Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • మా ఇంటి మహాలక్ష్మి | Ma Inti Mahalakshmi | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మా ఇంటి మహాలక్ష్మి

    రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "ఒరేయ్ కృష్ణా… ఒకసారి ఇలా వస్తావూ! నీతో మాట్లాడాలి" లోపలనుండి కొడుకును పిలిచింది కాంతమ్మ. ఇంట్లోనే కిరాణం కొట్టుపెట్టుకుని మంచి గిరాకితో వ్యాపారం చేస్తున్నాడు కృష్ణమూర్తి.

    "ఆ వస్తున్నానమ్మా… కొట్టులో గిరాకి ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక వస్తాను" అక్కడనుండే

    సమాధానం ఇచ్చాడు.

    "అబ్బా..  వాళ్ళను కాసేపు ఆగమని చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి. బయటకు వెళ్ళిన కోడలు వస్తుంది. ఒక్కసారి వచ్చిపోరా" అంది దబాయింపుగా.

    "అబ్బబ్బా… ఏంటమ్మా? ఏం కొంపలంటుకుపోతున్నాయని ఒకటే పిలుస్తున్నావు? కొట్లో మనం లేకపోతే డబ్బులు పోతాయి. సరుకుకూడా చాటుగా లోపల వేసుకుంటారు.

    ఆ.. ఏమిటో తొందరగా చెప్పు. ఏదో చెప్పాలనుకున్నావు కదా" విసుక్కుంటూ అడిగాడు.

    "అంతకోపం అయితే ఎలాగరా? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా! మీ అక్కాలను బావలను ఈ దసరా పండుగకు పిలుద్దాము. చాలా ఏళ్ళైంది వాళ్ళు పండుగకు మనింటికి వచ్చి. నీ భార్యను అడుగుదామంటే ఏమంటుందోనని ముందుగా నీ చెవిలో వేస్తున్నాను” అంది.

    "అమ్మా … నేనింకేంటో అనుకున్నాను. ఈ విషయం మనం తీరికగా మాట్లాడుకోవచ్చు. అవతల నాకు చాలా పని ఉంది. తరువాత ఆలోచిద్దాము" అంటూ గబగబా వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి.

    ఉసూరమనిపించింది కాంతమ్మకు. ఈయన సంపాదన ఉన్నప్పుడు నా పెత్తనం నడిచినన్ని రోజులు పండుగలకు పబ్బాలకు ఆడపిల్లలను పిలిచేదాన్ని. ఇప్పుడేమో ఎవరి హడావుడి వాళ్ళకే సరిపోతుంది. కనీసం ఐదేళ్ళకోసారన్నా ఆడపిల్లలను దసరా దీపావళికి పిలుచుకోవాలి. ఏమిటో కోడలితో ఎన్ని సార్లు చెప్పినా ఈచెవితో వింటుంది ఆచెవితో వదిలేస్తుంది. పోని మేమన్నా వెళదామంటే ఈయనకు ఒంట్లో బాగుండదు. మేమున్నన్ని రోజులు మాకోసం రండి అంటే వాళ్ళు పిలవకుండా ఎలా వస్తాము అంటారు. ఈ కాలం మనుషులు అర్థంకారు అనుకుంది తనలో తానే బాధపడుతూ. రాత్రి భోజనాల దగ్గర, ఉదయం తల్లి అన్నమాటలను గుర్తుపెట్టుకోని భార్యతో అడిగాడు కృష్ణమూర్తి.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/oIyJtHRO5yg

    23 min
  • నాట‌కం | Natakam | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాట‌కం

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆ రోజు సాయంకాలం  నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న  స‌మ‌యంలో రాఘ‌వ వచ్చి. "నీతో  మాట్లాడాలి" అని చెప్పాడు.

    రాఘ‌వ ఆఫీసులో నా కొలీగ్‌; నాట‌కాలంటే బాగా పిచ్చి. ఎప్ప‌డూ శ‌ల‌వులు పెట్టి ప‌రిష‌త్ నాటక పోటీలనీ, నంది నాట‌కాల‌నీ తిరుగుతుంటాడు. అందుకే అత‌నికి ఆఫీసులో మంచి పేరు లేదు. అత‌నికి ఎన్నో సార్లు బ‌దిలీ జ‌రిగినా ఏ మంత్రినో, ఎమ్మెల్యేనో ప‌ట్టుకొని వాటిని ఆపించుకుంటూ ఉంటాడు.

    “ఏమిటి సంగ‌తి రాఘ‌వా? మ‌ళ్ళీ ఏదైనా నాట‌క పోటీలున్నాయా?” అని వాడిని న‌వ్వుతూ అడిగాను..

