Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ది ట్రాప్ ఎపిసోడ్ 14 | The Trap Episode 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 14

    రచన : పాండ్రంకి సుబ్రమణి 

    (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    తన ఇంటికి బయలుదేరుతున్నట్లు చెబుతుంది వినోదిని.

    ఉండమంటుంది మంగళదేవమ్మ.

    ఆఫీసుకు బయలుదేరుతున్న పరమేశ్వర్ ని ఆపి తమతో గుడికి రమ్మంటారు.

    ఇక ది ట్రాప్. . పదునాల్గవ భాగం చదవండి…

    మరి కొద్ది సేపటికి ఇంటిల్లిపాదీ ఆలయ ప్రాంగణం చేరుకున్నారు. గుడిలోకి ప్రవేశించక ముందు అక్కడ నిటారుగా నిల్చున్న ఆవుకి మంగళాదేవమ్మ, కామాక్షమ్మ ఇద్దరూ అరటి పళ్ళు అందించారు. వినోదిని చేత కూడా అరటి పళ్ళు తినిపించారు. అప్పుడు యెడంగా నిల్చున్న చిన్న కొడుకుని పిలిచి అతడికి కూడా పళ్ళిచ్చి ఆవుకి తినిపించమన్నారు. అప్పుడా సమయాన యెవరూ యెదురు చూడని దృశ్యం చూసి వేదమూర్తి విస్తుపోయినట్టు నిల్చుండిపోయాడు.

    విశ్వం భార్య సువర్చలతో యెదురొచ్చి--“నేనెలా యిటువంటి సమయంలో ఇలా ఊడిపడ్డానని తెల్లబోతున్నావా! రాబోకు—దరి రాబోకన్నట్టు చూడకు. మంచి రోజు, అందరమూ గుడిలో కలుసుకుందామని మాటల సందర్బంలో కామాక్షి చెప్పిందిలే—మాతో బాటు వసంత కూడా వచ్చిందిలే—నువ్వొక సారి చూసి దీవించాలిగా--అందుకే తీసుకు వచ్చాను. ఆడ పిల్ల తండ్రిని. నువ్వు యెడంగా ఉన్నట్లు నేనుండ లేనుగా!”.

    ఆమాట విన్నవెంటనే వసంత వెళ్ళి వినాయకం వేదమూర్తుల కాళ్ళకు నమస్కరించింది. వేదమూర్తి నోట మాట పెగలడం లేదు. తెలిసి గుడికి వచ్చాడంటు న్నాడు. మరి—పరమేశ్వర్ కి, వినోదినికీ జత చేరబోతున్నారన్నది తెలిసే వచ్చాడా! అతడికంతా అగమ్య గోచరంగా ఉంది. ఏమని చెప్పాలో యెలా స్పందించాలో తెలియక భార్య కామాక్షమ్మ వేపు చూపులు సారించాడు..

    భర్త చూపుల్లోని అర్ధాన్ని గ్రహించిన కామాక్షి అక్కడ కొన్న పూజా దినుసులు అత్తగారికి అందించి వేగంగా అక్కడకు చేరుకుంది- “వచ్చేసావా వదినా! వసంత యేదీ---“ అని పరామర్షిస్తూ సువర్చలతో చేతులు కలిపింది. నాజూకుగా సన్నటి బంగారు తీగలా నిల్చున్న వసంత తట్టున తేరుకుని కామాక్షికి నమస్కరించింది.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/LkE78SobvA0

    18 min
  • శాపవిమోచన | Sapavimochana | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శాపవిమోచన

    రచన: కాలనోస్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    కుక్క కి ఉన్న విశ్వాసం మనుషులకెక్కడ అని అంటారు కొందరు మనుషులు.

    ఓ కుక్కగా చెబుతున్నా.. మా కుక్కలకి విశ్వాసం, అవిశ్వాసం అనే పదాలు అర్థమే కావు. మరి ఇది నాకెలా తెలుసని ఆలోచిస్తున్నారా? నేనో స్పెషల్ కుక్కని!

