Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
November 25, 2019" మామిడి చెట్టు " అనే కధ , రా.వి. శాస్త్రి రాశారు.రా. వి. శాస్త్రి ,వృత్తిరీత్యా న్యాయవాది. కధల్లో కూడా న్యాయవాదే !. నేటిసమాజంలో నిత్యమూ పై తరగతుల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన ,హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకునే ,పెద్దమనిషి పెద్ద మనసున్న వాడు ఈ రా. వి.శాస్త్రి !....more30minPlay
November 25, 2019" పార్వతీ పరిణయం " అనే ఈ కధ ను కొడవటిగంటి కుటుంబరావు వ్రాశారు.సమాజంలో అగ్రవర్ణానికి చెందిన స్త్రీ కి నిమ్న జాతి యువకునితో వర్ణాంతర వివాహం జరిగితే నష్ట పోయేది నిమ్న జాతి యువకు డే నని తెలియచెప్పే కధ , కుటుంబరావు గారు వ్రాసిన " పార్వతీ పరిణయం" అనే కధ !....more23minPlay
November 24, 2019" నాన్న .... నేనొచ్చేస్తా.... ! " కధ , రచయిత్రి ఈశ్వరి .నాటి తరం స్త్రీ కి నేటి తరం మహిళకి ఉన్న తేడా , ఈ కథలో తల్లీ ,కూతుళ్ళయిన సావిత్రి ,సుధ ,లు ,ఆ నాటి ఉత్తరాలు కూతురు సుధ కు ఎలా కనువిప్పు కలిగించిందో వినేవాళ్లకు బాగా అర్థమై హమ్మయ్యా అనిపించక పోదు!....more22minPlay
November 24, 2019" కుటుంబ బంధాలను పటిష్టం చేసుకుందాం !" చంద్ర ప్రతాప్ ." మంచి గురించి మందిలో చెప్పు , చెడుగురించి చెవిలో మాత్రమే చెప్పు ! "....more6minPlay
November 23, 2019" కమ్మ తెమ్మెర " అనే కధ ను మధు రాంతకం రాజారాం ,గారు వ్రాశారు.శ్రీ మధు రాంతకం రాజా రాం కధలు పెద్దమనిషి తరహాగా కుదురుగా కమ్మగా ఉంటాయి. వీరి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. .ఈ కధ " కమ్మ తెమ్మెర " లో పెళ్లికుమారుని పై జాలిపడి పెళ్ళి కూతురు తెచ్చి శాలువా కప్పిన వైనం శ్రోతలకు గిలిగింతలు పెట్టి మధురాను భూతులను నెమరుకు తెస్తుంది !....more25minPlay
November 22, 2019" దోష గుణం " అనే ఈ కథను గుడి పాటి వెంకటా చలం గారు వ్రాశారు.చలం ఒక ఉప్పెన !. మూఢా చారాలతో క్రుళ్ళిపోయిన సంఘానికి చలం కధలు కత్తిపోట్లు. ఈ యన కధలు చదివితే ఆడవాళ్ళు చెడిపోతారని ఆయన పుస్తకాలను తగులబెట్టారు .సంప్రదాయాలు, నీతులు, నియమాలు అన్నిటి మీద చలం ధ్వజం మెత్తాడు. ఈ" దోష గుణం " కథలో సెక్స్ కారణంగా స్త్రీ గురయ్యే చిత్ర హింసను చలం శక్తివంతంగా లోకానికి చాటి చెప్పడం జరిగింది....more46minPlay
November 22, 2019" దేశ వ్యాపిత 30 కంపెనీలు బ్యాంకు ఋణాలు తీసుకుని 1 కోటి 61 లక్షలు ఎగ వేసిన ఘనా పాఠీలు" ." ది .వైర్ " అనే ఒక ప్రజా సంబంధవ్యవహారాల సంస్థ , సమాచార హక్కు చట్టం క్రింద సేకరించిన సమాచారం మూలంగా 30 కంపెనీలు , బ్యాంకుల అప్పులును ఎన్ని కోట్లలో ఎగ గొట్టింది వెలుగు చూసినది....more11minPlay
November 22, 2019" జీవ పరిణామం " గురించి ప్రొ. రామచంద్రయ్య గారి వివరణ.కోతి నుండి మనిషి పరిణామం చెందాడు. అనే అనుమానాయుత సందేహాన్ని ప్రొ. రామచంద్రయ్య గారు వివరించిన అంశాన్ని వినడం చేద్దాం!....more7minPlay
November 21, 2019" పడవ ప్రయాణం " పాలగుమ్మి పద్మ రాజు గారి కధ.పడవ ప్రయాణం కధ లో తనను హింసించే పురుషుడిపట్ల ఒకరకం స్త్రీకి ఉండే వ్యామోహ పూరిత మనస్తత్వం ఎంత విచిత్రమైనదో ద్యోతక మవుతుంది. ఈ కధ పద్మరాజు గారు పడవ టాపుమీద పడుకుని నీటిలో తెలిపోతున్నట్లు గా చెబుతున్నట్లు ఉంటుంది వింటున్న వాళ్లకు !....more24minPlay
November 21, 2019""డాబా ఇల్లు " అనే ఈ కధ కు రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ .ప్రతి మధ్యతరగతి మహిళకు తెలిసిసిన ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ . ఈ "డాబా ఇల్లు " కధ లో గతిలేక అమ్ముకున్న డాబా ఇంటి మీద విడదీయ లేని మమకారాన్ని పెంచుకున్న ,విషాద మూర్తులైన ఒక బడుగు జంట వాస్తవ జీవిత చిత్రణ ఇది!....more23minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.