Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Atma Vs Sareeram

    #ఆధునికఆధ్యాత్మికం 

    దాసు కిరణ్  

    మనలో చాలామందికి ఆధ్యాత్మికత అంటే జీవిత చరమాంకంలో అవలంబించే ఒక వ్యాపకం. కానీ మన వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి దశలోనూ ఆధ్యాత్మికత మన వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన ఒక జీవన విధానం అని మనం తెలుసుకోవాలి. ఈ ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక చింతన మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంతో సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే మనసు లగ్నం చేయకుండా ముక్కు మూసుకుని జపం చేయడం వలన ఏ ప్రయోజనమూ ఉండదు. మన భారతీయ ఆధ్యాత్మికాన్ని నేటి కాలంలో ఎలా ఉపయోగపడుతుందో ఈ 'ఆధునిక ఆధ్యాత్మికం' సిరీస్ లో కొండూరు కిరణ్ కుమార్ గారు వివరించారు.

    --- 

    #ఆధునికఆధ్యాత్మికం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/pc-aadhunika-aadhyatmikam 

    ---  

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   ---  ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    3 min
  • Prakruti Vilayam
    #మహాతలంమాయాదర్పణం

    సుధామయి

    చందమామ కథల్లోలాగా ఒక రాజు, ఒకరాణి , మాంత్రికుడు అతని ప్రాణాలు ఇలానే సాగే ఈ కథలో ఒక దర్పణం (అద్దం) కోసం ఈ కథ సాగుతుంది. పట్టాభిషేకం జరిగే ముందు దేశ సంచారం చేద్దామని, ప్రపంచాన్ని తెలుసుకుందామని తిరుగుతున్న శూరుడైన చంద్రశేనుడికి ఒక శివాలయం వద్ద ఒక అద్దం కనిపించింది. అది విచిత్రంగా తనలోకి అన్నింటిని లాగేసుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఆ అద్దం యొక్క విషయం కనుక్కుందాం అనుకుంటున్న అతనికి మాంత్రికుడు మారు వేషంలో వచ్చి, దాని గురించి చెప్పి మరో ప్రపంచం (మహాతలం) కు పంపిస్తాడు. దర్పణం యొక్క గొప్పతనం, మాంత్రికుడికి వచ్చే లాభం, మహాతలం అందాలు, అద్దం వల్ల చంద్రశేనునికి జరిగిన ప్రయోజనం ఏమిటో వినండి.

    ---

    #మహాతలంమాయాదర్పణం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   www.dasubhashitam.com/ab-title/ab-mahaatalam-maayaadarpanam

    --- 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    --- 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    6 min
  • Athadu - Ame

    అతడు - ఆమె

    ఉప్పల లక్ష్మణరావు

    డబ్బు జీవితాన్నీ శాసిస్తుంది. అధికారం కోసం ఆత్రంగా పైకి ఎదుగుతూ, తాను వచ్చిన స్థితిని మర్చిపోయి, వ్యక్తిత్వాన్నికూడా కోల్పోతుంటారు కొంతమంది. శాంతమ్మ చదివిన చదువుకు ఒక IAS ఆఫీసర్ ని పెళ్లిచేసుకుంటుందని వాళ్ళమ్మ అనుకోగా, ఆమె కోరికకు విరుద్ధంగా శాంతమ్మ తాను మనసిచ్చిన లాయరు చిదంబర శాస్త్రిని పెళ్లి చేసుకుంటుంది. ఒకరి కోసం ఒకరుగా, చాలామందికి ఆదర్శంగా ఉంటూ, ఎంతో దర్జాగా తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటారు వాళ్ళు. కానీ శాస్త్రి చేసిన ఒక చిన్న పనికి వారు తమ కున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి సాధారణ జీవితం గడపాల్సివస్తుంది. శాంతమ్మ ఏమాత్రం కృంగిపోక ఆ పరిస్థితిని కూడా ఆనందంగా అనుభవిస్తూ, కాంగ్రెస్ కార్యకలాపాలలో, స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొంటుంది. శాస్త్రి మళ్ళీ పుంజుకుని ఆస్తి మొత్తాన్ని సంపాదించుకుంటాడు. ఈ మధ్య కాలంలో తన భర్తలో వచ్చిన మార్పును జీర్ణించుకోలేని శాంతమ్మ పిల్లలతో సహా ఇల్లు విడచి వెళ్ళిపోతుంది. శాస్త్రిలో వచ్చిన మార్పు ఏంటి? తన తప్పు తాను తెలుసుకుంటాడా? తిరిగి వాళ్లిద్దరూ కలుసుకుంటారా? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.

