Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Kulapati

    #హిమబిందు

    అడివి బాపిరాజు

    శాతవాహనుల కాలం లోని వర్తకం, వర్తకంలో కొలతలు, యుద్ధంలోని సేనల వర్ణన, సుతౌలతిష్కుడు తన గారాలపట్టి అయిన తన మనవరాలిని పూర్తిగా విష‌కన్యగా మార్చిన తీరు, విషబాల మనసులో ఉన్న కోరికలు, ఆమె ప్రతీరోజు తనతోట లోకి ఎందుకు వెళుతోంది అక్కడ ఆమె ఏం చూసింది? తన ప్రాణానికి ప్రాణమైన సుమనశ్రీని హిమబిందు ఎందుకు దూరం చేసింది? హిమబిందును ఎవరు ఎత్తుకు పోయారు? హిమబిందును వెతకడానికి సుమనశ్రీ ప్రయత్నించిన తీరు వినండి.

    https://unsplash.com/photos/88IMbX3wZmI

    ––– 

    #హిమబిందు2 శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-himabindu-2

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    8 min
  • The L Shaped Room

    #దిఎల్‌షేపెడ్‌రూమ్

    వైన్ని రీడ్ బాంక్స్

    కొంతమందికి తమలో ఉన్న ప్రేమని వ్యక్తపరచడం రాదు. తండ్రికి కొడుకుపై అపారమైన ప్రేమ ఉన్న తాను దానిని ఆ కొడుకు ఎదురుగా చెప్పడు ఇందుకు ఉదాహరణగా మన పురాణాల్లో భారవి కథ చెబుతాడు. అతడు తండ్రిమీద కచ్చతో చంపాలనుకుంటాడు. ఇదేవిధంగా ఈ నవలలోని జేన్ తన తండ్రిపై ద్వేషంతో పెరుగుతుంది. బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం ఎలా ఉంటుందో అన్న ఆరాటంతో చేసిన పనికి గర్భవతి అవుతుంది. తన తండ్రివద్ద కాక ఒక మురికివాడలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో, అక్కడ తనతో పాటు నివసించేవాళ్ళు ఆమెను ఎంతో ఆదరిస్తారు. వాళ్ళ మేనత్త దగ్గరకి వెళ్లి కొన్ని రోజులు ఉన్నాక, ఆమె చెప్పిన మాటల్లో వాళ్ళ నాన్న ప్రేమ గురించి తెలుస్తుంది. తాను ఒక బిడ్డకి జన్మనిచ్చాక తన తండ్రి ప్రేమను చూస్తుంది. వాళ్ళ మేనత్త జేన్ తండ్రి పై ప్రేమ కలిగేటట్టు ఏమిచెబుతుందో వినండి.

    ---

    #దిఎల్‌షేపెడ్‌రూమ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-the-l-shaped-room

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    26 min
  • French Prisoner

    #ఫ్రెంచ్‌ప్రిసనర్

    హెన్రిక్ ఫీబి గేయి

    మన చుట్టూ మనకు తెలియకుండానే కొన్ని సూక్ష్మ శరీరాలు ఉంటాయని ప్రతి దేశం, ప్రతి జాతి వారూ నమ్ముతారు. అయితే అందులో నిజం ఎంతో చెప్పలేం కానీ, మన కోసం పరితపించే హృదయ ఆక్రందన మనందరికీ వినిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక సంపన్నురాలిని పెళ్లి చేసుకుని ఆమె ఆస్తి మొత్తానికి, ఆ ఊరికి అధికారి అవుతాడు బ్రామ్‌వెల్. ఆస్తిని పెంచుకునే క్రమంలో పెళ్ళాన్ని, పిల్లల్ని పట్టించుకోడు. ఇద్దరు మగ పిల్లల తరువాత హారియెట్ అనే ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి కన్నుమూస్తుంది బ్రామ్‌వెల్ భార్య. హారియెట్ చిన్ననాటి నుంచి తమ ఎస్టేట్‌లో‌ని సుశాన్ అనే పిల్లతో పాటు పెరుగుతుంది. హారియెట్ తన తండ్రితో బాటూ ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఆ ఎస్టేట్ కి తానే వారసురాలు అనుకుంటూ ఉంటుంది. ఆ రోజుల్లో ఫ్రెంచ్‌, బ్రిటన్‌దేశాలకు యుద్ధం జరుగుతుంటుంది. డచ్ దేశస్థుడైన జాన్‌ను ఫ్రెంచ్ వాడనుకుని ఖైదు చేస్తారు. జాన్ జైలునుంచి తప్పించుకుని హారియెట్ వాళ్లకు చిక్కుతాడు. మొదట అసహ్యించుకున్నా హారియెట్ జాన్ ను ఇష్టపడి అతని ద్వారా ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. హారియెట్ అసలు స్వరూపాన్ని గమనించి జాన్ పాపని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే కొన్నేళ్ల తరవాత జాన్ మనవడు వచ్చి హారియెట్ ఎస్టేట్ లోనే ఎందుకు ఉండిపోతాడో, అతనికి వినిపించిన భగ్నప్రేమ తాలూకూ ఆక్రందనలు ఏమిటో,హారియెట్ ఆ అసలు స్వరూపం ఏమిటో ఈ విశ్లేషణలో వినండి.

