Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • The Pigeon Project

    #దిపిజియన్‌ప్రాజెక్ట్

    ఇర్వింగ్ వాలెస్

    సృష్టిలోని ప్రతీజీవి భయపడేది మృత్యువుకు అని ధర్మరాజు యక్షునికి సమాధానమిస్తాడు. మరణం లేకుండా ఇంకొన్నేళ్లు బ్రతకాలని ఎవరైనా మందు కనిబెడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే నవల ఇది. సోవియెట్ యూనియన్‌లోని ఆఖభాజియాలో 150 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు 5000మంది ఉన్నారు. మాక్ డోనాల్డ్ ప్రపంచ చరిత్రను మార్చే సిద్ధాంతాన్ని (ఫార్ములా) కనుగొన్నాడు. అతని సహాయకుడు లియోనార్డ్. రష్యా ప్రభుత్వం ఆ ఘనత తమకే చెందాలని ఆ సిద్ధాంతాన్ని బయటకు రానీయకుండా ఒక గూఢచారిని నియమిస్తారు. లియోనార్డ్‌కి ఆ విషయం తెలిసి, డోనాల్డ్‌ను తప్పించి పారిస్ సభకి పంపాలని చూడగా అతను మధ్యలో వెన్నిస్‌లో అక్కడి ప్రభుత్వం వారిచే బందించబడతాడు. డోనాల్డ్ అతనిని బంధించిన చోటకు వచ్చే పావురాలను మచ్చిక చేసుకుని, తనని తప్పించమని ఒక చీటిపై రాసి అది ఆ పావురాలకు కట్టి వాటిని వదులుతాడు. టిమ్ ఒక ఇంజినీర్. సర్వం పోగొట్టుకున్నఅతను 3 ఏళ్లుగా స్తబ్దుగా ఉంటూ డోనాల్డ్‌ను కాపాడే పనిలో పడతాడు. డోనాల్డ్‌ను కాపాడే ప్రయత్నంలో టిమ్ పడే కష్టాలు ఏమిటో? ప్రపంచానికి అతను ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టగలిగాడా? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.

    ---

    #దిపిజియన్‌ప్రాజెక్ట్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-the-pegion-project

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    36 min
  • Computer | Sastramtho Dosthi 2

    #శాస్త్రంతోదోస్తీ2

    కోరా 

    సౌజన్యంతో  మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో సంగతులు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరిగింది? దీనివెనుక కారణం ఏంటి అనే సందేహాలు అందరికి వస్తాయి. కొన్ని తెలిసినా ఉదాహరణకు సునామి అంటే సముద్రంలో వచ్చే భూకంపం అని తెలుసు కానీ అది ఎలా జరుగుతుంది అనే వాటికి ఇంకా మనకు తెలిసినా,తెలియని కొన్ని ప్రశ్నలకు లోతైన వివరణను కూలంకషంగా కోరా సౌజన్యంతో తెలుసుకుందాం. 

    ---

    #శాస్త్రంతోదోస్తీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/pc-sastram-tho-dosthi

    ---

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    15 min
  • Dopidi Bhayam | Rendu Mahanagaralu

    #రెండుమహానాగరాలు

    అనువాదం : తెన్నేటి సూరి

    రాజు సరిలేని రాజ్యం చిందరవందరగా ఉంటుంది. అందుకే మహాభారతంలో భీష్ముణి శపథం అడ్డురాగా, వ్యాసుడ్ని బతిమాలి సత్యవతి వంశవృద్ధి చేస్తుంది. సింహాసనం పై ఉన్న రాజుకు అన్ని విద్యలు వచ్చి, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఉండాలి. రాజు నియంతలా ఉన్నా, ఏం చేతకాని వాడైనా ఆ రాజ్యం ఎలా ఉంటుందో ఈ నవలలో వినవచ్చు. ఫ్రాన్స్‌లో నివసించే జమిందారీ వంశం వారు న్యాయం చేస్తున్నానని ప్రజల్నిపీడించే విధానము ఆ వంశం లోని యువరాజు అయిన డార్నేకు నచ్చక, ఆ పరిస్థితులను తట్టుకోలేక లండన్ కి వెళ్లి తన పేరు మార్చుకొని, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ జీవించేవాడు. ఈ ఫ్రాన్స్ జమీందార్ల రాజరికానికి బలైన ఒక డాక్టర్ మాన్సియర్ మానెట్. అతని ఒక్కగానొక్కకూతురు, అతి సౌందర్యవతి అయిన లూసిని డార్నే పెళ్లి చేసుకుంటాడు. ఈ ఫ్రాన్స్ వంశస్థుల వారిచే మానెట్ పడ్డ కష్టం, ఎంతో పేరుగల మానెట్ మానసికపరిస్థితి ని బాగుచేయడానికి లూసీ, టెక్సాస్ బ్యాంకు మేనేజర్ లారీ చేసిన ప్రయత్నం ఈ భాగంలో వినండి.

