Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Sunlight on a Broken Column

    #సన్‌లైట్ఆన్ఎబ్రోకెన్‌కాలమ్

    అట్టియా హొసైన్

    స్వతంత్య్రం వచ్చినా స్త్రీకి మాత్రం కొన్ని కట్టుబాట్లు ఉంటూనే ఉన్నాయి. అందులోను ముస్లింలలో మరి ఎక్కువుగా ఉంటాయి. ఈ నవల రచయిత్రి ఆనాటి ముస్లింలలో జమీందారీ వంశంలో పుట్టి బాగా చదువుకున్న స్త్రీ. వీరు ఆ కాలంలోని వారి మతంలో ఉండే కట్టుబాట్లను గురించి వర్ణించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని తాతగారి వద్ద పెరుగుతుంది లైలా. స్వతంత్ర భావాలున్నతాతగారు లైలా పెదనాన్నను, తండ్రిని విదేశాలకు పంపి చదివిస్తారు. వారు తమ దేశంలో జరిగే స్వాతంత్య్రసమరంలో సహాయపడతారని భావించారు. కానీ విదేశాలలో చదువుకున్న పెదనాన్న కుటుంబం నాగరికతకు అలవాటు పడతారు. తాతగారి హయాంలో ఉన్న కట్టుబాట్లు క్రమేపి సడలిపోతాయి ఆ ఇంట. తాతగారి వద్ద పెరిగిన లైలా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత ఆమె జీవితం ఎలా ఉంది? ఆమెను ఎంతగానో ప్రేమించిన మేనత్త ఏమైంది? ఆమె భర్త, మేనత్త కాకుండా లైలాను ఎంతగానో ఆరాధించిన వ్యక్తి ఎవరో ఈ విశ్లేషణలో వినండి.

    ---

    #సన్‌లైట్ఆన్ఎబ్రోకెన్‌కాలమ్  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-sunlight-on-a-broken-column

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    25 min
  • The Far Cry | విశ్లేషణ

    #దిఫార్‌క్రై

    ఎమ్మా స్మిత్ 

    ధారణంగా ప్రతీ ఒక్కరూ ప్రేమని, ఆప్యాయతని కోరుకుంటారు. డి‌బ్బే తన రెండవ సంతానమైన థెరిస్సాను హాస్టల్ లో ఉంచి చదివిస్తుంటాడు. తన భార్య విలియం తన నుంచి థెరిస్సాను తీసుకెళ్లిపోతుందని తాను ఇండియా వెళ్ళిపోతాడు. అక్క తన మోసాటి సంతానమైన రూత్ టీ ఎస్టేట్స్ లో ఉంటుంది. అక్కడి సుందరమైన, నాగరికత లేని ఆ ప్రదేశం తన భర్త ఇష్టం లేక తానూ భర్త నుంచి విడిపోయి లండన్ వెళ్లిపోవాలని నిశ్చయించుకుంటుంది. కానీ తన తండ్రి చెల్లెలి ఆకస్మిక రాకకు ఇబ్బంది పడతారు భార్యాభర్తలు. ఇండియాకి వెళ్లిపోవాలనుకున్న డి‌బ్బేకి ప్రమాదం జరుగుతుంది. డి‌బ్బే ఏమవుతాడు? రూత్ లండన్ వెళుతుందా? థెరిస్సా పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.

    ---

    #దిఫార్‌క్రై శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-the-far-cry

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    30 min
  • Subhamangala Geetamulu

    #హిమాబిందు

    అడివి బాపిరాజు

    శిల్పకళలో తండ్రి వద్ద మెళకువలు నేర్చుకుంటున్న సుమనశ్రీ ఎంతో ధైర్యంతో హిమబిందును కాపాడుతాడు. అలాగే శాతవాహనుల ముద్దు బిడ్డడు అయిన మంజుశ్రీని కూడా వారి తల్లి తండ్రుల వద్దకు చేర్చుతాడు. విషబాలను తిరిగి చంద్రబాలగా మార్చే క్రమంలో ఆనందపాదులవారికి ఆమెపై అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. ఎంతో మంది శిష్యగణాన్ని సంపాదించిన ఆనందపాదులవారు ఎవరు? శ్రీకృష్ణ శాతవాహనుల నాశనానికి అతనిపై ప్రయోగించిన విషబాల వల్ల అతనికి ఏమౌతుంది? బౌద్ధ సన్యాసిగా మారాలనుకున్న సుమనశ్రీ ఏమౌతాడు? వీటి గురించి ఈ చివరిభాగంలో వినండి.చుకోవాలని, అందరిలోనూ తాను ఒకదిలా ఉండాలని తన ప్రాణాలమీదకి తెచ్చుకున్న కథ "సర్కస్ సుబ్బారావు" లోనూ, మరికొన్ని ముచ్చటైన కథలను వినండి.

