Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Basavaraju Apparao – Chapter 1

    #బసవరాజు‌అప్పారావు

    ఆయన రచనల్లోనూ, జీవితంలోనూ కూడా ఎక్కువ కవిత్వం ఉంది అనేలా రచన సాగించిన సుప్రసిద్ధ కవి శ్రీ బసవరాజు అప్పారావు గారు. స్వయంగా గాయకుడు, సంగీత పరిజ్ఞానం ఉన్నందువల్ల లయాత్మకంగా పాడగలరు. ఈయన కవితల్లో ఉర్దూ కవుల గజల్స్ కొంతవరకు కనిపిస్తాయి. చాలామంది వీరి పాటలను ఈనాటికీ తమ జీవితానికి అన్వయించుకునేలా ఉంటాయి. రెండు కవితలు బసవరాజు గారిని అగ్రశ్రేణి కవుల్లో నిలబెట్టాయి. ప్రణయానికి, విరహానికీ, వియోగానికి, సంగీతానికి, మాధుర్యానికి నిదర్శనమైన శ్రీ కృషుని గురించి వీరు వ్రాసిన గేయం ఏమిటి? భావకవి శ్రీ దేవులపల్లి కృషాశాస్త్రి గారు వీరి గురించి ఏమన్నారో వినండి.

    –

    #బసవరాజు‌అప్పారావు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-basavaraju-apparao

    Listen to a part of Chapter 1 of #BasavarajuApparao. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    13 min
  • Navarasaalu – Chapter 1

    #నవరసాలు

    మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల సంఘటనలను ఎదుర్కొంటాం. ఎంతోమంది మనుషులను కలుస్తుంటాం. వారివల్ల మనలో నవరసాలలో ఏదో ఒక భావం మన మనసుకి తాకుతుంది. ఒక మంచి కథ విన్నా, ఒక మంచి సినిమా చూసినా ఆ భావాలకి మన హృదయం సహజంగా స్పందిస్తుంది. ఏ రకమైన భావాలకి స్పందించని మనిషి ఉండనే ఉండరు అంటే అతిశయోక్తి. అమ్మ లాలిత్యంలోనూ, లాలనలోనూ కరుణరసం కనబడితే, ఒక ఉద్యమంలోనూ, రాజ్యాన్ని దక్కించుకోడంలోనూ వీరరసం కనబడుతుంది. మనం మన జీవితంలో వివిధ రసాలకు లోనవుతూవుంటాం.

    –

    #నవరసాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-navarasaalu

    Listen to a part of Chapter 1 of #Navarasaalu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    8 min
  • Agrahaaram Kathalu – Chapter 1

    #అగ్రహారం‌కథలు

    వేగం మనిషి మనుగడలో చేరి అలజడి కలుగజేస్తోంది. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది కానీ మనిషి జీవితంలో మనశ్శాంతిని కోల్పోతున్నాడు. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లోనూ, ఆప్యాయతలు, అనురాగాల్లో అనేక మార్పులు వచ్చాయి. రక్త సంబంధం లేకున్నా పక్కింటివారిని, ఎదురింటివారిని వరసలతో పిలిచి కలుపుకున్న బంధాలు, ఆబంధాలు తెచ్చిన బలం, ధైర్యం ఈనాడు లేవు. ఈ కథలలో ప్రతీ ఇంట ఉండవలసిన దుర్గమ్మలాంటి పెద్దవారు, భార్యాభర్తల ఆప్యాయతలు, బస్సు డ్రైవరే అయినా ఆ వూరిలో అతను సంపాదించిన ప్రేమ, ఆప్యాయతలను, పల్లెటూరిపిల్ల పట్నంలో ఇమడలేక పడే ఇబ్బంది గూర్చి ఇంకా ఇలా మరెన్నో మనచుట్టూ మనతో ఉన్న మనుషులగురించి సుభద్రగారు వివరించిన తీరు వినండి.

    –

    #అగ్రహారం‌కథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-agrahaaram-kathalu

    Listen to a part of Chapter 1 of #AgrahaaramKathalu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    10 min
  • Psychic – Chapter 1

    #సైకిక్

    ఒక్కోసారి మనిషికి జరిగే కొన్ని విపరీత పరిస్థితుల వల్ల, దుర్ఘటనల వల్ల కొంతమందికి లాభం జరుగుతుంది. అలానే నైరేన్‌కు ఒక ప్రమాదం వల్ల అతని జీవితంలో జరిగిన పరిణామాలను వివరించాడు సైకిక్ నవలలో. ఒక కూలి కుటుంబంలో పుట్టి, మేస్త్రీ గా పని చేస్తున్న నైరేన్‌ ప్రమాదవశాత్తు చాలా ఎత్తు నుండి కిందపడడం వల్ల మెదడుకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. దాని వల్ల అతనికి అంతర్ దృష్టి (6th సెన్స్) పనిచేస్తూ భవిష్యత్తు చెప్పడం మొదలు పెడతాడు. అందువల్ల చాలామంది వారి కుటుంబంలో తప్పిపోయినవారి గురించి అడిగి తెలుసుకునేవారు. ఒకసారి తన శక్తిని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి ప్రభుత్వంలో పేరుకుపోయిన ఎన్నోశిక్షలు పడని కేసు‌లను పరిష్కరించేవాడు. ఇలా తనకు లభించిన అతీంద్రియ శక్తితో తాను చేసిన మంచి పని ఏమిటో వినండి.