    ---

    ##రెండుమహానాగరాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-rendu-mahaanagaralu-1

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    21 min
  • Devatala Tirugubatu | Mangayya Adrushtam

    #మంగయ్యఅదృష్టం

    పి.వి.నరసింహారావు   

    శ్రీ పి.వి.నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాన మంత్రిగానే కాకుండా బహు భాషా కోవిదునిగా గొప్ప వక్తగా, రచయితగా ఎరుగని భారతీయుడు ముఖ్యంగా తెలుగువారు ఉండరు. వారు వ్రాసిన ‘ద ఇన్ సైడర్’ నవల ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానుల విశేషమైన ప్రసంశలను పొందింది. అలాగే, సుప్రసిద్ధ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలలో మొట్ట మొదటి తెలుగు వారైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్ర ఫణ్’ పేరిట హిందీలోకి వారు చేసిన అనువాదం శ్రీ నరసింహారావుగారికి హిందీ సాహితీరంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. నాటినుంచి నేటివరకూ తత్కాలీన రాజకీయాలు, నాయకుల తీరుతెన్నులకు ప్రతిబింబించే నవలిక చాలా కాలం క్రితం శ్రీ పి.వి. నరసింహారావు గారే వ్రాసిన ‘మంగయ్య అదృష్టం.’ బ్రహ్మదేవుని ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రతికూల వర్గాలుగా విడిపోయిన ఇతర దేవతలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి ఒక రాజకీయ నాయకుని కేంద్రంగా చేసుకుని చేసిన విన్యాసాలు ఈ కథ ఇతివృత్తం. సునిశితమైన హాస్యంతో సాగే ఈ కథలో చివరకు ఆధిపత్యం ఎవరి పక్షాన ఉన్నదో, పరాజిత పక్షం తీసుకున్న ఆ తీవ్రమైన నిర్ణయం తేలుస్తుంది. ప్రతి తెలుగు అభిమానీ తప్పక చదవ వలసిన ఈ కథను మీకు శ్రవణ రూపంలో అందిస్తోంది దాసుభాషితం. వినండి ‘మంగయ్య అదృష్టం’. 

    --- 

    #మంగయ్యఅదృష్టం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/ab-mangayya-adrushtam  

    –––  

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

    ---  

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    27 min
  • All india Radio | Potturi Vijayalakshmi hasya kathalu

    #పొత్తూరివిజయలక్ష్మిహాస్యకథలు

    పొత్తూరి విజయలక్ష్మి  

    హాస్య రచనలకి చిరునామా శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. 1982లో ఆమె వ్రాసిన తొలి నవల ‘ప్రేమలేఖ’ తోనే పొత్తూరి విజయలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నవల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాగా అఖండ విజయం సాధించింది. ఆ విధంగా ప్రారంభం అయిన ఆమె సాహితీ యాత్ర నేటికీ జయప్రదంగా కొనసాగుతూనే వుంది. ఇంతవరకు 20 నవలలు, 250 కధలు, ఎన్నో కాలమ్స్ రాశారు. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించిపెట్టినవి "పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు." సుమారు పదహారేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం ఎడిషన్ లో ధారావాహికం గా వెలువడిన ఈ కధలు విశేషమైన పాఠకాదరణ పొందాయి. పెళ్ళిళ్ళ లో రిటర్న్ గిఫ్ట్ గా పుస్తకాలను పంచిపెట్టడం అనే ఒక సత్సంప్రదాయం ఈ పుస్తకంతో మొదలైంది. ఆ విధంగా లక్షలాది మంది తెలుగు పుస్తక ప్రియులకు ప్రీతిపాత్రమై విజయలక్ష్మి గారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన పుస్తకాన్ని మొదటి సారి శ్రవణ రూపంలో మీ ముందుకు తెస్తున్నది ‘దాసుభాషితం’. వినండి. ‘పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు’ శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం, గళం: హిమజ సుమన్. 