    ఒకప్పుడు నేను కూడా మీకు లాంటి ఓ మనిషినే. కానీ కుక్కలని రాళ్ళతో కొట్టానని శపించబడ్డాను. నేను కూడా ఓ కుక్కలా మారి నా తప్పు తెలుసుకుంటే నాకు శాపవిమోచనం కలుగుతుంది. నేను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నా కానీ ఇంకా నేను మనిషిలా మారలేదు. ‘నా తప్పులను నేను తెలుసుకున్నా..’ అని నేను ఆకాశం వైపు చూసి రోజుకో పది సార్లైనా చెప్తాను. కానీ లాభం లేదు! నాకీ కుక్క బతుకు అలవాటు కూడా అయిపోతోంది. మెల్లెగా ఇదే బాగుందని అనిపిస్తుందేమో అని భయంవేస్తూ ఉంటుంది అప్పుడప్పడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    5 min
  • తరగని నిధి | Tharagani Nidhi | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    తరగని నిధి

    రచన: వేలూరి ప్రమీలాశర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "ఈశాన్యం వైపు పొడిచింది. నాలుగు వందల ఎనభై గజాలు... అద్భుతమైన స్థలం. మీరు 'ఊ!' అనండి రామకృష్ణ గారూ. కింద బ్రహ్మాoడమైన షాపింగ్ కాంప్లెక్స్, పైన విశాలంగా రెండు ఫ్లోర్లు నివాసానికీ... చక్కని ప్లాన్ గీసి ఇస్తాను. నాలుగు రోజుల్లో ఈ పాత ఇంటిని పడగొట్టి, పునాదులు తీయించే పనిలో ఉంటాను" ఇంజనీరు చెబుతున్న మాటలు నాకెందుకో అంతగా రుచించలేదు. నిర్లిప్తంగా ఉండిపోయాను.

    "కిష్ణయ్య బాబూ! ఊర్లోకొచ్చారని తెలిసి, చేను ఊడ్పులు ఆపి ఇలాగొచ్చీసినాను. ఏం బాబూ... ఇల్లు పడగొట్టేత్తారంట కదా!? ఆళ్ళూ ఈళ్ళూ సెప్పుకుంటన్నారు. నిజవేంటో తెలుసుకుందారని పరిగెట్టుకొచ్చీసినాను" నేను వచ్చానని తెలిసి, చేలో పని వదిలేసి, సైకిల్ మీద వచ్చిన వెంకన్న, సైకిల్ వెనక క్యారేజీ స్టాండ్ కి తగిలించిన చిన్న సంచిలోంచి, థమ్స్ అప్ బాటిల్ మూత తీసి చేతికందిస్తూ అడిగాడు.

    సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. ఆ ఇల్లు పరబ్రహ్మం గారు వారసత్వంగా నాకు ఇచ్చినది. ఆ తరం మనుషులతోపాటే ఇల్లూ మూగబోయింది. శిథిలమైపోతున్న మట్టి ఇటుక గోడల్లో, నిక్షిప్తమైన ఎన్నో జ్ఞాపకాలు నా మనసులో గందరగోళంగా తిరుగుతున్నాయి.

    అరవై అయిదేళ్ల నాడు... రామేశ్వరం యాత్రలకు వెళ్లిన పరబ్రహ్మం, వెంకట శేషమ్మ దంపతులు,  అక్కడ వారికి ఆతిధ్యం ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారి మూడో సంతానమైన నన్ను దత్తత తీసుకున్నారు. తల్లిలేని బిడ్డల్ని పెంచడానికి సతమతమవుతున్న సుబ్రమణ్యం గారికి నచ్చచెప్పి, బిడ్డని వృద్ధిలోకి తెస్తామని హామీనిచ్చి, తమతోపాటు తెచ్చి, తమ ఇంటి బిడ్డగా ఎంతో గారాబంగా పెంచుకున్నారు. వేదపండితుడైన పరబ్రహ్మం గారి అస్థిపై దాయాదుల కన్ను ఉండేది. సంతానం లేని పరబ్రహ్మం గారు,  నన్ను తెచ్చి పెంచుకోవడం ఊర్లో చాలామందికి మింగుడుపడలేదు. కొందరు మొహం మీద చెప్పినా, కొందరు చాటుగా చెవులు కొరుక్కునేవారు. ఇవేమీ పరబ్రహ్మం గారు పట్టించుకోలేదు. నాకు అయిదేళ్ల వయసు రాగానే రెండు ఊళ్ల అవతల వున్న  కాన్వెంటు స్కూల్లో చేర్పించి, రోజూ జట్కా బండిలో స్కూలుకి పంపేవారు.