    ---

    #ఫ్రెంచ్‌ప్రిసనర్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-french-prisoner

    --- 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    23 min
  • Leelasundari

    పిల్లల నవలలు చింతా దీక్షితులు  కథలంటేనే పిల్లలు అల్లరి మానేసి ఆసక్తిగా కూర్చుని వింటారు. మనం చెప్పే కథలలో కోతులు, పిట్టలు, పులులు ఇలా జంతువులను చేర్చి చెబితే ఇంకా శ్రద్ధగా వింటారు. రాక్షసులు ఎత్తుకుపోయి పెంచుకుంటున్న గోపీమోహిని, మణిమాలను ఒక రాజకుమారుడు శివసాయకుడు కలుసుకుంటాడు. లోపలికి వెళ్ళి ఎవరూ తిరిగిరాని, రాలేని అడవిలోంచి అతను ఆ ఇద్దరు ఆడపిల్లలను ఎలా బయటకి తీసుకొచ్చాడో "గోపీమోహిని" లోనూ, ఇద్దరు రాక్షసులు ఒక జంటకు పిల్లలుగా పుట్టి మంచిపనులు చేయాలనుకుని వారు పడ్డ కష్టాలేమిటో "సంపాలత" లోనూ వినండి. 

    https://www.dasubhashitam.com/ab-title/ab-chinta-deekshitulu-pillala-navalalu 

    –––   

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

    –––   

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    27 min
  • Yera

    భట్టిప్రోలు కథలు 1   

    నక్కా విజయరామరాజు  

    కష్టపడి పనిచేసే తత్త్వం ఉంటే ఏ మనిషికైనా అంగవైకల్యం అడ్డురాదు. పొద్దున్నేలేచి అన్నిరకాల తినుబండారాలు తయారుచేసుకుని బండిమీద సామాన్లు పెట్టుకుని, క్షణం తీరికలేకుండా అమ్మే కోటేశ్వరరావు ఒక్కసారిగా నిరాశ్రయుడైపోతాడు. అతను బండి పెట్టుకోడానికి అడ్డువచ్చిన S I నే అతన్ని పిలిచి మెచ్చుకుంటాడు ఎందుకో 'బస్టాండులో మిఠాయి బండి' లోనూ,ఎంతో ఏపుగా పెరిగి అందరి చేలకంటే ఎక్కువ దిగుబడి ఇస్తుందనుకున్నతన పొలంలోనే అంజయ్య ఎండ్రిన్ తాగి ఎందుకు మరణిస్తాడో ' కరమ సన్నాలు' లోనూ, సినిమాల మీదున్న పిచ్చి వ్యామోహం మట్టోడిగానే పేరుపడ్డ అతన్ని,అతని జీవితాన్ని ఎలామార్చిందో 'మట్టోడు' కథలోనూ ఇంకా మరిన్ని కథల్ని వినండి. 

    https://www.dasubhashitam.com/ab-title/ab-bhattiprolu-kathalu-2

    –––  

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    –––  

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    16 min
  • A Walk IN Dark

