
Sign up to save your podcasts
Or


వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో, కథానాయకుని తండ్రి, ఒక కుటుంబ రాజ్యాంగం రాసిపడేసి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనలను లెక్కపెడుతుంటాడు. ఇక్కడ కథానాయకుడు అనగానే నీకా లక్షణాలు లేవు అంటారని తెలుసు నాకు, ఇక్కడ కర్త కథానాయకుడు కాదు, కథానాయకుని తండ్రి. అలాగే మా నాన్నగారు (ఇక మీదట ప్రతీ దగ్గర నాన్న అనే వ్రాస్తానని మనవి, నా దగ్గర గారు గారు అని పలుమార్లు వస్తే మీరే అనగలరు, అతి వినయం దూర్తలక్షణమని) రాసిన రాజ్యాంగాన్ని నేనూ ఉల్లంఘించాను పలుమార్లు.
ఆయన ఇంటికి వచ్చేసరికి పిల్లలం పుస్తకాలు పట్టుకొని ఉంటే చాలు మహా సంతోష పడిపోయే వారాయన. చదువు లేక ఆయన పడే కష్టాలు, మేము పడకూడదని ఆయన బలమైన కోరిక, అదే విషయం మాకు పదే పదే చెప్పేవారు. మా ఇల్లు వీధికి ఎదురుగా ఉండటంతో ఆయన వీధి మొదలులో ఉండగానే ఆయన రాక మాకు కనపడిపోయేది, ఇక చూడాలి మా హడావుడి, ఎక్కడి ఆటలు అక్కడ బంద్, ఎక్కడి నవలాపఠనం అక్కడ బంద్, పుస్తకాలు పట్టుకొని మహా నటించేవాళ్ళము. నేనైతే అక్క, ఈ లెక్కతో గంట నుండి కుస్తీ పడుతున్న, రావటంలా, కాస్త చెప్పవా అనే అతి నటన కూడా. అలాగే ఏ పరీక్ష అయిన తర్వాత, ఎలా రాశావురా అని అడిగితే తొంబై వస్తాయని చెప్పేవాడిని, మా అక్కైతే ఓ అరవై వస్తాయని చెప్పేది, ఫలితాలు వచ్చాక మార్కులు తయారు మారయ్యేవి. అప్పుడాయన చెప్పేవారు, తక్కువ చెప్పి ఎక్కువ తెచ్చుకోరా అని. ఈ నియమాన్ని నేను ఇప్పటికీ ఉల్లంఘిస్తూనే వున్నా.
మా వూర్లో వేరుశెనగ ఎక్కువగా వేసే వాళ్ళము. విత్తనాలకు కాయలు వొలవటం పెద్దపని మాకు. అలా పిల్లలం అందరం కలిసి ఎవరి ఇళ్లల్లో అయితే విత్తనాలు వొలవాలో అక్కడ చేరే వాళ్ళం. ఒక లోటా విత్తనాలు, చచ్చు పప్పులు మినహాయించుకుని, వోలిస్తే పదిపైసలు. ఒకసారి మా స్నేహితులమందరం మా ఇంట్లోనే వొలుస్తున్నాం, నా లోటా పప్పులు అప్పుడే జమచేసి పదిపైసలు తెచ్చుకున్న, నేను కూర్చున్న ప్రదేశానికి రాగానే, నా స్నేహితుడొకడు ఒక లోటాడు ఒలిచి, ఈ లోపల ఉత్సపోసుకొద్దామని బయటకెళ్లినట్టున్నాడు, ఆ పప్పులు నా లోటాలో పోసుకొని మళ్ళీ జమచేద్దామని వెళ్లాను. అక్కడ చిత్రగుప్తుని లా పట్టుకున్నారు మా నాన్న, ఇప్పుడే జమ చేసేవు కదా అంతలోపు ఇంకో లోటాడు ఎలా వలిచావు అని. ఏవో కథలు చెప్పా, నమ్మలా, అంతలో మా వాడు రానే వచ్చాడు, నా పప్పులెవరో మాయం చేసేసారు అని ఏడుస్తూ. మా నాన్న నా జమ వాడికి బదలాయించి, అంతటి తో ఊరుకోకుండా ఎదో మునిగిపోయినట్టూ అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ నా ఘనకార్యం గురుంచి చాటింపు వేయించి, నా చేత బహిరంగ క్షమాపణ చెప్పించాడు. ఆయనకేమో పెద్ద పేరు, అబ్బా! సుందరయ్య చూడు కొడుకుని కూడా క్షమించడు అని. ఆయనకప్పటికీ మన మెగాస్టార్ ఇంకా చెప్పలేదేమో, తప్పులుంటే చెవిలో చెప్పు, మంచి ఉంటే మైక్ లో చెప్పు అని. ఇలా మా నాన్న చెప్పిన మాట, తప్పు చేస్తే వెంటనే ఒప్పుకొని క్షమాపణ అడుగు మరియు ఇతరులది లాక్కోకు అని. ఆ తర్వాత ఇతరుల కష్టాన్ని లాక్కోలేదు కానీ, ఈ తప్పు చేస్తే వెంటనే క్షమాపణ అడుగు అనే నియమాన్ని నేను ఉల్లంఘిస్తూనే వున్నా. సుప్రియా కూడా అంటుంది నాతో వాదించి వాదించి ఇక లాభం లేదనుకొని, "కిందపడ్డా, మూతిపళ్ళు రాలినా, నువ్వే గెలిచానంటావబ్బా!" అని.
సుప్రియా వాళ్ళ ఉరు కూడా నెల్లూరు అవటంతో, మేము నెల్లూరు వచ్చినప్పుడల్లా, మా ఇంట్లో కానీ లేక వాళ్ళింట్లో కానీ వరుసగా ఎక్కవ రోజులుండకుండా అక్కడికీ, ఇక్కడికీ గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళం. మా నాన్న ఒక నియమం పెట్టారు, వచ్చాక ఎక్కడైనా తిరగండి, కానీ మీరు నెల్లూరుకొస్తే మాత్రం మొదట మన ఇంటికే రావాలి, ఆ తర్వాతే సుప్రియా వాళ్ళ ఇంటికెళ్ళాలి అని. వాళ్ళింటికెళ్ళటం ఒకరోజు తర్వాత కావొచ్చు లేక తిధులు వారాలు బాగా లేక పోతే కొన్నిరోజులు కూడా పట్టవచ్చు. నాకు ఈ నియమం కాస్త అమానుషమనిపించేది. ఎందుకంటే సంవత్సరం తర్వాతో లేక రెండేళ్ల తర్వాతో నెల్లూరుకు వచ్చినప్పుడు, తనకి కూడా తనవాళ్ళని, ముఖ్యంగా తన చుట్టుపక్కల వారిని, తాను పెరిగిన పరిసరాలను ఎప్పుడెప్పుడు చూద్దామన్న కోరిక ఉంటుంది కదా. అయినా ఈ నియమం మా పెళ్లయిన నాలుగైదు ఏళ్ళు పాటించాము. ఈ లోపు నాకు ఇద్దరు కూతుర్లు పుట్టారు, నాకూ కొమ్ములు మొలిచాయి. ఓ రోజు మా నాన్న దగ్గరకెళ్ళి, తలెత్తి సూటిగా కళ్ళల్లోకి చూసి, మీకు తెలుసా నేను కూడా ఇప్పుడు మీ లాగే నాన్న నయ్యా, ఇక మీదట నెల్లూరులో దిగినప్పుడు మనింటికి రావాలనిపిస్తే మన ఇంటికి వస్తాము, లేక పోతే వాళ్ళింటికెళ్తాము. దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు అన్న లెక్కన చెప్పి అక్కడ నుండి పారిపోయా.
