Sign up to save your podcasts
Or

#సాక్షి
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 1865 నవంబరు 2, 1940 జనవరి 1 మధ్య, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి 20వ శతాబ్దం పూర్వార్ధం వరకూ జీవించిన సుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి అనే పేరుతో ఉపన్యాసాల ద్వారా ఆంద్ర వచన రచనలో ఒక కొత్త ప్రక్రియనూ, కొత్త ఒరవడిని సృష్టించిన మేధావి. కాల్పనిక సన్నివేశాలతో, ఊహాజనిత పాత్ర ద్వారా వివిధ సామాజిక అంశాల మీద ఉపన్యాస ధోరణిలో చేసిన వ్యాఖ్యానాలు ఈ సాక్షి వ్యాసాలు. ఏ కాలంలో గానీ ఎవరూ కనీస మాత్రంగా స్పృశించడానికి కూడా సాహసం చేయని అత్యంత సున్నితమైన అంశాలపై సైతం అలవోకగా వ్యాఖ్యానించడమే కాకుండా మొహమాటం లేకుండా, పదునైన పదాలతో సూటిగా ముక్కుమీద గుద్దినట్టు, నెత్తిన మొట్టినట్టు తార్కికంగా, వివాద రహితంగా, వినేవారికి విసుగు కలుగకుండా చెప్పడం ఈ వ్యాసాలలో ప్రత్యేకత. ధారాపాతంగా సాగిపోతున్న ఒక ప్రసంగాన్ని మధ్యలో ఎలా విడిచి వెళ్ళలేమో, ఈ వ్యాసాలను ఒకసారి చదవటం అంటూ మొదలు పెడితే, పూర్తి కాకుండా విరమించడం అసాధ్యం. చదవటం పూర్తయిన తరువాత కూడా ఏ పని చేస్తున్నా అప్పటివరకూ చదివిన విషయమే మనసును తొలిచేస్తూ ఇది ఫలానా అని చెప్పవీలులేని ఒక ఆవేశం నిలువెల్లా ఆవహిస్తుంది. పాఠకులకు ఇలాంటి చిత్త స్థితి కల్పించిన రచనలు చాలా కొద్ది. ఇదీ పానుగంటివారి సాక్షి వ్యాసాల వైశిష్ట్యం.
–
#సాక్షి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-sakshi
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#త్రివేణి
పెళ్లి అనే పదానికి సరైన అర్థం కూడా తెలియని వయసులో చేసే పెళ్లిళ్ల వల్ల నష్టాలు వస్తాయి. పూర్వ కాలంలో భర్త ఎలాంటివాడైన, అత్తవారు రాచిరంపాలు పెట్టినా తమ కాళ్లపై తాము నిలబడలేక ఎన్ని కష్టాలనైనా భరించేవారు ఆడవాళ్లు. ఇప్పుడు కాలం మారింది.స్త్రీ తనను తాను రక్షించుకుని, స్వశక్తి తో బతికే లా మారింది. పెళ్లి, తాళి ఇలాంటి పదాలకు అర్ధం తెలియని వయసులో పాణి కి, సరస్వతికి పెళ్లి అవుతుంది. పాణి పెద్దవాడై డాక్టర్ గా ఎదిగి, అదే ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేసే యముని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. భర్తే సర్వస్వంగా,అతనినే నమ్ముకుని వచ్చిన సరస్వతికి అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. ఆ ఆస్పత్రిలో పనిచేసే పనివాని కోడలు గంగ, సరస్వతికి తన కథ చెబుతుంది. సరస్వతి గంగను చూసి ధైర్యం తెచ్చుకుంటుంది. మరి సరస్వతి జీవితం ఏమవుతుంది? గంగ ఎలా సరస్వతికి సాయం చేసింది? యమున పరిస్థితి ఏమిటి? వినండి.
–
#త్రివేణి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-title-ab-triveni
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#మొదటి పేజీ
శ్రీ రమణ అనగానే " మిథునం" గుర్తుకొస్తుంది. వారి కథలలో మనసుకు హత్తుకునే రచనలు ఎక్కువ. నవ్య పత్రికలో "మొదటిపేజీ" పేరుతో కొన్ని శీర్షికలు వ్రాసారు. కేవలం 4,5 నిముషాల నిడివి ఉన్న ఈ శీర్షికలలో ఒక చిన్న అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని వ్రాసినవి. ఇందులో కొన్ని మన మనసులని కదిలించేవిగా, ఆలోచింపచేసేవిగా ఉంటాయి. బిస్మిల్లాఖాన్ గురించి, భోజుడి గురించి ఇంకా చాలా విషయాల గురించి వీరు చెప్పిన శీర్షికల్లో వినండి.
