 Listeners