Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Kaalaateetha Vyakthulu – Chapter 1

    #ప్రకాలాతీత వ్యక్తులు

    రకరకాల వ్యక్తిత్వాలు, విభిన్న అభిరుచులు ఉన్న వ్యక్తులు మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మనిషి ప్రవర్తనను చూసి ఒక్కసారిగా వారి మీద ఒక రకమైన అభిప్రాయం కలుగుతుంది. కానీ వారితో మనం స్నేహం చేసిన కొద్దీ వారి గురించి లోతుగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. తన హద్దుల్లో తాను ఉంటూ, ఆస్తి ఉన్నా మావయ్య రక్షణలో ఉంటూ, మావయ్యని ఎదిరించలేని పిరికివాడైన ప్రకాశం, తనకంటూ ఏ విధమైన బాధ్యతలు లేక, తనకున్న డబ్బులతో హాయిగా ఆనందిస్తున్న కృష్ణమూర్తి, తనకంటూ కొన్ని కోరికలు ఉన్నా, భారంగా బాధ్యతను మోస్తూ లోకానికి భయపడక జీవించే ఇందిర, జీవితంలో అన్ని కోల్పోయి ఇంకోకరికి భారం కాకుండా బతుకుతున్న కళ్యాణి, పిన్నిగారి తోడుగా, అన్నలకు ముద్దుల చెల్లెలిగా ఉన్న ఏ చికాకులు లేని వసుంధర ఇలా రకరకాల వ్యక్తులను, వారి జీవితాలలోని మలుపులను కాలాతీత వ్యక్తులు మొదటి భాగంలో వినండి.

    –

    #కాలాతీత వ్యక్తులు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-kalaateetha-vyakthulu-1

    Listen to a part of Chapter 1 of #KaalaateethaVyakthulu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    14 min
  • Prakruthi Kavithvam – Chapter 1

    #ప్రకృతి కవిత్వం

    బ్రిటిష్ వారు ప్రకృతికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. వీరిలో చాల మండే ఉన్న ఎక్కువగా ఈ ప్రకృతి గురించి విశ్లేషించిన కవులలో వర్డ్స్ వర్త్, కీట్, షెల్లీ వీరి గురించి వివరిస్తూ, మన తెలుగులో ఉన్న కవులను, వారి రచనలను గూర్చి మృణాళిని గారి విశ్లేషణలో విందాం. ప్రకృతే మనకు తొలి గురువు. వార్డ్స్ ప్రకృతిని 3 రకాలుగా తన కవిత్వంలో ప్రదర్శించాడు. మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధం అతన్ని దైవాంశ సంభూతునిగా చేస్తుంది. ప్రకృతిని ఆరాధించే వారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? వార్డ్స్ కవిత్వంలోని మహత్తు ఏంటి? ఇంకా ఋతువులపై, మనిషి జీవితంలోని సంఘర్షణలపై కీట్స్ రాసిన కవితలను, అలాగే షెల్లీ కవితల వివరణని, ప్రకృతిలో మనిషికున్న సహజీవనాన్ని గురించి వినండి.

    –

    #ప్రకృతి కవిత్వం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-prakruthi-kavithvam

    Listen to a part of Chapter 1 of #PrakruthiKavithvam. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • O Manishi Katha

    #ఓ మనిషి కథ

    ఒక మనిషి మంచిగా మారడానికి, చెడిపోవడానికి అతని చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. దీనిని మానసిక తత్వవేత్తలు పరిశోధనల ద్వారా ఋజువు చేశారు. తన తండ్రి తనపై విరుచుకుపడ్డా అమ్మ లాలనలో, పాలనలో ఒక అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న త్యాగు, అనుకోకుండా చెల్లి, తల్లిల హఠాన్మరణం తో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తాడు. తనకు నచ్చిన చదువు చదువుకోడం కోసం కూడా తన తండ్రితో మాట్లాడలేకపోతాడు. నెమ్మదిగా ధైర్యం కోసం వ్యసనాలకు స్నేహితుని ద్వారా దగ్గరవుతాడు. తనకు ఏమాత్రం సహకరించని భార్య, తాను కోరుకున్న అందమైన జీవితం జీవించలేక కుంగిపోతున్న త్యాగుని నారాయణ తన చేయూతనందించి మారుస్తాడు. కానీ తిరిగి తాను మునుపు ఉన్న స్థితిలోకి త్యాగు ఎందుకు వస్తాడు? అసలేం జరిగింది? వినండి.