    --- 

    #పొత్తూరివిజయలక్ష్మిహాస్యకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    

    https://www.dasubhashitam.com/ab-title/ab-potturi-vijayalakshmi-hasya-kathalu-1

    –––  

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

    ---  

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    8 min
  • Chematalu Pattinchina Bind Over | Asalem Jarigindante...

    #అసలేంజరిగిందంటే

    పి.వి.ఆర్.కె.ప్రసాద్  

    శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాడు గారు జగమెరిగిన మాజీ ఐఏయస్ అధికారి. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టరు మొదలుకుని, భారత ప్రధానికి మీడియా సలహాదారుగానూ, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యెక ప్రధాన కార్యదర్శి గానూ వివిధ హోదాల్లో పనిచేసి పనితీరులో తనదంటూ ఒక ముధ్రనూ ఒరవడినీ ఏర్పరచారు. సుమారు నలల్భై సంవత్సరాల సుదీర్ఘ పదవీ కాలంలో పొందిన అనుభవాల, అనుభూతుల అక్షర రూపం 'అసలేం జరిగిందంటే'. ఇప్పుడు శ్రవణ రూపంలో వినండి. 

    --- 

    #అసలేంజరిగిందంటే శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/ab-asalem-jarigindante

    –––  

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   ---  ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • Julapala Katha | Americomedy Kathalu 1

    #అమెరికామెడీకథలు

    వంగూరి చిట్టెన్ రాజు

    అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ నగరంలో నివసించే శ్రీ వంగూరి చిట్టెంరాజు గారు తెలుగు రాష్ట్రాల్లో కంటే యావత్తు అమెరికాలో నివసించే తెలుగువారికి పరిచయం అవసరం లేని ఇద్దరు ముగ్గురు ప్రముఖుల్లో ఒకరు. వృత్తి రీత్యా ఇంజనీరు. ప్రముఖంగా చెప్పుకోదగిన సాహితీవేత్త. రచయిత. కలకాలం నిలిచి ఉండే వందకు పైగా కధలు వ్రాశారు. అన్నీ అమెరికా నేపథ్యంలో హాస్య ప్రధానంగా వ్రాసినవి. ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి సుప్రసిద్ధ ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమంలో ప్రస్తావించిన నూరు తెలుగు కథల్లో, శ్రీ చిట్టెన్ రాజు గారు 1977 లో వ్రాసిన జులపాల కథ ఉన్నదంటే ఆ కథలు ఎంత ప్రముఖమైనవో తెలుస్తుంది. వ్రాసిన శతాధిక కథలను శ్రవణ రూపంలో అందించడానికి సంకల్పించిన దాసుభాషితం శ్రీ చిట్టెన్ రాజు గారిని సంప్రదించగా, తక్షణమే తన అంగీకారాన్ని తెలిపారు. ఆ క్రమంలో మీ ముందుకు వస్తున్నవే ఈ 'అమెరికామెడీ కథలు." వినండి "అమెరికామెడీ కథలు. మొదటి సంపుటం.

    ---

    #అమెరికామెడీకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-americomedykathalu-1

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min
  • The Eleventh Commondment

    #ఎలవంత్‌కమాండ్మెంట్ 

    జెఫ్రీ ఆర్చర్

    ఒక వస్తువుపైగాని, పదవిపైగాని, మనిషిపైగాని అతి వ్యామోహం ఉంటే అది ఎంతదాకా దారితీస్తుందంటే వారి ప్రాణాలు తీసేదాకా. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసం కొన్ని సూత్రాలు, నియమాలు కలిగి ఉండాలి. అదీ దూతలుగా ఉన్నవారికి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈ షరతులు. వీరు ప్రాధమికంగా 10 సూత్రాలను పాటించాలి. ఈ నవల విశ్లేషణలో ఇంకో సూత్రాన్ని చెబుతారు. కొన్నార్ గూఢచారి విభాగంలో పనిచేస్తూ పైకి ఆ విషయం తెలీనీకుండా LIC లో ఏజెంట్ పని చేస్తున్నట్టు అందర్నీ, ఆఖరికి భార్య మగ్గీని కూడా నమ్మిస్తాడు. ఈ గూఢచారి విభాగంలో అత్యున్నత స్థానంలో ఉన్నహెలెన్ తన పదవిని కాపాడుకోడం కోసం, తన తరవాత ఆ పదవిలోకి రాబోతున్న కొన్నారను పాములావాడి, ఎంతో చాకచక్యంగా తన అధికారంతో అతనిచే ప్రధానిని హత్యచేయిస్తుంది. ఎన్నో అధికారాలు ఉన్న ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఆమెను ఎందుకు ఎదుర్కోలేకపోయారు? హెలెన్ వేసిన పథకంలోంచి కొన్నారు బయటపడతాడా? హెలెన్ యొక్క నిజస్వరూపం ఎలా బయటపడుతుంది? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి. 