    –

    #సైకిక్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-psychic

    Listen to a part of Chapter 1 of #Psychic. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    26 min
  • Krishnapaksham Suklapaksham – Chapter 1

    #కృష్ణ‌పక్షం‌-‌శుక్ల‌పక్షం

    ' ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము ' అన్నట్లు జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవు. యువతీ యువకుల్లో పెళ్లి దాకా వెళ్లే ప్రేమలు కొన్నే చూస్తాం. ప్రసాద్, అనుపమ ఒకే స్కూల్లో టీచర్లు. ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధం అవుతారు. అనుకోని సంఘటన వల్ల వారి పెళ్లి ఆగిపోతుంది; కృష్ణమోహన్ డబ్బున్న పెద్ద డాక్టర్. భార్యతో ఎంతో ఆనందంగా ఉంటున్న అతను,అతని భార్యను వదిలేస్తాడు; ఎంతో అందమైన అమ్మాయి లక్ష్మి, కానీ ఆమె తన భర్తతో కలిసి ఉండలేదు. నాలుగు స్థంభాల్లా వేరే వేరే దిశల్లో ఉన్న ఈ నలుగురి జీవితాలు ఏ దరి చేరాయో వినండి.

    –

    #కృష్ణ‌పక్షం‌-‌శుక్ల‌పక్షం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-krishnapaksham-suklapaksham

    Listen to a part of Chapter 1 of #KrishnapakshamSuklapaksham. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    20 min
  • Kalyana Sundari Jagannatha – Chapter 1

    #కళ్యాణ‌సుందరీ‌జగన్నాథ్

    ఒకటో, రెండో పుస్తకాలు రాసినా ఎంతో పేరు తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రీమతి కళ్యాణ సుందరీ జగన్నాథ్. 1950-60 కాలాల్లో రచయిత్రిలు అడుగు పెట్టడానికి అనువైన కాలం. ఈమె రాసిన కథలు చాలా కొన్ని మాత్రమే అయినా ఆమె ప్రతీ వాక్యంలోనూ తెలుగుదనాన్ని ఒలికించారు. వీరి కథలలో ప్రధానాంశం స్త్రీ, పురుష సంబంధాలు. అందులో ప్రణయం, భగ్న ప్రేమ ఎక్కువగా కనిపిస్తాయి. ఈమె కథలు రాయడానికి ప్రోత్సహించినవారు ఎవరు? ఆమె పైన ఎక్కువగా ప్రభావం చూపించిన బ్రిటిష్ రచయిత ఎవరు? రచయితలను, మేధావులను ఆకర్షించిన కథాంశం ఏమిటి? ఎంతో ఉత్కంఠంగా సాగే ప్రేమ కథలకి ఆమె విషాదాంతాలే ఎందుకు రాశారో వినండి.

    –

    #కళ్యాణ‌సుందరీ‌జగన్నాథ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-kalyana-sundari-jaganaath

    Listen to a part of Chapter 1 of #KalyanaSundariJagannatha. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    13 min
  • Premalekha – Chapter 1

    #ప్రేమలేఖ

    లేఖల (ఉత్తరాలు) ద్వారా మన మనసులోని భావాలను పంచుకునే వీలుండేది. ఉత్తరాల ద్వారానే మనుషుల అపార్ధాలు తొలగించడం, మనుషుల మధ్య దూరాలు తొలగిపోడం, స్నేహ బంధం పెరగడంలాంటివి జరిగేవి. ఇక ప్రేమలేఖల సంగతి చెప్పనక్కరలేదు. ఇప్పుడు ఆ ఉత్తరాలంటేనే తెలీనివాళ్ళు కూడా ఉన్నారు. ఒక ప్రేమలేఖని అందుకుని, ఆ రాసిన అమ్మాయి తనను ఎంతగా ప్రేమిస్తోందో అని, ఆ అమ్మాయినే పెళ్ళిచేసుకోవాలని వచ్చిన ప్రతి సంబంధాన్ని నిరాకరించాడు ఆనందరావు. చదువుపై శ్రద్ద లేక పరీక్షల్లో తప్పుతూ పొగరుబోతు పిల్లగా పేరు తెచ్చుకున్న అల్లరిపిల్ల స్వర్ణ. ఇష్టం లేక పోయిన పెద్దల మందలింపుతో ఆనందరావు స్వర్ణని పెళ్ళిచేసుకుని మొదటి రాత్రే స్వర్ణ చెప్పిన మాటలకి షాక్ తగిలి స్పృహ కోల్పోతాడు ఆనందరావు. అసలు ఏం జరిగిందో ? స్వర్ణ ఏం చెప్పిందో ? వినండి ప్రేమలేఖ లో.

