Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Arunaachalam Pilupu – Chapter 1

    #అరుణాచలం పిలుపు

    ఈ జగత్తు మొత్తం పంచభూతాలతో నిండి ఉంది. మరి మన శరీరం దేనితో చేయబడి ఉంది? మనలోని ప్రాణానికి ఆధారం ఏది? పునర్జన్మ, మరణం ఉన్నాయా? సత్, చిత్ ల వ్యత్యాసం ఏమిటి? నేను ఎవరు?ఆత్మ శోధన ఎలా? జీవం, పరమాత్మ ఇలాంటి వాటిని తెలుసుకోవాలంటే ఒక దారిని చూపే గురువు కావాలి. సామాన్య మానవునిలా మనలో ఒకరిగా తిరిగి తమను గురించి తాము తెలుసుకున్న యతులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరైన "రమణ మహర్షి" ఈ ప్రశ్నలకు, మన చింతనకు ఇచ్చిన సమాధానాలే వెంకటరమణ శర్మ గారిచే వివరించబడ్డ ఈ 'అరుణాచలం పిలుపు'.

    –

    #అరుణాచలం పిలుపు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-arunaachalam-pilupu

    Listen to a part of Chapter 1 of #ArunaachalamPilupu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    25 min
  • MLA Aatmakatha – Chapter 1

    #ఎమ్మెల్యే ఆత్మకథ

    1956లో ప్రధమంగా ప్రచురింపబడిన ఈ నవల, తెలుగులో ఆనాటి రాజకీయాలపై చేసిన తొలి వ్యంగ్య రచనగా పేర్కొనబడింది. హాస్య రస ప్రధానమైనదని చెప్పబడినప్పటికీ, ఆ నాటి పాఠకులలో ఏపాటి హాస్యరసాన్ని ఒలికించిందో గానీ, ఈ నాటి రాజకీయ పరిస్థితులతో పోల్చుకుంటే హాస్యం పొంగిపొర్లటం తధ్యం. ఈ దేశంలో రాజకీయాలంటే స్వాతంత్ర్యానికి పూర్వం, దేశం కోసం త్యాగాలు, అనంతరం భోగాలు. అది మరింత వికృతమై పార్టీలు, సిద్ధాంతాలూ, నైతిక విలువలూ పట్టింపు లేకుండా పచ్చని చోట మేయడం వెచ్చని చోట పడుకోవడం ఆన్న చందంగా ఎప్పటికప్పుడు ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటేనే రంగంలో ఉండగలరు. అలా చేయలేని వారికి రాజకీయంలో స్థానం ఉండదు. ఈ నేపథ్యంలో కొత్త శాసన సభ్యుల ఉత్పత్తి-వృద్ధి-వ్యవహార-పరిణామ సరళిని పట్టి ఇస్తుంది ఈ ఆత్మకథ. అధికారం, ప్రజాసేవ వీటిని గురించి చక్కని ఆలోచలను ప్రేరేపిస్తుంది ఈ ఆత్మకథ. ఈ నవలా రచయిత శ్రీ మన్నవ గిరిధరరావు గారు వృత్తి రీత్యా అధ్యాపకులు. గుంటూరు హిందూ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులుగా 1990లో ఉద్యోగ విరమణ చేశారు. 1968లో గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై 1978 వరకూ ఎమ్మెల్సీగా ఉన్నారు. యువభారతి పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి అనేక హాస్య, విద్యావిషయక ప్రసంగాలు చేశారు. వారు చేసిన అనేక రచనలనుంచి ఈ నవలను ఎంచుకుని శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి ‘ఎమ్మెల్యే ఆత్మకథ'.