అలాగే నేను బయట దేశాలు పట్టుకొని తిరిగే రోజుల్లో, మా అమ్మా వాళ్ళు నెల్లూరులో మా అన్న వాళ్ళ దగ్గర వుండేవాళ్ళు. మా అన్న కొడుకు నాలుగేళ్ల పసికుంక. వాడినప్పు
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
నాకు మేనత్త రవణమ్మకిన్ను మా నాన్న మేనమామ రవణయ్యకిన్నుపెళ్లి చేసేసారు, మా తాత ఆదెయ్య మరియు మా నాన్నమ్మ ఆదెమ్మ లు కలిసి. మా నాయనకి, మా చిన్నాయన కి, నాకు, మా అన్నకీ ఆఖరుకి మా అమ్మ అక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణ మావే. ఆయన మాకు ఇల్లరికపుటల్లుడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు. ఆయన నడిస్తే పక్కనోళ్లు పరిగెత్తాలి, ఇద్డుమ్ వడ్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరడుగుల దూరంలో పడాల్సిందే. పండగలొస్తే నిప్పట్లు వొత్తాలంటే రవణయ్యే, కట్టెలు పేళ్ళుగా చీల్చాలంటే రవణయ్యే, భోజనంలో సింహభాగం కూడా ఆయనదే.
మా మేనత్త ఆయన దూకుడుకి బాగా వ్యతిరేకం, మెత్తనిది , ప్రేమ పాత్రురాలు, మేము గాడిదల్లా పెరిగినా మా ఏడవ తరగతి వరకూ మమ్మల్ని సంకనేసుకొనేది. ఆయనేది మాటలాడిన నువ్వే రైట్ నువ్వే రైట్ అంటూ ఆయన వాక్యం పూర్తిగాక ముందే అనేసేది. ఆ విషయం లో మా మేనత్త లౌక్యం నాకు చాలా ఇష్టం. మా వూర్లో మాకొక అంగడి ఉండేది అది మా మేనత్త మరియు మా మామ నడిపేవాళ్ళు. పండుగ దినాల్లో చేతిలో డబ్బులాడక పండుగ చేసుకోలేరు అన్న ఇళ్ల కల్లా మా మేనత్త బియ్యం, బెల్లం, నూనె లాటివి మా మావకు తెలియకుండా పంపేది. అందుకే ఊరందరకి ఆమె మా రవణమ్మ.
వాళ్లకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతుర్ని మరలా మా చిన్నాన్నకిచ్చారు. మా నాన్న, చిన్నాయన, మా మామల వ్యవసాయం భలే ఉండేది. వడ్లు విలువ ఇక పెరుగదు అని కళ్లాల్లో అమ్మేసుకుంటే అవి వెంటనే పెరిగేవి, మిరపకాయలకి రేట్లు వస్తాయనుకుని బొట్టల్లో ఉంచితే తీరా రేట్లు పడిపోయేవి. అమ్మబోయే సరికి రేటు సగం, కాయ తెల్లబడి బరువు సగం అయ్యేవి. ఇలా వ్యవసాయం చేసి ముగ్గురూ మా తాతని కాజేసేసారు. మేము ఎదో బావుకుందామని, మా అమ్మమ్మోళ్ల ఊరు ఉప్పలపాడు చేరి పోయాము. కొన్నేళ్ళకి మా మావ, మా మేనత్త, ఇద్దరి కొడుకులతో, మా చిన్న నాన్నమ్మోళ్లకి హోటల్ మరియు బి.హెచ్.పీ.వి లో కాంట్రాక్టులు ఉంటే అక్కడికి విశాఖకి వలస పోయారు.
మా మేనత్త కొడుకులు గోపాలయ్య, భాస్కరయ్య లు చిన్నప్పటి నుండి రామలక్ష్మణుల్లా పెరిగారు. ఇద్దరిదీ ఒకే మాట. నేను మా అన్న ఇద్దరం, సుందోపసుందుల్లా పెరిగాము. ఇద్దరికీ ఎడ్డెమంటే తెడ్డెము. అన్నిటికీ కొట్లాటలే మా మధ్య. ఆయనస్నేహితులతో నేను స్నేహం చేయకూడదు, మాటలాడకూడదు, అంతెందుకు ఆయన ఆయన స్నేహితులు ఆడే చుట్టుపక్కల నేను కనపడకూడదు. ఆయనకి మార్కులు సంకనాకొచ్చు, నాకు తగ్గితే ఆయనకీ ఎక్కడ లేని పెద్దరికం వొచ్చేస్తుంది, నా మీద దౌర్జన్యానికి . అందరూ పోలవటమే వాళ్ళని చూసి నేర్చుకొండిరా అని.
వాళ్ళు విశాఖ వెళ్లి చాలా కష్ట పడ్డారు. మామ బి.హెచ్.పీ.వి కాంటీన్ కి సరకులు కొనుగోలు చేసేవాడు, భాస్కరయ్య బి.హెచ్.పి.వీ లో కాంటీన్ మైంటెనెన్సు, గోపాలయ్య హోటల్ మైంటెనెన్సు చేసేవారు. ఈ క్రమం లో వచ్చిన అనుభవం తో శ్రీకాకుళం లో హోటల్ స్వప్న, ఏడు లాంతరుల వీధిలో మొదలు పెట్టారు. ఎదో సినిమా లో చెప్పినట్టు ఉప్పు దొరికే దగ్గర మామిడికాయలు తెచ్చి ఆవకాయ పెట్టి అమ్మడమే వ్యాపార లక్షణమని, అలా శ్రీకాకుళ మోళ్ళకి నెల్లూరు భోజనం రుచి చూపటమే వాళ్ళ వ్యాపార విజయం. వాళ్ళు ఇక వెనక్కి చూసుకోలేదు ఇక. డబ్బుకు డబ్బు పేరు కు పేరు వాళ్ళ హోటల్ కి.