    "నీకు నాట‌కాలంటే బాగా చిన్న చూపు గురూ! ఒక్క‌సారి నాట‌కంలో వేషం వేస్తే దానిలో సాద‌క బాద‌కాలు నీకు  తెలుస్తాయి. నాట‌కాలాడి మేమేదో బోలెడు సంపాదిస్తునాం అని మీరంతా అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వ‌ల్ల నేను ఒక్క పైసా సంపాదించ‌లేదు. అంతా చేతి చ‌మురు భాగోతం; నా చేతి డ‌బ్బులు ఇప్ప‌టిదాకా ఐదు లక్షలు  ఖ‌ర్చై పోయాయి. అయినా క‌ళా సేవ కోసం ఆ పాటి త్యాగం చెయ్య‌క త‌ప్ప‌దు” అన్నాడు తానే నాట‌క‌రంగాన్ని ఉద్ద‌రిస్తున్నట్లు ఫోజు పెడుతూ.

    “అది స‌రే. ఇంటికెళ్ళిపోతున్న స‌మ‌యంలో వ‌చ్చావేంటి? ఏం అంత అర్జెంటా?" అని అడిగాను..

    “చెప్పాలంటే అర్జంటే!... ప‌దిహేను రోజుల్లో నంది నాట‌కోత్స‌వాలు జ‌రగబోతున్నాయి. మేం ప్ర‌తీ సంవ‌త్స‌రం ఆడే  నాట‌కాల‌న్నింటికీ బహుమతులు వచ్చేసాయి . ఎంత కాలం ఆ పాత చింత‌కాయ ప‌చ్చ‌ళ్ళు ప‌ట్టుకొని వేళాడ‌తాం చెప్పు. అందుక‌ని ఈ సంవ‌త్స‌రం ఓ కొత్త నాట‌కం వెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాము. నువ్వు ఎలాగూ క‌థ‌లు, న‌వ‌ల‌లు వ్రాస్తుంటావు కాబ‌ట్టి మా కోసం ఒక మంచి నాట‌కం వ్రాస్తే ఈ సంవ‌త్స‌రం దాన్నే ఆడి ఫ‌స్ట్ ప్రైజ్ కొడ‌తాము” అన్నాడు రాఘ‌వ‌.

    “నేనెప్ప‌డూ నాట‌కాలు వ్రాయ‌లేదు రా... అన్నీ క‌థ‌లూ, న‌వ‌ల‌లే.. అంత‌గా వెయ్యాలంటే ఏదో న‌చ్చిన న‌వ‌ల‌ని నాట‌కంగా మార్చుకుంటే స‌రి” అన్నాను వాడితో.

    “బాబూ! ఆ ప‌నేదో నువ్వే చేసి పెట్టి మాకు ఒక మంచి నాట‌కాన్ని త‌యారు చెయ్యి... నీ పేరు చెప్పుకొని బ‌హుమ‌తులందుకుంటాము." అన్నాడు మ‌ళ్ళీ న‌వ్వుతూ..

    “అవునులే క‌ష్టం ర‌చ‌యిత‌ది, డ‌బ్బు, బ‌హుమ‌తులు మీవి! క‌వుల్ని, ర‌చ‌యిత‌ల్ని ఎప్పుడీ స‌మాజం గుర్తించింది క‌నుక‌? అప్పటి  శ్రీ‌నాథుడు నుంచి మొన్న‌టి మ‌హాక‌వి శ్రీ‌శ్రీ దాకా.... కవులందరికీ  పేరొచ్చింది కానీ ధ‌న‌ల‌క్ష్మి వాళ్ళ‌ని క‌నిక‌రించ‌లేదు. ఈ విష‌యంలో మాకూ, ల‌క్ష్మిదేవికి చుక్కెదురు "అన్నాను కుర్చీలోంచి లేస్తూ...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/2ObkXiSDPbM

    22 min
  • కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 10 | Kasthuri Ranga Ranga Episode 10 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కస్తూరి రంగ రంగా!! 10

    'Kasthuri Ranga Ranga Episode 10' Telugu Web Series

    Written By Ch. C. S. Sarma 

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ  

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    గోపాలయ్యగారి సోదరి దుర్గాదేవికి తన పెద్ద కొడుకు భూషణ్ కుమార్ కి కస్తూరితో వివాహం జరిపించాలని కోరిక.

    అందుకు గోపాలయ్య అంగీకరించక పోవడంతో కక్ష పెంచుకుంటుంది.

    రంగా, కస్తూరిలు కలిసి ఉన్న ఫోటోలు గోపాలయ్యకు పంపుతాడు భూషణ్.

    గోపాలయ్య మాట మీద రంగా వూరు విడిచి వెళ్తాడు.

    ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 10 చదవండి

    "భోజనానంతరం.. ఇరువురూ ఆ వూరి పోలీస్టేషన్ కు వెళ్లారు. కారును ఆపి ఇరువురూ దిగారు. స్టేషన్ ఇన్ఛార్జి ఇనస్పెక్టర్ కొత్తగా వచ్చిన దానయ్య పరుగున వచ్చి యస్. పి. , కస్తూరి రంగకు, డి. యన్. పి. వసంతదేశాయ్ కు సెల్యూట్ చేశాడు.