    ---

    #అతడుఆమె శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.  

    https://www.dasubhashitam.com/ab-title/pc-athadu-aame

    ---

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    ---

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    26 min
  • Donga

    అర్ధానుస్వారం కథలు  

    ఎన్ తారక రామారావు 

    కథలైనా, నవలలైనా ఈనాటి మన జీవితాలకి దగ్గరగా ఉంటే ఎక్కువగా మనసుకు హత్తుకుంటాయి. తారక రామారావు గారు రాసిన ఈ కథలలో ఈ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే లౌక్యం ఉండాలి అని తెలుస్తుంది. ఏరకమైన విద్య నేర్చుకోనివాడు, ఎందుకు పనికి రాడు అనుకున్నవాడు లౌక్యంతో ఎంతటి పేరు, ప్రతిష్టలు సంపాదించాడో 'తధాస్తు' లోనూ, ఇప్పటి పరికరాలకి, ఈ నాటి హడావిడి జీవితానికి సర్దుకుపోలేక, తానూ ఏ పని చేయాలో తెలీక ,ఊరికే ఆఫీసులో కాలం గడిపే ఒక ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందో 'టైం ఎంతైంది' లోనూ, తాము పుట్టి,పెరిగిన అలవాటు పడిన పరిస్థితులను వదలలేక,అక్కడే తమకున్న దాంట్లోనే ఆనందంగా కాలం గడుపుతూ, తమ కొడుకులు వస్తారని తల్లిదండ్రులు ఎలా ఎదురు చూస్తారో 'బ్రాంతి' లోనూ ఇంకా మరిన్ని కథలను వినండి.  

    https://www.dasubhashitam.com/ab-title/ab-ardhanuswaaram

    ---

    14 min
  • ఆచార్యదేవోభవ

    ప్రతీ ఒక్కరికి తల్లి మొదటి గురువైతే, తల్లి ప్రేమను, తండ్రి నేర్పే క్రమశిక్షణను, అపారమైన విద్యను మనకు అందించేవారే గురువులు. మన పూర్వకాలంలో గురు శుశ్రూష చేసి విద్యలను నేర్చుకునేవారు. కృష్ణుడు, రాముడు కూడా ఇలా నేర్చుకున్న వారే. వేదాలు, శాస్త్రాలు సంస్కృతంలో లేక ద్రావిడ భాషలో ఉన్నాయి. వాటిని పూర్తిగా నేర్చున్నవారు చాలా తక్కువగా ఉండేవారు. రాను రాను గురుకులాలకి వెళ్లి నేర్చుకునేవారు, నేర్పేవారు కూడా తగ్గారు. వీటిని జనసామాన్యంలోకి తేవడానికి చాలా మంది కృషి చేసారు. బీద కుటుంబంలో పుట్టినా, చదువుమీద ఆశతో, శాస్త్రం నేర్చుకోవాలన్న పట్టుదలతో ఎందరో వివిధ శాస్త్రాలలో ప్రావీణ్యులయ్యారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా ,ఉపకులపతులుగా ఉండి తమకున్న ఆసక్తితో చేసిన పరిశోధనలను, సాహిత్యంపై అనేకులు చేసిన కృషిని ఈ 'ఆచార్యదేవోభవ' లో వినండి.