    –

    #ఓ మనిషి కథ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-o-manishi-katha

    Listen to a part of Chapter 1 of #OManishiKatha. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    15 min
  • Balakrishna – Chapter 1

    #బాలకృష్ణ

    ఎన్టీఆర్-బాలకృష్ణ ల సంబంధం గురించి వింటుంటే, సినిమా పరిశ్రమలు, నటన శైలులు వేరైనా, రాజకపూర్-రిషికపూర్ లు గుర్తురాకమానరు. రాజ్ కపూర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ సినీ లెజెండ్లే. ఇద్దరికీ సినిమా రంగంలోని అన్నీ విభాగాలపై మంచి అవగాహన ఉంది. అందుకే, ఇద్దరూ నటులుగా, నిర్మాతలుగా, దర్శకులుగా విజయం సాధించారు. ఇద్దరూ తమ కుమారులని లేత వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం చేశారు. కుమారులు ఇద్దరూ కథానాయకులు గా చేసిన మొదటి సినిమాతోనే విజయం సాధించారు. బాలకృష్ణ రిషి కపూర్ ఇద్దరు కూడా తమ తండ్రులని తండ్రిగా కంటే ఒక కళాకారుడిగా, గురువుగా ఎక్కువ చూశామని చెప్తారు. ఇటువంటి ఆసక్తికర సామ్యాలు మనకి కనిపిస్తాయి. వినండి. నందమూరి బాలకృష్ణ తో ముఖాముఖీ.

    –

    #బాలకృష్ణ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-balakrishna-mukhaamukhee

    Listen to a part of Chapter 1 of #Balakrishna. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • Sri Madhavapeddi Suresh – Chapter 1

    #శ్రీ మాధవపెద్ది సురేష్

    విరిసినది వసంత గానం...... చాలామంది జీవితాలు వడ్డించిన విస్తరులు కావు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, జీవిత గమ్యం ఏమిటో, ఏ రంగంలో స్థిరపడాలో తెలియని వయసులో, తనకు తెలియకుండానే సంగీత ప్రపంచంలో పడ్డారు. ఏ గురువు గుమ్మం ఎక్కకుండానే హార్మోనియం వాయించటం నేర్చుకున్నారు. ఆ అనుభవంతో ఒక ‘అకార్దియన్’ కొనుక్కుని దానిమీద ప్రావీణ్యం సంపాదించారు. అంచెలంచెలుగా ఎదిగారు. సంగీత కచేరీలలో వాయిస్తూ కుటుంబానికి ఆర్ధిక పరమైన ఆసరాగా ఉన్నారు. ఒక సారి ఒక కచేరీలో పాల్గొని స్వస్థలానికి తిరిగి వెళుతుండగా, ప్రయాణంలో ఎవడో ఆ అకార్దియన్ వాయిద్యం ఉన్న పెట్టెను సూటు కేసు అనుకుని దానిలో ఏ 'కొంచె'మైనా ఉండకపోతుందా అని దాన్ని కాస్తా లేపేశాడు. ఉపాధి ఆసరా ఊడిపోయింది. ఇలాంటి కష్టాలు ఎన్నో. అయినా కృంగిపోలేదు, నిరుత్సాహ పడలేదు నమ్ముకున్న రంగాన్నీ వీడనూ లేదు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఫలితం – ‘స్వయంకృషి’కి నిర్వచనం,,పర్యాయం, ఆ పదానికే నిలువెత్తు సజీవం, నేటి సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేశ్. వారితో దాసుభాషితం ‘ముఖా-ముఖీ’ వినండి.

    –

    #శ్రీ మాధవపెద్ది సురేష్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-sri-madhavapeddi-suresh

    Listen to a part of Chapter 1 of #SriMadhavapeddiSuresh. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.  

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. 

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. 

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము. 