    –

    #ప్రేమలేఖ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-premalekha

    Listen to a part of Chapter 1 of #Premalekha. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    21 min
  • Nadulu – Chapter 1

    #నదులు

    నది ఒక సృష్టి కి, నిరంతర ప్రవాహ శీలానికి సంకేతం. నీటి దగ్గర మనిషి ఆవాసం ఏర్పరచుకున్నప్పుడు నాగరికత వృద్ధి చెందింది అని చెప్పుకుంటాం. ప్రాచీన సాహిత్యం అంతా నదులు,సముద్రాల ప్రస్తావన లేకుండా జరగలేదు. "నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం... "అన్నాడు ఒక కవి . మన జీవిత ప్రయాణాన్ని యావత్తును ధ్వనింపచేసే తాత్వికత కూడా పడవ ప్రయాణంలో కనిపిస్తుంది. కవులు జీవిత గమ్యానికి, నదీ తీరానికి సామ్యాన్ని చూపుతారు. మరెన్నో విషయాలను నదులపై విశ్లేషణలో వినండి.

    –

    #నదులు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-nadulu

    Listen to a part of Chapter 1 of #Nadulu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    9 min
  • Jajimalli – Chapter 1

    #జాజిమల్లి

    పట్నపు వాతావరణంలోని నాగరికతలో ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నా మనం మనల్ని కోల్పోతూ, మన మనశ్శాంతిని కూడా కోల్పోతున్నాం. మనపరుగులు, ఉరుకులు మనకేంకావాలో అవి మనకందకుండా చేస్తున్నాయి. మంచి స్నేహాన్ని, తోడును మనకి దూరం చేస్తున్నాయి. జాలర్ల కుటుంబంలో పుట్టిన బద్దాలుకు, అతని బావ అంటే అమితమైన ఇష్టం, ప్రేమ. ఆమె బావకు బద్దాలును రాకుమారిలా చూడాలని, ఆమె కోసం ఎంతో ధనాన్ని సంపాదించి, తాను అనుకున్నట్లు ఉన్నత స్థానంలో ఉండేలా ఆమెను తీర్చిదిద్దాలని కోరిక. వీరి ఇరువురికి నరసింహారావు మాష్టారు అన్నీ తానై తోడుగా ఉంటారు. ఏదో కోల్పోయాననుకున్న పద్మావతికి, నరసింహారావు మాష్టారి శిష్యుడు,గొప్ప సంగీత దర్శకుడు అయిన రాధాకృష్ణ, అతని భార్య సుశీల పరిచయం వల్ల వారి జీవితాల్లో జరిగిన అనూహ్య మార్పును,దాని తరవాత వారి జీవితాల్లో వికసించిన జాజిమల్లెల సౌరభం ఎలావుందో వినండి.

    –

    #జాజిమల్లి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-jajimalli

    Listen to a part of Chapter 1 of #Jajimalli. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • Wine & Olive – Chapter 1

    #వైన్‌అండ్‌ఆలివ్

    ప్రభుత్వం అనేక చట్టాలు, పథకాలు రాజ్యాగంలో తీసుకువస్తుంది. అలా తీసుకువచ్చే పథకాల్లో మద్యనిషేధం, కుటుంబనియంత్రణ, హరితవిప్లవం ఇలాంటివి కొన్ని. కానీ అవి అమలు జరగాలంటే ఒక పెద్ద ఉద్యమం జరగాలి. అలాంటి ఉద్యమంలో ఒకటైన కుటుంబనియంత్రణ గూర్చి రచించబడినదే ఈ నవల. పిల్లల పౌష్ఠిక ఆహరం ఉత్పత్తులను తయారుచేసే బయోడ్ కంపెనీకి అధిపతి, సంపన్నుల్లో ఒకడు, అందగాడు అంగీస్. నలుగురి పిల్లల తల్లి అయినా ఎంతో అందంగా ఉండే చక్కటి మనిషి క్లారీ. వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకుని అందరికి ఆదర్శవంతంగా ఉంటారు. క్లారి సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటూ, కుటుంబనియంత్రణకు ఉద్యమం చేబడుతుంది. ఈ ఉద్యమం వల్ల అంగీస్ కంపనీలో ఉత్పత్తుల కొనుగోలు పడిపోవడంతో ఇద్దరికీ మధ్య గొడవలు పెరిగి ఎవరి దారిన వారుగా అయిపోతారు. అంగీస్ కు తాను చేసిన పొరపాటేమిటో ఎలా తెలుస్తుందో వినండి ఈ విశ్లేషణలో...

    –

    #వైన్‌అండ్‌ఆలివ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-wine-and-olive

    Listen to a part of Chapter 1 of #WineAndOlive. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    24 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.