    42 min
  • Antullu | Bhattiprolu kathalu

    భట్టిప్రోలు కథలు 1 

    నక్కా విజయరామరాజు

    సాధారణంగా పల్లెటూర్లు అంటే ఇష్టపడనివారు ఉండరు. చిననాటి జ్ఞాపకాలూ  మరచిపోయేవీకావు. పల్లెటూర్లలో ఉండే ఆప్యాయతలు, అనురాగాలు పక్కంటివారింట్లో దొంగతనం జరిగినా పట్టించుకోని  పట్టణాలలో ఉండవు. తాను పుట్టి పెరిగిన ఊరిలోని కథలను మనసుకు హత్తుకునేలా రాసారు విజయరామరాజుగారు.

    భార్యాభర్తల మధ్యన ఉండే ప్రేమానురాగాలను, భర్త ఇంకొకరితో మాట్లాడితే ఆ భార్యలో కలిగే ఈర్ష్య, అసూయను,చాలా చక్కగా 'అంటుళ్లు' లోనూ, ఒకనాటి జమీందార్లు వారి ఆస్తులు కరిగిపోయిన తీరులు 'అత్తరు జమీందారు' లోనూ, పల్లెటూర్లలో సంక్రాంతికి ఆడే కోడిపందాలు, మనుషులమధ్యన పెరిగే కక్షలు 'పెట్టమారి' లోనూ, కష్టపడి పైకొచ్చిన సుధాకర్‌ను మోసం చేసి ఊర్లో దర్జాగా తిరిగిన పెద్దబ్బులు కథ 'జేబులోడు' లోనూ ఇంకామరికొన్ని కథలను వినండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-bhattiprolu-kathalu-1

    14 min
  • Without Mercy

    #వితౌట్‌మెర్సీ 

    లోకంలో వెల కట్టలేనిది, తరగనిది, ఏ స్వార్థం లేనిది అమ్మ ప్రేమ ఒక్కటే. జంతువులు, పక్షులు తన పిల్లలను కాపాడుకోడానికి ఎలా విశ్వప్రయత్నం చేస్తాయో అలాగే ఒక చదువులేని స్త్రీ తన పిల్లలను కాపాడుకోవడం కోసం చేసిన పోరాటాన్ని వివరించినదే "వితౌట్ మెర్సీ" అనే ఈ యదార్ధ గాథ.   మిరియం అలీ బ్రిటన్ లో పని చేసుకుంటూ పొట్ట పోసుకునే ఒక యువతి. ఆమె పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఫ్రెడ్‌ను పెళ్లి చేసుకుంటుంది. ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుని, కాలం వెళ్లబుచ్చే అతను పిల్లల్ని ఆదాయం తెచ్చే వనరుగా, భార్యను పిల్లల్ని కనే యంత్రంగా భావిస్తాడు. ప్రతి సంవత్సరం ఒక పిల్ల చొప్పున భార్య ఆరోగ్యాన్ని కూడా చూడకుండా ఐదుగురు పిల్లల్ని కంటాడు. ఆడ పిల్లల్ని ఇద్దర్ని వారి స్వస్థలమైన అరబ్ దేశంలోని యమన్‌‌ను చూపిస్తానని చెప్పి అక్కడ వారిని అమ్మేస్తాడు. దౌత్య కార్యాలయానికి లేఖలు రాసి, పత్రికల్లో తన దీన గాథను వివరించి, దుబాయిలో ఉన్న తన పిల్లల్ని, తన దగ్గరకు తెచ్చుకోడానికి మిరియం పడిన అగచాట్లు ఏమిటో వినండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-without-mercy 