    10 min
  • Aakasamantha – Chapter 1

    "ఓర్చుకోవాలి తల్లీ " అనే ఈ సప్తాక్షరాలు, శాపాలై తరతరాల నుంచి ఆడపిల్లల జీవితాల్లో నిర్వేదగానం చేస్తున్నాయి. క్షమయా ధరిత్రి ఇంకా పల్లవిస్తూనే ఉంది. మార్పు అనివార్యం. అత్యంత సహజం. ఓర్పు నుండి నేర్పు వైపు సాగే ప్రస్థానంలో గెలుపు - ఓటమి, పడటం-లేవటం, జీవన పోరాటంలో నిరంతర ప్రక్రియ. రచయిత జీవితమే రచనా వ్యాసంగం వైపు నడిపించింది. ఆర్థిక, సామాజిక ,రాజకీయ అవగాహన, చారిత్రక భౌతిక పరిస్థితులు, తాత్వికచింతన ,శక్తిగా మార్చేందుకు చోదకాలని జీవితానుభవాలు నేర్పాయి నేర్పుతున్నాయి. ఈ నేపథ్యంలో శోధన సాధన లక్ష్యంగా సాగుతున్న జీవనయానంలో ఎదురైన అనుభవాలే ఆకాశమంత కథాంశాలు. స్త్రీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొనే శక్తినిచ్చే కథలివి. జీవన పోరాటం తప్ప అనవసరం సౌకుమార్యం, లాలిత్యం,మరో భుజం పై వాలిపోయే మనస్థత్వం ఈ పాత్రల్లో ఉండవు. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన జీవితానికి తానే మార్గం ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కథలన్నీ ఉంటాయి ఎక్కడా, స్త్రీ సౌందర్య వర్ణన ఉండదు మనో నిబ్బరం, ఆత్మస్థైర్యానికి పెద్ద పీట వేయటం ఈ కథలలో ప్రధాన లక్ష్యం. ఈ పాత్రలు పరిపూర్ణమైన స్త్రీలు. ఓటమిని అంగీకరించని అపరాజితలు. అసలా ఆలోచన కూడా ఉండని ధీరోదాత్తలు. "నేర్చుకోవాలి తల్లీ" అని దిశానిర్దేశం చేయడం ఆకాశమంత ప్రత్యేకత. వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగిని, ప్రవృత్తి రీత్యా రచయిత అనువాదకురాలు, దర్శకురాలు, కళాకారిణి, సామాజిక కార్యకర్త అయినా డాక్టర్ దుట్టా శమంతకమణి గారి గురించి వారి మాటల్లోనే చెప్పాలంటే "కనుదోయిలో కలలు కరిగి, కన్నీటి సాగరాన్ని ఈది, నీళ్లు రాని కళ్ళకు అధినేత్రినై, అక్షర సేద్యం ఆరంభించిన అమ్మను. భారతీయ రైల్వే నా బ్రతుకు బండి మార్గం, ఆశయాల పందిరిలో సజ్జన సాంగత్యం, ప్రజా కళల నందనం ,సాహితీ పూలవనం, నా స్వప్నం నా గమ్యం."

    19 min
  • Baapu – Chapter 1

    #బాపు

    చిత్రకళలో ఎంతోమంది ఏకలవ్య శిష్యులకు గురువుగారు,చాల తక్కువగా మాట్లాడే అద్భుత పౌరాణిక చిత్రాల దర్శకుడు అయిన లక్ష్మీనారాయణ (బాపు) గారితో మృణాళిని గారి పరిచయం.... ఆయనకు ఇష్టమైన దర్శకులు ఎవరు? వారు తీరిక వేళల్లో ఏం చేస్తారు? ఆయన తీసిన కుటుంబకథా చిత్రాలలో భార్యాభర్తల గురించి ఎక్కువగా ఉంటుంది ఎందుకు? పౌరాణిక సినిమాలు ఇప్పుడు ఎందుకు తీయడం లేదు? జీవితం గురించి ఆయన చెప్పిన ఫిలాసఫీ ఏమిటి? ఈ విషయాల గురించి ముఖాముఖిలో......