    తాళాలు తీసి ఇంట్లోకి అడుగుపెట్టిన నాతోపాటూ, వెంకన్న కూడా ఊర్లో విషయాలు చెబుతూ లోపలకి  వచ్చాడు. మండువా లోగిలిలో  ఓ పక్కగా నాపరాళ్ల గచ్చుపై ముద్రించి ఉన్న అష్టా చెమ్మా గడులు చూడగానే, అమ్మ తన తోటి ఇల్లాళ్ళతో కలిసి కూచుని, గవ్వలు విసురుతూ పందెం వెయ్యడం గుర్తొచ్చింది. భోజనం పూర్తిచేసి, నిద్ర రాకుండా ఉండేందుకు అమ్మ  ఇలా కాలక్షేపంగా ఆడేది. పెరట్లో అవిస చెట్టుమీదకి పాకించిన తమలపాకు తీగ నుంచి, లేత తమలపాకులు కోసి, కుండలో దాచివుంచిన గుల్లసున్నం ముద్దతీసి వేలితో ఆకులపై రాసి, వక్కా, కవిరి, పచ్చకర్పూరం, గులాబీ రేకల చూర్ణం, తేనె కలిపి అమ్మ చుట్టియిచ్చే తాంబూలం అంటే నాన్నకి చాలా ఇష్టం. నోట్లో ఆకుల రసం ఊరుతుంటే, బుగ్గలో తాంబూలం కొరికి పట్టి ఉంచి, విసనకఱ్ఱతో విసురుకుంటూ, పడక్కుర్చీలో కునుకు తీసేవారు నాన్న. అమ్మ చేతి గాజుల గలగలలూ, గవ్వల సడీ కలిసి లయబద్ధంగా ఉండదేమో హాయిగా నిద్రలోకి జారుకునేవారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/BSPkrB-3R1Y


    11 min
  • దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు | Dongagaru Pappudakalo Jari Paddaru | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు  (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    మౌర్య సామ్రాజ్యాన్ని సామ్రాట్ అశోకుడు పరిపాలించిన 37 సంవత్సరాలలో రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం చాలా కొత్త కొత్త మార్పులు జరిగాయి.

    ప్రజల ధనసంపాదన కోసం ఆర్థిక సంస్కరణల ఏర్పాట్లు జరిగాయి, ప్రజారోగ్య అభివృద్ధి దృష్ట్యా విభిన్న మందిరాల స్థాపనలు జరిగాయి.

    ఇంకా కుటుంబంసమస్యల పరిష్కారం కోసం, అలాగే ఆస్తి తగాదాల నిర్మూలన కోసం ప్రత్యే కమైన "వీధితీర్పు మందిరాలు" లాంటివి కూడా వెలిసాయి.

    దానితోపాటు ప్రజల జీవన విధానాలు.. పూర్తిగా మారాయి.

    కానీ రాజు గారికి రాజ్యంలో ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించింది. ప్రజలు నూటికి నూరు మంది క్షేమంగా ఉండాలన్నది ఆయన అభిమతం, ఆలోచన... ! ప్రజలందరూ తనను స్నేహితుడుగా, హితుడిగా భావించాలని.. ఆయన మనసులో నిర్ణయించుకున్నారు.

    'కానీ.. ఒక వర్గం తనకు భయపడుతున్నారని, తనను శత్రువుగా చూస్తూ జీవితం వెళ్లబుచ్చు తున్నారు... '

    అని అశోకుడు వేగుల ద్వారా తెలుసుకున్నాడు.... ఆ వర్గమే దొంగలు.. గజదొంగలు..

    వాళ్లు కూడా మనుషులే.. పుట్టుకతో ఏ ఒక్కరూ దొంగ గా మారాలని అనుకోరు.. మారరు. అస్త వ్యస్తమైన వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవన విధానాన్ని మార్చిపాడేస్తుంది. దాంతో వాళ్ళు సులభ తరమైన జీవనవిధానాన్ని నేర్చుకుంటారు.... అదే "దొంగతనం".... అది తప్పుడు మార్గం అయినా దానికి అలవాటు పడిపోయి... అలా అలా జీవనం సాగించేస్తుంటారు.. అందులో కొందరు కరడు

    గట్టిన గజదొంగలు గా కూడా మారతారు. ఇంకొందరు హంతకులుగా... తయారవుతారు.

    అలాంటి దొంగలను, గజదొంగలను కూడా మామూలు మనుషులుగా... మార్చాలని అశోక సామ్రాట్ రాజుగారు నిర్ణయించుకున్నారు..

    ఆ విషయాన్ని.. పెద్ద పెద్ద శిలా ఫలకాల మీద ఈ విధంగా రాయించారు.

    "ఇందుమూలముగా.. ప్రజలందరికీ... తెలియ జేయునది..... రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం అన్ని రకాల దొంగలను.. వారు చేసిన తప్పులను క్షమించి.. సాధారణ ప్రజాజీవనంలో వారిని మమేకం చేయాలని.. అశోక సామ్రాట్ మహారాజుగారు.. పెద్దమనసుతో నిర్ణయించుకున్నారు.

