Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Naaham Karta Harih Kartaa – Chapter 1

    నాహం కర్త హరిః కర్తా

    తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, కీర్తి శేషులు శ్రీ పీవీఆర్కే ప్రసాద్ గారు, ఆయన జీవితంలో... 'ఏమిటిది? ఎందుకు ఇలా అయింది? ఇది నాహం కర్తా, హరిః కర్తా' అనుకున్న సందర్భాలు అనేకం. వాటిల్లో ముఖ్యమైనవి, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా ఉన్నప్పుడు అనుభవైక్యమైనటువంటి అద్భుత సంఘటనలను ఆవిష్కరించే పుస్తకం, ఆయన రచించిన 'నాహం కర్త హరిః కర్తా'. ఆ పుస్తకం శ్రవణ రూపం దాసుభాషితం అప్ లో వినండి.

    –

    #నాహం‌కర్త‌హరిః‌కర్తా శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-naham-karta-harih-karta

    Listen to a part of Chapter 1 of #Gurajada. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    9 min
  • Baandhavyaalu - Part 1 – Chapter 1

    #బాంధవ్యాలు

    'బాంధవ్యాలు', అంపశయ్య నవీన్ గారి నవలాత్రయంలో మూడవది. మొదటి రెండు, ‘కాలరేఖలు’, ‘చెదిరిన స్వప్నాలు’. ఇవి, 1944 నుండి 1995 వరకు తెలంగాణ ప్రాంతపు సామాజిక, రాజకీయ సాంస్కృతిక చరిత్రకు అద్దం పడతాయి. 2004 కాలరేఖలు కు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. 'బాంధవ్యాలు' నవలను నాలుగు భాగాలుగా అందిస్తోంది దాసుభాషితం.

    –

    #బాంధవ్యాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-bandhavyalu-1

    Listen to a part of Chapter 1 of #Baandhavyaalu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    22 min
  • Amaraavati Kathalu - Vol 1 – Chapter 1

    #అమరావతి కథలు

    తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందిస్తోంది దాసుభాషితం. వినండి మొదటి సంపుటి లోని మొదటి భాగం.

    –

    #అమరావతి కథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-amaravati-kathalu-vol-1

    Listen to a part of Chapter 1 of #Amaraavati Kathalu - Vol 1.
    Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    10 min
  • Gurajada – Chapter 1

    #గురజాడ

    ఆధునిక కవి, వాస్తవికవాది అయిన గురజాడ అప్పారావు గారి గురించి, వారి నవలలలోని స్త్రీ పాత్రల యొక్క విశ్లేషణను కాత్యాయని గారి ద్వారా వినండి. కన్యాశుల్కం లోని బుచ్చమ్మ ద్వారా వితంతువులలోని ఆశలను, వారి మనోభావాలను విశ్లేషించారు. ఈనాటి భార్యాభర్తల మధ్య లోపించిన సంబంధాల గురించి, చాలా మంది భార్యాభర్తలు ఎలా జీవిస్తున్నారో అప్పుడే వారి కాలంలోనే వివరించారు. ఒక స్త్రీకి చదువు ఎంత ముఖ్యం? ఒక మనిషి ఇంకో మనిషిని సంస్కరించగలడా? శంభునాథముఖర్జీ ద్వారా వారు పొందిన ప్రేరణను గురించి వినండి.

    –

    #గురజాడ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-gurajaada

    Listen to a part of Chapter 1 of #Gurajada. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    14 min
  • Gona Gannareddy – Chapter 1

    #గోన గన్నారెడ్డి

    ఎందరో రాజులు ఈ భువిని పాలించారు. కానీ చరిత్రలోనే ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలడం గూర్చి, అందులో ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాల గూర్చి అడవి బాపిరాజుగారు ఒక నవలగా వ్రాశారు. కాకతీయ వంశంలోని గణపతిరాజుకు పుత్రికలే తప్ప పుత్రులు కలుగలేదు. తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి, పోషించే గణపతి రాజు తన తరువాత ఆ ప్రజలకు సామంత రాజుల వల్ల నష్టం కలుగుతుందని ఎంచి, తన పుత్రికల్లో పెద్దదయిన రుద్రదేవిని రుద్రరాజుగా పెంచి అన్ని విద్యలు నేర్పిస్తాడు. అదే రాజ్యంలో గజదొంగగా పేరుగాంచిన గోన గన్నారెడ్డి ఆ రాజ్యంలోని సామంతరాజుల పిల్లలను అపహరించి తీసుకెళ్తుంటాడు. . రుద్రదేవి, కాకతీయరాజ్యంలో జరిగే కుట్ర, గోన గన్నారెడ్డిల గూర్చి వర్ణన ఈ భాగంలో వినండి.

