Sign up to save your podcasts
Or

#కోదండ రామిరెడ్డి
ఎన్నో ఘన చిత్ర విజయాలను సాధించి, చిరంజీవి mega stardom కి కారకులైన దర్శకులలో మొదటి వారు శ్రీ కోదండరామి రెడ్డి. కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రాల డ్రీం టీం చిరంజీవి, కోదండరామిరెడ్డి, K S రామారావు, యండమూరి, సత్యానంద్. మీకు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, దొంగమొగుడు, చిత్రాలు నచ్చితే, మీరు ఈ ముఖాముఖీని ఇష్టపడతారు. ఎందుకంటే దీనిని నిర్వహించినవారు ఆ చిత్రాల కథా రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్.
–
#కోదండ రామిరెడ్డి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kodanda-mukhaamukhee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#మురారి
కాట్రగడ్డ మురారి 90 దశకం వరకు విజయవంతమైన చిత్రాలు తీసిన సినీ నిర్మాత. సీతామాలక్ష్మి, గోరింటాకు, జానకీరాముడు, నారి నారి నడుమ మురారి లు ఆయన తీసిన కొన్ని సినిమాలు. డాక్టర్ చదువు మానేసి మరీ దర్శకుడవుదామని చిత్ర రంగం ప్రవేశం చేసిన మురారి గారు, నిర్మాతగా ఎందుకు మారారు? తాను తీసిన సినిమాలేవీ కళాఖండాలు కావు అని ఒప్పుకునే మురారి, తన చిత్రల్లో ఏ ఒక్క విషయంలో తన మాటే నెగ్గాలనుకునేవారు? ఇంకా చాలా ఆసక్తి కలిగించే విషయాలు ఈ చిన్న ముఖాముఖీ లో వినండి.
–
#మురారి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-katragadda-murari-mukhaamukhee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#గిరిజా కళ్యాణం
వివాహమూ, వైవాహిక జీవితమూ అంటే భిన్న అభిప్రాయాలున్న ఇద్దరు యువతీ యువకుల చుట్టూ అల్లిన కథ ఇది. పెళ్లి అంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది. జీవితమంటే భార్య, పిల్లలు, బాధ్యత అనే ఎలాంటి బాదరబందీ లేకుండా ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా ఆనందంగా సాగిపోవాలంటాడు తాడు చందూ. విచిత్రంగా విధి వీరిద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. పెళ్లయిన మొదటి రాత్రే, "ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్లి. నీకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు. త్వరలో నీకు డివోర్స్ ఇచ్చేస్తాను" అని చెప్పేసి గిరిజను నిశ్చేష్టురాలిని చేశాడు. విభిన్న ధ్రువాలైన ఆ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది? రమణీయమైన శైలిలో పాఠకులను ఉత్కంఠతతో ఉక్కిరి బిక్కిరి చేసి తన్మయంలో ముంచెత్తిన సులోచనారాణి నవల, ‘గిరిజా కళ్యాణం’ మొదటి సారి శ్రవణ రూపంలో, ఆమె కుమార్తె శ్రీమతి శైలజ, అల్లుడు శ్రీ రవి నూకల సౌజన్యంతో మీ ముందుకు తెస్తోంది దాసుభాషితం. ఈ భాగంలో మొదటి 30 అధ్యయాలు వింటారు.
–
#గిరిజా కళ్యాణం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-girija-kalyanam-part-1
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#వెన్నెల
పున్నమి వెన్నెలను చూస్తే మనసు పులకరిస్తుంది. వెన్నెలపై ఎందరో కవులు వారి భావాలను పలికించారు. ప్రాచీన కవులూ వెన్నెలను తమ కవితా వస్తువుగా తీసుకుని రచనలు సాగించారు. వెన్నెల ప్రేయసి, ప్రియుల మధ్య ఆనందాన్ని, ఆహ్లాదాన్నే కాక ఆవేదనను కూడా పెంచుతుంది. వెన్నెలను తెలుగు సినీ సాహిత్యంలో ఉంచిన వారు ఆరుద్రగారు. వెన్నెలతో తమ బాధను, విరహాన్ని విన్నవించుకోడం సినీసంగీతంలో వింటూనే ఉంటాం. మరి ప్రాచీన కవులు తమ సాహిత్యంలో వెన్నెలపై రాసిన విశ్లేషణను మృణాళిని గారి ద్వారా వినండి.