    –

    #ఎమ్మెల్యే ఆత్మకథ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-mla-aatmakatha

    Listen to a part of Chapter 1 of #MLAAatmakatha. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    6 min
  • Dasari – Chapter 1

    #బాదాసరి నారాయణ రావు

    దాసరి నారాయణ రావు అనగానే వెంటనే గురొచ్చేది ఆయన నిండైన విగ్రహం. మన ఊహకి ఇంకొంచెం అవకాశం ఇస్తే ఆయనకి మేకప్ వేసి _"సీతారావయ్యగారా!..."_ అనిపిస్తుంది. కష్టాల్లోంచి పాఠాలను నేర్చుకోవడం, అపారమైన ప్రతిభ, తీవ్రంగా శ్రమించే గుణం, శ్రీ దాసరి నారాయణ రావుకు భారత దేశంలో (ప్రపంచంలో?) అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనతను తెచ్చిపెడితే, గంభీరమైన ఆలోచనలు, సామాజిక స్పృహ, ఇతరుల కష్టాలను తీర్చాలన్న తపన ఆయనను ఒక పత్రికా సంపాదకుడిగా, శ్రామికల నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగేట్టు చేశాయి. 2008లో డా. మృణాళిని తో పాల్గొన్న ముఖాముఖీలో, ఆయన 'స్టార్' లపైన, తెలుగు సినిమా నాణ్యత పైన, పత్రికల పైన, సీక్వెల్స్ పైన, తన ఆలోచనలను నిర్మొహమాటంగా, సూటిగా, కుండబద్దలు కొట్టినట్టు పంచుకున్నారు. అవి విన్న తరువాత ఆయన 'బాహుబలి' చూడగలిగుంటే బావుండనిపిస్తుంది. ఓ దిగ్గజ మనిషి పోయిన తర్వాత సహజంగా ఆ రంగంలో ఆ మనిషి వదిలిన ప్రభావం గురించి చెప్పుకుంటాం. ఈ ముఖాముఖీ వింటే దాసరి ఇంకా చేయలేక పోయిన పనులు ఏమిటో ఆయన ద్వారానే మనకు తెలుస్తుంది. ఆ ముఖాముఖీని ఇపుడు దాసుభాషితం యాప్ లో వినండి.

    –

    #దాసరి నారాయణ రావు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-dasari-narayana-rao-mukhaamukhee

    Listen to a part of Chapter 1 of #DasariNarayanaRao. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min
  • Balamuralikrishna – Chapter 1

    #బాలమురళీకృష్ణ

    సంగీతాన్ని మధించి, ఆ అమృతాన్ని మనకు అందించిన వారిలో ఒకరైన బాలమురళీకృష్ణ గారితో మృణాళిని గారి ముఖాముఖీ విందాం. 1940 లో మొదటిసారి రేడియోలో పాడి, ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుని దేశంలోనే కాక, ప్రపంచంలోని అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రంలోనే పుట్టి వారు మద్రాసు లో ఎందుకు స్థిరపడ్డారు? జుగల్బందీ వల్ల ప్రయోజనం ఏమిటి? కొత్త రాగాల్ని ఎందుకు కనిపెట్టారు? సంగీత, సాహిత్యానికి గల సంబంధం, అన్నమయ్య కృతుల విషయంలో వారు చేసిన సేవ వీటితో పాటు మరిన్ని విషయాలను వినండి.

    –

    #బాలమురళీకృష్ణ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-baalamurali

    Listen to a part of Chapter 1 of #బాలమురళీకృష్ణ. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • World Philosopher's Day – Chapter 1

    #వరల్డ్ ఫిలొసొఫెర్స్ డే

    ఒక విషయం గురించి లోతుగా, క్షుణ్ణంగా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలతో శోధించే వాళ్ళను, తార్కిక జ్ఞానం ఉన్న వాళ్ళను తత్వవేత్తలుగా చెబుతారు. ఈ తత్వవేత్తలు భారత దేశంలో, గ్రీస్ దేశంలో ఒకే కాలంలో జన్మించారు. నీరు, గాలి, అగ్ని ఈ మూడు జగత్తుకు ఆధారాలు. తర్కబద్ధం కాని ఆలోచన అసంబద్ధం అవుతుంది. సరైన ఆలోచన సరైన జ్ఞానానికి దారితీస్తుంది. 20 వ శతాబ్దపు తత్వవేత్త సాత్ర్ సిద్ధాంతాలకు, అతని నవలలకు అసంఖ్యాకమైన అభిమానులు ఎందుకు ఉన్నారు? వివిధ తత్వవేత్తల గురించి, పాశ్చాత్య తత్వవేత్తలకు, భారతీయ తత్వవేత్తలకు గల వ్యత్యాసం, 'తాత్వికుడు' అనే పదానికి డెకార్డ్ ఇచ్చిన నిర్వచనం మృణాళిని గారి విశ్లేషణలో వినండి.