–
#మొదటి పేజీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-modati-pejee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#గోపీచంద్
కాల్పానిక వచన సాహిత్యంలో అగ్రగాములైన రచయితల్లో గోపీచంద్ ఒకరు. తత్వవేత్తగా, రేడియో ప్రయోక్తగా, సినిమా రచయితగా, దర్శకునిగా ఇలా వారు బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరు రేడియోలో గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. గోపీచంద్ గారిపై పాశ్చ్యాత్త రచయితల ప్రభావం ఎక్కువగా ఉన్నది. వీరి రచనలు ఎక్కువగా వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ఎవరు ఎంతగా విమర్శించినా తానూ చెప్పాలనుకున్నది చెప్పేవారు. దీనివల్ల వారు వారి మిత్రులను కూడా శత్రువులుగా చేసున్నారేమో అని చాలా మంది అంటారు. సినీ రంగంపై వారికి అసంతృప్తి ఎందుకు వచ్చింది? వీరిని విశేషంగా ఆకర్షించింది ఏది? ఎక్కువగా దేనిని ద్వేషించారు? ఇంకా వీరి రచనలపై విశ్లేషణను మృణాళిని గారి ద్వారా వినండి.
–
#గోపీచంద్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-gopichand
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
శ్రీ రామకృష్ణ కథామృతం
అవతార పురుషుల మార్గంలో మనకు అతి సమీపకాలంలో అవతరించినవారు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస. అసంఖ్యాకమైన వారి శిష్యులలో ప్రతి ఒక్కరూ ఆయన సందేశాలలో కొన్నింటిని స్వీకరించి దానిని తమ జీవితం ద్వారానూ, రచనలు, ప్రసంగాల వంటి వివిధ మార్గాలద్వారానూ ప్రపంచానికి చాటారు. ఆ శిష్యులలో ఒకరు మహేంద్రనాథ్ గుప్త ఒకరు. వీరు కేవలం 'మ' గా ప్రసిద్ధులు. వీరు శ్రీ రామకృష్ణుల అమృత వాక్కులను ప్రపంచానికి అందజేసే మహద్భాగ్యం పొంది తద్వారా ప్రపంచ మాట చరిత్రలో ఎనలేని కీర్తినార్జించారు. 'మ' శ్రీరామకృష్ణులను 1882 ఫిబ్రవరిలో ప్రప్రధమంగా సందర్శించారు. ఆనాటి నుండి 1886 ఆగస్టులో శ్రీరామకృష్ణులు మహాసమాధి వరకూ దాదాపు 250 రోజులు ఆయన్ను దర్శించి, వారి అమృతవాక్కులను ఆలకించే భాగ్యం పొందారు. ఆ సంభాషణలను తమ దినచర్య పుస్తకంలో వ్రాసుకుని పదిలపరిచారు. ఆ తరువాత వాటిని 'శ్రీ శ్రీరామకృష్ణ కథామృత' పేరిట ఐదు సంపుటాలుగా వంగ భాషలో ప్రచురించారు. అనంతర కాలంలో ఇది మిగతా భారతీయ భాషలతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. క్లిష్టమైన తాత్త్విక సత్యాలు శ్రీరామకృష్ణులవద్ద సరళంగా మారడం ఒకవైపు, ఆయన చూపే దృష్టాంతాలు, ఉపమానాలు చెప్పే కథలు వాటిని సునాయాసంగా అర్ధం చేసుకునేలా చేసి మనస్సుకు హత్తుకునేట్టు చేయడం మరో వైపు ఈ గ్రంధంలో మనం చూస్తాం. జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరీక్షా సమయాలలో కథామృతంలోని ఒకటి రెండు అధ్యాయాలు చదివినపుడు ఎక్కడినుంచో అనిర్వచనీయమైన ఒక ఓదార్పు వచ్చి శోకతప్త హృదయాలను సేదదీర్చి ఆనందానుభూతులను కలిగించడం అసంఖ్యాక పాఠకుల అనుభవం. అందువల్ల ప్రతిరోజూ ఉదయం దినచర్యను ప్రారంభించే ముందూ, రాత్రి పడుకునే ముందూ కథామృతంలోని ఒకటి రెండు అధ్యాయాలు చదవటం అనేకులు ఒక అలవాటుగా కలిగి ఉన్నారు. ఆ గ్రంథరాజం ప్రప్రథమంగా ఇప్పుడు శ్రవణ రూపంలో. వినండి 'శ్రీ రామకృష్ణ కథామృతం' శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం.