    ముందు ఇనస్పెక్టర్ దానయ్య, వెనుక రంగా, వసంత్ లు ఆఫీసులో ప్రవేశించారు. డ్యూటీలో వున్న పోలీసు కానిస్టేబుల్స్ సవినయంగా సెల్యూట్స్ చేశారు.

    కస్తూరి రంగ.. వసంత్ దేశాయ్ కూర్చున్నారు.. ఎదురుగా దానయ్య నిలబడి ఉన్నారు.

    “మీ పేరు?.. ” అడిగాడు కస్తూరిరంగ.

    “దానయ్య సార్!.. ” ఇన స్పెక్టర్ జవాబు.

    "మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కదూ!.. ".

    "అవును సార్!.. రెండు వారాలయింది.. ”

    "కూర్చోండి.. ఇక్కడ ఎంతమంది స్టాఫ్ వున్నారు?"

    దానయ్య కూర్చున్నాడు.

    "సార్.. కానిస్టేబుల్స్ ముగ్గురు.. జూనియర్సు ఏడుగురు..

    మొత్తం పదిమంది సార్.. "

    "మీలో ఈ వూర్లో అందిరిలో ఎవరికి సీనియారిటీ?.. "

    "హెడ్ కానిస్టేబుల్ సీతారామ్ కి సార్!.. "

    "అతన్ని పిలవండి.. "

    ఇనస్పెక్టర్ దానయ్య సీతారామ్ ను పిలిచాడు.

    సీతారామ్.. కస్తూరిరంగ ముందుకు వచ్చి నిలబడి సెల్యూట్ చేశాడు.

    "మీ పేరు?.. "

    "సి. సీతారాం సార్!... "

    "సి.. అంటే?.. "

    “చింతలూరి.. ”

    "అది మీ ఇంటి పేరు కదూ!.. "

    “అవును సార్!.. ”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/AAzbUWlWx2I




    18 min
  • కోతి కొమ్మచ్చి | Kothi Kopmmachhi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కోతి కొమ్మచ్చి

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “ఒరేయ్ ధన్వి! కొద్దిగా యిటు రారా” అని పిలిచాడు మనవడిని, రంగనాధం.

    “నేను చదుకుంటున్నా తాతయ్యా” అని జవాబు.

    “యిదిగో. . ఒకసారి యిటు వస్తావా, కాళ్ళు పీకేస్తున్నాయి. కొద్దిగా నొక్కి వెళ్ళు” అని భార్య ని పిలిచాడు.

    “వుండండి, బట్టలు ఆరేస్తున్నాను” అని జవాబు.

    “ఒరేయ్ అబ్బాయి! ఒకసారి వచ్చి వెళ్ళరా” అని కొడుకుని పిలిచాడు.

    “ఆఫీస్ కాల్ లో వున్నాను నాన్నా” అని జవాబు.

    “ఛీ. . పాడు జీవితం! దురదృష్టం వెంటాడి నడుం విరగడం తో డాక్టర్ గారి సలహాతో మంచానికి అతుక్కుపోయాను. నడక లేకపోవడం తో కాళ్ళలో రక్తప్రసరణ తగ్గి, కాళ్ళు ఒకటే నొప్పి.

    మనవడు పైక్లాస్ కి రావడంతో, ఎప్పుడూ చదువుతోనే వుంటాడు.

    ఎక్కువ జీతం అని పేరేగాని, అన్నం తినటానికి కూడా టైం వుండదు కొడుకుకి.

    కోడలు కి సహాయంగా తను వంటగది వదిలి రాదు. అందులో ఆదివారం అవడంతో టిఫిన్ రెడీ చేస్తున్నట్టు వున్నారు.

    రిటైర్ అయ్యేటప్పుడు, తోటివాళ్ళు అందరూ "మీకేమి సార్, పిల్లలు చేతికి అంది వచ్చారు. హాయిగా విశ్రాంతి తీసుకోండి " అని. .

    ‘పిల్లలు చేతికి అందిరావడం కాదు, వాళ్ళ పనులతో చేతికి అందకుండా వున్నారు’ అనుకున్నాడు రంగనాధం.

    70 వచ్చిన తరువాత జీవించాలని అనుకోవడం బుద్ది తక్కువ. ఓపిక వుండదు, నడిచివెళ్లి కావలిసినవి తెచ్చుకోలేడు. ఈ బిజీ కాలంలో ఎవరి పనులు వాళ్ళకి. యిహ ముసలితనం తో ఒంటరిగా గడపటం ఎంత కష్టమో అనుభవిస్తే కాని తెలియదు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/KEmRgEmp0Fc

    5 min
  • నాకేమవుతోంది ఎపిసోడ్ 6 | Nakemavuthondi Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకేమవుతోంది…? ఎపిసోడ్ 6

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ 

    గత ఎపిసోడ్ లో...

    కూతురు ఫోన్ తియ్యక పోవడం గురించి ఆందోళన  పడుతుంది ప్రియా తల్లి ప్రమీల.

    కూతురు పంపిన మొదటి మెయిల్ లోని విషయం చెబుతాడు ప్రభాకర రావు.

    ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదని కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది ప్రమీల.

    దార్లో డిటెక్టివ్ పురందర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి ప్రియా ఫోన్ నంబర్ గనుక మారిఉంటే తనకు ఇవ్వమని ప్రమీలను అడుగుతుంది.

    ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఆరవ భాగం చదవండి…

    భార్య చెప్పింది విన్న ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలైంది. ఫోన్ భార్య చేతి నుండి అందుకుని, "చూడమ్మా! మా అమ్మాయి కూడా మూడు రోజుల నుండి  ఫోన్ తీయడం లేదు. అయితే రెండు మార్లు మెయిల్ చేసింది. పొద్దున ఫోన్ చేయమని మెసేజ్ పెడితే సిగ్నల్స్ సరిగ్గా లేవని, రాత్రికి ఇంటికి వచ్చాక కాల్ చేస్తానని రిప్లై మెసేజ్ ఇచ్చింది" ఆందోళనగా చెప్పాడు.

    "మీరు బజారులో ఉన్నట్లు ఉన్నారు. వాయిస్ సరిగా వినపడ్డం లేదు. పక్కనే ఏదైనా  ఖాళీగా ఉన్న రెస్టారెంట్ ఉంటే అందులోకి వెళ్ళి కాల్ చేయండి" అంది ప్రవల్లిక.

    కాస్త దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు ప్రభాకర్ రావు. తరువాత ప్రవల్లిక కి  ఫోన్ చేసి "మా అమ్మాయి మొదట పెట్టిన మెయిల్ లో ఇది షెడ్యూల్ చెయ్యబడ్డ మెయిల్ అని, తను క్షేమంగా ఉంటే దీన్ని మరో తేదీకి మారుస్తానని రాసింది. ఆ మెయిల్ కనుక నాకు చేరితే  తనకేదో ఇబ్బంది కలిగినట్లేనని  కూడా రాసింది. కానీ తరువాతి మెయిల్లో భర్తతో చిన్నపాటి తగాదా అయిందని, ఆ ఆవేశంలో అలా మెయిల్ పెట్టానని, దాన్ని డిలీట్ చేయమని రాసింది. భర్తతో కలిసి  రిసార్ట్ కి వెళ్తున్నానని, అక్కడ సిగ్నల్స్  సరిగ్గా ఉండవని, కాల్ చేయవద్దని కూడా ఆ మెయిల్లో రాసింది" చెప్పాడు ప్రభాకరరావు.

    “మీరు డిలీట్ చేసిన మెయిల్ ట్రాష్ ఫోల్డర్ లో  ఉంటుంది. దాన్ని రిస్టోర్  చేసి  ఆ రెండు మెయిల్స్  నాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కూడా పంపండి" అంటూ తన మెయిల్ ఐడి చెప్పింది ప్రవల్లిక.

    భర్త చేతి నుండి ఫోన్ తీసుకున్న ప్రమీల "నేను ఇప్పుడే  హైదరాబాద్ కి బయలుదేరుతున్నాను. ఈ లోపల నువ్వు కాస్త శ్రద్ధ తీసుకొని, మా అమ్మాయి ఎక్కడ ఉందో వాకబు  చేయి. నీకు పుణ్యం ఉంటుంది" అంటూ అభ్యర్థించింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Llr6ckPsaak

    14 min
  • లహరి | Lahari | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లహరి

    రచన: సుజాత తిమ్మన

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఇండియా టైటిల్ కైవసం చేసుకుని ధగధగ మెరిసే కిరీటం శిరసున ధరించింది లహరి. ఆమె రెండు కళ్ళల్లో- ఒక కంట ఆశ్చర్యం తో కూడిన ఆనందం అయితే, మరో కంట తన విజయం వెనుక నాన్న పడిన శ్రమా, పంచిన ప్రేమామృతం.. ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను అనే కృతజ్ఞతా భావంతో కూడిన అశృ ధారలు చెంపలను తడిపేస్తూ ఉంటే... కిరీటంలోని రవ్వల మెరుపులు చిన్నబోతున్నాయి... చెక్కిళ్ళపై నిలిచిన నీటి బిందువులపై వున్న ఇంద్రధనుసు రంగులతో పోటీ పడలేక.

    చేతిలో కాఫీ కప్పుతో ఆ రోజు పేపర్లోని మొదటి పేజిలో వచ్చిన తన ఫోటోలను చూసుకుంటూ… నిన్నటి సంఘటన లోనుంచి గతంలోనికి జారిపోయింది లహరి.

    అక్క తరువాత ‘ఆడపిల్ల‘ గా పుట్టిన నేనంటే అమ్మకి ఎందుకో అసలు ఇష్టం ఉండేది కాదు... కడుపులో ఉన్నప్పుడు నన్ను పూర్తిగా అబ్బాయిగానే ఊహించుకుందట( నలుగురు ఆడపిల్లల మద్యలో నాలుగోది ఆమ్మ కావడంతో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయింది. అయినా తనకు తానే స్పూర్తి అయి టైలరింగ్ నేర్చుకొని తన అవసరాలు తను తీర్చుకోనేదట. తరువాత తెలిసిన నిజం ) అందుకే నేను తొలి శ్వాస తీసినపుడే అమ్మాయి అని తెలియగానే ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపిందట.

