Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
February 20, 2019రామాయణం ఉత్తరకాండ - 1రాముని పట్టాభిషేకం అయ్యి రాజ్య పాలన చేస్తుండగా అగస్త్య మహాముని అయోధ్య వచ్చారు. మునులందరూ ఇంద్రజిత్తుని లక్ష్మణుడితో సంహరించిన వైనం తమకు ఆశ్చర్యం కలిగించిందని అనేసరికి రాముడికి ఆశ్చర్యం కలిగి ఇంద్రజిత్తుని వృత్తాంతం చెప్పమని కోరాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు.The post రామాయణం ఉత్తరకాండ – 1 first appeared on Telugu Audibles📖....more12minPlay
February 17, 2019రామాయణం యుద్ధకాండ సమాప్తం!విభీషణుడు పుష్పక విమానంలో సీతారామ, లక్ష్మణులను అయోధ్య కు తీసుకువెళ్లబోతూ సీత కోరిక మేరకు మార్గమధ్యంలో కిష్కిందలో ఆగి సుగ్రీవుడి భార్యలను, ఇతర వానరప్రముఖులను అయోధ్యకు తీసుకువెళ్లారు. భరతుడు ఎంతో మర్యాదతో, వైభవంగా రాముని పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ఏర్పడింది. యుద్ధకాండ సమాప్తంThe post రామాయణం యుద్ధకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖....more12minPlay
February 17, 2019రామాయణం యుద్ధకాండ - 13విభీషణ అనుమతి తీస్కుని లంకకి వెళ్లి, రావణ సంహారం చేసానని సీతకి చెప్పమని రాముడు హనుమకు చెప్పాడు. సీతను రాముడి వద్దకు చక్కగా అలంకరించి తీసుకువచ్చారు. పరాయి వాడి దగ్గర అంత కాలం ఉన్న సీతను స్వీకరించను అన్నాడు. సీత అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఇంకా అంత శుభమే!The post రామాయణం యుద్ధకాండ – 13 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 16, 2019రామాయణం యుద్ధకాండ - 12లక్ష్మణుడు కొనప్రాణంతో ఉండగా, హనుమంతుడిని ఔషధీ పర్వతంపై ఉన్న ఔషదములు దొరక్క ఏకంగా పర్వతాన్నే పెకలించి యుద్ధరంగానికి తీసుకువచ్చాడు. ఆ ఔషదములకు లక్ష్మణుడికి ప్రాణం వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రాముడు యుద్ధం ప్రారంభించాడు. అలా ఏడూ రాత్రులూ ఏడూ పగళ్ళూ యుద్ధం చేశారు. రాముడు దేవతలిచిన దివ్యమైన బాణాన్ని సాధించగా అది దుష్ట రావణుడి ప్రాణాలు హరించింది.The post రామాయణం యుద్ధకాండ – 12 first appeared on Telugu Audibles📖....more11minPlay
February 15, 2019రామాయణం యుద్ధకాండ - 11నికుంభుల హోమం చేస్తున్న ఇంద్రజిత్తును ఎవరైతే అడ్డగిస్తారో, వారి చేతిలోనే ఇంద్రజిత్తుకి చావు ఉందన్న విషయం విభీషణుడు రాముడుతో చెప్పాడు. దాంతో రాముడు, లక్షమునిడిని వెళ్ళమని అన్నాడు. లక్ష్మణుడికి, ఇంద్రజిత్తుకు, వనరులకు, రాక్షసులకు భయంకరమయిన యుద్ధం జరుగగా లక్ష్మణుడు ఒక తీవ్రమయిన బాణంతో ఇంద్రజిత్తును సంహరిస్తాడు.The post రామాయణం యుద్ధకాండ – 11 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 13, 2019రామాయణం యుద్ధకాండ - 10కుంభకర్ణుడు, అకంపనుడు, అతికాయుడు, మకరాక్షుడు తదితర రాక్షసులందరూ చచ్చారు. ఇంద్రజిత్ రామ లక్ష్మణులను అంతమొందిస్తానని రావణుడికి ప్రమాణం చేసి భీకర యుద్ధం చేయనారంభించాడు.The post రామాయణం యుద్ధకాండ – 10 first appeared on Telugu Audibles📖....more11minPlay
February 12, 2019రామాయణం యుద్ధకాండ - 9సుగ్రీవుడు మూర్ఛనించి లేచి కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికేసి ఒక్క గెంతులో రాముడు వద్దకు ఎగిరాడు. కుంభకర్ణుడు రగిలిపోయి రామదండు మీదకు దండెత్తాడు. దొరికిన వారిని దొరికినట్టు తినేస్తున్నాడు.The post రామాయణం యుద్ధకాండ – 9 first appeared on Telugu Audibles📖....more12minPlay
February 11, 2019రామాయణం యుద్ధకాండ - 8కుంభకర్ణుడు అతి భయంకరంగా యుద్ధం చేయనారంభించాడు. వానర ప్రముఖులను చిత్తుగా ఓడించాడు. హనుమంతుడు వంటి పరాక్రమవంతులు కూడా కుంభకర్ణుడి శక్తికి పడిపోయారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని మూర్ఛపుచ్చి లంకకు తీసుకువెళ్లాడు.The post రామాయణం యుద్ధకాండ – 8 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 10, 2019రామాయణం యుద్ధకాండ - 7రావణ సైన్యంలో ఎందరో ప్రముఖ రాక్షషులు చచ్చారు. రావణుడికి ఏమి చెయ్యాలో పాలు పోక కుంభకర్ణుడిని నిద్రలేపమని ఆదేశించాడు. లంకాసేన కొండంత తినుబండారాలు, ఏనుగులు, గుర్రాలు వెంటబెట్టుకుని భేరీలు మోగిస్తూ కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నారుThe post రామాయణం యుద్ధకాండ – 7 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 10, 2019రామాయణం యుద్ధకాండ - 6భీకర యుద్ధం ఆరంభమయింది. ఇంద్రజిత్తును యుద్ధరంగంలో అంగదుడితో తలపడి తరువాత మాయాయుద్ధం మొదలుపెట్టాడు. రామ లక్ష్మణుల మీదకు నాగాస్త్రం విడిచి వారిని కట్టి పడేసి సందులేకుండా బాణాలతో కొట్టాడు.. రామలక్ష్మణులు చనిపోయారని భావించి తిరిగి వెళ్ళాడు. వానర సేన శోకసముద్రంలో మునిగిపోయింది.The post రామాయణం యుద్ధకాండ – 6 first appeared on Telugu Audibles📖....more13minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.