గోపాల మామ సమర్ధుడు భాస్కర మామ కష్ట జీవి. అన్న నీడలో నే బతగ్గల సామాన్య జీవి. కలిసే వుండే వారు ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాక కూడా. ఆ తర్వాత మొదలయ్యాయి మనఃస్పర్ధలు. మేము అందరం చెప్పాము కనీసం కలిసే వ్యాపారం చేసుకోండి, కలసి ఒకే ఇంట్లో ఉండక పోయినా అని. భాస్కర మామే అడిగాడు హోటల్ నువ్వన్నా తీసుకో లేక నాకన్నా ఇవ్వు అని వాళ్ళ అన్నని. వాళ్ళ అన్నకి తెలుసు మా భాస్కర మామ కి కొత్త హోటల్ నడిపే సమర్థత లేదని. అందుకే బాగా జరిగే హోటల్ ఇచ్చేసి విజయనగరం లో కొత్త స్వప్న హోటల్ పెట్టుకున్నాడు. మొదట బాగా కష్టపడ్డా తర్వాత అది బాగా జరగటం మొదలెట్టింది.
కానీ భాస్కర మామే విశాఖలో ఒక హోటల్ ఓపెన్ చేసాడు జరగలేదు, బట్టల కొట్టు పెట్టాడు జరగలేదు. శ్రీకాకుళం హోటల్ మీద ధ్యాస పెట్టలేదు, అప్పులయ్యాడు. బాగా క్రుంగి పోయాడు. ఆస్తులు అమ్మేశాడు. ఒక రోజు ఫోన్ వచ్చింది భాస్కర మామ ఇక లేరు అని. హార్ట్ ఎటాక్ అని. మనిషి ఆరోగ్యం మీద మంచి అవగాహన వున్నవాడు. చెడు అలవాట్లు లేని వాడు. వాళ్ళ అన్న వచ్చాడు కర్మ కాండలు దాకా వున్నాడు. ఆ తర్వాత ఆ వైపు చూడలా. వాళ్ళ పిల్లల పెళ్ళిలకు పిలవలా, తమ్ముడి పిల్లల పెళ్లిళ్లకు రాలా.
రామ లక్ష్మణ కుటుంబాలు అలా విడిపోయాయాయి. ఇక సుందోప సుందుల కొస్తే ఇంకా తిట్టుకుంటూనే వున్నారు కొట్టుకుంటూనే వున్నారు. మధ్య మధ్యలో ఏరా నాతో మాట్లాడుతూ మాట్లా
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
మల్లిగాడు కరెక్ట్. మనం ప్రతి రోజు చాలా విషయాలు అందరి దగ్గరా నేర్చుకుంటాం. అవి మన పిల్లల దగ్గర నుండి అయితే ఇంకా బాగుంటాయి. నేను ఈ రోజు నా పిల్లల దగ్గర ఏమి నేర్చుకున్నానో చెప్తా. పెద్దపాప అమృతకి ఐదేళ్లు అనుకుంటా, తనకి చదరంగము నేర్పించాలని అనుకున్నా, అలాగే మొదలెట్టాను ఒక అయస్కాంతపు చదరంగపు అట్ట కొని. పరవాలేదు త్వరగానే నేర్చుకున్నది. కానీ గుర్రం (నైట్ ) వేసే అడుగులు మాత్రం బాగా అయోమయ పడుతుంది. చాలా సార్లు చెప్పినా అయోమయమే. ఒక రోజు మరల మరల తప్పు చేస్తుంటే కొంచెం చిరాకు పడ్డాను. కాసేపు అన్నీ ఆపేసి నా వైపే చూస్తుండి పోయింది. నాన్న, నేను ఒకటి అడగొచ్చా అన్నది. అసలు ఈ చెస్ ఎందుకు ఆడుతున్నాం మనం. ఇది ఒక ఆట కదా , సరదా కోసమే కదా అన్నది. అవునమ్మా అన్నా నేను సమాధానం గా. మరి నీ అరుపుల్లో సరదా ఎక్కడుంది నాన్న అన్నది. ఒక్కసారి నాకు అవగతమైనది నేను చేసిన తప్పేమిటో. మనః స్ఫూర్తి గా క్షమాపణ కోరాను. అది ఎప్పటిలాగే తనకలవాటైన తనదైన నవ్వుతో ఫరవాలేదు నాన్న అన్నది. అలాగే చదువుల దగ్గర కూడా. ఒక సారి లెక్కల్లో పదే పదే తప్పులు చేస్తుంటే కోపం వచ్చి ఒక్కటి పీకాను. పెద్దగా తను ఏడవటం, నేను ఛీ! ఎందుకు ఒకటి తగిలించానా అని బాద పడటం. ఎక్కువసేపు ఆగలేక పోయా, వెంటనే బతిమాలటం మొదలెట్టా (సుప్రియ దీన్నీ నా ఓదార్పు యాత్ర అని ఎగతాళి చేస్తుంది. నేనే ఎక్కువ ఓదార్పులు చేసుంటానని కూడా). అది వెంటనే మరల నువ్వు కొట్టావని కాదు నాన్న, ఆ లెక్కలు నాకెందుకు రావటం లేదు అని ఏడుపు వస్తుంది. అంతే నేను ఆ పాపని కొట్టాను అని అనుకోవడానికే నాకు చిరాకు వేసింది. అదే చివరిసారి.
పెద్దది ఇలా అయితే మా చిన్నది వేరే. యూ.ఎస్ లో వున్నప్పుడు అదుండగా ఇంట్లో ఎమన్నా కోపమొచ్చి అరవాలన్న భయమే. అది ముందే రూల్స్ రామనుజం. అసలే వాళ్ళ బడి లో మొదట నేర్పేదే 911 నొక్కమని. కాక పోతే దేవుడి దయవల్ల ఎదెప్పుడు నొక్కలేదు. ఒక రోజు అక్కడ ఒక పెద్ద అంగడికి వెళ్ళాం. పెద్దదాని కేదో ఫ్రాక్ నచ్చింది. అది వాళ్ళమ్మని అడిగింది కావాలని. వాళ్ళమ్మ అక్కడికి దూరం గా వున్న నన్ను చూపించి, మీ నాన్న నడుగు అన్నదట. ఇద్దరు నా దగ్గరకి వచ్చారు, నేను మీ అమ్మనడుగమ్మా అన్నా. మా పెద్దది అమాయకంగా మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తడానికి రెడీ అయ్యింది. మా చిన్నది దాని చెయ్యిపెట్టి ఆపి, అక్కడ అడిగితే ఇక్కడ, ఇక్కడ అడిగితే అక్కడ అని చెప్పినప్పుడే నీకు అర్థం కాలా వాళ్ళు కొనరని, ఇక నీ పరుగు ఆపు అని. అప్పుడర్థమయ్యింది వద్దు అనుకుంటే విడమర్చి చెపితే పిల్లలు అర్థం చేసుకుంటారు, సాకులు చెప్పకూడదని. ఒకసారి వాళ్ళ గది అంత గులాబీ రంగు వస్తువులతో నింపాలి అనుకొని అన్నీగులాబీవే కొనటం మొదలెట్టారు. గులాబీ దుప్పట్లు, గులాబీ బ్లయిండ్స్, గులాబీ వాల్ క్లాక్ మొదలైనవి. ఇక నా ఓపిక నశించి నో అన్నా. దానికి మా చిన్నది మేము పెద్ద వాళ్ళం అయ్యాము, మాకేదీ ఇష్టమో మాకు తెలుస్తున్నాయి అని ఖరాఖండి గా చెప్పింది. ఇంతకీ దాని వయస్సు ఆరేళ్ళు. కాబట్టి వాళ్ళ ఇష్టాల్ని మన్నించడం నేర్చుకున్నాం. కానీ వాళ్ళు కూడా మేము వద్దన్నప్పుడు, సరే వద్దులే అనటం నేర్చుకున్నారు. ఈ పరస్పర గౌరవం మొదలయ్యాక అస్సలు వాళ్ళ నిర్ణయాలకి వాళ్ళను వొదిలేశాము. ఈ మధ్య పెద్దది నాకు ఎం.పీ .సీ వద్దు నాన్న, నేను ఎం.ఈ.సి చదువుతాను అన్నది, మూడు నెలల చదువులు అయ్యాక. అదే ఏ కళాశాల మంచిదో కనుక్కుని ఎం.ఈ.సి లో చేరిపోయింది.
మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్, నా మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్ నా స్నేహితురాలి నంబరుకి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు అని చెప్పి. ఆలోచన లేని నెలతక్కువ వెధవ వాడు, మరలా ఎక్కువ తిట్టాలంటే వాడి పేరు కూడా హర్షానే, అందుకే వాడిని ఇంత కన్నా ఎక్కువ తిట్టలేకున్న అంటూ ముక్తాయించింది. తిట్టవలసినదంతా తిట్టి, ఇంకా తిట్టలేను అంటావేమమ్మా అంటే, మీరూరుకోండి నాన్న, వాడినా మాత్రం తిట్టవచ్చులే అంటూ, నాకు చెప్పకనే చెప్పేసింది నన్ను కూడా ఎంత వరకూ తిట్టగలదో.
ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ భార్య విధేయుడివి) అని ఈసడిస్తాడు అప్పుడప్పుడు. ఆయనకు పెద్ద ఫీల్ అంతా ఆయన కంట్రోల్ లోనే నడుస్తుందని. వీళ్లకు తెలీదు, అంతేగా అంతేగా అంటే, వాళ్ళు ఎంత సంతోషించి ఎన్ని సేవలు చేసేస్తారో. నాకైతే ఇంట్లో కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే టిఫిన్లు భోజనాలు కూడా నోటికే. తిని నా మూతి నేను కూడా కడగనబ్బా.
జీతం రాగానే ఇంత అని తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటమే నా పని. ఇంట్లోకి అన్నీ, అమ్మ నాన్నల మందులు, పిల్లల పికప్ డ్రాప్ ఆఫ్, వాళ్ళ హాస్పిటల్ విజిట్స్ అన్నీ తనే. అబ్బా నువ్వు సూపర్ అంటే, కార్ తోలటం నేర్చేసి అన్నీ తనే వన్ వుమన్ ఆర్మీ లాగా. ఎవరన్నా బంధువులు వచ్చినా పిక్ అప్ డ్రాప్ ఆఫ్ అన్నీ ఆమెనే. మన పని ఆఫీస్ కి వెళ్ళటం, రావటం పిల్లల చదువు చూడటం అంతే. మీరు ఏమంటారు, అంతేగ అంతేగ అని వాళ్ళ చిన్న మాటలను ఓపిగ్గా వింటూ వింటే కలిగే బోలెడు లాభాలు . ఇక మీకు తెలుసు అనుకుంటా మీ ఇంట్లో కూడా మీరు ఎలా ఉండాలో. కాదూ కూడదు నేను పురుష పుంగవుడిని నేనింతే అని మా అన్నలా వున్నారా, దేవుడే కాపాడాలి మిమ్మల్ని. నా మాట విని కనీసం లాక్ అవుట్ అయినదాకా అన్నా నటించండి, ఆ తర్వాత మీకే అలవాటైపోతుంది.
నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం. వాళ్ళలో ఒక పిల్లవాడు బహు నేర్పరి అనుకుంటా, చిన్న పిల్ల లు వాడిని బతిమాలుతున్నారు, అన్నా మా పటానికి డీల్ వేయకన్నా అనో, నా మాంజా బాగా రాలేదన్నా చూడు అనో. వాడు కూడా చాలా కలుపుగోలుగా, సరే లేరా! నేను తెంచనులే నీ పటాన్ని అంటూనో, లేక రారా నా మాంజా ఇస్తాననో అందర్నీ కలిపేసుకుంటున్నారు. నాకనిపించింది ఆహా ఇది కదా పిల్లలు నేర్చుకోవటమంటే అని. అదే పిల్లలు రేపు గొడవ పడొచ్చు ఎల్లుండి ఒకటొవ్వొచ్చు. కానీ ఎంత మంచి బతుకు కళలు నేర్చుకుంటున్నారు.
బతుకు కళలు నేర్వటం అంటే నా చిన్న తనానికి వెళ్ళాలి అలాగే మీ చిన్న తనానికి.
మా వెంకట్స్పర్లన్న చేతిలో పడిందంటే ఏ గాలి పటమైన రిపేరై సర్రుమనాల్సిందే. అన్నా! నా పటం ఎగరటం లేదు అని మా పిల్లకాయలం వెళ్తే, అబ్బాయిలూ సూత్రం సరిగ్గా లేదురా అంటూ, రెండు-నాలుగు కాకపోతే రెండు-ఐదు పెట్టాలిరా అంటూ సరి చేసిచ్చే వాడు. రెండు-నాలుగు అంటే రెండు బెత్తెల దారం పైన, నాలుగు బెత్తెలు దారం కింద కలిపి కట్టడం. అలాగే మా శీనన్న బొంగరాలు తిప్పటం లో నేర్పరి. ఆయన దగ్గర రకరకాల పరిమాణంలో బొంగరాలుండేవి. వాటికి జాలీలు పేనటం (ఇక్కడ జాలీ అంటే ఏంటి పేనటం అంటే ఏంటి అని మీరే తెలుసు కోవాలి), గుమ్మా కొట్టటం నేర్వటం, ఆయన దగ్గరే మేమంతా. బొంగరంతో గుమ్మా కొడితే పెద్ద ఘాతాలు పడాల్సిందే అవతల వాళ్ళ బొంగరాలకి. గిరి లోంచి బొంగరం బయటకి రావాలంటే దానికి పెద్ద పడగ ఉండాలని నేర్చుకోవటం లాటి చిన్న చిన్న విషయాలు గ్రహించాము.