    –

    #వరల్డ్ ఫిలొసొఫెర్స్ డే శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-philosophers-day

    Listen to a part of Chapter 1 of #WorldPhilosopher'sDay. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    13 min
  • Veturi – Chapter 1

    #వేటూరి

    శ్రీ వేటూరి గారి పుట్టిన రోజున రికార్డు చేయబడ్డ ఈ ముఖాముఖీ, ఆయన వ్రాసిన 'జీవనరాగం' నవల శ్రవణ పుస్తకం విడుదల సందర్భంగా శ్రోతలకు తిరిగి అందిస్తోంది దాసుభాషితం. పరిచయకర్త డా. సి. మృణాళిని. ఈ ముఖాముఖీలో వేటూరి వారు విశ్వనాథ, మల్లాది వారి దగ్గర శిష్యరికం గురించి, కే. విశ్వనాధ్ ప్రభావం గురించి, సినిమా పాట ఎలా ఉండకూడదో ఇతరుల నుంచి తాను ఎలా నేర్చుకున్నది హాస్యభరితంగా వివరిస్తారు.

    –

    #వేటూరి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-sri-veturi-mukhamukhee

    Listen to a part of Chapter 1 of #Veturi. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min
  • Yajnam tho Padenu – Chapter 1

    #యజ్ఞం తో పదేను

    తెలుగు సాహిత్యంలో ఎన్నో అమూల్య రచనలు సాహితీ సామ్రాజ్య సింహాసనాలను అలంకరించి ఎందరో పండితోత్తముల నీరాజనాలు అందుకున్నాయి. అటువంటి వాటి సరసన చేర్చదగిన వాటిలో ఒకటి శ్రీ కాళీపట్నం రామారావు గారి 'యజ్ఞంతో పదేను’ కథా సంపుటి. 1966లో, ఆ రోజుల్లో ప్రముఖ మాసపత్రిక ‘యువ’ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన 'యజ్ఞం' అనే అక్షర అంకురం, అనంతరకాలంలో సాహితీ మహావృక్షమై 'నూరేళ్ళ కథ' పండుగల్లో గొల్లపూడి మారుతీరావు వంటి ప్రముఖుల వందనాలందుకున్నది. అంతే కాదు, పెను సంచలనాన్ని సృష్టించి సాహితీ వర్గాల్లో రసవత్తరమైన చర్చకు ఆస్కారమిచ్చింది. మరీ విచిత్రంగా ఆ చర్చ ప్రధానాంశంగా 'కథా యజ్ఞం' అనే మరో రచనకు దారితీసింది. నిశ్చయంగా ఇది 'సాహిత్య విమర్శ'కు సంబంధించి ఒక కొత్త పుంత. "యజ్ఞం తో తొమ్మిది" అనే కథ సంపుటానికి 1995 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు. ఆ తొమ్మిది కథలకు మరో ఆరు జేర్చి 'యజ్ఞంతో పదేను' కథా సంపుటాన్ని శ్రవణానువాదానికి అనుమతిస్తూ ఆ పుస్తక ప్రతిని చేవ్రాలు సహితంగా స్వహస్తాలతో వారే అందజేసి 'దాసుభాషితం' ను ఆశీర్వదించారు. వారు అందించిన ఆశీస్సులు 'దాసుభాషితం' శ్రోతలకు అందజేస్తూ సమర్పిస్తున్నాను. వినండి. 'యజ్ఞం'తో పదేను’ కథా సంపుటి శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.

    –

    #యజ్ఞం తో పదేను శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-yajnam-tho-padenu

    Listen to a part of Chapter 1 of #YajnamThoPadenu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    17 min
  • Krishnaastami – Chapter 1