    –

    #గోన గన్నారెడ్డి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-gona-gannareddy-1

    Listen to a part of Chapter 1 of #GonaGannareddy. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    26 min
  • Duvvuri Venkata Ramana Sastri – Chapter 1

    #దువ్వూరి వెంకట రమణ శాస్త్రి

    చిన్నయ సూరి గారి బాల వ్యాకరణానికి రామణీయమైన వ్యాఖ్య రాసిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారి గురించి మృణాళిని గారి విశ్లేషణలో తెలుసుకుందాం. విద్య వల్ల మానవ సంబంధాలలో వచ్చే మార్పులను, జీవితాన్ని సారవంతంగా ఎలా మలచుకోవాలో వీరి జీవితం మనకి తెలుపుతుంది. పల్లెకి, పట్టణానికి మధ్య తేడాని, పట్టన వాసుల జీవితాన్ని వారు వర్ణించారు. తన జీవిత చరిత్రలో వారి అనుభవాలే కాక కొన్ని పిట్టకథల్ని కూడా చెప్పారు. దువ్వూరి వారి వ్యాకరణ ప్రస్థానం ఎలా మొదలైంది, కట్టు శ్లోకాలంటే ఏంటి, వారి లోపాలతో పాటు వారిని అందరూ ఎందుకు అంతగా ప్రేమించారో వినండి.

    –

    #దువ్వూరి వెంకట రమణ శాస్త్రి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-duvvuri-venkataramana-sastri

    Listen to a part of Chapter 1 of #DuvvuriVenkataRamanaSastri. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • Alpajeevi – Chapter 1

    #అల్పజీవి

    అసమర్ధుడి జీవయాత్ర, చివరకు మిగిలేది, అల్పజీవి - ఇవి తెలుగులో మనోవైజ్ఞానిక రచనలుగా పేరుగడించాయి.

    అంపశయ్య నవీన్ గారు ఈ రచనలని ఇలా నిర్వచించారు. “ఇలాంటి రచనల ముఖ్య లక్షణం పాత్రల బాహ్య రూపాన్ని కాకుండా మనసుల్ని శోధించటం. ప్రధానంగా పాత్రల మనస్సుల్లో చెలరేగుతున్న సంఘర్షణను చిత్రించటం.”

    ప్రేమ కథా చిత్రాల్లోని సన్నివేశాలు మన జీవితంలో జరిగినవే అయితే మన ఆసక్తి పెరిగి ఆ సన్నివేశాలని ఇంకా ఆస్వాదిస్తాము. అదే విధంగా ఈ రచనల్లో ఇతివృత్తం, కథానాయకుల వ్యక్తిత్వం ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉంటే, వారికి తాము జీవితంలో ఏకాకులం కాదనే ఉపశాంతిని పొందవచ్చు. ఇప్పటికే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, గోపీచంద్ ‘అసమర్ధుని జీవయాత్ర’ పుస్తకాల శ్రవణ రూపాలను అందించిన దాసుభాషితం, రావిశాస్త్రి గా పేరుగడించిన, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచన ‘అల్పజీవి’ ని, వారి కుమారుడు రాచకొండ ఉమాశంకర శాస్త్రి గారి సౌజన్యంతో మీకు ఈ వారం అందిస్తోంది. ఈ శ్రవణ పుస్తక విడుదలతో, తెలుగు మనోవైజ్ఞానిక రచనా త్రయాన్ని మీకు అందిస్తున్నందుకు మేము ఆనందిస్తున్నాము

    –

    #అల్పజీవి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-alpajeevi

    Listen to a part of Chapter 1 of #Alpajeevi. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    23 min
  • Asamardhuni Jeeva Yatra – Chapter 1

    #అసమర్ధునిజీవయాత్ర

    "ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టారు? ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? ఈ యుద్దాలు, ఈ నాశనాలు, బాధలు, తాపత్రయాలు, అన్నీ తప్పుతాయిగా? అంతా సుఖంగా బతుకుతారుగా ! వాళ్లీ విధంగా ఆలోచించరు. జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు".