–
#వెన్నెల శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-vennela
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#బుచ్చి బాబు
ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు, బుచ్చిబాబుగా ప్రసిద్ధులైన శివరాజు వెంకట సుబ్బారావు రచనల మీద డా. C. మృణాళిని తమదైన ప్రత్యేక శైలిలో చేసిన విశ్లేషణ ఇది. జూన్ 14, ఆయన జయంతి సందర్భంగా 4 అధ్యాయాలలో మీకు అందిస్తున్నది దాసుభాషితం. ఇది విన్న తరువాత, మీకు ఆయన వ్రాసిన ప్రసిద్ధ నవల 'చివరకు మిగిలేది" తప్పక చదవాలని పిస్తుంది. దాసుభాషితం ఆ పూర్తి నవలను శ్రవణ రూపంలో ఇదే యాప్ లో అందిస్తుంది. Chivaraku అని యాప్ లో వెతకండి.
–
#బుచ్చి బాబు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-bucchi-babu
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#కాశీ యాత్ర
హైందవ సంప్రదాయంలో తీర్థ యాత్రలకు ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ, భారతీయ ఆత్మగా కీర్తించబడుతున్న కారణాన కాశీ యాత్ర మరింత ప్రత్యేకం. ప్రాచీన సంప్రదాయ విద్యలకు అప్పుడూ ఇప్పుడూ అధ్యయన అధ్యాపన కేంద్రంగా కూడా భాసిల్లుతోంది. తెలుగు సాహిత్యాన్ని భావి తరాల వారికి శ్రవణ రూపంలో అందించడానికి ‘దాసుభాషితం’ చేస్తున్న కృషిలో భాగంగా పుస్తకాలను అన్వేషిస్తున్న క్రమంలో కాశీ యాత్రకు సంబంధించిన రెండు పుస్తకాలు లభించాయి. రెండూ ప్రముఖమైనవే. ఒకటి శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య గారు వ్రాసిన కాశీ యాత్ర చరిత్ర, మరొకటి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు వ్రాసిన కాశీ యాత్ర. శతావధాని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి 18 యేండ్ల వయసులో కాశీ మహాక్షేత్రానికి వ్యాకరణాధ్యయనం కొరకు వెళ్లారు. ఆ అనుభవాలను 64 ఏళ్ళ వయసులో 1934లో రాశారు. ఇది ఈనాటి పాఠకులకు ఆసక్తిదాయకంగానూ ఆమోద యోగ్యంగానూ తోచటం చెళ్లపిళ్ల వారి కాశీ యాత్ర నే ఎంచుకోవడం జరిగింది. ఈ పుస్తకంలో 'కాశీ యాత్ర' తో పాటు మరికొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. వాటిని విసర్జించి కేవలం కాశీ యాత్ర అధ్యాయానికి మాత్రమే ఈ శ్రవణ పుస్తకాన్ని పరిమితం చేయడం జరిగింది. ఇక రచనా, శైలి విషయానికి వస్తే చెళ్ళపిళ్ళ వచనంలో ఒక విలక్షణత ఉంది. పదాలు మెత్తగా ఉంటాయి. చెప్పడంలో చమత్కారం ఉంటుంది. వాక్య నిర్మాణంలో సౌందర్యం ఉట్టి పడుతూ ఉంటుంది. అన్నీ కలిపి పాఠకుడిని అనిర్వచనీయమైన ఒక మోహావేశంలో కట్టిపడేస్తాయి. అందుకే తిరుపతి శాస్త్రి పద్యంలో సొగసరి, వేంకట శాస్త్రి గద్యంలో గడసరి అంటారు. ఇన్ని విధాల విశిష్టమైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వ్రాసిన ఈ కాశీ యాత్ర గ్రంధాన్ని అన్నమయ్య గ్రంధాలయం ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన శ్రీ మోదుగుల రవికృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్ధిక సహాయంతో 2012 సంవత్సరంలో అందమైన గ్రంధంగా ప్రచురించారు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి ప్రత్యక్ష శిష్యులలో ఒకరైన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి "మా గురువు గారు.... " అనే ముందుమాటతో సహా ఈ పుస్తకాన్ని యథాతథంగా శ్రవణంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి "కాశీ యాత్ర”. శ్రవణానువాదం గళం: కొండూరు తులసీదాస్.
–
#కాశీ యాత్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-kaasi-yatra
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ఆర్. నారాయణ మూర్తి
దర్శకుడు, నటుడు అయిన ఆర్. నారాయణ మూర్తి గారి గురించి విందాం . నారాయణ మూర్తి గారి చదువు, వారి ఊరు, ఆయన చదువుకున్న రోజుల్లో ఉద్యమకారుడిగా మారిన తీరు, ఇంకా ఆయన సినిమాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు? ఆయనకు సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది? రెండవసారి సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? మద్రాసులో ఆయన ఎలాంటి కష్టాలు పడ్డారు? అసలు దర్శకత్వం చేయాలని ఎందుకు అనుకున్నారు? ఎలా చేసారు? మరియు ఆయన మొదట దర్శకత్వం వహించిన 'అర్ధరాత్రి స్వతంత్రం' సినిమా గురించి ఆయన అనుభవాలు మీ దాసుభాషితం ద్వారా ముఖాముఖీలో.....