    ---

    #హిమాబిందు  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-himabindu-3

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    8 min
  • Anni Telisina Tenalayana | Maa oori kathalu 2

    #మాఊరికథలు 

    నక్కా విజయరామరాజు

    మా ఊరి కథలు ఒకటవభాగంలో కొన్ని కథలు విన్నారు. బతుకుతెరువు కోసం పని నేర్చుకోవడం ఒక విధమైతే, ఏ పనైనా చేయగలిగేట్టు మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం ఇంకో విధం. అలా ఏ పనైనా చేయగలిగి, ఎవరికి ఏ అవసరం వచ్చినా సలహాలిచ్చే అతని కథ "అన్నీ తెలిసిన తెనాలాయన" లోనూ, నోరు లేని జీవాలమీద మనం యెంత ప్రేమ చూపిస్తామో, అవి కూడా అంతే విధంగా మనపైన ప్రాణాలు పెట్టుకుంటాయని, మన కోసం ఎంతటి కష్టానైనా, ఎలాంటి పరిస్థితినైనా భరిస్తాయని "ఎంకటమ్మ" లోనూ, ప్రతీ మనిషిలోనూ ఏదో ఒక కళ ఉంటుందని, పరిస్థితుల వల్ల అతనిలో ఉన్న ప్రావీణ్యం ఎలా బయటకి వస్తుందో "లాగూ సొక్కా అయన్ది మాఊరే" లోనూ, తనని గొప్ప అనిపించుకోవాలని, అందరిలోనూ తాను ఒకదిలా ఉండాలని తన ప్రాణాలమీదకి తెచ్చుకున్న కథ "సర్కస్ సుబ్బారావు" లోనూ, మరికొన్ని ముచ్చటైన కథలను వినండి.

    ---

    #మాఊరికథలు  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-maa-oori-kathalu-2

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    20 min
  • Home To Poland

    #హోమ్‌టుపోలాండ్

    క్రిస్టినీ హాచ్‌కిస్

    యుద్ధం - ఏంతో మంది పిల్లలని అనాధలని చేయటమే కాక, ఆస్తి నష్టం, జన నష్టంతో పాటూ ఆ ప్రాంతం రూపు రేఖలు లేకుండా చేస్తుంది. మన భారతదేశం లోనే దక్షిణ భాగంలో ఉన్న మనకి యుద్ధాలు, సరుకులు దొరకక పోవటం, రాత్రికి రాత్రి కర్ఫ్యూలు, రోజుల తరబడి బయటికి వెళ్లకుండా ఇంట్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవించటం లాంటివి లేవు. ఏడాదికి ఒక్కసారి దీపావళి రోజున పేలే బాంబులకే మనం చెవులు చిల్లులు పడుతున్నాయని, వాతావరణం పాడైందని అనుకుంటాం. కానీ కాశ్మీర్లో ప్రజలు, దేశ సరిహద్దుల్లో వారు నిత్యం ఇలాంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు. తమ ప్రాంతాన్ని, సాంప్రదాయాన్ని, ఆస్తుల్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి ఏళ్ల తరబడి అక్కడే జీవిస్తూ ఎప్పటికైనా తమ ఊరులో తమ సొంత ప్రాంతాలలో జీవిస్తామని ఆశతో బతుకుతున్నారు చాలామంది. తమ దేశంలోనే వేరే ప్రాంతంలో ఉండలేని వారు, తమ దేశాన్ని వదిలి ఇంకో దేశంలో జీవించే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు పడే మనోవేదనని ఈ నవలలో క్రిస్టినీ చాలా హృద్యంగా వివరించారు.

    ---

    #హోమ్‌టుపోలాండ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-home-to-poland

    –––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    ---

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    30 min
  • Addamlo Jinnah

    #తిలక్‌కథలు

    దేవరకొండ బాల గంగాధర తిలక్

    భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవుల్లో భావకవీ, అన్నీ వర్గాల కవులు "మావాడు" అనుకొన్న కవి తిలక్ కథకుడు, నాటక కర్త. ప్రతి నిత్యమూ మన కళ్ళముందే జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించటానికి ఆయన కవితలతో పాటు కథలను, నాటక ప్రక్రియలను కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. మనకు వీధుల్లో తారసిల్లే బిచ్చగాళ్ళు, ఆనాధలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్లు, పడుపుగత్తెలు చీకటిబజారు చక్రవర్తులు, ఇలా ఎందరెందరినో పాత్రలుగా మలచి నిజ రూపంలో మనముందు నిలబెడతారు. అందుకనే అన్నారు “ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు” అని. ‘తిలక్ కథలు’ మూడు సంపుటాలలో మొదటి సంపుటాన్ని శ్రీ తులసీదాస్ గళంలో అందిస్తోంది దాసుభాషితం.

    ---

    #తిలక్‌కథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-tilak-kathalu-1

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    15 min
  • Chidambaram

    #పెంకుటిల్లు

    కొమ్మూరి వేణు గోపాలరావు

    1935 లో జన్మించిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత. బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావంతో తెలుగులో సుమారు 50 పైగా నవలలు వ్రాయటం వలన ఈయన "ఆంధ్రా శరత్"గా పిలువ బడ్డారు. ‘పెంకుటి’ల్లు నవల ఈయన పేరును చిరస్ధాయి చేసింది. ఇంటి పెద్ద, తన బాధ్యతను విస్మరిస్తే, ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో కళ్ళకు కడుతుంది ఈ నవల. అన్నింటికీ మించి, కాలంతో పాటు మారుతూ వచ్చిన మధ్యతరగతి విలువల పరిణామ క్రమానికి అక్షర రూపంగా పాఠక లోకంలో 'పెంకుటిల్లు’ స్థానం ఎన్నటికీ పదిలమే. ఓ నవల చదువుతున్నట్టుగా కాక ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్టుగా అనిపించే ఈ నవలను డా. కొమ్మూరి వేణుగోపాలరావు గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం.