    ఈ సదవకాశాన్ని... అలాంటి దొంగలు ఉపయోగించుకొని.. తమ జీవనాన్ని మార్చుకొని తమ భార్య బిడ్డలతో ఇదే రాజ్యంలో కష్టపడి పని చేసుకుంటూ బ్రతకవలసినదిగా.. ఇది ఒక సువర్ణావకాశంగా.. భావించవలసినదిగా..... కోరడమైనది.

    ఇందుకోసం చిల్లరమల్లర దొంగలు, చిన్న దొంగలు, పెద్ద దొంగలు, దోపిడి దొంగలు, హంతకులు.. బందిపోటులు అందరూ రాజుగారిని సందర్శించి తమ గత చరిత్రను రాజుగారి సమక్షంలో విన్న వించుకొని భవిష్యత్తు చక్కగా మార్చుకొనుటకు అంగీకరిస్తున్నామని తెలిపి రాజు గారి క్షమాపణ కోరి వారి అనుగ్రహంతో ప్రజా జీవనవిధానంలో మమేకం కావచ్చు

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/5t-6G4GDgAc



    16 min
  • టెక్నిక్ | Technique | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    టెక్నిక్

    రచన: లక్ష్మి చివుకుల

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "ఏమండీ! ఈరోజు మా కాంతం కక్కి కొడుక్కి పెళ్లి చూపులకు వెళ్లాం కదా.." భర్తకు ఏదో చెప్పాలని ఆరాటంగా మొదలు పెట్టింది ఉమ.

    "అవును వెళ్లారు. నన్ను రమ్మని పిలిస్తే నేను రాలేదు. ఇంతకీ ఏమయింది.. పిల్ల నచ్చిందా.. మీ కాంతం కక్కి కొడుక్కి?" భార్య చెప్పేది పూర్తిగా వినకుండానే మధ్యలోనే అడిగాడు రాంబాబు.

    "ఫరవాలేదు. పిల్ల బానే వుంది కానీ మరీ బొత్తిగా ఏమీ లేని వాళ్లండీ. కనీసం కూర్చోడానికి సరి అయిన కుర్చీలు కూడా లేవు. మమ్మల్ని చూసి, పక్కింటికి వెళ్లి కుర్చీలు తెచ్చి వేసి, కూర్చోబెట్టారు." నిష్టూరంగా చెప్పింది ఉమ.

    "నేను అప్పటికీ మొత్తుకుంటూనే వున్నా, పెళ్లి చూపులకి అంతమంది ఎందుకు వెళుతున్నారు.. పెళ్లి కొడుకు, తల్లి, చెల్లెలు వెళితే చాలు అని. పటాలం అంతా కట్ట గట్టుకుని పోయారు. పాపం వాళ్లెంత ఇబ్బంది పడ్డారో.." బాధ పడ్డాడు రాంబాబు.

    "వాళ్లు ఏమీ ఇబ్బంది పడిపోలేదు కానీ మీరు ఆట్టే బాధ పడకండి. ఏదో కాస్త టీ నీళ్లు పోసారు కానీ ఎవరికీ స్వీట్ హాటు ఏమీ పెట్టలేదు లెండి. పైగా 'కతికితే అతకదండీ' అని ఒక సామెత కూడా ఉపయోగించారు.

    ఎంత లేని వాళ్లు అయితే పెళ్లి చూపులకి గుమ్మం లోకి వచ్చిన మగపెళ్లి వారికి ఒక స్వీట్ హాటు పెట్టరుట అండీ" మూతి మూడు వంకర్లు తిప్పుతూ మాట్లాడింది ఉమ.

    "సరేలే. మీరు ఏమైనా తినడానికి వెళ్లారా ? ఏమిటీ ? ఇంతకీ సంబంధం విషయం ఏమయింది?"

    "నేను వెళితే ఆ పని సక్సెస్ కాకుండా వుంటుందా ? ఏమనుకుంటున్నారు నా గురించి” పనిలో పని ఉమ తన గొప్ప చెప్పుకోవడం మొదలు పెట్టింది.

    మా కాంతం కక్కి ఏది అడిగినా కూడా 'మా వల్ల కాదండీ! మేము తూగలేమండీ!' అంటూ దేనికీ ఒప్పుకోలేదు ఆడపెళ్లి వారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్ట పడ్డారని పెళ్లికి ఒప్పుకున్నారు మా కాంతం కక్కి వాళ్లు."