    మొట్ట మొదటి సారిగా పురిటి కందుగా నాన్న ఒడి చేరానేమో…’నాన్న’ ను తలచుకుంటే చాలు ఆత్మార్పణ భావం మెదులుతుంది. అయన అనురాగాల ఆలింగనాలలోనే అన్ని మరచి పెరిగాను కదూ!

    అమ్మ అసలు నాకు కొత్త బట్టలు కూడా కొనేది కాదు. అన్నీ అక్కవే వేసేది. చివరికి స్కూలు పుస్తకాలూ, డ్రస్, షూస్, కూడా అక్కవే.

    చిన్న కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తున్న నాన్న ఎప్పుడూ నన్ను సమాధాన పరుస్తూ ఉండేవారు. ఎప్పుడయినా తన బడ్జెట్ లోనుంచి నాకొక్కదానికే తను ఇష్టంగా బట్టలు తెచ్చేవారు. ఇంటి పరిస్థితులు అకళింపు చేసుకుంటూ అక్క గారాభాన్ని సహిస్తూ, నాన్న చెప్పే తన అనుభవాల కథలను, ఝాన్సిలక్ష్మి భాయి, రుద్రమదేవిల వీరత్వాన్నే కాదు... మొల్ల… వెంగమాంబ రచనల గురించి… సరోజిని దేవి… దుర్గాభాయి దేశ్ ముఖ్ యొక్క పోరాట పటిమను సమయం చిక్కి నప్పుడల్లా చెపుతూ నాలో తరగని ఆత్మస్థైర్యాన్ని నింపారు. నేనూ ఏదో సాధించాలనే తపనని నాకందిస్తూ, ’ఆడపిల్ల’ని అని ఎప్పుడూ వెరవకుండా సాగాలనే ధైర్యాన్ని పెంచారు.

    బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరాలనే ద్యేయంతో ప్రతి క్లాసులోనూ నేనే ప్రథమ స్థానంలో ఉండేదాన్ని. అది చూసి అక్క ఎప్పుడూ ఉడుక్కునేది. అమ్మ నా వైపు అభినందనగా చూసేది కానీ ఎప్పుడూ ప్రశంసించేదికాదు..

    ఒక్కోసారి ‘నేను తనకి పుట్టలేదేమో?’ అనే సందేహం వస్తూ ఉండేది… అయినా అది కొద్ది సేపే…అమ్మ... అమ్మేగా... మరి.

    నిండుగా… గుంబనంగా ఉంటూ కెరటాలతో ఎగసి ఎగసి పడే సముద్రం కూడా ఒక్కో సారి సునామీలను ఎదుర్కోక తప్పటం లేదు. జీవితం కూడా అంతేనేమో!

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/T9v5H2009i8

    14 min
  • దేవుడు వెళ్లిపోయాడు | Devudu Vellipoyadu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    దేవుడు వెళ్లిపోయాడు

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    మానవ  రుణానుబంధాలు  చిత్రవిచిత్రాలు . వాటికి  చదువు సంస్కారంతో  పనిలేదు.... మంచి మానవత్వం వున్న మనస్సు వుంటే చాలు...మనిషి దేవుడై పోతాడు.

    స్టేషన్లో  రైలు బండి వచ్చి ఆగింది.  ఆ స్టేషన్లో దిగ వలసినవారు  గమ్యాన్ని  చేరామనే  ఆనందంతో భోగీల నుంచి కిందకు  దిగుతున్నారు.ఆ బండి ఎక్కి   ముందుకు ప్రయాణం  చేయ వలసిన వారు  హడావుడిగా  తమ సామాగ్రితో  కంపార్టుమెంట్స్ లో  ఎక్కుతున్నారు వారి వారి  టికెట్ తరగతి ననుసరించి.

    నారిగాడు లచ్చి దంపతులు. రెండు గోనె సంచులను  చేతపట్టుకొని  ఎంతో రద్దీగావున్న  మూడవ తరగతి  జనరల్ కంపార్టుమెంట్లో అతి కష్టం మీద  ఎక్కారు.  వున్న సీట్లలో ,  మధ్యన  నడిచే దారిలో  జనం నిలబడి వున్నారు. కంపార్టుమెంట్  ముందువున్న  ఎక్కే ద్వారం  ప్రాంతానవున్న  ఖాళీ స్థలంలో  లోనికి పోలేక  తమ సంచుల్నీ  భోగీ చెక్కకు ఆనించి  ఇరువురూ ఆ  చెక్కకే  ఆనుకొన్నారు.

