కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఒక తెలుగు భాషాభిమాని గా , మరీ ముఖ్యంగా ఈ "కానమోకు కథావచనం!" లక్ష్యం గూడా తెలుగు భాష కు నావంతు కర్తవ్యంగా నేను స్వయంగా చేసే " మాతృభాషా సేవ" గా తెలుగు భాష లో ప్రచురితమైన నేను చదివిన పలు కథ లు, వ్యాసాoశములు , హేతు విజ్ఞాన విషయాలు , జీవిత స్వగతాలు , తదితరాలను పలువురికి వినిపించాలనే సదుద్దేశంతో మీ కానమోకు స్వరం తో చదివి ఈ Pod Cast ప్రక్రియ ద్వారా Record చేసి శాశ్వత మొనర్చె సంకల్పంతో తృప్తిని పొందుతున్నాను. ఆ క్రమం లోనే ఇప్పుడు ఈ " తేనె లొలుకు తెలుగు భాష ! " అనే కనువిప్పు కలిగించే ఈ కథా రూప రచనను శ్రీ శేష కల్యాణి గుండమ రాజు చేయగా మీ కానమోకు స్వరాన ఇది నా తెలుగు భాషా సేవగా సమర్పిస్తూ శ్రోతలుగా మీరు ఆలకించి ఈ నా క్రతువుకు మీ ఆదరణను అభిలాషిస్తూ దీన్ని నివేదిస్తున్నాను !.