    #ఏవాక్‌ఇన్‌డార్క్

    జాయిస్ స్ట్రేంజర్

    విశ్వాసానికి మారు పేరుగా కుక్కని చెబుతారు. మనము ఇచ్చిన శిక్షణని బట్టి అవి ఏపనినైనా చేస్తాయి. స్టీవ్ పర్వతప్రాంతాలలో నివసిస్తూ తండ్రికి వ్యవసాయంలో, తల్లికి ఇంటిపనుల్లో సాయంచేస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. తాను పెంచుకునే గొర్రెలకు కాపలాగా, లీగ్ అనే కుక్క అతనికి తోడుగా ఉంటుంది. స్టీవ్ చిననాటి స్నేహితురాలైన మారాను ఆమె టీచర్ ట్రైనింగ్ పూర్తి అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఒక రోజు స్కూల్ పిల్లల్ని ప్రమాదంనుంచి తప్పించబోయి స్టీవ్ ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదంలో అతను తన కంటిచూపును కోల్పోతాడు. మారా జీవితం తన వల్ల దెబ్బతింటుందని ఆమెని కసురుకుని వెళ్ళగొడతాడు. కానీ ఆమె అతని ఫామ్ ని చూసుకుంటూ అతని తల్లి తండ్రులవద్దనే ఉండిపోతుంది. ఒక ట్రైనింగ్ ఇచ్చిన కుక్కని చూపులేని అతనికి తోడుగా ఉండేందుకు మారా పనిచేసిన స్కూల్ పిల్లలు బహుమతిగా ఇస్తారు. ఆట్రయినింగ్ ఇచ్చిన కుక్క ఎలా అతనికి సహాయపడింది? మళ్ళీ అతనికి చూపు వచ్చిన తరువాత సంస్థకు తిరిగి ఇచ్చేసిన ఆ కుక్క ఎలా ఉంది? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.

    ---

    #ఏవాక్‌ఇన్‌డార్క్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/pc-a-walk-in-the-dark

    --- 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    26 min
  • Mahaanadi

    #వెండితెర  సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు. ఇందులో ఎన్నో చిత్రాలు ఊహాత్మకంగా, జరిగినవి, ఒక మనిషి యొక్క ఆత్మకథ ఇలాంటివి అద్భుతంగా మలచి మన ముందుకు తెస్తారు దర్శకులు. మనకి చాలా సినిమాలు ఎంతో ఆదరణ పొందుతాయి ఎందుకో అనిపిస్తుంది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దే పరాజయం పొందుతాయి.కొన్ని అద్భుతంగా 'ఆస్కార్' కు ఎంపికవుతాయి. కొన్ని ఆస్కర్ దాకా వెళ్లకపోయినా అద్భుతంగా కొన్నేళ్లపాటు ఎప్పుడు చూసిన మల్లి మల్లి చూడాలనిపిస్తుంటుంది. అలంటి కొన్ని సినిమాల గురించి విశ్లేషణను Quora సౌజన్యంతో మీ దాసుభాషితంలో వినండి.  

    –

     #వెండితెర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.  https://www.dasubhashitam.com/ab-titl...  Listen to a part of Chapter 1 of #Venditera. Download the App via the link above to listen to the full title.  

    ––  

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    –––  

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    8 min
  • Bypass Samuloru

    #సింహాచలంసంపెంగలు

    శ్రీ రమణ

    థలు కబుర్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. సామాన్యంగా మనతో చెప్పేకబుర్లలా ఉంటె అవి మరీ మనసుకు హత్తుకుంటాయి. శ్రీ రమణగారు రాసిన ఈ కథలలో ఎక్కువగా తన జీవితం లో జరిగిన వాటినే కబుర్లలో రాసినట్టుగా ఉంటాయి. 'బైపాస్ సాములోరు'లో సాములవారి జీవితాలలో ఉండే హంగామా, ఆర్భాటం: చాలా మంది హీరోయిన్ ల జీవితాలలోలా తన గళంతో వ్యాపారం చేసే ఒక భర్తపై తిరగబడిన ఒక భార్య కథ 'చివరి చరణం' లో, సాధారణంగా మావయ్యల దగ్గర ఉండే చనువు , వారు చూపే ఆప్యాయత, ఆదరణ లను 'గుర్రాలమావయ్య'లోను ఇంకా మరి కొన్ని కథలను వినండి.