    బండి కూతవేసి  ముందుకు బయలుదేరింది. అరగంటలో ... ప్రక్క స్టేషన్లో ఆగింది.  మధ్యన నిలబడి వున్న వారు  కొంతమంది దిగిన కారణంగా... లోన వున్నందున  నారిగాడు... లచ్చి  మధ్య దారిలోకి  రాగలిగారు.

    వారివురి వదనాలు... ఎంతో దీనంగా  కళావిహీనంగా వున్నాయి.  తలకు  తైల సంస్కారం లేదు.  కళ్ళల్లో కాంతి లేదు.  వారి హృదయాల నిండా  వున్నది ఆవేదన.

    పడమట సూర్యుడు  అస్తమించాడు. కంపార్టుమెంట్లో దీపాలు వెలిగాయి. చీకటిని చీల్చుకొంటూ  రైలు బండి ముందుకు పోతూవుంది.

    బండి మరో స్టేషన్లో ఆగింది.  చాలామంది దిగారు. నారిగాడికి లచ్చికి  సీట్లు దొరికాయి.  బెంచీక్రింద  తమ లగేజీని వుంచి  కిటికీ వైపున లచ్చి ... ఆమె ప్రక్కన నారిగాడు  కూర్చున్నారు. బండి కదిలింది.

    “మామా!.. బాధపడుతుండావా?...” నారిగాడి ముఖంలోకి చూస్తూ దీనంగా అడిగింది లచ్చి.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.




    17 min
  • కూడలి | Kudali | Telugu Short Story | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కూడలి

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    తండ్రి  చనిపోతూ ఇచ్చిన  కొబ్బరిబోండాల వ్యాపారాన్ని తండ్రి బాటలోనే సైకిల్ మీద కొనసాగిస్తున్నాడు కిష్టప్ప.

    ఊరంతా తిరిగి అమ్మడంతో వచ్చే సంపాదన పెరుగుతున్న కుటుంబ అవసరాలకు సరిపోకపోయినా ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టకుండా చేస్తున్నాడు.

    జూన్ మాసం. ఆ యేడు ఊరి కూడలిలో  రెండు కొత్త కాలేజీలు వెలిశాయి.

    "ఇగ్గో...ఏవయ్యో...ఏదోమూల నిలబడితే నీ బొండాలు ఎవడు కొంటాడయ్యో. కొత్త కాలేజీలు పెట్టిన కాడికి పోయి అమ్ము.  స్టూడెంట్ కుర్రాళ్ళు రోజూ వచ్చి తాగుతారు. గిరాకీ ఎక్కువ ఉంటుంది" అంది కిష్టప్ప పెళ్ళాం  సూరమ్మ.

    "అక్కడ అమ్మేటోళ్లు ఎవడూ లేకపోతే నేను అమ్ముదును. ముందే ఎవుడన్నా అమ్ముతుంటే మద్దెలో నేనెళ్తే  తిట్టుకోరూ. "

    "ఊరుకుముందుగానే నీకన్నీ సందేహాలే.ఎల్తేనేగా తెలిసేది. బేగి ఎల్లి అక్కడ పాగా ఎయ్యి పో. ఎవుడేవంటాడో నేనూ చూస్తా" అంది సూరమ్మ.

    పెళ్ళాం నోటికి, పసిరికపాము కాటుకు మందులేదురా అయ్యా అని తండ్రి ఏనాడో చెప్పాడు. వెళ్లకపోతే ఎన్ని తిట్లు కాయాలో. దానికంటే ఎల్లిపోవడమే మంచిది అనుకుంటూ సైకిల్ ని కాలేజీ కూడలి వైపుకి తిప్పాడు.

    కాలేజీలన్నీ మెయిన్ రోడ్డునుంచి లోపలికి  ఉన్నాయి. రోడ్డు మలుపులో సైకిల్ పెట్టుకుని నిలబడ్డాడు కిష్టప్ప.

    సపోటాల బండి తోసుకుంటూ వచ్చాడు ఓ  కుర్రాడు.

    మోకాళ్ల వరకూ వేసుకున్న చినుగుల లాగూ, బొత్తాలు ఊడిన మాసిన చొక్కా వేసుకున్నాడు.

    సపోటాలు పాలసపోటాలోయ్ అంటూ అక్కడికి వచ్చాడు.

    తన బండిని రోడ్డు పక్కగా పెట్టి పళ్ళను ఆకర్షణీయంగా సర్దుతున్నాడు.

    గోలీసోడా అమ్మే తాత అక్కడకు ముందే వచ్చినట్టున్నాడు. వాళ్ళవంక చూస్తూ నిమ్మకాయల్ని సర్దిపెట్టుకున్నాడు.

    ఒకళ్ళనొకళ్ళు తినేసేలా చూసుకున్నారు.

    కాలేజీ సందులోంచి కుర్రాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు  దుకాణాల్ని పట్టించుకోవట్లేదు.

    కిష్టప్ప సైకిల్ గురించి ఎవరూ అభ్యంతరం పెట్టకపోయేసరికి హమ్మయ్య అని కుదురుకున్నాడు.

    పొద్దస్తమానం ఎదురుచూసినా ఎవరూ ఆ పక్కకి రాలేదు.