    "అదేమీ కాదు కానీ ఇప్పటికే మీ కాంతం కక్కి కొడుక్కి చాలా సంబంధాలే చూసారు. కట్నాలు కానుకలు దగ్గర ఎన్ని సంబంధాలు వదిలెయ్య లేదు? ఇప్పటికే ఆ అబ్బాయికి పెళ్లి ఆలస్యం అయిపోతోంది. ఇప్పుడు అబ్బాయి పట్టు పట్టాడని ఏమీ అనలేక కాంప్రమైజ్ అయ్యారు మీ కాంతం కక్కీ వాళ్లు. నాకు తెలియదా..”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Ud9q84aTaeI



    5 min
  • కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 | Kasthuri Ranga Ranga Episode 8 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కస్తూరి రంగ రంగా!! 8

    Kasthuri Ranga Ranga Episode 8' Telugu Web Series

    Written By Ch. C. S. Sarma 

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    శశాంక కోరికపై కస్తూరి, రంగాలు బెంగళూర్, మైసూర్ టూర్ వెళతారు.

    కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి ఆకట్టుకునేలా ఉపన్యసిస్తాడు రంగ..

    కేసుకు సంబంధించిన వివరాలు సేకరించడానికి రేపల్లె వెళదామని వసంత్ తో చెబుతాడు.

    ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 చదవండి…

    మరుదినం ఐదుగంటలకు లేచి స్నానం చేసి... పదినిముషాలు దైవప్రార్తన చేసి, డ్రస్ చేసికొని ఇంటికి తాళం వేసి, గార్డును లేపి అతని చేతికి తాళం ఇచ్చి టొయాటో ఇన్నోవాలో కూర్చున్నాడు. సెక్యూరిటీగార్డుని పిలిచాడు. అతను డోర్ ను సమీపించాడు.

    "నీ పేరు హిమామ్ కదూ!..."

    "జీసాబ్!..."

    "మై దో దిన్ నహీ రహూంగా!.. ఫౌదోంకు, ఝూడోంకు పానీ అచ్చాదాల్ నా!... కోయీ ఆకర్ పూచేతో... సాబ్ క్యాంప్ గయే హై... కహీనా!... సంఝే!..” అడిగాడు యస్.పి కస్తూరిరంగ.

    “హీ సాబ్!..." తల ఆడించాడు హిమామ్

    "గేట్ ఖోలో!..."

    పరుగున వెళ్లి హిమామ్ వీధిగేటు తెరిచాడు...

    కస్తూరి రంగా కారు వీధిలో ప్రవేశించింది. ఇరవై నిముషాల్లో రంగా వసంత్ నిలయానికి చేరాడు. వాకిటముందు కారు ఆపాడు.

    వసంత్ “గుడ్మార్నింగ్ సర్...." అంటూ సెల్యూట్ చేశాడు.

    పక్కకు జరిగి డోర్ తీశాడు రంగా... వసంత్ కార్లో కూర్చున్నాడు... టొయాటో కదిలింది.

    రింగ్ రోడ్ వైపుకు కారును మళ్లించి బంజారా హిల్స్ నుండి ఇరవై నిముషాల్లో రింగ్ రోడ్ ఎక్కేశాడు రంగా... అసమయంలో ట్రాఫిక్ లేని కారణం...

    ఆ రాత్రి... ఐ.జి. అనంతనాగ్ గారికి తనకు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.

    "యస్.పి. కస్తూరి రంగా!..."

    "గుడ్ ఈవినింగ్ సార్...... యస్... యస్... సార్ !..."

    వినయంగా చెప్పాడు కస్తూరి రంగా.

    “క్వార్టర్లో చేరారా!...”

    “యస్ సార్!...”

    "ఎలా వుంది...?"

    "ఇటీజ్ ఓకే... సార్!..."

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/LHufbor9Rj4

    14 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 26 | Kakathi Rudrama Episode 26 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 26

    'Kakathi Rudrama Episode 26' New Telugu Web Series

    Written By Ayyala Somayajula Subrahmanyam

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    మహాదేవుడు ఓటమిని అంగీకరించి, రుద్రమదేవిని శరణు కోరుతాడు. రుద్రమ దేవి నిండు సభలో గన్నారెడ్డిని అభినందిస్తుంది. రాజద్రోహం చేసిన లకుమయా రెడ్డి, జన్నిగ దేవులు క్షమాబిక్ష పొంది రాజ్యం వదిలి వెళ్ళిపోతారు.

    ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 26(చివరి ఎపిసోడ్) చదవండి..

    రుద్రమదేవి అలసటతో అంతఃపురము లోకి చేరింది.

    ఆమె తల్పమున శయనించినది. ఆమెకు గతము జ్ఞాపకమునకు వచ్చుచున్నది.

    మహాదేవరాజు ఓటమి --- తన విజయము.

    గన్నారెడ్డి చాణుక్య రణము- వీరభద్రుల వీరపరాక్రమములు.