అలాగే సిగరెట్ ప్యాకెట్ లని చించి, వాటితో యూనో లాగ ఆడటం. ఒక్కో సిగరెట్ బ్రాండ్ కి ఒక్కో వేల్యూ. చార్మినార్ బ్రాండ్ లోయెస్ట్ వేల్యూ ఆపైన సిసర్స్ తర్వాత విల్స్. ఈ సిగరెట్ కార్డ్స్ మాకు యూనో ముక్కలు. మళ్ళీ వీటిల్ని ఎక్స్చేంజి చేసుకునే వాళ్ళం, రెండు ఛార్మినార్స్ కి ఒక సిసర్స్, రెండు సిసర్లుకి ఒక విల్స్, అలా అన్నమాట. ఇవి మా ఖజానాలు. మా మల్లికార్జున అన్న వీటికోసం ఒక పెద్ద ఎక్స్చేంజి నే నడిపేవాడు. అలాగే గోళీలు ఆట. రక రకాలు గా ఆడే వాళ్ళం. ఒడి పోయిన వాళ్ళు మోచేతులతో నేలమీద డోకాలి. గోళీలాటలో నేను నేర్పరిని మా వూరికే. అలాగే కర్ర బిళ్ళ లేక గిల్లి దందా, ఉప్పు ఆట, కుందుడు గుమ్మా, పల్లంచి లాటి ఆటల్లో ఒక్కొక్కళ్ళు నేర్పరులు మా ఊర్లో.
అలాగే మా పిల్లకాయలం యానాది రెడ్డి చేలో, నేలబాయిలో ఈతకొట్టే వాళ్ళని తొంగి చూస్తావుంటే, మాకన్నా పెద్దోళ్ళు మమ్మల్ని ఎత్తి ఆ బాయిలో తోసేస్తే భయంతో కేకలు పెడుతూనే ఈతకొట్టేసే వాళ్ళం. నాకు అప్పుడే తెలిసింది అందరూ అన్నిట్లో మేటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కొ ఆట లో మేటి అని. వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకోవాలి అని చూసే వాళ్ళం, లేకపోతే వాళ్ళని మా జట్లలో చేర్చుకొని వాళ్ళం. అన్నీ నేర్పింది మాకు వయసులో పెద్దయిన మా సీనియర్స్, అలాగే మేము మా జూనియర్స్ కి. అది ఒక పరంపర . సీజన్ మారే సరికి తెలియకుండానే ఆటలు మారిపోయేవి . అప్పటికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఎలా తెలియకుండానే ఆటలు అలా మారిపోతాయబ్బ అని. అది నిజం గా పెద్ద సైన్స్.
అలాగే ఆరో తరగతి చదవాలంటే మా ఊరి నుండి మూడు కిలోమీటర్ల దూరం లో వుండే పెదపుత్తేడుకి వెళ్ళాలి. మాకు అలవాటు అయ్యేవరకూ మా సీనియర్స్ మమ్మల్ని గమనిస్తూ తీసుకెళ్లేవారు. మా హైస్కూల్ లో చదువుల్లో ఫస్ట్ అంటే మా వూరే ఉండాలి. అది మా సీనియర్స్ నుండి వచ్చిన పరంపర. మన ఊరి పేరు నిలబెట్టాలిరా అంటూ, మాకు మార్కులు తగ్గితే వాళ్ళే ఉక్రోష పడే వాళ్ళు, మాకన్నా. ముందే అన్నా అన్నా అంటూ వాళ్ళ పుస్తకాలు రిజర్వు చేసుకొనే వాళ్ళం. కాస్త పెద్దయ్యాక కొన్ని రోజులు మా సీనియర్ అన్నలు అక్కల మధ్య ఉత్తరాలు చేరవేత కూడా. అన్నా! చెప్పన్నా, ఆ అక్క నీ ప్రేమని ఒప్పుకుందా లేదా అని మేము అడిగితే, రే! ఓపికుండాలి రా, అంత త్వరగా కుదరవురా, అంటూ ఓపిక కూడా నేర్పారు మా అన్నలు. ఇవన్నీ పుస్తకాలు పాఠశాలల ఆవల మేము నేర్చుకున్న బతుకు కళలు.
నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు. ఒక రోజు చిన్నది వచ్చి , 'నాన్నా, నాకీ మధ్య అబ్బాయిలతో మాటలాడటం ఉత్సుకత గాను, అమ్మాయిలతో మాటలాడడం విసుగ్గాను వుంది. అమ్మాయిలు ప్రతి దానికి ముఖం మాడ్చుకుంటూ వున్నారు. అదే అబ్బాయిలైతే ఉత్సాహంగా సరదాగా ఉంటూ, మాట్లాడడానికి చాలా హాయిగా వున్నారు', అని చెప్పింది. సహజంగా నేను కానీ సుప్రియ కానీ వాళ్ళు ఎమన్నా ఇటువంటివి చెబితే వాళ్ళని ఖండించము. వాళ్ళు వాళ్ళ భావాలని బయట పెట్టనిస్తాం. కాబట్టే వాళ్ళు అన్నీ దాయకుండా చెప్పేస్తారు.
అదే సమయంలో మా పెద్దది ఓ కథతో వచ్చింది. నాన్నా! మా కాలేజీ లో మా సహాధ్యాయిని వాళ్ళ అమ్మ, మా కాపలాదారుడి కొడుకుని కొట్టింది చూడూ అంటూ! ఏమి జరిగిందిరా! అంటే ఈ విధం గ చెప్పుకొచ్చింది. "మా సహాధ్యాయిని ని వాళ్ళ అమ్మే రోజూ తనను కాలేజీ లో దింపేది. అలా దింపడానికి వచ్చినప్పుడల్లా, మా కాపలాదారుడి కొడుకు ఆమెకి నమస్కారం కూడా చెప్పేవాడట. ఈ మధ్య ఆవిడ రావటం లేదు, ఆ అమ్మాయే ఒంటరిగా వచ్చేస్తుంది, కాలేజీకి రావటం మరియు పోవటం అలవాటు పడిపోయింది కనుక. కొన్ని రోజులకి, అమ్మాయి వాళ్ళ అమ్మకి కాలేజీ నుండి ఫోన్ కాల్ వెళ్ళింది, వాళ్ళ అమ్మాయి క్లాస్ కి సరిగా రావటం లేదని. వాళ్ళ అమ్మగారు, కాదు మా అమ్మాయి క్రమం తప్పకుండా వస్తుంది కాలేజీకి అని చెప్పి, వెంటనే వచ్చేసారు కాలేజీ దగ్గరకు. అమ్మాయి గారు కాలేజీ లో లేరు. అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఒక డి.ఎస్.పి. ఆయన వెంటనే తన బెటాలియన్ తో రంగంలోకి దిగి, కనిపెట్టారు ఆ అమ్మాయీ, మా కాపలాదారుని కొడుకు పక్కనున్న పార్కు లో తేలి వున్నారని. వాళ్ళ నాన్నగారు వాడినేమీ అనలేదు, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం వాడిని కుమ్మేసింది" అని. పైగా తేలిందేమిటంటే ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మ నెంబర్ మారిందని, బదులుగా తన స్నేహితురాలి నెంబర్ కాలేజీలో ఇచ్చి, ఇన్ని రోజుల గైరు హాజరు మేనేజ్ చేసింది. ఆ పిల్ల ఖర్మకాలి రిసెప్షనిస్ట్ గావేరే ఆమె రావటం, వచ్చినావిడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి పాత నెంబర్ కి ట్రై చేయటంతో అసలు భండారం బయట పడింది.