    ఆరోజు ఎండ గట్టిగానే కాసింది. చెట్టుకింద సైకిల్ ఆపుకుని కూర్చున్నాడు కిష్టప్ప.

    ఆ పక్కనే ముంజలు అమ్మే ముసలవ్వ గోని సంచీ పరిచి ముంజల్ని పెట్టుకుని ఈగల్ని తోలుకుంటోంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/uqZjLo8LSyk

    12 min
  • వాళ్ల నిర్ణయం అమోఘం అద్భుతం | Valla Nirnayam Amogham Adbhutham | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వాళ్ల నిర్ణయం అమోఘం.. అద్భుతం

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    హరహరమహాదేవయ్యకి 90 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి.. భార్య అన్నపూర్ణమ్మ కు 80 ఏళ్లు..

    కొడుకు శ్రీవిష్ణు, కోడలు శ్రీవల్లి.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు.. వర్క్ ఫ్రమ్ హోమ్.

    ఇంకా.. సంవత్సరం వయసు నిండి.. అప్పుడే పడి పడి లేస్తూ బుడిబుడి నడకలు వేస్తున్న మనవడు 'చందు'.

    వృద్ధ దంపతులు ఇద్దరూ తన అవసాన కాలం ఆనందంగా గడపడానికి.. తన కొడుకు కోడలు ఇంట్లో అనుకూల వాతావరణం తమకు లేదని భావిస్తూ నెల రోజుల నుంచి తర్జన భర్జనలు పడుతూ.. తట్టుకోలేని పరిస్థితిలో ఒక నిర్ణ యానికి వచ్చేశారు.

    వాళ్ళిద్దరూ తమ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పార్కులో మూలగా ఉన్న సిమెంట్ బల్లమీద కూర్చు న్నారు.. ఇద్దరి చేతులలోనూ వైట్ పేపర్, బాల్ పెన్ ఉన్నాయి.

    "అన్నపూర్ణ! మనం పడ్డ క్షోభను గురించి నీ మనసు లో ఏమనుకుంటున్నావు? ఆ భావం పూర్తిగా వాళ్ళు ఇద్దరకు అర్థమయ్యేలా ఈ పేపర్ మీద రాయి.. నేను కూడా నా దగ్గరున్న పేపర్ మీద రాస్తాను" అంటూ భార్యకు చెప్పాడు.. హరిహరమహాదేవయ్య.

    అంతే.. ఇద్దరూ తమ స్మృతిపథం లోని విష యాలను గుర్తుచేసుకుంటూ తాము అనుభ వించిన బాధను అక్షరాల రూపంలో పెట్టటం ఆరంభించారు.

    "ఒరేయ్ శ్రీ విష్ణు.. భోగి పండుగ నాడు ఆవుపేడతో పిడకలు చేసి దండ కట్టి నా మనవడు చేత భోగి మంట లో వేయిద్దాం అనుకున్నాను. మీరిద్దరూ.. 'కుదరదు'.. అన్నారు. ఆ భోగి పిడక విభూది నుదుటన బొట్టు పెట్టుకుంటే.. వచ్చే భోగి వరకు ఆయురారోగ్యాలతో ఉంటారురా.. అని నెత్తీ నోరు మొత్తు కు చెప్పినా.. కాదన్నారు.. ‘ఇప్పుడు భోగిమంటలు భోగి పిడక లు ఎక్కడ ఉంటాయి???.. ఆ చాదస్తాలు అన్నీ ఇప్పుడు కుదరదు..’ అంటూ చాలా చిరాకు పడ్డారు.

    ‘ఆ విభూదికి ముఖం మచ్చ పడిపోతుంది బాబోయ్!!’ అన్నారు మీరిద్దరూ. ఎలర్జీలు.. దానికడుపుమండ.. ఇంకేదో ఇంకేదో వచ్చేస్తుంది అన్నారు ఇంగ్లీషులో.

    సరే మీరిద్దరూ ఏమీ తెలియని చిన్నపిల్లలు అనుకోవడానికి.. అలా కాదు కదా.. నీకేమో గడ్డం బోల్డంత పెరిగింది. నీ పెళ్ళానికేమో ఆ మాయదారి ఉంగరాల జుట్టు కి పాలిష్ పెట్టడానికే టైం సరిపోవడం లేదు. ఎంత మహా నగరంలో ఉంటే మాత్రం.. సాంప్రదాయాలు మొత్తం మూటగట్టి పక్కన పెట్టేసి బ్రతకాలంటే మా వల్ల కాదు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/pLBi5r8JFq4

    20 min
  • ప్రాయ‌శ్చిత్తం | Prayaschittham | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రాయ‌శ్చిత్తం

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆ రోజు బి. ఏ ఫ‌లితాలు వ‌చ్చేరోజు... శార్వ‌రికి ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర్నుంచీ టెన్షన్ గా ఉంది.. 3 సంవ‌త్స‌రాల క‌ష్టం యొక్క ఫ‌లితం తేలేరోజు.. చ‌దువుకుంటున్న‌ప్పుడు ఎక‌నామిక్స్ లెక్చ‌ర‌ర్ గారు ‘మూడు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ‌తారు. మూడు గంట‌ల్లో ప‌రీక్ష వ్రాస్తారు. కానీ  మూడు నిమిషాల్లో ఫ‌లితం తెలిసిపోతుంది’ అన్న మాట‌లు ఆ స‌మ‌యంలో గుర్తుకు వ‌చ్చి నవ్వుకుంది...