    ఆనాడు తాను ఒక్కతే, అన్ని లక్షలమంది సమూహమున సింహాసన మధిష్టించినది. ఆమెకు తరతరాల నుండి కాకతీయవంశ ప్రాభవాలు దీవింపజేసిన, ముత్తా

    తల - తండ్రిగారల నిలువెత్తు పఠములు చేతులెత్తి దీవిస్తున్నట్టు, ఆమె చెవిలో విజయధ్వానాలు వినిపించుచుండెను. ఆమెకు దుఃఖం వచ్చుచుండెను. ఐననూ అదిమి పెట్టుకుంది.

    వీరభద్రప్రభువు చిరునవ్వుతో, గంభీరంగా మెరిసెడి కళ్ళతో తనవైపునకే చూచుచుండెను. ఆమె లేచి నిలబడి-

    "ప్రభూ! మీరునూ, నా ప్రక్కన సింహాసనంపై కూర్చొనుడు. నేను ఒంటరిగా ఇంతపెద్ద సామ్రజ్యపు బాధ్యత తీసుకోలేను" అని అందామనిపించింది. చక్రవర్తిణి ఐనా ఆమె స్త్రీ కదా! బేలతనం స్త్రీల హక్కు కదా!

    ఆమె అలంకరించుకుంది. దాసదాసీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివదేవయ్యామాత్యులు, వీరభద్రప్రభువు లతో మంతనాలు చేస్తున్నారు. భవిష్యత్తు విషయంలో సుధీర్ఘ చర్చలు సాగుతున్నవి.

    సూర్యకాంతి చల్లగా వుంది. శ్రావణమాసపు మబ్బులు ఆకసమున చెమ్మచెక్కలాడుచున్నవి. వీరభద్రుల పినతండ్రి కుమారులు, మహాదేవరాజు కూడా చర్చలలో పాల్గొన్నారు. ( యాదవ మహాదేవులు, చాళుక్యమహాదేవులు వేరు వేరు)

    రుద్రమ పరిచారికలను పిలిచింది.

    "చక్రవర్తిణీ.. ఆజ్ఞ"

    "ముమ్ముడాంబికాదేవి ని తొందరగా అలంకరించి తీసుకుని రావలెను".

    ఈ చర్య ముమ్ముడమ్మకుగానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఏమీ అర్దము కాలేదు.

    ఆమెను క్షణాలలో అలంకరించి తీసుకొని వచ్చినారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ywEJFzW0_Dc

    17 min
  • యంత్రం | Yanthram | Telugu short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com


    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    యంత్రం

    రచన : సుస్మితా రమణ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా!?…కుళాయి విప్పి అలా వదిలేయొద్దని?" అంది కూతురు.

    "బుజ్జి తువ్వాలని కేకేస్తే అలా వెళ్ళాను. ఈలోగా బకెట్ నిండినట్లుంది." చెప్పింది తల్లి.

    "స్నానానికి వెళ్ళేటప్పుడు, తువ్వాలు పెట్టుకోడం దానికి తెలీదా?...నీ గారాబం వల్లే అదలా తయారయింది." కూతురి కోపం.

    "చిన్నపిల్ల కదా!...నెమ్మదిగా అలవాటు అవుతుందిలే!" సర్ది చెప్పింది తల్లి.

    "ప్రతి దానికీ దాన్నలా వెనకేసుకు రావద్దు." అంది కూతురు.

    "అలాగే తల్లీ!"

    "ఏదో మాడు వాసన వస్తోంది చూడమ్మా!" కూతురి ఆర్డర్..

    "అయ్యో!...స్టవ్ మీద పాలు పెట్టాను. నీ మాటల్లో పడి …”

    "ఈమధ్య అన్నీ ఇలాగే చేస్తున్నావు. పాలు నాతో మాట్లాడటం వల్లే మాడిపోయాయంటావ్!?..." తల్లిని విమర్శించింది కూతురు.

    "అలా నేనలేదే! ఈ మాత్రం దానికే ఇంతలా కేకలు వేయాలా!?..." బాధ పడింది తల్లి.

    "నా నోరే వినిపిస్తోంది. నీవు చేస్తోంది ఎవరికీ కనిపించటంలేదు. ఆయనకు ఆఫీసు టైం అవుతోంది కేరేజ్ కట్టేసావా?"

    "అయిపోవస్తోంది… అయిదు నిముషాల్లో!"

    "తొందరగా కానీ ! తెల్లారే లేస్తావు. ఏం ప్రయోజనం?...ఆ గిన్నెలు పనిమనిషి తోమి కడుగుతుందిగా ?...ఆ పనులు నీవెందుకు చేయడం?..శుద్ధ దండగ!”