    #కృష్ణాష్టమి

    భువన మోహనుడు, రాధా వల్లభుడు, గోపిక మానసచోరుడు, వెన్న దొంగ ... ఇలా ఎన్ని పేర్లు చెప్పినా సరిపోదు. నల్లనివాడైనా, ప్రతీ ఒక్కరినీ తన చిలిపి పనులతో ఆకట్టుకునే వాడు శ్రీకృష్ణుడు. దేవకికి అష్టమ గర్భంలో జనియించి, కంసుణ్ణి సంహరించి, యాదవుల్ని తన వేణుగానంతో సమ్మోహనంలో ముంచెత్తాడు. తానొక్కడే అయినా ఎంతో మంది గోపికలకు తన ప్రేమను పంచాడు. పాండవులకు తోడుగా ఉంటూ ధర్మాన్ని రక్షించాడు. రాజనీతిని భోదించాడు. గీత ద్వారా సర్వ జనులకు ధర్మాన్ని, దాన్ని కాపాడే విధానాన్ని, ఆనందాన్ని కలిగించాడు. అటువంటి ఆ జగన్మోహనుని గురించి, కృష్ణాష్టమి గురించి ఈ విశ్లేషణలో వినండి.

    –

    #కృష్ణాష్టమి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-srikrishnaastami

    Listen to a part of Chapter 1 of #SriKrishnaastami. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    14 min
  • Sahithyamlo Prakruthi Chitrana – Chapter 1

    #సాహిత్యంలో ప్రకృతి చిత్రణ

    "కాదేది కవితకు అనర్హం " అన్నారు. కానీ మన ప్రకృతిలో ప్రతి చిన్న వస్తువు కవితలకు అలవాలమే, ఆధారమే అని నమ్మక తప్పదు. ఎందుకంటే ప్రాచీన కవులు ప్రకృతిలో పర్వతం, అరణ్యం .. ఇలా ఎంచుకుంటే, ఆధునిక కవులు నది, వెన్నెల, పువ్వులు ఇటువంటి వాటితో పాటు గాలి ఇంకా సూర్యుడు, చంద్రుడు సూర్యోదయం,చంద్రోదయం, ఋతువులు ఇలా అన్నిటిని వర్ణించారు. ప్రాచీన కవులలోని తిక్కన నుంచి ఆధునిక కాలానికి చెందిన విశ్వనాథులవారు , వేదుల వంటి వారు కూడా ప్రకృతిని అద్భుతంగా వర్ణించిన వర్ణనలను మృణాళిని గారి విశ్లేషణలో వినండి.

    –

    #సాహిత్యంలో ప్రకృతి చిత్రణ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-sahithyamlo-prakruthi-chitrana

    Listen to a part of Chapter 1 of #SahithyamloPrakruthiChitrana. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    13 min
  • Rajasekhara Charitramu – Chapter 1

    #రాజశేఖర చరిత్రము

    శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు రచయిత, పత్రికా సంపాదకులు, అన్నిటికి మించి గొప్ప సంఘ సంస్కర్త అని మనకు తెలుసు. కానీ ఏ పరిస్థితులు ఆయనను సంఘ సంస్కరణకు పురిగొల్పాయో అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన 'రాజశేఖర చరిత్రము' నవల వినాలి. ‘రాజశేఖర చరిత్రము’ లో రాజశేఖరుడు గారి అమాయకత్వము, అవివేకము ఆ కుటుంబం పడిన అష్టకష్టా లన్నింటికీ మూలం. సంఘంలోని కపటులు, కల్లరులు, కుక్షింభరులు, స్తుతి పాఠకులు, డాంబికులు, ఏ విధంగా అమాయకులను బాధించి, తాము బాగపడుతున్నారో, అంధ విశ్వాసాల వల్ల, అవివేకపు ఆచారాల వల్ల కొన్ని కుటుంబాలు ఎలా నాశనమైపోతున్నాయో ఈ నవలలోని సంఘటనల వల్ల తెలుసుకోవచ్చు. తెలుగువారి ఆచార వ్యవహారాలు, వాటి బాగోగుల వివరణ, ఆహ్లాదపరచే వ్యంగ్యం, హద్దులు దాటని హాస్యంతో, సర్వులకూ అవసరమైన సద్గుణాలను సలక్షణమైన శైలిలో సామాన్యులకు సయితం అర్ధమయ్యేలా వర్ణించి వాటికి అభిముఖత్వం కల్పించిన ఆ నవలారాజం ప్రప్రథమంగా శ్రవణ రూపంలో. వినండి - రాజశేఖర చరిత్రము - మీ ‘దాసుభాషితం’ యాప్ లో.

    –

    #రాజశేఖర చరిత్రము శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-rajasekhara-charitramu

    Listen to a part of Chapter 1 of #RajasekharaCharitramu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    19 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.