    ––– 

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    ––– 

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    29 min
  • Himabindu

    #హిమబిందు

    ఈ నాటి ప్రజాస్వామ్యానికి ముందు మన భరత దేశాన్నిరాజులు పాలించారు. కొన్ని ఏళ్ళక్రితం పాలించిన వారిలో మగధులు,చోళులు, పల్లవులు, శాతవాహనులు.. ఇలా చాలా మంది. అడవి బాపిరాజు గారు శాతవాహనుల కాలంను తన నవలలో వివరించిన విధానం వినండి. శాతవాహనుల కాలం నాటి శిల్పకళను, రాజులను ఓడించడానికి ఇతరులు చేసే ప్రయత్నాలు, యుద్ధంలో సైనికులు పడే అగచాట్లు, అన్నా చెల్లెళ్ళ సంబంధాలు, పందెంలో ఒకర్ని ఓడించాలనే కసి, ఇరువురు రాజుల మధ్యన ఉండే పగ, రాణులకు ఉండే అలంకారపు వస్తువులు, ఈ నాటి మానవ బాంబులా ఆనాడు పగ కోసం ఒక స్త్రీని విషకన్యగా మార్చిన తీరు మరిన్ని విషయాలను ఈ హిమబిందు మొదటి భాగంలో వినండి.

    –

    #హిమబిందు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-himabindu-1

    Listen to a part of Chapter 1 of #Himabindu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    9 min
  • Jalandhara Kathalu

    #జలంధర‌కథలు

    మన బాధలకు కారణం ఎదుటువారిని చూపించకూడదు అని, మనం ఆలోచించే విధానంలో మార్పు ఉండాలి అని పున్నాగపూలులో తెలుసుకున్నాం. అలాగే జలంధరగారు రాసిన వారి కథలలో కూడా అత్యుత్తమ పాత్రలని సృష్టించారు. మౌనంగా ఆరాధిస్తూ జీవితంలో ఓడిపోయిన శారదకు సాయం చేసిన ఒక మూగ ప్రేమికుని కథ సాలభంజికలలోనూ, పేదరికంలో ఉన్న ఒక అనాధ తన అక్కకు ఆత్మశాంతి కలగడంకోసం పడే తపనకి ఒక పెద్దింటి ఆవిడ ఏం చేసిందో 'శ్రద్ధాంజలి' లో, కొన్ని కళల్లో నిష్ణాతులైన వారి జీవిత గాథలు ఎన్నో మలుపులతో, ఎంతో విచిత్రంగా ఉంటాయి. అలా ఒక గాయని యొక్క జీవితగాథని 'మహా గాయని' లోనూ ఇంకా మరికొన్ని కథలను వినండి.

    –

    #జలంధర‌కథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-jalandhara-kathalu-1

    Listen to a part of Chapter 1 of #JalandharaKathalu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    15 min
  • Nede Choodandi

    #నేడే‌చూడండి

    సినిమా అంటే ప్రజలందరిలో ఏదో ఉత్సాహం, ఉత్తేజం. అది పాతదైనా, కొత్తదైనా. ఈ సినిమాలలో ఇప్పుడు యానిమేటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయి. తెలుగులో సినిమాలు తీయడం అనే ప్రక్రియకు ఆద్యుడుగా రఘుపతి వెంకయ్య గారినే చెప్పుకోవాలి. మూకీ సినిమాలని తీసి మొదట్లో అన్ని చోట్ల ప్రదర్శించారు. వాహిని,విజయ స్టూడియోలు రాకమునుపు వీరు తీసిన ఈ మూకీ చిత్రాలను ప్రజలు ఈ కదిలే చిత్రాలు ఏమిటా అని ఎంతో ఆదరించారు. వీరు వీరి అబ్బాయిని ఈ చిత్రాలకి సంబంధించి పై చదువులు చదువుటకు విదేశాలకు పంపారు. తరువాత వీరు నిర్మాణం చేపట్టి ఎంతగానో నష్టపోయారు. వీరు ఎందుకు నిర్మాణంలో నష్టపోయారు తరువాత ఏమి జరిగిందో ఈ సినీ చరిత్ర మొదటిభాగంలో వినండి.

    –

    #నేడే‌చూడండి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-nede-choodandi-1

    Listen to a part of Chapter 1 of #NedeChoodandi. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    18 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.