    ఇది ఆ అసరమర్ధుని ఫిర్యాదు. గోపీచంద్ గారి 'అసమర్ధుని జీవయాత్ర' చాలా మంది అడిగిన శ్రవణ పుస్తకం. ఇది తెలుగులో మొదటి మనోవైజ్ఞానిక నవల గా గుర్తింపు పొందింది. ఈ పుస్తకం అందించడంలో గోపీచంద్ గారి తనయులు, నటులు సాయిచంద్ గారి సహకారానికి కృతఙ్ఞతలు.

    –

    #అసమర్ధునిజీవయాత్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-asamardhuni-jeevayatra

    Listen to a part of Chapter 1 of #AsamardhuniJeevaYatra. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    30 min
  • Chivaraku Migiledi – Chapter 1

    #చివరకుమిగిలేది

    కావ్య ఖండాల్లాంటి కథలెన్నో వ్రాసిన ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు వ్రాసిన ఒకే ఒక నవల – చివరకు మిగిలేది. అయితేనేం, తెలుగులో వచ్చిన ముఖ్యమైన మూడు మనోవైజ్ఞానిక నవల్లో ఒకటిగా పేరు గడించింది. మిగతావి గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర', రావిశాస్త్రి 'అల్పజీవి'.  

    తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు పఠన్య గ్రంధంగా నిర్దేశింపబడిన ఈ నవల గురించి బుచ్చిబాబు గారే స్వయంగా ఇలా వ్రాసారు. 

    "గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'-కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్నిబట్టి ఈ సమస్యని నవలలో చర్చించి, ఒక సమాధానం కనుక్కున్నానని కాదు. ఈ వస్తువుని వ్రాసేస్తే విషయం నాకు విశదపడుతుందనీ, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందనీ తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేపోవడం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో 'చెడుగు' - 'పాపం' - ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపైబడి వారి జీవితాల్ని ఏవిధంగా వికసించనీయకుండా, పాడుచేసింది- యిది కూడా ఒక ప్రధానమైన అంశమే. ఒకరు చేసిన అపచారాలకి మరియొకరు బాధ్యులై బాధపడడం వల్ల సమాజంలో వ్యక్తిగతమైన నైతిక విలువలకి తావులేకుండా పోతుంది"

    –

    #చివరకుమిగిలేది శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-chivaraku-migiledi

    Listen to a part of Chapter 1 of #ChivarakuMigiledi. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    19 min
  • Illali Muchhatlu – Chapter 1

    #ఇల్లాలి ముచ్చట్లు

    పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేకన్నా "ఇల్లాలి ముచ్చట్లు " రచయిత అంటే పాఠకులకు బాగా అర్ధమవుతుంది. 30 సంవత్సరాలుగా శీర్షికలతోనే విశేష ఆదరణ పొందిన ముచ్చట్లు విందాం. సామాన్య మధ్యతరగతి ఇల్లాలి సరదాలు, బాధలు, అసంతృప్తులు శీర్షికలుగా వ్రాసినారు. ఇంట్లో పిల్లలు,పెద్దలు వస్తువులను ఎక్కడబడితే అక్కడ పెట్టేస్తే వాటిని వెతికి ఇవ్వడానికి ఇల్లాలు పడే అవస్థ 'పుస్తకాలు - పరధ్యాస'లోను, స్నేహితుడిని ఆదుకోడం కోసం సాయం చేస్తే అది తనకు ఎలాంటి ఇబ్బంది తెచ్చి పెట్టిందో 'సుందరమ్మ వీధి' లోను, చిన్నప్పుడు బొమ్మల కొలువు పెట్టడంలో ఉండే శారద, దానికోసం పడే ఆరాటం 'బొమ్మలు బొమ్మలు బొమ్మలు 'లోనూ ఇంకా మరెన్నో ముచ్చట్లు వినండి.

    –

    #ఇల్లాలి ముచ్చట్లు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-illali-muchhatlu-1

    Listen to a part of Chapter 1 of #IllaliMuchhatlu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    6 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.