    ---

    #సింహాచలంసంపెంగలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/ab-title/ab-simhachalam-sampengalu

    --- 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    15 min
  • Yaksha Kinnera Kimpurushulu

    #పురాణయానం  కోరా సౌజన్యంతో  వేదములు, ఇతిహాసాలు, పురాణాలతో, వాటిలోని ధర్మసూక్ష్మాలను అవలంబిస్తూ మన భారతదేశం నడుస్తోంది. వాటిలోని ధర్మాలపై అనేకానేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. మన పురాణాలలో ఎన్నో సందేహాలు. ఎన్ని కథలు మనకు సుపరిచితం అయినా, పిల్లలకు వాటిని కథలుగా చెప్పేటప్పుడో,ఎక్కడైనా ప్రవచనాలు వింటున్నప్పుడో, ఆ కథలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడో అనేకానేక సందేహాలు వస్తూ ఉంటాయి. మనకు తట్టని,ఆలోచించని రీతిలో పిల్లల ఆలోచనావిధానం, తర్కం ఉంటాయి. మరి ఇలాంటి సందేహాలను ఇంట్లో జ్ఞానవృద్దులు ఉంటే తెలుసుకోవచ్చు. ఇలాంటి మనకు వచ్చే సందేహాల నివృత్తికి వేదికగా Quora ఉన్నది. దీని ద్వారా మన సందేహలు కొంతవరకు తెలుసుకుందాం. 

    --- 

    #పురాణయానం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/pc-puraanayaanam

    ---  

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

    ---  

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    7 min
  • North & South

    #నార్త్అండ్‌సౌత్

    ఎలిజబెత్ గాస్కెల్

    కార్మికునికి యజమానికి మధ్యన ఉన్న సమరసభావాన్ని, మానవబంధాన్ని గురించి తెలుపుతుంది ఈ నవలా విశ్లేషణ. చిన్నప్పటి నుంచి పల్లెటూరిలో పెరిగి ఆవాతావరణంలో హాయిగా ఉన్న మార్గరెట్ తన పిన్ని కూతురి పెళ్ళికి సాయానికి పట్నం వస్తుంది. అక్కడి అలవాట్లను, వాతావరణాన్ని అలవరచుకుని అందరికి తలలోని నాలుకలా ఉంటుంది. ఆ పెళ్ళిలో మార్గరెట్‌ని చూసి పెళ్ళికొడుకు అన్నగారు హెన్రి మార్గరెట్‌ని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. కానీ మార్గరెట్‌ని ఇష్టపడదు. అయితే మార్గరెట్‌ తండ్రి హాల్ డబ్బులు బాగా సంపాదించాలని చక్కటి పల్లెటూరి వాతావరణం వదలి, పొగగొట్టాలతో కాలుష్యంతో నిండిన ఉత్తరంవైపుకు ప్రయాణమవుతారు. సాహిత్యం పై మక్కువ ఉన్న ధోర్టన్‌కి మాష్టారుగా హాల్‌ నియమింపబడతాడు.ధోర్టన్‌మార్గరెట్ భావాలకు ,ఆదర్శాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు.కానీ అతని తల్లికి ఇష్టముండదు. అక్కడి వాతావరణానికి మార్గరెట్ తల్లికి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆమె మరణం తో నిర్వేదం లోకి వెళ్లిన హాలును అతని స్నేహితుడు బెల్ తన ఇంటికి తీసుకెళతాడు. కానీ భార్య మీద బెంగతో హాల్ మరణిస్తాడు.ఒంటరిదైన మార్గరెట్‌కు బెల్ తన ఆస్తిని రాసిస్తాడు. లండన్ లోని ఆర్ధిక అసమానతల కారణంగా ధోర్టన్‌ వ్యాపారం దెబ్బతింటుంది. తరువాత ఎలాంటి మార్పులు జరిగాయి? ధోర్టన్‌,మార్గరెట్లు కలుసుకున్నారా? ఈ విశ్లేషణలో వినండి.

    ---

    #నార్త్అండ్‌సౌత్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

    https://www.dasubhashitam.com/search?query=north

    image :- http://images5.fanpop.com/image/photos/32000000/North-and-South-north-and-south-32024244-1920-1080.jpg

    --- 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    34 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.