ప్రపంచ జనాభాలో బౌద్ధులు 48కోట్ల 75 లక్షల మంది ఉన్నారు. కాంబోడియా, జపాన్, దక్షిణ కొరియా, లావోస్, మలేషియా, మంగోలియా, మియన్మార్, చైనా, నేపాల్, సింగపూర్, శ్రీలంక, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మరియు భూటాన్ , లాటి దేశాల్లో బౌద్ధులే అధికం. ఆ బౌద్ధులు భారత దేశంలోని బుద్ధుడు నడయాడిన ప్రదేశాలను ఆరాధిస్తారు!. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం బుద్ధుడి కి ఇష్టమైన పర్యటించినప్రాంతమే గాకుండా ఆయనే స్వయంగా " కాలచక్ర" ను ఇక్కడే బోధించి , అశోకుడు బౌద్ధ స్థూపాన్ని నిర్మించిన స్థలి గా ప్రసిద్ధిగాంచిన బౌద్ధ పర్యాటక కేంద్రం అని మెగాస్తనీస్ వ్రాశాడు.