#శ్రీరామకృష్ణకథామృతం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-sri-ramakrishna-kathamrutam
Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
#హృదయనేత్రి
#హృదయనేత్రి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-hrudaya-netri
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
#Kalaa Poornodayam – Chapter 1
కళా పూర్ణోదయం
ప్రబంధ యుగానికి చెందిన ప్రాచీన తెలుగు సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ విశిష్ట స్థానం అలంకరించిన మనోహర కావ్యం ‘కళాపూర్ణోదయం.’ ఇది మిగిలిన ప్రబంధాల వలే పురాణ ప్రధానమైనది కాదు. పూర్తిగా కాల్పనికం అందుచేత దీనికి వేరే మూలం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా కళాపూర్ణోదయం రచనా తీరు చదువరులను ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఆధునిక కాలంలో కొన్ని నవలలోనూ, సినిమాలలోనూ 'ఫ్లాష్ బ్యాక్' గా మనం చెప్పుకునే ‘కాలక్రమ వ్యత్యయం’ అనే ఈ ప్రక్రియను సూరనార్యుడు పదహారవ శతాబ్దంలోనే ప్రవేశపెట్టాడని చెప్పాలి. 'నభూతో న భవిష్యతి' అన్న విధంగా సూరనార్యుడు రచించిన ఈ పద్య గద్య కావ్యం లోని మూల కవితా సౌందర్య, సౌరభాలకు ఏ మాత్రం భంగం కలగకుండా సరళమైన వచన రూపంలో అందించారు సుప్రసిద్ధ పత్రికా రచయిత కవి, అనువాదకులు శ్రీ రెంటాల గోపాలకృష్ణ. ఈ వచన కావ్యాన్ని ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి ‘కళాపూర్ణోదయం’.
#కళాపూర్ణోదయం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-kalaa-poornodayam
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
#రమ్యకృష్ణన్
రసరమ్య పాత్రలలోనే కాక, భక్తిపారవశ్యం ఉన్న పాత్రలలో కూడా మెప్పించిన రమ్యకృష్ణన్ తో ముఖాముఖీ ... 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన భర్త దర్శకుడై, తాను ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో అనే విషయం పై ఏమైనా సలహా ఇస్తారా? ఆయన తీసిన సినిమాల్లో రమ్యకి బాగా నచ్చిన సినిమా, పాత్ర ఏమిటి? తనకు సినీ పరిశ్రమలో మంచి స్నేహితుడు ఎవరు? ఇంకా మరిన్ని విషయాలను ఆమె మాటల్లోనే విందాం.
–
#రమ్యకృష్ణన్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-ramya-krishna
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#లాల్ దేడ్
ఏకకాలంలో భక్త కవయిత్రిగా, సమాజ సంస్కర్తగా పేరు పొందిన రచయిత్రి లల్లాదేవి (లాల్ దేడ్) సంక్షోభ యుగంలో జన్మించి మార్పును, శాంతిని కోరుకుంటున్న ప్రజలకు మార్గనిర్దేశం చేసిన మహనీయురాలు ఈమె. మధ్య యుగంలో సాంస్కృతిక, మతపరమైన పరిణామాలేకాక , భాషా పరిణామాలు కూడా వచ్చాయి. ఈమె రచనలు సార్వజనీన సత్యాలను, సార్వకాలీనమైన విషయాలను, తెలిపి ఈనాటికీ ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. లల్లాదేవి రచనలు కాశ్మీరీ భాషలోనే ఎందుకు ఉంటాయి? 600 ఏళ్ళ తరువాత కూడా ప్రజలు ఎందుకు ఆమెను తలచుకుంటున్నారు? ఆమె యోగినిగా ఎందుకు మారారు? ఇంకా మరిన్ని విషయాలను మృణాళినిగారి విశ్లేషణలో వినండి.
–
#లాల్ దేడ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-lal-ded
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#సువర్ణరేఖ
మనచుట్టూ మన మధ్య జరుగుతున్న విషయాలనే తన కథా వస్తువులుగా స్వీకరించి జానకీ బాల గారు ఈ కథ సంపుటిని తయారుచేసారు. ఇందులో బంధుజనాలు, వారి రాకపోకలు అసలు నలుగురిని కలుపుకుంటూ ఎందుకు ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా రాసిన కథ "మానవ సంబంధాలు ", పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన ఒక ఆడపిల్ల , అత్తవారింటికి వచ్చేసరికి వచ్చే మార్పులను గురించి "రెండు తలల పాము " లో, చదవడం,రాయడం రాకపోయినా విషయం పరిజ్ఞానం ఎంత ముఖ్యమో "చదువు" లోనూ ఇంకా మరెన్నో కథలను ఈ శ్రవణ పుస్తకంలో వినండి.
–
#సువర్ణరేఖ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-suvarnarekha
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
From the publisher's feed