–
#ఆర్. నారాయణ మూర్తి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-narayana-murthy
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#వెలుగు వెన్నెల హారతి
“నేను వ్రాసే వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చిన్న చిన్న కథలు, ఉదాహరణలు ఇస్తూ వచ్చాను. అయితే ఇటువంటి పెర్సొనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ కథలు పిల్లలకు ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ ఇస్తాయి. అలాంటి కథలన్నీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఒక పుస్తకం రాశాను దాని పేరు వెలుగు వెన్నెల హారతి. అదే ఇప్పుడు మీకు శ్రవణ రూపంలో ప్రెజెంట్ చేస్తున్నాను. నా వివిధ వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోనుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని కథలు విదేశాలకు సంబంధించిన పురాతన గాధలు మరికొన్ని, బౌద్ధానికి జైనానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కొన్ని ఇంటర్నెట్ నుంచి స్వీకరించినవి, కానీ చాలావరకు నావి. పెద్దలు పిల్లలకి బెడ్ రూమ్ కథలు చెప్పటం తగ్గిపోయింది. 'అసలు మాకు తెలుస్తే కదా చెప్పటానికి’ అంటున్నారు కొందరు. ఈ శ్రవణ పుస్తకం ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నాను. మీరు వినండి. వీలైతే పిల్లలకు చెప్పండి, లేదా వారికి వినిపించండి." - మీ యండమూరి వీరేంద్రనాథ్
–
#వెలుగు వెన్నెల హారతి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-velugu-vennela-harathi
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#అనుభవాలు జ్ఞాపకాలూను
తెలుగు కథా రచయితల్లో మున్ముందుగా జ్ఞప్తికి వచ్చే కొందరిలో శ్రీపాద సుబ్రహణ్య శాస్త్రి గారు ఒకరు. ఇంకా చెప్పాలంటే వీరే ప్రధములు. వెలనాటి శాఖీయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వీరు వారి వంశ విద్యలైన శ్రౌతస్మార్తములు, జ్యోతిష్యములు నేర్చుకున్నారు. వచనానికి కండబలం, గుండెబలం ఇచ్చిన రచయితల్లో శాస్త్రి గారు గణనీయులు. వాడీ, వేడి సమృద్ధిగా ఉన్న భాష వీరిది.సంస్కృత పండితుడు అయికూడా తెలుగుభాష మీద మక్కువతో తెలుగులోనే ఎక్కువ రచనలు చేశారు. ఎందరో రచయితలు అన్నట్లు వీరి రచనలన్నీ ఒక ఎత్తు ఈ "అనుభవాలు జ్ఞాపకాలు" ఒక ఎత్తు. స్వీయ చరిత్ర, ఆత్మకథ వంటి పేర్లు కాకుండా అనుభవాలు జ్ఞాపకాలు అనే ఈ పేరు ఎందుకు పెట్టారు? వీరి జీవితంలో జరిగిన సంఘటనలు, ఆనాటి వారి జీవన విధానం ఏమిటో వినండి మీ దాసుభాషితంలో.
–
#అనుభవాలు జ్ఞాపకాలూను శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-anubhavalu-jnapakaloonu-1
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ఇల్లాలిముచ్చట్లు
పత్రికలలో కాలమ్స్ రాయాలంటే అపారమైన పాండిత్యం ఉండాలి. ప్రతిభ, పాండిత్యం, అభ్యాసం ఉన్న రచయితలలే ఈ కాలమ్స్ రాయగలరు. ఇలా సంవత్సరాల తరబడి కాలమ్స్ రాసిన వారు తెలుగులో చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. వీరు ఎన్నో నవలలు, కథలు రాసినా వీరికి బాగా పేరు తెచ్చినది మాత్రం "ఇల్లాలిముచ్చట్లు". ఈయన రాసిన ఈ ఇల్లాలిముచ్చట్లు శీర్షికలు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందాయి. వీరు కొత్త రచయితలను, రచనలను బాగా ప్రోత్సహించేవారు. స్త్రీ జీవితంలోని అసంతృప్తిని, స్త్రీ తన కుటుంబం నుంచి భర్త నుంచి ఏమి కోరుకుంటోంది అనే విషయాన్నీ, వంటింటి నుంచి అంతర్జాతీయ విషయాలపై కూడా మాట్లాడే ఒక సగటు ఇల్లాలి ముచ్చట్లపై విశ్లేషణను వినండి.
–
#ఇల్లాలిముచ్చట్లు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-illali-muchhatlu
Listen to a part of Chapter 1 of #Illalimuchhatlu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
From the publisher's feed