    "రాత్రి తిన్న కంచాలలో వదిలేసిన వాటిని మనమే తీసి, చెత్త కవరులో పడేయాలి. కంచాలలో కాసిన్ని నీళ్ళు పోస్తే,అవి ఎండిపోవు.”

    "పనిమనిషి ఆపని చేస్తుందిలే!”

    "బుజ్జి దాని కేరేజ్, అల్లుడు గారి కేరేజ్ తోమి కడిగాను. పనిమనిషి వచ్చేలోగా అవసరమైనవి మనమే శుభ్రం చేసుకోవాలి కదా ?" చెప్పింది తల్లి.

    "అన్ని పనులు ఒకేసారి చేసేద్దామనుకుంటావ్ ! ఏ పనీ సవ్యంగా చేయవు.”

    "దానికి టిఫిన్ పెట్టి, కేరేజ్ కడుతున్నాను. అలా నాలుగు మాటలు అనేకంటే ఆయన కేరేజ్ నీవు కట్టేయొచ్చుగా? …”

    "స్సరే! రేపటి నుంచి అన్ని పనులు నేనే చేసుకుంటాలే!"

    "అంత నిష్ఠూరం దేనికమ్మా? ఉదయం పూట వంట పనిలో కాస్త సాయం చేస్తే నాకింత హైరాన ఉండదు కదా?" అంది తల్లి.

    "ఇకమీదట నీకెలాంటి ఇబ్బంది ఉండదులే! వంట మనిషిని మాట్లాడుతా. అన్నీ తనే చేస్తుంది."

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/mF7S0Oa-XU0


    14 min
  • నాకేమవుతోంది ఎపిసోడ్ 4 | Nakemavuthondi Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకేమవుతోంది…? ఎపిసోడ్ 4

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

    ‘నాకేమవుతోంది…?’ ’ ధారావాహిక నాలుగవ భాగం

    గత ఎపిసోడ్ లో...

    తనకు ప్రమాదం ఉన్నట్లు తండ్రికి మెయిల్ చేస్తుంది ప్రియ అనే యువతి. భర్త ప్రవర్తనలో తేడా ఉన్నట్లు ఆ మెయిల్ లో చెబుతుంది.

    కానీ ఆమె తండ్రి ఆ మెయిల్ చూడడు.

    తరువాత తాను తొందరపడి ఆ మెయిల్ పంపినట్లు, తను భర్తతో కలిసి రిసార్ట్ కి వెళ్తున్నట్లు మరో మెయిల్ పంపుతుంది.

    కూతురు ఆ మెయిల్ లో చెప్పినట్లు మొదటి మెయిల్ డిలేట్ చేస్తాడతను.

    ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక నాలుగవ భాగం చదవండి…

    "మంచి పని చేశారు. ఇప్పుడే ఎస్సై గారికి చెబుతాను" అంటూ అతని నంబర్ నోట్ చేసుకొని ఎస్సైకి కాల్ చేశాడా కానిస్టేబుల్.

    విషయం విన్న ఎస్సై రంగనాథం, "వాళ్ళ రిసార్ట్ లోనే హత్యో ఆత్మహత్యో జరిగి ఉంటుంది. కేసుల గొడవ తప్పించు కోవడానికి శవాన్ని బయట పడేసి ఉంటారు. నేను వెంటనే స్టేషన్ కి వస్తాను. డ్రైవర్ ని రెడీగా ఉండమను. ఫోటోగ్రాఫర్ కి కూడా ఇన్ఫార్మ్ చెయ్యి" అన్నాడు.

    "అలాగే సార్" అంటూ ఫోన్ పెట్టేసాడు ఆ కానిస్టేబుల్.

    మరో పావు గంటలో తన బైక్ లో స్టేషన్ కి చేరుకున్నాడు ఎస్సై రంగనాథం.

    అప్పటికే అక్కడ డ్రైవర్ జీప్ తో సిద్ధంగా ఉన్నాడు.

    ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా రెడీగా ఉన్నారు.

    రంగనాథం ఎక్కగానే జీప్ కదిలింది.

    ఆ వీధి చివర రెడీగా ఉన్న క్లూస్ టీం ఫోటోగ్రాఫర్ ని ఎక్కించుకున్నాడు.

    "టీం లో మిగతా వాళ్ళు డైరెక్ట్ గా స్పాట్ కి వస్తామన్నారు" చెప్పాడా ఫోటోగ్రాఫర్.

    "తెలుసు. ఎస్ పీ గారితో, ఏసీపీ గారితో మాట్లాడాను" చెప్పాడు రంగనాథం.