    ---

    #ఎలవంత్‌కమాండ్మెంట్  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-eleventh-commandment

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    34 min
  • Palla Durgayya | Aacharya Devo Bhava 2

    #ఆచార్యదేవోభవ2

    డా.ఆర్.అనంత పద్మనాభరావు

    చిరంజీవయినా పుడుతూనే మెగాస్టార్ ఐపోలేదయ్యా... తెగించే సత్తా చూపందే సడన్గా స్వర్గం రాదయ్యా... ఈ లిరిక్స్ మనీ అనే సినిమాలో ఒక పాటలోనివి. ఒక మామూలు మనిషిగా పుట్టి ఎన్నో కష్టాలకు ఓర్చి నేర్చిన కళలని ప్రదర్శించి ప్రేక్షకులని ఉల్లాసపరిచి ఒక గొప్ప హీరోగా ఎదిగిన వ్యక్తిపై రాసిన లిరిక్స్. డా. ఆర్. అనంత పద్మనాభారావుగారు రాసిన ఆచార్య దేవో భవ వ్యాసములలో ఇలా ఎందరో ఆచార్యులను గురించి మనకి తెలియజేశారు. ఒక గొప్ప ఆచార్యునిగా వారు ఎదిగిన స్థితి, ఆచార్యునిగా వారు చేసిన పరిశోధనలు కృషి విద్యార్థులు దృష్టిలో ఒక హీరోగా ఎదిగిన తీరుకి ఏమాత్రం తక్కువ కాదు. ఈ శీర్షికలోని వ్యాసాలను వింటుంటే ఎందరో ఆచార్యులు ఆంధ్ర దేశంలో మనం ఉంటున్న ఊర్లో నుండి మనం తిరిగిన ఊర్లలో నుండి ఎన్నో యూనివర్శిటీలకు చేరి శాస్త్రం, చరిత్ర, నాట్యం, నటన, ఇలా ఎన్నో కళలలో, విద్యలలో వారు చేసిన పరిశోధన, కృషి గురించి వివరిస్తూ ఉంటే ఆచార్యులని ఆచార్యులగానే కాక గొప్ప హీరోలుగా మనం చూస్తాం. మరి వారు చేసిన కృషి తెల్సుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి అనుకుంటే ఆ ఆచార్యులు నడిచిన మార్గం ఏంటో వినండి. 

    ---

    #ఆచార్యదేవోభవ2  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-aacharyadevobhava-2

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    5 min
  • Raghupathi Venkataratnam | Aacharya Devo Bhava

    #ఆచార్యదేవోభవ

    డా.ఆర్.అనంత పద్మనాభరావు

    ప్రతీ ఒక్కరికి తల్లి మొదటి గురువైతే, తల్లి ప్రేమను, తండ్రి నేర్పే క్రమశిక్షణను, అపారమైన విద్యను మనకు అందించేవారే గురువులు. మన పూర్వకాలంలో గురు శుశ్రూష చేసి విద్యలను నేర్చుకునేవారు. కృష్ణుడు, రాముడు కూడా ఇలా నేర్చుకున్న వారే. వేదాలు, శాస్త్రాలు సంస్కృతంలో లేక ద్రావిడ భాషలో ఉన్నాయి. వాటిని పూర్తిగా నేర్చున్నవారు చాలా తక్కువగా ఉండేవారు. రాను రాను గురుకులాలకి వెళ్లి నేర్చుకునేవారు, నేర్పేవారు కూడా తగ్గారు. వీటిని జనసామాన్యంలోకి తేవడానికి చాలా మంది కృషి చేసారు. బీద కుటుంబంలో పుట్టినా, చదువుమీద ఆశతో, శాస్త్రం నేర్చుకోవాలన్న పట్టుదలతో ఎందరో వివిధ శాస్త్రాలలో ప్రావీణ్యులయ్యారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా ,ఉపకులపతులుగా ఉండి తమకున్న ఆసక్తితో చేసిన పరిశోధనలను, సాహిత్యంపై అనేకులు చేసిన కృషిని ఈ 'ఆచార్యదేవోభవ' లో వినండి.

    ---

    #ఆచార్యదేవోభవ  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-aacharyadevobhava

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    8 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.