మేము మా పిల్లల్ని అడిగాము, పైన కథలో మీరు ఏమి గ్రహించారు అని. వాళ్లు తమకలవాటైన శైలిలోనే చెప్పారు, ఆ అమ్మాయిదే తప్పు అని, అలా వాళ్ళ పేరెంట్స్ నమ్మకాన్ని, ఆశల్ని ఆ అమ్మాయి వమ్ము చేసింది అని. మేము అడిగాము మరి చెల్లి కూడా, అబ్బాయిలతో మాటలాడటం చాలా ఉతసాహంగా వుంది అన్నది కదా, మరి ఆ అమ్మాయి చేసినది తప్పు ఎలా అని. ఆ అమ్మాయికి కూడా వాడు చెప్పిన కబుర్లు ఉత్సాహంగానే వున్నాయి కాక పోతే స్కూల్ బదులు పార్క్ అంతే తేడా అని. నాన్నా, మేము ఇలా ఆ అమ్మాయిదే తప్పు అన్నామని మాకు వ్యతిరేకంగా మీరు చెప్తున్నారు, మేము ఆ అమ్మాయే కరెక్ట్ అంటే మీరు ఇంకోలా చెప్పేవాళ్ళు అంటూ నా మీద విరుచుకు పడ్డారు మా మా అమ్మాయిలు.
మాకు అర్థమయ్యింది మేము మా స్టాండ్ చెప్పే సమయం వచ్చిందని. మీలో కొందరికి నచ్చినా నచ్చక పోయిన నేను ఇలా చెప్పా. మొదటిది, మీరు ఒప్పులు చేస్తేనే నేను మీకు అండగా ఉండేదని అనుకోవొద్దు, మీరు తప్పులు చేసి కష్టాల్లో పడ్డా నేను మీకు వున్నా, కాబట్టి నన్ను ఏ సమయం లో నైనా సహాయం కోసం అడగటంలో సంకోచించ వద్దు. నా దృష్టి మీ సమస్యని పరిష్కరించటం మీదనే కానీ మిమ్మల్ని ఎత్తి పొడవటం మీద ఉండదు. ఇంకా సంభాషణను పొడిగిస్తూ, ఈ విధంగా కొంచెం సుత్తి కొట్టాం, ' మీకు ఒకడు నచ్చొచ్చు, వాడు చెప్పే కబుర్లు నచ్చవచ్చు, కానీ కథ అంతటి తో ముగియదు. వాడు కొంత కాలానికి బయటకెళ్దాం అంటాడు. ఒక సినిమా కో, ఒక పార్క్ కో, లేక ఎక్కడైనా ఒంటరి ప్లేస్ కో. మీకు కొన్ని సార్లు వెళ్లాలని అనిపించ వచ్చు. కానీ మీరు అన్నీసార్లు వేళ్ళ లేరు. మీరు వెళ్లలేనప్పుడు వాడు ఎమోషనల్ గా మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తాడు. చచ్చినట్టు వెళ్ళాలి, వాడి మాట వినాలి. ఈ ప్రాసెస్ లో మీరు కోల్పోయేది మీకు నచ్చినట్టుండ గలిగే మీ ఫ్రీడమ్. మీకు అవసరమా ఇదంతా. మీకు ఎక్కడికైనా వెళ్లాలంటే తీసుకు వెళ్లే అమ్మా, నాన్న, నాన్నమ్మ మరియు తాతయ్య లాటి ఇందరం వున్నాము. మీ ఎమోషన్స్ వినడానికి, భరించడానికి, ఏమీ ఆశించకుండా చేయడానికి. మీకు మీ ఫ్రీడమ్ కావాలా, లేక ఆ ఫ్రీడమ్ కీని ఏ గొట్టం గాడి చేతిలో పెడతారా' అని .
తర్వాత రోజు వచ్చారు ఇద్దరు, నాన్నా! మాకు మీరు ఇచ్చే ఫ్రీడమ్ కావాలి. మా ఫ్రీడమ్ కీస్ మా చేతుల్లోనే ఉండాలి అంటూ. సరే అమ్మా, ఒక నాన్న! వైపునుండి చూస్తే మీరు నా దగ్గర, రూపం లో గొంగళి పురుగుల్లా, గుణం లో సీతకోక చిలుకల్లా, మీ మీ పెళ్లిళ్లయ్యాక, రూపం లో కూడా సీతాకోక చిలకల్లా
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
నా స్నేహితులు నన్నడిగారు, నీ కథలతో పడలేకున్నామురా, అసలు నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు అని. అసలే కథల కామరాజును కదా నేను, అందుకే నా కథల వెనక కథ ఇక్కడ చెప్తున్నా.
నా బాల్యం ఉన్నంతలో బాగానే జరిగింది, నేను బడికి వెళ్లే వరకు. నాకెందుకో మొదటి నుండి బడికి వెళ్ళటమంటే చెడ్డ చిరాకు. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పులు, ఎండలో ఎక్కువసేపు నిలబడి జ్వరాలు తెచ్చుకోవటాలు, ఆ జ్వరాలు నాకే కాదు మా అయ్యోర్లకు కూడా వచ్చేయని కథలు చెప్పటాలు, ఇంకా ఎక్కువ సెలవలు కావాలంటే అయ్యోర్లే పైకి వెళ్లిపోయారనే అమాయకపు కథలు. ఈ కథలు అల్లటం చాలా సులభమే కానీ, ఎవరి దగ్గర ఏ కథ చెప్పామో గుర్తుంచుకొని ఆ కథ మరల మరలా పొర్లుపోకుండా చెప్పటం మహాకష్టం. ఆ మహా కష్టమే నాకు మంచి జ్ఞాపకశక్తిని ఇచ్చిందని నా నమ్మకం.
నా ఈ కథలు చెప్పటం చాలా నిరాటంకంగా సాగింది చాలా ఏళ్ళు, అలాగే వాటి పరిధి కూడా బాగా పెరిగింది. ఒక వయస్సు వచ్చాక, తరచుగా నా అబద్దాలు బట్టబయలు కావటం మొదలెట్టటంతో, మా అమ్మ నా చెంప పగల కొట్టి, నీ అబద్దాలు ఎప్పుడన్నా అవసరం కోసం చెప్పటమనే గీత దాటి, అలవాటుగా చెప్పటమనే పరిధిలోకి వస్తున్నాయని, నా బతుకు నాన్నా! పులి కథలా అవుతుందని చెప్పింది. ఆ చెంప దెబ్బ నాకు నిజమైన చెంప పెట్టు. అప్పటి నుండి నేను అబద్దాలు అలవాటుగా చెప్పటం మాని, అవసరానికి మాత్రమే చెప్పటం నేర్చుకున్నా. కానీ కథలు అల్లటంలో పనికొచ్చిన పనికిమాలిన మేధోశక్తి మాత్రం దెబ్బతినలా మా అమ్మ చెంప దెబ్బ కొట్టినా.
అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, అన్నలు, అక్కలు మరియు స్నేహితులతో జరిగిన చాలా ఘటనలు నాకు జ్ఞాపకమే, వాళ్ళతో పాటూ నా చుట్టూ పక్కల వున్నవారితో మరియు సహోద్యోగులతో వున్న అనుబంధాలు, వాళ్ళతో నా అనుభవాలు ఇప్పటికీ నా కళ్ళ ముందరే. వాటికి అక్షర రూపమే ఒక పుటకి మించని ఈ కథలు. నా కథలలో పాత్రలన్నీ నాతో ఎదో ఒకరకంగా ప్రయాణం చేసిన వారే. అక్కడక్కడా కొన్ని పేర్లు మాత్రమే మార్చబడ్డవి వాళ్ళ గోప్యత కోసం.
నా కథలు మొదటి నుండి చదివి తిట్లు ఎక్కువ, పొగడ్తలు తక్కువ రూపేణా వెలిబుచ్చిన మా స్నేహ బృందానికి నేను ధన్యవా
మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు. వాడు ఉదయాన్నే తాతా! కాఫీ తాగుతావా అంటూ వచ్చేసేవాడు. అప్పటి నుండి నేను ఆఫీసుకు వెళ్లే వరకూ నేను వాడితోనే ఆటలు. ఒక రోజు నేను కాఫీ తాగుతుంటే వచ్చి నా బుగ్గ నాకటం మెదలు పెట్టాడు, ఏందిరా !అబ్బీ అంటే నీ బుగ్గకి చక్కెర అంటుకుంది తాతా అని నవ్వటం మొదలెట్టాడు. ఏందబ్బా వీడు ఇలా అంటున్నాడు అని అద్దంలో చూసుకుంటే, నిజమే గెడ్డం నెరవటం మొదలెట్టినది, అక్కడక్కడా చక్కెర అద్దినట్టు. ముసలోడు అయ్యే తొలి లక్షణాలు వాడు ఎంత ముచ్చటగా చెప్పాడో.
నాకో ఛండాలపు ఐ.డి కార్డు ఉండేది. నా ఫోటో ఎంత దరిద్రంగా ఉండేదంటే, ఆ ఫోటో ని చూసి మా అభిరాం రోజు అడిగేవాడు, తాతా ఈ ఫోటో లో ఉండేది ఎవరూ అని, నేనేరా అంటే, ఓహో నువ్వేనా అనే వాడు. మరలా, రెండు మూడు రోజుల తర్వాత అదే ప్రశ్న, వేసేవాడు, తాతా! ఈ ఫోటో లో ఉండేది ఎవడు అని, నేను మరల నేనేరా అనటం, వాడు ఓహో అనటం నిత్యకృత్యమయ్యింది. వాడే నిజం ఒక రోజు మా ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ నన్ను లోపలకి రానివ్వలేదు, నా ఐ.డి నాది కాదంటూ.
అభిరాం బాగా యాక్టీవ్ గా మరియు ఎనర్జిటిక్ గా వుండే వాడు. వాడిని నేను ఆటలకి బయటకి బాగా తీసుకెళ్లే వాడిని. వాడికిష్టమైన ఆట ఫుట్ బాల్. వాడు బంతిని తంతే, అది బులెట్ లాగా దూసు కెళ్ళేది. అలాగే వాడి కొక బుజ్జి సైకిల్ ఉండేది. వాడిని తీసుకొని వాకింగ్ వెళ్ళేవాడిని. వాడు నాతో ట్రైనింగ్ వీల్స్ వున్న ఆ సైకిల్ వేసుకొని బుద్ధిగా వచ్చేవాడు. నేను నడుస్తుంటే నా ముందర మరియు దారికి ఎడమ పక్కన. ఒక రోజు వాడికి చెప్పా! నువ్వు పెద్ద వాడివి అయ్యావు రా, నీ సైకిల్ కి ఇక ట్రైనింగ్ వీల్స్ తీసేస్తా అని. అలాగే తీసేసా. మొదట బాగా భయపడినా రెండో రోజే అలవాటు పడిపోయాడు. వేగంగా కూడా తొక్కటం మొదలెట్టాడు. అలా ఇంకో రెండు రోజులు గడిచాయి. అలవాటు ప్రకారం, ఓ రోజు వాడిని తీసుకొని బయల్దేరా. వాడు చాలా వేగం గా రోడ్ కి అడ్డదిడ్డం గా తొక్కటం మొదలెట్టాడు. అభీ ! ఇలా తొక్కితే నేను ఒప్పుకోను, ఇంటికి పద అని కోపంగా చెప్పా. వాడు అంతే కోపంగా తాతా ! ఏమి నేనేనా చూసుకోవాల్సింద , అవతల వచ్చే వాడు కూడా చూసుకోవాలిగా, వాడే చూసుకుంటాడు లే అంటూ వేగంగా అక్కడ నుండి ఇంకా అడ్డదిడ్డం గా వెళ్లి పోయాడు. హత విధీ ! మనకి ఎవరూ నేర్పక్కర్లేదు రూల్స్ బ్రేక్ చేయటం , అది మన రక్తం లోనే వుంది అనుకుంటూ ఇల్లు చేరా.
అలాగే కొన్నాళ్ల తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద బెంగుళూరు వెళ్లి పోయారు వాళ్ళు. వాడి కబుర్ల కోసం ఫోన్ చేసే వాడిని నేను రెగ్యులర్ గా వాడికి. ఒక రోజు తాతా! నాకు స్పెల్లింగ్ టెస్ట్ అని చెప్పాడు. ఏంటిరా డీటెయిల్స్ చెప్పు అంటే, నేను ఏ ఆల్ఫాబెట్ తో మొదలయ్యే పదిపదాలలో మా మిస్ అడిగే పదానికి స్పెల్లింగ్ చెప్పాలి అన్నాడు. సరే ! పదీ పదాలు నేర్చుకున్నావురా అంటే. తాతా ! పిచ్చోడివి నువ్వు నాది క్లాస్ లో మెదటి పేరు, మా మిస్ నాతో నే మొదలెడుతుంది అందుకే నేను మొదటి పదమే నేర్చుకెళ్తున్న అన్నాడు. ఓరి నీ పాసుగులా నీ తెలివి మాకు లేదయ్యె అని నిట్టూర్చా. తర్వాత రోజు వాడు ఫోన్ చేసి చెప్పాడు, తాతా ! మా మిస్ కి బుర్ర లేదు అని. ఏందిరా! అబ్బయ్య అంటే, నన్ను లాస్ట్ పదమడిగింది అని చెప్పాడు. వాళ్ళమ్మ పదికి నాలుగే మార్కులు వచ్చాయి ఎందుకురా, అనడిగితే వాళ్ళమ్మని ఓదారుస్తాడు! మా క్లాసులో మూడు రెండు వచ్చినోళ్ళు ఇంత మంది వున్నారు అంటూ. నేను కుటుంబాన్ని వొదిలి చెన్నైలో ఉండగలిగానంటే వాడి తోడు చాలా దోహద పడింది.
అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలం లోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం . మాకు మాతృస్వామ్యము ఇష్టం కాబట్టి అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టా. ఇటు నుండి అటు వెళ్లాలన్న, అటు నుండి ఇటు వెళ్లాలన్న రాజు పాళెం లో దిగి బస్సులు మారాలి. నాకు ఈ పాళెం ఏందిరా బాబూ అని చిన్ననాటి నుండి డౌట్ కానీ అరవ దేశానికెళ్లాక అర్థమయ్యింది పాళ్యం రూపాంతరం అయ్యి పాళెం అయ్యిందని. ఎలా అయినా మనం మన ఎన్ .టి.ఆర్ రాక ముందు మదరాసీలము కదా. ఈ గోల వదిలెయ్యిహే! చెప్పాల్సింది చెప్పు , ఈ మధ్య అసలు కంటే కొసరేక్కువయ్యింది నీకు అని పొడస్తావుంది సుప్రియ పక్కంజేరి.
సరే అసలు కథ చెప్తా. నాకు ఐదేళ్లు వయస్సనుకుంటా, కాక పోతే మా అమ్మ దగ్గర తెలుగు నాలుగాకులే ఎక్కువ చదివా. మన గోపిగాడి లాగ కాకుండా బస్సుల మీద ఊర్ల పేర్లు చదివెయ్య గలుగుతున్న అప్పటికే. మా అమ్మ అత్తారిళ్ల మీద అలక తీరి అమ్మగారింటి నుండి నన్ను తీసుకొని ప్రయాణం కట్టింది. మనమూ ఊరెళ్తున్నామని దోస్తులందరికీ టామ్ టామ్ వేసి కొత్త చొక్కాయ వేసి బయలుదేరాము. బస్సు రాజు పాళెం రాగానే మా అమ్మ ముందు నన్ను దింపి ఆ తర్వాత వాళ్ళ పుట్టిల్లోళ్లు ముచ్చట పడి కట్టిచ్చిన చీపురు కట్టలు బస్సులోంచి కిందకిసిరి ఆమె దిగబోయేంతలో ఆ బస్సు' నాకొడుక్కేమొచ్చిందో రోగం సక్కా నూక్కొని పొయ్యాడు బస్సుని.
కిందకు దిగిన నాకు అర్థం కాలా నా కర్థమయ్యింది మా అమ్మ బస్సులోంచి దిగలా . ఆ బస్సు నెల్లూరెళ్ళి పోయింది, నేనేంజెయ్యాల చుట్టూ చూసా రోడ్ కి ఎదురుగుండా నెల్లూరు నుండి మా ఊరెళ్ళే బస్సు వుంది. ఒకటికి రెండు సార్లు చదివా, నెల్లూరు, కోవూరు, రాజుపాలెం, గండవరం, కొత్తవంగల్లు, గొట్లపాలెం, పెదపుత్తేడు, ఉప్పలపాడు అని బస్సు పక్క వైపున చక్కగా కనపడ్డాయి. అబ్బా చదవటం సూపర్ గా వచ్చేసింది , మా గోపిగాడు గాడిదెద్దులా పెరిగాడు ఆడికి ఇప్పటికీ రాదు అనుకుంటూ, ఒక్క తాటిన రోడ్ దాటినా. బస్సెక్కి ఇద్దరు పెద్దోళ్ల మధ్య సీట్ లో ఇరుక్కున్న. మనకి అప్పటికి ఇంకా అరటిక్కట్టు వయస్సు కూడా కాదు. ఎవరూ అడగాలా. మా వూరు చేరా.
ఎలా అబ్బా మా అమ్మమ్మకి చెప్పటం మా అమ్మ తప్పి పోయిందని ఒకటే ఆలోచన బస్సంతా. బస్సు దిగగానే నన్ను బస్సు ఎక్కిచ్చి ఆడే బడి ఆడుతున్న దోస్తులకేమీ అర్థం కాలా నన్ను చూసి. ఏమిటిరా మీ ఎదవ కన్ఫ్యూషన్ ముందే నేను మా అమ్మ తప్పి పోయి యాడస్తా ఉంటే అంటూ ఇంటికి బయల్దేరా. ఈళ్ళు గమ్మునుంటారా నాకంటే ముందు లగెత్తారు మా అమ్మమ్మ కాడికి . ఓ ఈసిరమ్మా నీకూతురు తప్పి పోయిందమ్మా అంటా. మా అమ్మమ్మ భలే హుషారయిన మడిసిలే అచ్చు నాలాగా వెంటనే మా సీనన్ని అదే బస్సు ఎక్కిచ్చింది రాజుపాళేనికి. ఈ లోపి మా అమ్మ, మా అమ్మ తో పాటు రాజుపాలెం లో దిగిన మా ఊరోళ్లంతా నాకోసం రాజుపాలెం అంతా వెతికి వెతికి, ఏడ్చుకొని ఏడ్చుకొని మల్లా అదే బస్సు నెల్లూరెళ్లి తిరిగొస్తుంటే దాన్ని రాజుపాలెం లో ఎక్కి మా వూరికి బయల్దేరారు. ఈ రెండు బస్సులు గండవరం లో కలుసుకున్నాయి. మా శీనన్న వెంటనే మా అమ్మ కాడికెళ్ళి మనోడు సూపర్ గున్నాడు నువ్వేమి ఏడవమాక అని మన క్షేమ సమాచారాలు చెప్పి మా అమ్మని ఉప్పలపాటి కి తీసుకొచ్చాడు.
ఎట్లా ఐన మా అమ్మ సూపర్ వీపు విమానం మోత మోగేలా కొట్టలా. నేను అనుక్కున్నట్టు మా అమ్మే తప్పి పోయిందని నమ్మేసింది. దగ్గరకి తీసుకొని తవుడుకొని పొట్టనిండా బువ్వ పెట్టి పొట్ట మీద వేసుకొని నిద్ర పుచ్చింది. నేను నిద్ర లేచేసరికి ఎదో పుస్తకం చదువుతా కనపడింది. అప్పుడు తొలిచింది ఎదో పురుగు నా బుర్రని. ఓ అమ్మ అమ్మ నేనొకటి అడగతా సెప్తావా అని. అడగర అంది మా అమ్మ తేటంగా . “అవునే నేను చిన్న పిల్లోడిని కదా రాజు పాళెం లో తప్పి పోయాను కదా నేను దొరికే వరకూ నువ్వు రాజు పాళెం వదలకూడదు కదా అక్కడే వుంటాను అనుకోకుండా మరి మన ఊరి బస్సు” ఎలా ఎక్కావు? ' అని.
From the publisher's feed

52 Listeners