    స్పాట్ కి చేరడానికి అరగంట పట్టింది.

    రిసార్ట్ వాళ్ళు పెట్టిన మనుషులు జనాలని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కావడం లేదు.

    పోలీస్ జీప్ ని చూడగానే జనాలు కాస్త దూరంగా జరిగారు.

    రంగనాథం సైగ చేయగానే కానిస్టేబుల్స్ జీప్ దిగి, అక్కడ ఉన్నవారికి వెళ్లిపొమ్మని కేకలు పెట్టారు. దాంతో ఆ ప్రదేశం దాదాపు ఖాళీ అయింది.

    అక్కడే వున్న రిసార్ట్ మేనేజర్ సందీప్, జీప్ దిగిన ఎస్సైని చూసి దగ్గరికి వచ్చి విష్ చేసాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/BSDMdkVc4qI


    14 min
  • పునర్జన్మ | Punarjanma | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పునర్జన్మ

    రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ

    ఆ రోజు ఆదివారం. ఉదయం అమ్మ, నాన్న లతో కలిసి కాఫీ తాగుతూన్నప్పుడు సునయన ఇలా అంది. "అమ్మా, నేను కళ్ళు, ఇంకా ఒక ఐదు అవయవాలు దానం చేయడానికి ‘ఆర్గాన్ డోనర్ కార్డు’ తీసుకుందామనుకుంటున్నాను" అంది.

    "అంటే" అన్నది అయోమయంగా వాళ్ళమ్మ.

    "అంటే, నేను నా మరణానంతరం నా కళ్ళు, ఇంకా ఏ అవయవాలు ఇతరులకు దానం ఇవ్వవచ్చో అవి దానం ఇస్తాను, అని హాస్పిటల్ వాళ్లకు వ్రాసి ఇవ్వడమన్న మాట. " అంది సునయన.

    "అయ్యో, అయ్యో, అవేమి మాటలే?" రమ గట్టిగా అన్నది.

    "ఏమిటమ్మా" ఆందోళన గా అన్నాడు, వాళ్ళ నాన్న చలపతి.

    "నాన్నా, నిన్న మా స్నేహితురాళ్ళమందరం కలిసి ‘బ్లైండ్ చిల్డ్రన్ హోం’ కు వెళ్ళాము. అక్కడ కళ్ళు లేని పిల్లలను చూశాము. వాళ్ళనలా చూస్తుంటే ఎంతో బాధనిపించింది నాన్నా. మన ఊర్లోనే ఇంత మందికి కళ్ళు లేకుంటే ఇంక మిగతా ఊర్లల్లో ఎంత మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో కదా! మనం చనిపోయిన తరువాత మన కళ్ళు దానం చేస్తే ఇద్దరి జీవితాలు ప్రపంచాన్ని చూస్తాయి. మనం చనిపోయి మళ్ళీ పుట్టిన వాళ్ళ మవుతామమ్మా!" అంది వాళ్ళ నాన్నకు, అమ్మకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ. చలపతి కూడా అవయవదానం విషయం విని వున్నాడు కనుక ఆందోళన పడకుండా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పట్నుంచి వాళ్ళమ్మ.. అవయవ దానమంటే ఏదో విపరీతమన్నట్లుగా బాధ పడ్తోంది.

    "ఎందుకమ్మా అలా, కన్నీళ్లు పెట్టుకొంటావు?" అన్నది సునయన నిస్సహాయంగా వాళ్ళమ్మ రమను చూస్తూ. "ఒక్కగానొక్క నలుసువి. ఎన్నో పూజలు చేసి కన్నాను నిన్ను. నువ్విలాంటి అశుభం మాటలు మాట్లాడితే కళ్ళనీళ్ళు పెట్టుకోక ఏం చేయను?" అంటూ కళ్ళు తుడుచుకుందామె. అది చూసి, సునయన వాళ్ళ నాన్న కూడా "అదికాదమ్మా, అసామాన్యమైన పనులు మనకెందుకు చెప్పు?" అన్నాడు, అనునయం గా.

    "అదేంలేదు నాన్నా, మనం తలచుకుంటే ఇదేమంత కష్టమైన పనేమీ కాదు. ఎంతో అవసరమైన పని. మన జీవితానికి మరో జన్మనిస్తుంది. మనం పోతూ.. పోతూ.. ఒక మంచి పనిని చేసిన వాళ్ళమవుతాము. అయినా అది ఎప్పటి సంగతో కదా, ఇప్పుడు 'డిక్లరేషన్' కదా ఇస్తున్నది. దానికెందుకింత భయం? "

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/udl7ttLfmII

    20 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world