    నిజ‌మే.. ఇప్పుడు మూడు నిముషాల స‌మ‌యం వ‌చ్చేసింది. నిన్న‌టిదాకా ఆమెకు త‌న ఫ‌లితం మీద బాగా న‌మ్మ‌కం ఉండేది. కానీ ఈ రోజు ఎందుకో ఫ‌లితాలొస్తాయి అన‌గానే భ‌యం క‌లుగుతోంది; ముఖ్యంగా ఈ టెన్ష‌న్‌కి కార‌ణం లెక్చర‌ర్స్‌, స్నేహితులు ఆమె మీద పెట్టుకున్న న‌మ్మ‌కం.. వాళ్ళంతా శార్వ‌రికి యూనివ‌ర్శిటీ ఫ‌స్ట్ వస్తుంద‌నీ గొప్ప న‌మ్మ‌కం పెట్టుకున్నారు.... శార్వ‌రి భ‌య‌ప‌డుతున్నదందుకే..

    ఒక వేళ వాళ్ళంతా భావిస్తున్న‌ట్లు యూనివ‌ర్శిటీ ఫ‌స్ట్ గానీ రాక‌పోతే వాళ్ళ‌ముందు త‌ను త‌లెత్తుకోగ‌ల‌దా?`` అని ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. అందుకే ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న ద‌గ్గ‌ర్నుంచీ ఏం జ‌రుగుతుందోన‌నీ భ‌య‌ప‌డుతోంది...

    ఆమె కాఫీ తాగి కాసేపు పేప‌రు తిర‌గ‌వేసింది. ఆ త‌రువాత ఫ్రెష్ అయి 9 గంట‌ల‌కు యూనివ‌ర్శిటికి బ‌య‌లుదేరింది.

    ఆటోలో వెళుతుంటే ఆమెని ఆలోచ‌న‌లు చుట్టు ముట్ట‌సాగాయి. జీవితంలో ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించి త‌ను ఈ స్థితికి చేరుకుంది. తాను ఆరు చ‌దువుతున్న‌ప్పుడు తండ్రి శ్రీధర్ ఒక హ‌త్య కేసులో ఇరుక్కొని జైలు పాల‌వ‌డం, ఆ త‌రువాత త‌ల్లి సులోచ‌న బెంగ‌తో మంచం ప‌ట్టి చ‌నిపోవ‌డం, అప్పుడు  త‌న‌ని ఎవ‌రో అనాధాశ్ర‌మంలో చేర్పించ‌డం... అక్క‌డే ఉండి తాను ఇంట‌ర్‌లో రేంకుతో పేస‌వ‌డం, ఆ త‌రువాత స్కాల‌ర్‌షిప్పు మంజూర‌వ‌డంతో తాను హాస్ట‌ల్లో ఉండి డిగ్రీ  చ‌దువుకోవ‌డం అన్నీ గుర్తుకు రాసాగాయి... యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర ప‌డుతుంటే ఆమె భ‌విష్య‌త్తు గురించి ఆలోచించ‌సాగింది.

    ఆరునెల‌ల క్రితం పీజీ చ‌దువు కోసం లండన్  స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్‌కి ఎప్లె చేస్తే ప‌దిరోజుల కింద‌ట త‌న‌కు సీటు ఎలాట్ అయిన‌ట్లు ఆ యూనివ‌ర్శిటి నుంచి లెట‌ర్ వ‌చ్చింది. కాక‌పోతే సుమారు మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఫీజుగా క‌ట్టాలి.. మ‌రొక రెండు ల‌క్ష‌లు ఖర్చులు , పుస్త‌కాల‌కు అవ‌స‌రం అవుతాయి.

    ఇప్పుడామె ఆలోచ‌న‌ల‌న్నీఆ ఐదు ల‌క్ష‌ల చుట్టే తిరుగుతునాయి. ఒక‌వేళ ఆ డ‌బ్బు స‌మ‌కూర‌క‌పోతే లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్  లో చదువు కోవాలనే  తన కల  కల్ల అవుతుంది ; అప్పుడు ఇక్క‌డే పిజీ చెయ్యాలి; ఆమె ఆలోచ‌న‌లు ఐదులక్ష‌ల‌లు దాకానే వ‌చ్చి ఆగిపోతునాయి త‌ప్పా అవి ఎలా సంపాదించాల‌న్న విష‌యం వైపు వెళ్ళ‌టం లేదు...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/41KUKv2Lqc4


    14 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world