    –

    #బాపు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-baapu

    Listen to a part of Chapter 1 of #Baapu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min
  • Inti Peru Indraganti – Chapter 1

    #ఇంటి పేరు ఇంద్రగంటి

    పూర్వకాలం నాటి వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణులు అందులోని శాఖలు, అవి ఏర్పడిన విధానం తెలుపుతూ తన ఆత్మకథను రాయడం ప్రారంభించారు శ్రీకాంత శర్మగారు. వారి పూర్వులలో ఒకరి నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం అసలు ఈ ఇంద్రగంటి పేరు ఎలా వచ్చింది? వారు చాల ఉన్నా ఎవరికి వారు ఎందుకు విడిపోయారో చెప్పారు. తండ్రి ఒక వయసు వచ్చాక తమ పిల్లలకు మంచి స్నేహితుడిలా ఉండాలి అన్న మాటను తూచా తప్పకుండ శర్మ గారి నాన్నగారు హనుమఛ్ఛాస్త్రి గారు పాటించారు. తనకీ తన తండ్రికి జరిగిన ప్రతి చిన్న విషయాన్నీచెబుతూ, తన తండ్రి గారి బాల్యం, విద్యాభ్యాసం, వారు తెలుసుకున్నమరిన్ని విషయాలను ఈ భాగంలో వినండి.

    –

    #ఇంటి పేరు ఇంద్రగంటి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-inti-peru-indraganti-1

    Listen to a part of Chapter 1 of #IntiPeruIndraganti. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    21 min
  • Narayana Rao – Chapter 1

    #నారాయణరావు

    లక్ష్మీసుందర ప్రసాదరావు విశ్వలాపురం జమీందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు చేసిన జమీందారీ వివాహం విఫలమై ఆమె పుట్టినింటికి తిరిగి రావటంతో, రెండవ కుమార్తె శారదకు జమీందారీ సంబంధం కాకుండా సాధారణ కుటుంబానికి చెందినవాడైనా యోగ్యుడు, విద్యావంతుడైన యువకుని కోసం అన్వేషిస్తూ ఉన్న సమయంలో నారాయణరావు నచ్చి, అతని తండ్రితో పెళ్లి ప్రతిపాదనలు చేస్తాడు. శారదకు ఈ సంబంధం సుతరామూ ఇష్టం లేదు. మరి ఆ సంసారం ఎలా సాగింది? ఆత్మగౌరవానికి విలువనిచ్చే నారాయణరావు పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు ఏమైంది? నవలకు రచయిత ఇచ్చిన అద్భుతమైన ముగింపులో తెలుసుకుంటాం. పదహారణాల తెలుగుతనం మూర్తీభవించిన బాపిరాజు, ఆయన వ్రాసిన ప్రతి నవలా, అది చారిత్రకమైనా, సాంఘికమైనా, దేనికదే సాటి. తన బహుముఖీన ప్రజ్ఞ ప్రతి నవలలోనూ ప్రదర్శించిన బాపిరాజు గొప్ప భావుకుడు. ముఖ్యంగా నారాయణరావు నవల, కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి వేయిపడగలు నవల సరసన నిలిచి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పురస్కారాన్ని పంచుకున్నది. అటువంటి నవలా రాజాన్ని శ్రవణరూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి నారాయణరావు శ్రవణ పుస్తకం, మొదటి సంపుటం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.

    –

    #నారాయణరావు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-narayana-rao

    Listen to a part of Chapter 1 of #NarayanaRao. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    10 min
  • Aarudra – Chapter 1

    #ఆరుద్ర

    అభ్యుదయ కవి, విమర్శకుడు, పరిశోధకుడు, తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణకర్త అయిన భాగవతుల శంకరశాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. మనందరికీ ఆరుద్రగా సుపరిచితులైన సినీ గేయ రచయితనే ఈ శంకరశాస్త్రి. ఆరుద్ర వీరి కలం పేరు. సినీ పాటకు కావలసిన అన్ని హంగులు తెలిసిన కవి ఆరుద్ర. నాటికలు, గేయాలు, నవలలు ఎన్ని రాసిన ఆరుద్ర తన సినీ యుగాల గీతాలు రాయడంలోనే అందెవేసిన చేయి. శ్రీ శ్రీ కి, ఆరుద్రకి మధ్య సంబంధం, ఆరుద్రకు ఇష్టమైన పాట, అతని రచనలోని ప్రత్యేకత, ఆరుద్ర రాసిన భక్తి పాటల్లో వైవిధ్య భరితమైన పాటలు ఏంటి? ఇంకా మరెన్నో విషయాల గురించి మృణాళిని గారి విశ్లేషణలో వినండి.

    –

    #ఆరుద్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-aarudra

    Listen to a part of Chapter 1 of #Aarudra. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.