    ---

    #పెంకుటిల్లు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-penkutillu

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    19 min
  • Record Break

    #మాఊరికథలు

    నక్కా విజయరామ రాజు

    కథలన్నీ కంచికెళతాయి అంటారు. ఎందుకో తెలియదు కానీ కొన్ని కథలు కంచికి కాదు మన ప్రాణాలు విడిచేదాకా మనతోనే ఉంటాయి తీయని, మధురస్మృతులలా. భట్టిప్రోలు కథలలోలాగా ఇవి కూడా ఊర్లోని వాళ్ళతో ముచ్చట్లలాగా కనబడతాయి. ప్రాణంగా ఉండే స్నేహితులు మాట తేడా వచ్చి దూరమైనా వారిలోని ప్రేమలు ఎప్పటికీ తరగవని చూపే 'రికార్డింగ్ బ్రేక్' లోనూ, ఏనాడూ పుట్టి బుద్దెరిగిన నుంచి కోపం రాని సుబ్బారావుకు కోపం వచ్చిందో 'సుబ్బారావుకు కోపం వచ్చింది' లోనూ, గుమాస్తాలంటే ఎంత బాధ్యతగా ఉంటారో 'గోపాలరావు గారి పెద్దగుమస్తా' లోనూ,తల్లిదండ్రులు పిల్లలపై ప్రాణాలు పెట్టుకుంటే ఆ పిల్లలు పెద్దవాలైతే ఎలా ఉంటారో వారి ప్రేమలు ఎలా ఉంటాయో "అమెరికా రాజయ్య" లోనూ; మూగ జంతువుల ప్రేమలు ఎల్ ఉంటాయో "తోకలోళ్ల ఆంబోతు" లోను మరికొన్ని కథలు వినండి.

    ---  

    #మాఊరికథలు  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.      https://www.dasubhashitam.com/ab-title/ab-maa-oori-kathalu-1

    --- 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.    

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము

    20 min
  • Bharata bhoomilo Andhakaara yugam lene ledu

    #సత్యచరిత్ర  

    సత్య పాలంకి 

    మనలో చాలా మందికి చరిత్ర గురించిన అన్ని విషయాలు తెలీదు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి గూర్చి కనుగొన్నది తెలుసు కానీ ఆ ఆలోచన ఆయనకు ఎలా స్ఫురించింది అని 'ఆపిల్ పండు కథ' లోనూ, మన ఇతిహాసాలను, పురాణాలను మన శాస్త్రజ్ఞులను పాశ్చత్యులు ఏ విధంగా చూస్తున్నారో 'ఇతిహాసం' లోనూ, మనవారు సూర్య చలనాన్ని బట్టి లెక్క కట్టిన కాలాన్ని పాశ్చత్యులు తమకనుకూలంగా ఎలా కుందించారో 'కాలాన్ని కుదించిన కుట్ర' లోను ఇంకా మరికొన్ని చరిత్ర విశేషాలను వినండి. 

    ---

     #సత్యచరిత్ర  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/pc-satya-charitra

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

    ---  

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము

    14 min
  • Madhura

    #యాత్రానుభవాలు

    కొండూరు తులసిదాస్

    2008 ప్రారంభంలో ఒక సుప్రభాత సమయాన, జీవితం ఏ ప్రత్యేకతా లేకుండా నిస్తేజంగా గడుస్తున్నట్టు తోచింది. ఏదైనా తీర్థ యాత్ర చేద్దామా అనిపించింది. నా ఆలోచనను శ్రీమతితో పంచుకోగా కాశీ వెళ్లి వద్దామని ప్రతిపాదించింది. ఆ విధంగా 2008 మార్చి నెలలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రధానంగా ప్రారంభమైన మా భారత దేశ తీర్థ యాత్రలు, ఇతర పుణ్య క్షేత్రాలూ, విహార స్థలాల దర్శనంగా 2015 సెప్టెంబరు వరకూ సాగింది. ఈ ఏడు సంవత్సరాల్లో ఒక్క ఈశాన్య రాష్ట్రాలూ, జమ్మూ కాశ్మీర్, గోవా తప్ప మిగతా దేశమంతా చుట్టివచ్చాము. ఆ యాత్రలలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, సంతోషాలు, సంతృప్తులు, ఇక్కట్లు, ఇబ్బందులు, సమస్యలు. వాటన్నిటి అక్షర సమాహారమే ఈ భారతదేశ తీర్థ-విహార యాత్రలు, భావాలు, అనుభవాలు పుస్తకం.

    #యాత్రానుభవాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-yatranubhavalu-vihnukshetralu

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    4 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.